కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 5/15 పేజీలు 3-6
  • మీరు మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనసు విప్పి మాట్లాడుకోకపోవడం
  • శ్రద్ధాపూర్వకమైన ప్రయత్నం అవసరం
  • దేవుడి వాక్యం నుండి సహాయం
  • తల్లిదండ్రులారా, పిల్లలారా—ప్రేమగా సంభాషించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • నీ కుటుంబమును దేవుని నూతన లోకములోనికి కాపాడుకొనుటకు కృషిచేయుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయవచ్చు?—2వ భాగం
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • పరస్పర సంభాషణ నిరాటంకముగా కొనసాగించుట
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 5/15 పేజీలు 3-6

మీరు మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారా?

“జపానీయులైన తండ్రులు పని రద్దీలో ఉంటూ, తమ పిల్లలతో ఆడుకోకపోయినా ప్రేమించబడుతున్నారు” అనే ఈ పతాక శీర్షిక కొన్ని సంవత్సరాల క్రితం మైనీచీ షీమ్‌బూన్‌ వార్తాపత్రికలో వచ్చింది. ప్రభుత్వ సర్వేలో పాల్గొన్న జపానీయులైన పిల్లల్లో 87.8 శాతం మంది పిల్లలు భవిష్యత్తులో తమ తండ్రులను తాము చూసుకోవాలనే కోరికను వ్యక్తం చేశారని ఈ పతాక శీర్షిక రిపోర్ట్‌ చేసింది. అయితే ఇదే విషయం ఇదే వార్తాపత్రిక యొక్క ఇంగ్లీష్‌ సంపుటిలో, మరొక పతాక శీర్షిక క్రింద కనిపించింది. “తండ్రులూ కొడుకులూ: నిర్లక్ష్య ధోరణి” అని ఉంది ఆ పతాక శీర్షిక. జపాన్‌ భాషలోని సంపుటిలా కాక, అది అదే సర్వేలోని మరో పార్శ్వాన్ని ఉన్నతపర్చింది: ప్రతి పని దినమున, జపానీయులైన తండ్రులు తమ పిల్లలతో కేవలం 36 నిమిషాలు మాత్రమే గడుపుతున్నారు. తారతమ్యం చేసి చూస్తే, పశ్చిమ జర్మనీలోని తండ్రులు పని దినాల్లో తమ పిల్లలతో 44 నిమిషాలు గడుపుతున్నారు, అమెరికాలోని తండ్రులైతే 56 నిమిషాలు గడుపుతున్నారు.

తమ పిల్లలతో అంతగా సమయం గడపనిది తండ్రులు మాత్రమే కాదు. ఇల్లు వదిలి వెళ్ళి ఉద్యోగం చేసుకునే తల్లుల సంఖ్య రోజు రోజుకూ అధికమౌతోంది. ఉదాహరణకు, చాలా మంది ఒంటరి తల్లులు తమ కుటుంబాన్ని పోషించేందుకు ఉద్యోగం చేయవలసిందే. తత్ఫలితంగా, తల్లిదండ్రులు—తండ్రులైనా తల్లులైనా సరే—తమ పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతుంది.

12,000 కన్నా ఎక్కువ మంది అమెరికన్‌ టీనేజర్లపై 1997లో జరిపిన ఒక అధ్యయనం కనుగొన్నదేమిటంటే, తమ తల్లిదండ్రులతో సన్నిహిత సంబంధాలుగల యౌవనస్థులు భావోద్వేగ ఒత్తిడితో, ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపులతో బాధపడడం గానీ, హింసాయుత కార్యకలాపాల్లో పాల్గొనడం గానీ, మత్తు పదార్థాలను వాడడం గానీ అరుదు. “మీరు పిల్లల అవసరాలకు ఉండకపోతే పిల్లలతో మీకు అవినాభావ సంబంధం ఉందన్న భావన కలుగదు” అని విస్తృత అధ్యయనంలో ఇమిడివున్న పరిశోధకుల్లో ఒకరు అన్నారు. మీరు మీ పిల్లలతో సమయాన్ని గడపడమూ, మీరూ పిల్లలు మనసు విప్పి మాట్లాడుకోవడమూ చాలా ప్రాముఖ్యం.

