యెహోవాసాక్షులు అంతర్జాతీయ సమావేశాలను ఏర్పాటు చేయబోతున్నారు
యెహోవాసాక్షుల పరిపాలక సభ, 1998లో అంతర్జాతీయ సమావేశాలను ఏర్పాటు చేయాలని పథకం వేస్తోంది. 1996 అక్టోబరు 5 శనివారం నాడు జెర్సీ సిటీ సమావేశ హాలులో జరిగిన వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా వారి సాంవత్సరిక మీటింగ్‌లో ఈ విషయం ప్రకటింపబడినప్పుడు అందరూ ఉత్సాహంగా ప్రతిస్పందించారు.
మామూలుగా జరిగే జిల్లా సమావేశాలతో పాటు 1998 మధ్యభాగంలో ఉత్తర అమెరికాలో అనేక అంతర్జాతీయ సమావేశాలు ఏర్పాటు చేయబడతాయి. భూమి నలుమూలల నుండి వందల వేల సంఖ్యలో వచ్చే సాక్షులు కూడుకొనేలా ఈ సమావేశాలు చేస్తాయని అపేక్షించబడుతుంది. వీలైనన్ని ఎక్కువ దేశాల నుండి ప్రతినిధులు వచ్చేలా చేసేందుకు, ఉత్తర అమెరికాలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించడానికి నిర్ణయించిన నగరానికి, వాచ్‌టవర్ సొసైటీ యొక్క 100 కంటే ఎక్కువ బ్రాంచి కార్యాలయాలు తమ ప్రతినిధులను పంపే అవకాశాన్ని కలిగించడం జరుగుతుంది.
ఉత్తర అమెరికాకు ప్రయాణించి వెళ్లాలని అనుకునే వారంతా అక్కడకు వెళ్లలేకపోవచ్చు. అయితే తమకు సమీపంలో జరగబోయే ఒక అంతర్జాతీయ సమావేశానికి వారు హాజరవ్వడం సాధ్యం కావచ్చు. యూరప్‌లోని రెండు లేక మూడు దేశాల్లో అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి, మిగతావి ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, దక్షిణ పసిఫిక్ మరియు కరీబియన్లలో జరుగుతాయి.
సరైన సమయం వచ్చినప్పుడు, సొసైటీ బ్రాంచి కార్యాలయాలు తమ తమ ప్రాంతంలోని సంఘాలు ఏ సమావేశ నగరానికి లేక నగరాలకు ఆహ్వానించబడ్డాయో అనే విషయాన్ని తెలియజేస్తాయి. ప్రతినిధులను ఎన్నుకునేందుకుగల ఏర్పాట్ల గురించీ సమావేశం జరుగబోయే తేదీల గురించీ సమాచారం ఇవ్వబడుతుంది. ప్రతినిధుల ఎంపిక కొరకైన దరఖాస్తులను పూరించాలని అనుకొనేవారు ఈ ప్రత్యేక సందర్భం కొరకు తమ నిధులలో కొన్నిటిని కూడబెట్టుకోవడం ఇప్పటినుండే ప్రారంభించవచ్చు.
1998 కొరకైన ఈ అంతర్జాతీయ సమావేశాల్లో ఏమి రానైయుందో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు ఎదురు చూడవచ్చు. అన్ని దేశాల్లోని జిల్లా సమావేశాల్లోనూ అదే కార్యక్రమం అందించబడుతుంది.