403 సంవత్సరాల వైవాహిక బంధం సంకటంలో పడింది
స్వీడన్‌లో చర్చి మరియు రాష్ట్రం 400 కంటే ఎక్కువ సంవత్సరాలుగా సన్నిహిత సంబంధాలను ఆనందించాయి. ఇప్పుడు మతానికీ ప్రభుత్వానికీ మధ్యగల వైవాహిక బంధం బలహీనమయ్యింది.
పూర్వం 1593లో లూథరనిజం రాష్ట్ర మతంగా స్థాపించబడి స్వీడన్ వాసులందరూ బాప్తిస్మం తీసుకున్న సభ్యులవ్వవలసి వచ్చింది. సంవత్సరాల తర్వాత, 1850లలో ఒక సవరణ చేయబడింది. స్వీడన్ వారు బాప్తిస్మం తీసుకోవలసిన అవసరత ఇక ఎంతమాత్రం లేదు; అయినప్పటికీ, వారు ఇంకా లూథరన్ చర్చి సభ్యులుగానే పరిగణింపబడుతున్నారు. అలా వారు చర్చికి మద్దతు ఇచ్చేందుకు తమ పన్ను విధించబడిన రాబడిలో ఒక శాతాన్ని చర్చికి చెల్లించవలసి ఉన్నారు మరియు చర్చి అందించే కొన్ని పౌరసేవలకు అయ్యే ఖర్చు చెల్లించవలసి ఉన్నారు. ఇటీవలనే మరొక మార్పు వచ్చింది. 1952 నుండి స్వీడన్ వారు చట్టం సహాయంతో చర్చి నుండి తమ పేరు తీసివేయించుకోవాలని ఎంపిక చేసుకోవచ్చు మరియు అలా చర్చి పన్నులోని అత్యధిక భాగాన్ని కట్టకుండా వారు తప్పించుకోగలరు.
ఇటీవలి సంవత్సరాల్లో స్వీడన్‌పై లూథరన్ చర్చి తన పట్టును కోల్పోతోంది. అది అనివార్యం, ఎందుకంటే స్వీడన్ జనాభాలో 10 శాతం లూథరన్‌లు కాని వలస వచ్చిన వారే. వారిలో యూదులు, కాథోలిక్‌లు మరియు ముస్లిమ్‌లు కూడా ఉన్నారు. అలా 1996 ప్రారంభానికల్లా కేవలం 86 శాతం మంది స్వీడన్ వారే లూథరన్ చర్చికి చెందుతారు, మరి ఆ సంఖ్య ఇప్పుడు తగ్గిపోతోంది.
పెరిగిపోతున్న ఉదాసీన వైఖరి చర్చికీ రాష్ట్రానికీ మధ్య దూరాన్ని పెంచుతోంది. ఇప్పటికే, రాజు లూథరన్ కానవసరం లేదనీ ఒక లూథరన్ తల్లి/తండ్రికి పుట్టిన పిల్లలు ఆటోమేటిక్‌గా లూథరన్ రాష్ట్ర చర్చి సభ్యులుగా పరిగణింపబడరని ప్రకటించబడింది. అంతే కాకుండా, ద డల్లాస్ మార్నింగ్ న్యూస్ ప్రకారం, 2,000 సంవత్సరాల నాటికి “ప్రాంతీయ పారిష్‌లూ రాష్ట్రమూ చర్చి వద్ద ఉన్న ఆస్తులను జమకట్టి విభాగించుకోవాలి. చర్చి తన 168 కోట్ల డాలర్ల సాంవత్సరిక బడ్జెట్ తగ్గించుకోవాలి, ఎందుకంటే అందులోని అధిక శాతం పన్నులను వసూలు చేయడం ద్వారా వచ్చిందే.” ఈ శతాబ్దం తర్వాత చర్చి తన స్వంత బిషప్‌లను నియమించుకుంటుంది.
ఉదాసీనత మరియు సభ్యుల సంఖ్య తగ్గిపోవడం క్రైస్తవ మత సామ్రాజ్యాన్ని పట్టి పీడిస్తుండగా, స్వీడన్‌లోని యెహోవాసాక్షులు వర్ధిల్లుతున్నారు. ఆ దేశంలో 24,487 మంది దేవుని రాజ్య ప్రచారకులు ఉన్నారనీ దాదాపు 10 శాతం మంది పూర్తికాల పయినీరు సేవకులుగా ప్రకటిస్తున్నారనీ యెహోవాసాక్షుల 1997 వార్షిక పుస్తకం (ఆంగ్లం) నివేదిస్తుంది. వీరిలో అనేకులు గొప్ప సేవాధిక్యతల కొరకు ముందుకు వస్తున్నారు. ఉదాహరణకు, యెహోవాసాక్షుల 1995 జిల్లా సమావేశంలో 20 వివాహిత జంటలు వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌కు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఆ సమయంలో, తరగతులలో ఉత్తీర్ణులైన దాదాపు 75 మంది స్వీడన్ దేశీయులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మిషనరీసేవ చేస్తున్నారు. వారి చక్కని మాదిరీ, ప్రోత్సాహకరమైన ఉత్తరాలూ సందర్శనలూ ఇప్పుడు ఈ సేవను గురించి ఆలోచిస్తున్న వారిపై ఎంతో ప్రేరణాత్మకమైన ప్రభావాన్ని చూపించాయనడంలో సందేహమేమీ లేదు.
అలా, క్రైస్తవ మత సామ్రాజ్యానికి చెందిన లక్షలాది మంది నైతికంగా పతనమౌతుండగా, యెహోవాసాక్షులు “హృదయానందముచేత కేకలు” వేస్తున్నారు.—యెషయా 65:13, 14.
[30వ పేజీలోని చిత్రం]
స్వీడన్