మనసు విప్పి మాట్లాడుకోకపోవడం

ముఖ్యంగా తల్లి/తండ్రి ఉద్యోగరీత్యా ఇంటికి దూరంగా ఉన్నట్లయితే, అలాంటి కుటుంబాల్లో మనసు విప్పి మాట్లాడుకోవడం సరిగా జరగదు. నిజమే, మనసువిప్పి మాట్లాడుకోవడం జరగడం లేదన్న సమస్య తల్లి/తండ్రి ఇంటికి దూరంగా ఉండే కుటుంబాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటున్నప్పటికీ, తమ పిల్లలు నిద్రలేవక ముందే పనికి వెళ్ళి పోయి, పిల్లలు నిద్రపోయాక తిరిగి చేరుకుంటారు. ఇలా పిల్లలను కలవకపోవడం వల్ల కలిగే లోటును భర్తీ చేసేందుకు, కొంతమంది తల్లిదండ్రులు వారాంతాల్లోను, సెలవు రోజుల్లోను కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. వాళ్ళు తమ పిల్లలతో “నాణ్యమైన” సమయాన్ని గడపడాన్ని గురించి మాట్లాడుతారు.

అయితే, తక్కువైన సమయాన్ని నాణ్యమైన సమయం భర్తీచేస్తుందా? “సాధారణంగా, తమ తల్లిదండ్రులతో తక్కువ సమయం గడిపే పిల్లలకన్నా ఎక్కువ సమయాన్ని గడిపే పిల్లలే మెరుగ్గా ఉంటారు. ఆ సమయ కొరతను భర్తీ చేయడం చాలా కష్టమని అనిపిస్తుంది. నాణ్యతగల సమయం అనే తలంపుకు మరీ విపరీతమైన విలువ ఇవ్వబడింది” అని పరిశోధకుడైన లారెన్స్‌ స్టైన్‌బర్గ్‌ జవాబిస్తున్నారు. ఒక బర్మా స్త్రీ సరిగ్గా అలాగే భావిస్తోంది. ఆమె భర్త—సగటు జపాన్‌ దేశపు మగవాడు—పని స్థలం నుండి ప్రతి రోజు రాత్రి ఒంటి గంటకో, రెండు గంటలకో ఇంటికి చేరుకుంటాడు. ఆయన వారాంతాల్లో తన కుటుంబంతో గడుపుతున్నప్పటికీ, “శనీ ఆది వారాలు ఇంట్లో ఉన్నంత మాత్రాన మిగిలిన రోజుల్లో కుటుంబంతో గడపకపోవడం వల్ల కలిగిన లోటు తీరిపోదు. . . . ప్రతి రోజు తినవలసిన భోజనాన్ని తినకుండా, వారమంతటికీ కలిపి శనీ ఆదివారాల్లో తినగలరా?” అని ఆయన భార్య అడుగుతోంది.

శ్రద్ధాపూర్వకమైన ప్రయత్నం అవసరం

కుటుంబంలో మనసు విప్పి మాట్లాడుకోవడాన్ని కొనసాగించడం అనేది చేయడంకన్నా చెప్పడమే సులభం. ఒక తండ్రిగానీ, ఉద్యోగం చేసే తల్లి గానీ జీవనోపాధిని చూసుకోవలసిన, కుటుంబాన్ని పోషించుకోవలసిన అవసరాల వల్ల, తన కుటుంబంతో సమయాన్ని గడపడం సులభం కాదు. తప్పని పరిస్థితుల్లో తమ ఇంటికి దూరంగా వేరే ప్రాంతంలో పని చేస్తున్న అనేకమంది క్రమంగా ఫోన్‌లు చేయడం ద్వారా లేదా ఉత్తరాలు వ్రాయడం ద్వారా మనసు విప్పి తమ తలంపులను తెలియజేసుకుంటుంటారు. ఇంట్లోనే ఉన్నా, దూరంగా ఉన్నా, కుటుంబ సభ్యులు మనసు విప్పి చెప్పుకుంటూనే ఉండేందుకు శ్రద్ధతో కూడిన ప్రయత్నం అవసరం.

తమ కుటుంబంతో మనసు విప్పి మాట్లాడడాన్ని నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రులు తమ నిర్లక్ష్యానికి తప్పక మూల్యం చెల్లించవలసి వస్తుంది. తన కుటుంబంతో సమయాన్ని అంతగా గడపని, కనీసం వాళ్ళతో కలిసి భోజనమైనా చేయని ఒక తండ్రి చాలా తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొన్నాడు. ఆతని కుమారుడు విరుచుకుపడే స్వభావాన్ని అలవర్చుకున్నాడు. కూతురు ఒక దుకాణంలో దొంగతనం చేస్తుండగా పట్టుబడింది. ఒకరోజు ఆదివారం ఉదయం, ఆ తండ్రి గోల్ఫ్‌ ఆటకు బయలుదేరడానికి సిద్ధమౌతుండగా, అతని కుమారుడు, “ఈ ఇంట్లో అమ్మేనా తల్లీ తండ్రీ?” అని అంటూ ఉక్రోషం వెళ్ళగ్రక్కాడు. “ఈ కుటుంబంలో ప్రతిదీ అమ్మే నిర్ణయిస్తుంది. డాడీ, నువ్వెన్నడూ . . . ” అని అంటూ ఆ అబ్బాయి తన బాధను వ్యక్తం చేశాడు.

ఆ మాటలు ఆ తండ్రిని ఆలోచింపజేశాయి. తొలి ప్రయత్నంగా, తను తన కుటుంబంతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలని చివరికి ఆయన నిర్ణయించుకున్నాడు. మొదట, తనూ తన భార్యా కలిసి తినడం మొదలుపెట్టారు. క్రమేణా, పిల్లలు కూడా వాళ్ళతో కలిశారు. చివరికి బ్రేక్‌ఫాస్ట్‌ టేబిల్‌ మనసు విప్పి మాట్లాడుకునే స్థలంగా మారింది. మెల్లగా, అది రాత్రి భోజనాలు కూడా కలిసి చేయడానికి దారితీసింది. అలా, ఆయన తన కుటుంబం సర్వ నాశనం కాకుండా కాపాడుకునే దిశలో పయనిస్తున్నాడు.

దేవుడి వాక్యం నుండి సహాయం

తమ పిల్లలతో మనసు విప్పి మాట్లాడేందుకు తల్లిదండ్రులు సమయాన్ని తీసుకోవాలని బైబిలు ప్రోత్సహిస్తుంది. “ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, [“నీ కుమారుల మనసుల్లో వాటిని నాటితీరాలి,” NW] నీ యంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను” అని ప్రవక్తయైన మోషే ద్వారా ఇశ్రాయేలీయులు బోధించబడ్డారు. (ద్వితీయోపదేశకాండము 6:4-7) అవును, మనలో తల్లిదండ్రులైన వాళ్ళం పిల్లల మనసుల్లోనూ, హృదయాల్లోనూ దేవుడి మాటలను నాటాలంటే, మన కుటుంబంతో సమయాన్ని గడపడంలో మనం చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది.

ఆసక్తికరంగా, “తమకొక మతముందని చెప్పినవారిలో దాదాపు 88 శాతం మందికి . . . మతం మరియు ప్రార్థనలకు ప్రాముఖ్యత ఇవ్వడం రక్షణగా ఉంది” అని ముందు పేర్కొన్న 12,000 కన్నా ఎక్కువ మంది అమెరికన్‌ యౌవనస్థులపై చేసిన 1997 సర్వే వెల్లడి చేసింది. ఇంట్లో ఇచ్చే సరైన మత సంబంధ నిర్దేశం, మత్తుమందులను ఉపయోగించడం, భావోద్వేగ ఒత్తిడి, ఆత్మహత్యకు పాల్పడడం, హింసకు పాల్పడడం వంటి వాటినుండి యౌవనస్థులను రక్షిస్తుందని నిజ క్రైస్తవులు గుర్తిస్తారు.

తమ కుటుంబం కోసం సమయాన్ని కనుగొనడం కష్టమని కొందరు తల్లిదండ్రులు భావిస్తారు. ముఖ్యంగా, ఇంట్లో పిల్లలతో సమయాన్ని గడపడానికి ఇష్టపడ్డా, ఉద్యోగం చేయక తప్పని ఒంటరి తల్లుల పరిస్థితి అదే. వాళ్ళు తమ కుటుంబంతో గడిపేందుకు విలువైన సమయాన్ని ఎలా కనుగొనగలరు? “ఆచరణాత్మక బుద్ధినీ, ఆలోచన సామర్థ్యాన్నీ కాపాడుకోండి” అని బైబిలు ఉద్బోధిస్తోంది. (సామెతలు 3:21, NW) తల్లిదండ్రులు తమ కుటుంబం కోసం సమయాన్ని కేటాయించేందుకు తమ “ఆలోచన సామర్థ్యాన్ని” ఉపయోగించగలరు. ఎలా?

