కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 7/15 పేజీలు 2-4
  • నమ్మదగ్గ భవిష్యవాణుల అన్వేషణలో

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నమ్మదగ్గ భవిష్యవాణుల అన్వేషణలో
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మానవుల్లోని స్వతస్సిద్ధ అవసరం
  • బైబిలు ప్రవచనాన్ని మీరెందుకు నమ్మవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • యెహోవా చెప్పిన ప్రవచనాలు తప్పక నెరవేరతాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ప్రవచనాల అర్థాన్ని ఎవరు తెలియజేయగలరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • మనకాలం కోసమైన దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యముంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 7/15 పేజీలు 2-4

నమ్మదగ్గ భవిష్యవాణుల అన్వేషణలో

అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ అని అటుతర్వాత పిలువబడిన మాసిదోనియ రాజు సా.శ.పూ. 336లో గద్దెనెక్కగానే మధ్య గ్రీసులో ఉన్న డెల్ఫైలోని పుణ్యక్షేత్రాన్ని సందర్శించాడు. ఆ కాలంలోని లోకాన్ని జయించాలన్న అభిలాషే ఆయన భవిష్య ప్రణాళిక. కానీ ఆయన తన మహత్కార్యంలో జయాన్ని పొందుతానని దైవిక హామీ కావాలనుకున్నాడు. చరిత్ర గాథల ప్రకారం, ఆయన డెల్ఫైకి వెళ్లిన రోజు, భవిష్యత్తు చెప్పే పూజారిణిని సంప్రదించడానికి అనుమతి లేదు. సమాధానం దొరక్కుండా వెనక్కి మరలడానికి ఇష్టపడక ఆ పూజారిణిని జోస్యం చెప్పమని అలెగ్జాండర్‌ పట్టుబట్టాడు. ఆమె చీకాకుతోను నిస్పృహతోను ఇలా అరిచింది: “ఓ బిడ్డా, నీవు అజేయుడవు!” యువకునిగా ఉన్న ఆ రాజు దీన్ని శుభ శకునంగా భావించాడు—తన సైనిక చర్యల్లో దిగ్విజయాన్ని ప్రసాదించేదిగా దాన్ని అర్థం చేసుకున్నాడు.

అయితే, అలెగ్జాండర్‌ గనుక బైబిలులోని దానియేలు పుస్తకంలోని ప్రవచనాలను పరిశీలించివుంటే తన యుద్ధాల పరిణామం గురించి మరింత శ్రేష్ఠమైన సమాచారాన్ని పొందేవాడు. ఆయన ప్రచండ వేగంతో సాధించబోయే విజయాల గురించి అవి అసాధారణమైన ఖచ్చితత్వంతో ముందే తెలియజేశాయి. సాంప్రదాయకంగా నమ్ముతున్న దాని ప్రకారం, చివరికి దానియేలు తన గురించి ఏమి నమోదు చేశాడో చూసే అవకాశం అలెగ్జాండర్‌కు లభించింది. యూదా చరిత్రకారుడైన జోసీఫస్‌ ప్రకారం, ఈ మాసిదోనియ రాజు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ఆయనకు దానియేలు ప్రవచనం చూపించబడింది—అది ఆ పుస్తకంలోని 8వ అధ్యాయంలో ఉన్నదేనని భావించబడుతుంది. (దానియేలు 8:5-8, 20, 21) ఇందుమూలంగానే ఆ నగరాన్ని అరివీర భయంకరులైన అలెగ్జాండర్‌ సైన్యం నాశనం చేయకుండా విడిచిపెట్టిందని నివేదించబడుతుంది.

మానవుల్లోని స్వతస్సిద్ధ అవసరం

రాజైనా పేదైనా, ప్రాచీనుడైనా ఆధునికుడైనా—మానవుడు నమ్మదగ్గ భవిష్యవాణుల అవసరాన్ని అనుభవించాడు. బుద్ధిజీవులముగా మానవులమైన మనం గతాన్ని అధ్యయనం చేస్తాము, వర్తమానాన్ని గురించిన స్పృహను కలిగివున్నాము, అంతేకాదు ప్రాముఖ్యంగా భవిష్యత్తును గురించి ఆసక్తిని కలిగివున్నాము. దీనికి అనురూపంగానే చైనాలోని ఒక సామెత ఇలా ఉంది: “రాబోయే మూడు రోజుల వ్యవహారాలను ఈరోజే తెలుసుకోగలవాడు వేలాది సంవత్సరాలు ఖర్చుచేయగల ధనాన్ని సంపాదించగలడు.”

అన్నికాలాల్లోనూ కోట్లాదిమంది దైవికమని తాము భావించిన మూలాల్ని సంప్రదిస్తూ భవిష్యత్తులోనికి తొంగి చూడటానికి ప్రయత్నించారు. ఉదాహరణకు ప్రాచీన గ్రీకుల్ని తీసుకోండి. వారికి అనేకమైన పుణ్యక్షేత్రాలు ఉండేవి—డెల్ఫై, డెలోస్‌, డడోనాలు వాటిలో కొన్ని. ఈ ప్రాంతాల్లో వారు రాజకీయ లేదా సైనిక అభివృద్ధుల సంబంధంగా తమ దేవుళ్లను సంప్రదించేవారు, అలాగే ప్రయాణమూ, వివాహమూ పిల్లలూ వంటి వ్యక్తిగత వ్యవహారాల గురించి కూడా సంప్రదించేవారు. కేవలం రాజులూ, సైనికాధికారులూ మాత్రమే కాక పూర్తి గోత్రాలకు గోత్రాలే, పూర్తి నగరప్రభుత్వాలే ఈ పుణ్యక్షేత్రాల ద్వారా ఆత్మ సామ్రాజ్యం నుండి నడిపింపు కోసం వెదికేవారు.

ఒక ప్రొఫెసర్‌ చెప్తున్నదాని ప్రకారం, ఇప్పుడు “భవిష్యత్తును గురించిన అధ్యయనానికే అంకితమైన సంస్థలు పుట్టగొడుగుల్లా అకస్మాత్తుగా పుట్టుకొస్తున్నాయి.” అయితే, ప్రవచనాలను గురించిన అత్యంత ఖచ్చితమైన మూలమైన బైబిలును ఉపేక్షించడానికి అనేకమంది సుముఖత చూపిస్తారు. తాము వెదుకుతున్న సమాచారమే బైబిలు ప్రవచనాల్లో ఉండగల అవకాశాన్ని వారు నిక్కచ్చిగా తిరస్కరిస్తారు. కొంతమంది పండితులైతే బైబిలు ప్రవచనాలను ప్రాచీన పూజారులు చేసిన భవిష్యవాణులతో సమాంతరంగా పరిగణించేంత వరకూ వెళ్తారు. ఇక ఆధునిక సంశయవాదుల విషయానికి వస్తే వారు సాధారణంగా బైబిలు ప్రవచనాలకు విరుద్ధంగా మొగ్గుచూపుతుంటారు.

నమోదు చేయబడిన వృత్తాంతాల్ని మీకు మీరే పరీక్షించుకోమని మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. బైబిలు ప్రవచనాలను మానవ జోస్యాలతో జాగ్రత్తగా పోల్చినప్పుడు ఏమి తేలుతుంది? మీరు ప్రాచీనకాలపు జోస్యాలకన్నా బైబిలు ప్రవచనాలను ఎక్కువగా నమ్మవచ్చా? అంతేకాక, మీరు బైబిలు ప్రవచనాల చుట్టూ మీ జీవితాన్ని నమ్మకంగా నిర్మించుకోవచ్చా?

[3వ పేజీలోని చిత్రం]

అలెగ్జాండర్‌ ప్రచండ వేగంతో సాధించే విజయాల గురించి బైబిలు ముందే చెప్పింది

[క్రెడిట్‌ లైను]

Cortesía del Museo del Prado, Madrid, Spain

[4వ పేజీలోని చిత్రం]

అలెగ్జాండర్‌ ద గ్రేట్‌

[క్రెడిట్‌ లైను]

Musei Capitolini, Roma

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

COVER: General Titus and Alexander the Great: Musei Capitolini, Roma

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి