కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 5/1 పేజీ 29
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • మెలకువగా ఉండవలసిన సమయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • క్రీస్తు ప్రత్యక్షత—మీరు దానినెలా అర్థం చేసుకుంటారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • పాఠకుల నుండి ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 5/1 పేజీ 29

పాఠకుల ప్రశ్నలు

మత్తయి 24:34 నందలి “తరము” అనే పదాన్ని గురించిన, ఇటీవలనే సరి చేయబడిన అవగాహన ఈ ప్రస్తుత విధానాంతం సుదూర భవిష్యత్తులోకి నెట్టివేయబడిందనే తలంపును అనుమతిస్తుందని చెప్పవచ్చా?

ఎంతమాత్రం కాదు. దానికి వ్యతిరేకంగా, ఇటీవలనే సరి చేయబడిన అవగాహన అంతాన్ని గురించి మరింతగా ఎదురుచూసేవారమై ఉండడానికి మనకు సహాయం చేయాలి. అదెలా?

నవంబరు 1, 1995, కావలికోట వివరించిన విధంగా, “ఈ తరము” అనే పద సముదాయాన్ని యేసు తన సమకాలీనులైన దుష్ట ప్రజలకు అన్వయించాడు. (మత్తయి 11:7, 16-19; 12:39, 45; 17:14-17; అపొస్తలుల కార్యములు 2:5, 6, 14, 40) అయితే అది ఒక ప్రత్యేకమైన తేదీనుండి ప్రారంభమయ్యే నిర్దిష్టమైన కాల గతి యొక్క వివరణ కాదు.

నిజానికి, కావలికోట యొక్క అదే సంచికలోని, “పాఠకుల ప్రశ్నలు” శీర్షిక రెండు కీలక అంశాలపై కేంద్రీకరించింది: “ఓ తరం ప్రజలు అంటే నిర్దిష్ట సంవత్సరాలుగల కాలంలోని ప్రజలుగా దృష్టించకూడదు” మరియు “ఒక తరంలోని ప్రజలు సాపేక్షంగా కొంత కాలం వరకు మాత్రం జీవిస్తారు, ఎక్కువ కాలం జీవించరు.”

మనం తరచూ “తరము”ను ఈ విధంగా ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మనమిలా చెప్పవచ్చు: ‘నెపోలియన్‌ తరానికి చెందిన సైనికులకు విమానాలు మరియు అణుబాంబుల గురించి ఏమి తెలియదు.’ నెపోలియన్‌ జన్మించిన సంవత్సరంలోనే జన్మించిన సైనికుల గురించి మనం సూచిస్తున్నామా? ఆయన కంటే ముందు మరణించిన ఆ ఫలానా ఫ్రెంచి సైనికులను మాత్రమే మనం సూచిస్తున్నామా? కానేకాదు; “తరము”ను గూర్చిన అలాంటి ఉపయోగం ద్వారా మనం కొన్ని నిర్దిష్టమైన సంవత్సరాలను స్థాపించాలని ప్రయత్నించడం లేదు. అయితే, మనం నెపోలియన్‌ కాలంనుండి భవిష్యత్తులోకి వందల సంవత్సరాలను కాదుగాని, సాపేక్షంగా స్వల్ప కాలాన్ని సూచిస్తున్నాము.

ఒలీవ కొండపై యేసు తన ప్రవచనంలో చెప్పినదాని గురించిన మన అవగాహన విషయం కూడా అంతే. ఆ ప్రవచనం యొక్క వివిధ అంశాలు నెరవేరడం అంతం సమీపంలో ఉందని నిరూపిస్తుంది. (మత్తయి 24:32, 33) ప్రకటన 12:9, 10 చెబుతున్నట్లు, 1914లో దేవుని పరలోక రాజ్యం స్థాపించబడటంతో సాతాను భూ పరిధిలోకి పడద్రోయబడ్డాడు. సాతానుకు ఇప్పుడు మరింత ఆగ్రహం వచ్చిందని ప్రకటన జత చేస్తుంది. ఎందుకు? “తనకు సమయము కొంచెమే అని” అతడికి తెలుసు. (ఇటాలిక్కులు మావి.)—ప్రకటన 12:12.

నవంబరు 1, కావలికోట “జాగరూకంగా ఉండవలసిన సమయం!” అనే ఉపశీర్షికను కల్గివుండడం సబబే. తగిన విధంగానే దాని తరువాతి పేరా ఇలా చెప్పింది: “సంఘటనల కచ్చితమైన సమయాన్ని గురించి మనకు తెలియవలసిన అవసరం లేదు. బదులుగా, మన దృష్టి మనం జాగరూకంగా ఉండటంపై, దృఢ విశ్వాసాన్ని వృద్ధిపర్చుకోవడంపై, మరి యెహోవా సేవలో పనిరద్దీ కల్గి ఉండటంపై ఆధారపడి ఉండాలే కానీ—తేదీని లెక్కించడంపై కాదు.” ఆ తర్వాత అది యేసు యొక్క ఈ మాటలను ఎత్తివ్రాసింది: “ఎదురు చూస్తూ ఉండండి, మెలకువగా ఉండండి, ఎందుకంటే నియమిత సమయం ఎప్పుడో మీకు తెలియదు. నేను మీకు ఏది చెబుతున్నానో అదే అందరికీ చెబుతున్నాను, జాగరూకంగా ఉండండి.”—మార్కు 13:33, 37, NW.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి