మే నెల కొరకు మీ పథకములేమి?
1 మే నెల మనలో అనేకమందికి ప్రాంతీయసేవలో అభివృద్ధికర కార్యమును చేయు సమయమును ప్రారంభించును. సాధారణముగా పరిచర్యలో అభివృద్ధికర కార్యమును చేయునట్లు మనము వ్యక్తిగత గురులను పెట్టుకొనుటకు అనుకూలమైన మాసము.
2 మే నెలకొరకు మీ సంఘము ఏ ప్రాంతీయ సేవ ఏర్పాట్లను చేసియున్నది? సాయంకాల సాక్ష్యముతోపాటు ప్రాంతీయ సేవకొరకైన కూటములు అదనముగా తీసుకొని ఇతరులతోపాటు ప్రాంతీయసేవలో పనిచేయుటకు మీ కార్యక్రమ పట్టికను దిద్దుబాటు చేసుకొనగలరా? తక్కువ ప్రాముఖ్యత గల ఇతర కార్యమును మీరు తాత్కాలికముగా ప్రక్కన పెట్టగలరా?
3 జ్ఞాపకార్థమునకు హాజరైనవారితో కలసి మాట్లాడుటతోపాటు గతమందు మీరు కలిసినప్పుడు మీతో మాట్లాడలేనంత పనితొందరలో ఉన్నవారిని వెదకుటకు మరియు మీరు వెళ్లినప్పుడు ఇంటియొద్దలేనివారిని కూడా కలియుటకు మే నెల మంచి సమయమైయుండును. మరలా కలిసి సాక్ష్యమిచ్చుటకు మీరు ఇప్పటికే అనేక ప్రయత్నములు చేసియున్నను మరలా వారిని కలిసి సువార్తయందు వారి ఆసక్తిని పునఃప్రారంభించుటకు ప్రయత్నము చేయులాగున మీ రికార్డులను చూచుకొని వీరిని ఎందుకు కలువకూడదు. బహుశా సాయంకాల సమయమందు కలసి మాట్లాడుట ఫలవంతముగా ఉండును.
4 ఈ మే మాసములో అనేకమంది సహోదర సహోదరీలు ఆక్సిలరీ పయినీర్లుగా చేయుటకు ఏర్పాటును చేసికొనియున్నారు. వీరిలో కొందరు కుటుంబ బాధ్యతలను కలిగినవారున్నారు. మరికొందరు పూర్తికాల లౌకిక ఉద్యోగములయందు ఉన్నవారున్నారు. 60-గంటలు కోరబడుచున్నవనగా కేవలము అవి సగటున రోజుకు రెండు గంటలు మాత్రమయ్యే ఉన్నవి.
5 ఆక్సిలరీ పయినీరుగా చేయుటకు మే మాసములో మీకు పరిస్థితులు అనుకూలించక పోయినట్లయిన, ఆ నెలలో తమ ప్రాంతీయ కార్యమును వృద్ధి చేసికొన ప్రయత్నించు వారితో లేక పయినీర్లతో కొంతకాలము గడిపి మీ ప్రాంతీయ సేవా కార్యమును కూడా వృద్ధి చేసికొనుట సాధ్యము కావచ్చును. యెహోవా మీ ప్రయత్నములను ఆశీర్వాదిస్తాడను అభయమును మీరు కలిగియుండవచ్చును. ఆయన తన ఆత్మద్వారా మీరు మీగురిని చేరుకొనుటకు బలము నివ్వగలడు.—సామె. 20:18; 21:5 ఎ.