మీరు పగలంతా పని చేసి, అలసటతో ఇంటికి చేరే ఉద్యోగస్థురాలైన తల్లైతే, వంట చేయడంలో మీతో కలవమని చెప్పే సంగతి ఏమిటి? అలాంటి సమయాన్ని కలిసి గడపడం ఒకరికొకరు మరింత సన్నిహితులయ్యే అవకాశాన్నిస్తుంది. మీరు మీ పిల్లలతో పని చేయిస్తే, మొదట్లో ఎక్కువ సమయం పట్టవచ్చు. కానీ, మీరు అలా చేయడాన్ని ఆస్వాదించగలుగుతున్నారనీ, అలా చేయడం సమయాన్ని కూడా ఆదా చేస్తుందనీ త్వరలోనే మీరు కనుగొంటారు.

మీరు, వారాంతాల్లో చేయవలసిన అనేక పనుల లిస్ట్‌ ఉన్న తండ్రైయుండవచ్చు. ఈ పనుల్లో కొన్నింటిని మీ పిల్లలతో కలిసి ఎందుకు చేయకూడదు? మీరూ పిల్లలూ కలిసి పనిచేస్తుండగా మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. అదే సమయంలో మీరు వాళ్ళకు విలువైన తర్ఫీదును ఇవ్వవచ్చు. మీ పిల్లల్లో దేవుడి మాటలను నాటమన్న బైబిలు ఉద్బోధ మీరు ‘మీ ఇంట్లో కూర్చునియున్నప్పుడూ, దారిలో నడుస్తున్నప్పుడూ,’ నిజానికి అవకాశం వచ్చిన ప్రతిసారీ కూడా వాళ్ళతో మాట్లాడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీరూ పిల్లలూ కలిసిపని చేస్తుండగా, మనసు విప్పి మాట్లాడుకోవడం “ఆచరణాత్మక బుద్ధి”ని చూపిస్తుంది.

మీ కుటుంబంతో సమయాన్ని గడపడం దీర్ఘకాలిక ఫలితాలను తెస్తుంది. “పరస్పరం సమాలోచన చేసేవారికి బుద్ధి ఉంది” అని బైబిలు సామెత చెబుతుంది. (సామెతలు 13:10, NW) మీరు మీ కుటుంబంతో మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా, అనుదిన జీవిత పోరాటానికి అవసరమైన బుద్ధికుశలమైన నిర్దేశాన్నిచ్చే మంచి స్థాయిలో మీరు ఉండగల్గుతారు. అలా ఇప్పుడు ఇచ్చే నిర్దేశం, భవిష్యత్తులో చాలా సమయాన్నీ ఆదా చేయవచ్చు, రాగల హృదయవేదనను నివారించవచ్చు. అంతేకాక, అది మీ సంతోషానికీ, వాళ్ళ సంతోషానికీ తోడ్పడుతుంది. మీరు అలాంటి నిర్దేశాన్నిచ్చేందుకు, మీరు దేవుడి వాక్యమైన బైబిలులో కనుగొనబడే సమృద్ధియైన బుద్ధికుశలతల జలాశయాన్ని తోడవలసి ఉంది. మీ పిల్లలకు బోధించడానికీ, మీ కుటుంబం తీసుకోవలసిన చర్యలకు మార్గదర్శనాన్నిచ్చేందుకూ దానిని ఉపయోగించండి.—కీర్తన 119:105.

[4వ పేజీలోని చిత్రం]

తమ తల్లిదండ్రులతో సన్నిహిత సంబంధంగల యౌవనస్థులు భావోద్వేగపు ఒత్తిడితో బాధపడే అవకాశం చాలా తక్కువ

[5వ పేజీలోని చిత్రం]

మనసు విప్పి మాట్లాడుకోవడం కుటుంబ జీవితంలో మంచి ఫలితాలను తెస్తుంది

[6వ పేజీలోని చిత్రం]

మీరు మీ బిడ్డతో కలిసి పని చేస్తుండగా, మనసు విప్పి మాట్లాడుకోవచ్చు, విలువైన తర్ఫీదును కూడా ఇవ్వవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి