‘సత్యాన్ని శాంతిని ప్రేమించండి’!
“సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను: ‘. . . సత్యాన్ని శాంతిని ప్రేమించండి.’”—జెకర్యా 8:18, 19, NW.
1, 2. (ఎ) శాంతికి సంబంధించినంత వరకు మానవజాతిని గూర్చిన నివేదిక ఏమిటి? (బి) ప్రస్తుత ప్రపంచం ఎందుకు ఎన్నడూ నిజమైన శాంతిని చూడలేదు?
“ప్రపంచం శాంతిని ఎన్నడూ కల్గిలేదు. ఎక్కడో ఒకచోట—తరచూ ఏక కాలంలో అనేక దేశాల్లో—ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంది.” అమెరికాలోని మసాచెసెట్స్ విశ్వవిద్యాలయ ప్రొఫెసరైన మిల్టన్ మయర్ అలా అన్నాడు. మానవజాతిపై ఎంతటి విచారకరమైన వ్యాఖ్యానమో కదా! నిజమే, మానవులు శాంతిని కోరుకుంటారు. రోమా కాలంనాటి పాక్స్ రొమానా నుండి ప్రచ్ఛన్న యుద్ధ కాలంలోని “పరస్పర నిశ్చయ వినాశన” పద్ధతి వరకూ దానిని పరిరక్షించడానికి రాజకీయ నాయకులు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నించారు. అయినా, చివరికి వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అనేక శతాబ్దాల క్రిందట యెషయా వ్యక్తపర్చినట్లుగా, ‘శాంతిదూతలే ఘోరంగా విలపించారు.’ (యెషయా 33:7) ఎందుకిలా?
2 ఎందుకంటే విద్వేషం, అత్యాస కనుమరుగవ్వడం నుండే అనంతమైన శాంతి పుట్టుకొస్తుంది; అది సత్యమందు వేళ్లూనుకోవాలి. శాంతి అబద్ధాలపై ఆధారపడదు. అందుకే యెహోవా ప్రాచీన ఇశ్రాయేలీయులకు పునఃస్థాపనను గూర్చి, శాంతిని గూర్చి వాగ్దానం చేస్తున్నప్పుడు ఇలా చెప్పాడు: “నదివలె సమాధానమును [“శాంతిని,” NW] ఆమెయొద్దకు పారజేయుదును, . . . జనముల ఐశ్వర్యము . . . పొర్లిపారు జలప్రవాహమువలె . . . రాజేతును.” (యెషయా 66:12) ఈ విధానానికి దేవుడైన అపవాదియగు సాతాను, ‘నర సంహారకుడు’ నరహంతకుడు, “అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై” ఉన్నాడు. (యోహాను 8:44; 2 కొరింథీయులు 4:4) అలాంటి దేవున్ని కలిగిన ప్రపంచం శాంతిని ఎప్పటికైనా ఎలా కల్గివుండగలదు?
3. తన ప్రజలు కల్లోలిత ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ యెహోవా ఏ విశిష్టమైన బహుమానాన్ని వారికి అనుగ్రహించాడు?
3 అయినా, సాతాను యొక్క యుద్ధ పీడిత ప్రపంచంలో తన ప్రజలు జీవిస్తున్నప్పటికీ, యెహోవా వారికి శాంతిని అనుగ్రహిస్తాడు. (యోహాను 17:16) సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో, యిర్మీయా ద్వారా చేసిన తన వాగ్దానాన్ని నెరవేర్చి, తన ప్రత్యేకమైన జనాంగాన్ని వారి స్వదేశమందు పునఃస్థాపించినప్పుడు, ఆయన వారికి “శాంతిని సత్యాన్ని” అనుగ్రహించాడు. (యిర్మీయా 33:6) మరి ఈ అంత్యదినాల్లో, తన ప్రజలు ప్రపంచం ఇప్పటి వరకూ చవిచూసిన క్లిష్టమైన గడ్డుకాలంలో జీవించాల్సి వచ్చినప్పటికీ వారి “దేశం”లో లేదా భూసంబంధమైన ఆత్మీయ స్థితిలో “శాంతిని సత్యాన్ని” ఆయన వారికి అనుగ్రహించాడు. (యెషయా 66:8; మత్తయి 24:7-13; ప్రకటన 6:1-8) జెకర్యా 8వ అధ్యాయంపై మన చర్చను కొనసాగిస్తుండగా, దేవుడు అనుగ్రహించిన ఈ శాంతి సత్యాలపై మనం ప్రగాఢమైన ప్రశంసను పెంపొందించుకొని, దానియందలి మన భాగాన్ని కాపాడుకోవడానికి మనం ఏమి చేయాలో చూస్తాం.
‘మీ చేతుల్ని బలపర్చుకోండి’
4. ఇశ్రాయేలీయులు శాంతిని అనుభవించాలంటే ఏవిధంగా ప్రవర్తించాలని జెకర్యా వారిని ప్రోత్సహించాడు?
4 జెకర్యా 8వ అధ్యాయంలో ఆరవసారి, యెహోవా నుండి వచ్చిన ఈ ఉద్వేగభరితమైన ప్రకటనను మనం వింటాం: “సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా—సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాదివేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యము తెచ్చుకొనుడి [“మీ చేతుల్ని బలపర్చుకోండి,” NW]. ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకక యుండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయెను, తన పనిమీద పోవువానికి శత్రుభయముచేత నెమ్మది [“శాంతి,” NW] లేకపోయెను; ఏలయనగా ఒకరిమీదికొకరిని నేను రేపుచుంటిని.”—జెకర్యా 8:9, 10.
5, 6. (ఎ) ఇశ్రాయేలీయుల నిరుత్సాహాన్నిబట్టి, ఇశ్రాయేలులో ఏ పరిస్థితి ఏర్పడింది? (బి) ఇశ్రాయేలీయులు యెహోవా ఆరాధనను మొదటి స్థానంలో ఉంచినట్లైతే వారికే మార్పు జరుగుతుందని ఆయన వాగ్దానం చేశాడు?
5 యెరూషలేములో ఆలయం పునర్నిర్మింపబడ్తుండగా జెకర్యా ఈ మాటలు మాట్లాడాడు. ఇంతకుముందు, బబులోను నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులు నిరుత్సాహపడి, ఆలయ నిర్మాణ పనిని నిలిపివేశారు. వారు తమ స్వంత సౌఖ్యంపైనే శ్రద్ధను నిలిపినందున వారికి యెహోవా నుండి ఆశీర్వాదం, శాంతి రాలేదు. వారు తమ భూముల్ని సాగుచేసినా, తమ ద్రాక్షతోటలపై శ్రద్ధ చూపించినా, వారు వర్థిల్లలేదు. (హగ్గయి 1:3-6) అది వారు ‘కూలి లేకుండా’ పనిచేసినట్లుగానే ఉంది.
6 ఇప్పుడు ఆలయం నిర్మించబడ్తుండగా, ‘దృఢంగా ఉండమని’, ధైర్యంగా యెహోవా ఆరాధనను మొదటి స్థానంలో ఉంచుకోమని జెకర్యా యూదులను ప్రోత్సహించాడు. వారలా చేసినట్లైతే ఏమి జరిగి ఉండేది? “పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. సమాధానసూచకమైన [“శాంతి విత్తనము ఉంటుంది,” NW] ద్రాక్షచెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశమునుండి మంచు కురియును, ఈ జనులలో శేషించినవారికి వీటినన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. యూదావారలారా, ఇశ్రాయేలువారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై యుంటిరో ఆలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును; భయపడక ధైర్యము తెచ్చుకొనుడి [“మీ చేతుల్ని బలపర్చుకోండి,” NW].” (జెకర్యా 8:11-13) ఇశ్రాయేలీయులు కృతనిశ్చయంతో పనిచేసినట్లైతే, అది వర్థిల్లుతుంది. మునుపు, అన్యజనులు శాపాస్పదానికో ఉదాహరణ చెప్పాలనుకున్నప్పుడు, వారు ఇశ్రాయేలును చూపించేవారు. ఇప్పుడు ఇశ్రాయేలు ఆశీర్వాదానికో ఉదాహరణగా ఉంటుంది. ‘వారి చేతులను బలపర్చబడడానికి’ ఎంత మంచి కారణమో కదా!
7. (ఎ) 1995 సేవా సంవత్సరంలో ఉన్నతస్థాయికి చేరుకున్న ఏ పులకరింపజేసే మార్పుల్ని యెహోవా ప్రజలు అనుభవించారు? (బి) వార్షిక నివేదికలో, ప్రచారకుల్ని, పయినీర్లను, సగటు గంటలను గూర్చిన విశిష్టమైన రికార్డుని కల్గివున్న ఏ దేశాల్ని మీరు చూడగలరు?
7 నేటి విషయమేమిటి? సరే, 1919వ సంవత్సరానికి మునుపున్న సంవత్సరాల్లో, యెహోవా ప్రజలు ఎంతమేరకు నిరాసక్తిగా ఉన్నారు. వారు మొదటి ప్రపంచ యుద్ధంలో పూర్తిగా తటస్థవైఖరిని అవలంభించలేదు, తమ రాజైన యేసుక్రీస్తును అనుసరించడానికి బదులు మానవుని అనుసరించే దృక్పథాన్ని కల్గివున్నారు. తత్ఫలితంగా, సంస్థకు లోపల నుండి, వెలుపల నుండి వచ్చిన వ్యతిరేకతను బట్టి కొందరు నిరుత్సాహపడ్డారు. తరువాత, 1919లో యెహోవా సహాయంతో వారు తమ చేతుల్ని బలపర్చుకున్నారు. (జెకర్యా 4:6) యెహోవా వారికి శాంతిని అనుగ్రహించాడు, మరి వారు బలంగా వర్థిల్లారు. ఇది 1995 సేవా సంవత్సరంలో ఉన్నతస్థాయికి చేరుకున్న వారి గత 75 సంవత్సరాల నివేదికనందు కనబడుతోంది. ఒక ప్రజగా, యెహోవాసాక్షులు జాతీయవాదానికి, తెగలవాదానికి, దురభిమానానికి, విద్వేషానికి సంబంధించిన మరితర మూలాలన్నింటికి విముఖులై ఉంటారు. (1 యోహాను 3:14-18) వారు యెహోవా ఆత్మీయ ఆలయంలో ఆయనను యథార్థమైన ఆసక్తితో సేవిస్తున్నారు. (హెబ్రీయులు 13:15; ప్రకటన 7:15) గత సంవత్సరంలోనే, తమ పరలోకపు తండ్రిని గురించి ఇతరులతో మాట్లాడడానికి వారు వందకోట్ల గంటలపైనే వెచ్చించారు! ప్రతినెలా వారు 48,65,060 బైబిలు పఠనాల్ని నిర్వహించారు. ప్రతినెలా సగటున 6,63,521 మంది పయినీరు సేవలో భాగం వహించారు. తమ ఆరాధనయందు నిజమైన ఆసక్తిని కల్గిన ప్రజలకో ఉదాహరణను ఇవ్వాలని అనుకున్నప్పుడు క్రైస్తవమత సామ్రాజ్యంలోని పరిచారకులు కొన్నిసార్లు యెహోవాసాక్షుల్నే సూచిస్తారు.
8. ‘శాంతి విత్తనం’ నుండి ప్రతి క్రైస్తవుడూ ఎలా ప్రయోజనం పొందగలడు?
8 వారి ఆసక్తినిబట్టి, యెహోవా తన ప్రజలకు ‘శాంతి విత్తనాన్ని’ ఇచ్చాడు. ఆ విత్తనాన్ని సాగుచేసుకొనే ప్రతి ఒక్కరూ తన హృదయమందూ జీవితంలోనూ శాంతి ఎదగడాన్ని చూస్తాడు. యెహోవాతోనూ తోటి క్రైస్తవులతోనూ శాంతిని పెంపొందింప చేసుకొనే నమ్మకమైన క్రైస్తవులందరూ యెహోవా నామం పెట్టబడిన ప్రజల శాంతి సత్యాల్లో భాగం వహిస్తారు. (1 పేతురు 3:11; పోల్చండి యాకోబు 3:18.) అది అద్భుతకరమైనది కాదా?
“భయపడకుడి”
9. యెహోవా తన ప్రజలతో తాను వ్యవహారించే తీరులో వచ్చే ఏమార్పును ఆయన వాగ్దానం చేశాడు?
9 ఇప్పుడు మనం యెహోవానుండి వచ్చిన ఏడవ ప్రకటనను చదువుతాం. అదేమిటి? “సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా—మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను మీకు కీడుచేయ నుద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలు చేయ నుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి.”—జెకర్యా 8:14, 15.
10. యెహోవాసాక్షుల్ని గూర్చిన ఏ నివేదిక వారు భయపడలేదని చూపిస్తోంది?
10 మొదటి ప్రపంచ యుద్ధకాలంలో యెహోవా ప్రజలు ఆత్మీయ భావంలో చెదిరిపోయినప్పటికీ, తమ హృదయాల్లో సరియైన దానిని చేయాలనే కోరికను వారు కల్గివున్నారు. అందుకే, యెహోవా కొంత క్రమశిక్షణను ఇచ్చిన తరువాత, వారితో తాను వ్యవహారించే తీరుని మార్చుకున్నాడు. (మలాకీ 3:2-4) నేడు, మనం వెనక్కి తిరిగి చూసి, ఆయన చేసిన దానినిబట్టి ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తాం. నిజమే, మనం “సకల జనములచేత ద్వేషింప”బడుతూనే ఉన్నాం. (మత్తయి 24:9) అనేకమంది చెరపట్టబడ్డారు, కొంతమంది తమ విశ్వాసం నిమిత్తం మరణించారు కూడా. మనం తరచూ నిర్లక్ష్యాన్నో ప్రతికూలతనో ఎదుర్కొంటాం. అయినా మనం భయపడం. దృశ్యమైన లేదా అదృశ్యమైన ఏ వ్యతిరేకతకన్నా యెహోవా బలవంతుడని మనకు తెలుసు. (యెషయా 40:15; ఎఫెసీయులు 6:10-13) ఈ మాటల్ని మనం నిర్లక్ష్యపెట్టం: “యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము.”—కీర్తన 27:14.
“ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను”
11, 12. యెహోవా తన ప్రజలకు అనుగ్రహించే ఆశీర్వాదాల్లో మనం పూర్తిగా భాగం వహించాలనుకొంటే మనలో ప్రతిఒక్కరూ ఏ విషయాన్ని మనస్సులో ఉంచుకోవాలి?
11 యెహోవా నుండి వచ్చు ఆశీర్వాదాల్లో పూర్తిగా భాగం వహించడానికి, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. జెకర్యా ఇలా చెబుతున్నాడు: “మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన [“శాంతియుతమైన,” NW] న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువానిమీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణముచేయ నిష్టపడకూడదు, ఇట్టివన్నియు నాకు అసహ్యములు; ఇదే యెహోవా వాక్కు.”—జెకర్యా 8:16, 17.
12 సత్యాన్నే మాట్లాడాలని యెహోవా మనకు ఉద్భోదిస్తున్నాడు. (ఎఫెసీయులు 4:15, 25) దుర్యోచనలు చేసి, వ్యక్తిగత లాభం నిమిత్తం సత్యాన్ని మరుగుచేసే లేదా అబద్ధ ప్రమాణాల్నిచేసే వారి ప్రార్థనల్ని ఆయన వినడు. (సామెతలు 28:9) భ్రష్టత్వాన్ని ఆయన ద్వేషిస్తున్నాడు గనుక బైబిలు సత్యానికి మనం హత్తుకొని ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. (కీర్తన 25:5; 2 యోహాను 9-11) అంతేకాకుండా, ఇశ్రాయేలులో పురద్వారాల దగ్గరనున్న ఇశ్రాయేలీయులైన పెద్దలవలె న్యాయ విచారణలను చేపట్టిన పెద్దల సలహాలు, నిర్ణయాలు వ్యక్తిగత అభిప్రాయంపై కాక బైబిలు సత్యంపై ఆధారపడి ఉండాలి. (యోహాను 17:17) క్రైస్తవ కాపరులుగా, వారు ‘శాంతియుతమైన న్యాయాన్ని’ అన్వేషించాలని, వ్యాజ్యెమాడుకుంటున్న ఇరుపక్షాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించాలని మరియు పశ్చాత్తాపపడిన పాపులు దేవునితో శాంతిని తిరిగిపొందడానికి సహాయపడాలని యెహోవా కోరుకుంటున్నాడు. (యాకోబు 5:14, 15; యూదా 23) అదే సమయంలో, ఇష్టపూర్వకంగా తప్పిదాన్ని చేయడంలో కొనసాగుతూ ఆ శాంతికి భంగం కల్గించే వారిని ధైర్యంగా బహిష్కరించడం ద్వారా వారు సంఘం యొక్క శాంతిని పరిరక్షిస్తారు.—1 కొరింథీయులు 6:9, 10.
‘జయోత్సాహం, ఆనందం’
13. (ఎ) ఉపవాసం విషయంలో ఏ మార్పును జెకర్యా ప్రవచించాడు? (బి) ఇశ్రాయేలులో ఏ ఉపవాసం ఆచరించబడేది?
13 మనమిప్పుడు ఈ గంభీరమైన ఎనిమిదవ ప్రకటనను వినబోతున్నాం: “సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా—నాలుగవ నెలలోని ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యూదా యింటివారికి సంతోషమును ఉత్సాహమును [“జయోత్సాహాన్ని ఆనందాన్ని,” NW] పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి [“సత్యాన్ని శాంతిని ప్రేమించండి” NW]”. (జెకర్యా 8:19) మోషే ధర్మశాస్త్రం క్రింద, తమ పాపాల నిమిత్తం దుఃఖాన్ని వ్యక్తపర్చేందుకు ప్రాయశ్చిత దినాన ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండేవారు. (లేవీయకాండము 16:29-31) జెకర్యా ద్వారా చెప్పబడిన నాల్గు ఉపవాసాలు యెరూషలేము జయించబడి, నాశనం చేయబడిన దానికి సంబంధించిన సంఘటనలను గురించి శోకాన్ని వ్యక్తం చేసే ఆచరణేనని స్పష్టమౌతోంది. (2 రాజులు 25:1-4, 8, 9, 22-26) అయితే, ఇప్పుడు ఆలయం పునర్నిర్మింపబడి, యెరూషలేము మరలా ప్రజలతో నింపబడింది. దుఃఖం ఆనందంగా మారింది, ఉపవాసాలు పండుగలుగా మారాయి.
14, 15. (ఎ) జ్ఞాపకార్థదిన ఆచరణ ఆనందించడానికి ఏవిధంగా ఒక గొప్ప కారణమౌతోంది, ఇది మనకు దేన్ని జ్ఞాపకం చేయాలి? (బి) వార్షిక నివేదికలో చూచినట్లుగా, జ్ఞాపకార్థదిన ఆచరణకు సంబంధించి ఏ దేశాలు విశిష్టమైన హాజర్ని కల్గివున్నాయి?
14 ఈనాడు, మనం జెకర్యా ద్వారా చెప్పబడిన ఉపవాసాల్నిగాని, ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ఉపవాసాల్నిగాని ఆచరించం. యేసు మన పాపాల నిమిత్తం తన జీవాన్ని అర్పించాడు గనుక గొప్ప ప్రాయశ్చిత్తార్థ దినం యొక్క ఆశీర్వాదాల్ని మనం అనుభవిస్తున్నాం. మన పాపాలు పాక్షికంగాగాక పూర్తిగా కప్పివేయబడతాయి. (హెబ్రీయులు 9:6-14) పరలోకపు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ, క్రైస్తవులచే ఆచరింపదగిన ఏకైక ఆచరణగా మనం ఆయన మరణ జ్ఞాపకార్థ దినాన్ని ఆచరిస్తాం. (లూకా 22:19, 20) ఆ ఆచరణను ఆచరించడానికి ప్రతి సంవత్సరం మనం కూడుకుంటుండగా ‘జయోత్సాహాన్ని, ఆనందాన్ని’ మనం అనుభవించడం లేదా?
15 గత సంవత్సరం, జ్ఞాపకార్థ దినాన్ని ఆచరించడానికి 1,31,47,201 మంది కూడుకున్నారు అంటే 1994 నాటికన్నా 8,58,284 మంది ఎక్కువ. ఎంత పెద్ద సమూహమో కదా! దీన్ని ఆచరించడానికి తమ రాజ్యమందిరాల్లోకి అసాధారణమైన పెద్ద సంఖ్య సమకూడగా 78,620 యెహోవాసాక్షుల సంఘాల్లోని ఆనందాన్ని దృశ్యీకరించుకోండి. నిశ్చయంగా, హాజరైన వారందరూ “మార్గమును సత్యమును జీవమును” అయినవాడూ ఇప్పుడు యెహోవా యొక్క గొప్ప ‘శాంతియధిపతి’గా పరిపాలిస్తున్నవాని మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా వారు ‘సత్యాన్ని శాంతిని ప్రేమించడానికి’ కదిలింపబడ్డారు! (యోహాను 14:6; యెషయా 9:6) కల్లోలాలచే యుద్ధాలచే విచ్ఛిన్నం చేయబడిన దేశాల్లో దానిని ఆచరించిన వారికి ఆ ఆచరణ ప్రత్యేకమైన భావాన్ని కల్గివుంది. మన సహోదరుల్లో కొందరు 1995 నాటి వర్ణింపశక్యంకాని ఘోరకృత్యాలకు సాక్ష్యంగా ఉన్నారు. అయినప్పటికీ, ‘సమస్త జ్ఞానానికి మించిన దైవిక శాంతి యేసుక్రీస్తు వలన వారి హృదయాలకు, తలంపులకు కావలిగా ఉంది.’—ఫిలిప్పీయులు 4:7.
‘యెహోవాను ప్రసన్న ముఖుని చేసుకొందాం’
16, 17. అన్యజనులు ఏవిధంగా ‘యెహోవాను శాంతిపరచ’గలరు?
16 అయితే, జ్ఞాపకార్థ దినానికి హాజరైన ఆ లక్షలాదిమంది ఎక్కడ నుండి వచ్చారు? యెహోవా నుండి వచ్చిన ఈ తొమ్మిదవ ప్రకటన వివరిస్తోంది: “సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా—జనములును అనేక పట్టణముల నివాసులును ఇంకను వత్తురు. ఒక పట్టణపువారు మరియొక పట్టణపువారి యొద్దకు వచ్చి—ఆలస్యముచేయక యెహోవాను శాంతిపరచుటకును, [“ప్రసన్న ముఖుని చేసుకొనుటకు,” NW] సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు—మేమును వత్తుమందురు. అనేక జనములును బలముగల జనులును యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును, యెహోవాను శాంతిపరచుటకును [“ప్రసన్న ముఖుని చేసుకొనుటకు,” NW] వత్తురు.”—జెకర్యా 8:20-22.
17 జ్ఞాపకార్థ దినానికి హాజరైన ప్రజలు ‘సైన్యములకు అధిపతియైన యెహోవాను అన్వేషించే’ కోరికను కల్గివున్నారు. వీరిలో అనేకులు ఆయనకు సమర్పించుకొని బాప్తిస్మం పొందిన సేవకులే. హాజరైన వారిలో లక్షలాదిమంది ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు. కొన్ని దేశాల్లో జ్ఞాపకార్థ దినానికి హాజరైన వారి సంఖ్య రాజ్య ప్రచారకుల సంఖ్యకు నాలుగైదు రెట్లు ఎక్కువే. పురోభివృద్ధి చేసుకోవడంలో కొనసాగేందుకు అనేకులైన ఈ ఆసక్తిపరులకు సహాయం అవసరం. మన పాపాల నిమిత్తం యేసు మరణించి, దేవుని రాజ్యమందు ఇప్పుడు పరిపాలిస్తున్నాడనే జ్ఞానంలో ఎలా ఉత్సహించాలో వారికి మనం నేర్పిద్దాం. (1 కొరింథీయులు 5:7, 8; ప్రకటన 11:15) యెహోవా దేవునికి సమర్పించుకొనేందుకు, ఆయన నియమిత రాజుకు లోబడేందుకు వారిని మనం ప్రోత్సహిద్దాం. ఈ విధంగా వారు “యెహోవాను శాంతిపర”చుదురు.—కీర్తన 116:18, 19; ఫిలిప్పీయులు 2:12, 13.
“ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది”
18, 19. (ఎ) జెకర్యా 8:23 నెరవేర్పునందలి ‘యూదుడు’ నేడు ఎవరు? (బి) “యొక యూదుని చెంగు పట్టుకొని”న ఆ “పదేసిమంది” నేడు ఎవరు?
18 జెకర్యా ఎనిమిదవ అధ్యాయంలో చివరిసారిగా మనమిలా చదువుతాం: ‘సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.’ యెహోవా యొక్క చివరి ప్రకటన ఏమైవుంది? “ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని—దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.” (జెకర్యా 8:23) జెకర్యా కాలంలో శరీరసంబంధమైన ఇశ్రాయేలీయులే దేవుడు ఏర్పర్చుకున్న జనాంగం. అయినా, మొదటి శతాబ్దంలో, ఇశ్రాయేలీయులు యెహోవా యొక్క మెస్సీయాను తిరస్కరించారు. అందునుబట్టి, ఆత్మీయ యూదులచే తయారుచేయబడిన “దేవుని ఇశ్రాయేలు” అయిన ఒక యూదుని అంటే ఓ క్రొత్త ఇశ్రాయేలీలును తన ప్రత్యేకమైన ప్రజగా మన దేవుడు ఏర్పర్చుకున్నాడు. (గలతీయులు 6:16; యోహాను 1:11; రోమీయులు 2:28, 29) వీరి మొత్తం సంఖ్య 1,44,000 మందియై ఉండాలి, తన పరలోక రాజ్యంలో యేసుతోపాటు పరిపాలించడానికి వీరు మానవజాతిలో నుండి ఏర్పర్చుకొనబడ్తారు.—ప్రకటన 14:1, 4.
19 ఈ 1,44,000 మందిలోని అనేకులు నమ్మకమైనవారిగా ఉండి ఇప్పటికే మరణించి, తమ పరలోక ప్రతిఫలాన్ని పొందారు. (1 కొరింథీయులు 15:51, 52; ప్రకటన 6:9-11) భూమిపై కొద్దిమందే ఉన్నారు, యూదునితోపాటు వెళ్లాలని ఎంపిక చేసికొనిన “పదేసిమంది” “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి[న] . . . యొక గొప్ప సమూహ”మేనని తెలుసుకోవడాన్ని బట్టి వీరు ఆనందిస్తున్నారు.—ప్రకటన 7:9; యెషయా 2:2, 3; 60:4-10, 22.
20, 21. ఈ ప్రపంచాంతం సమీపిస్తుండగా యెహోవాతో శాంతిని మనమెలా పదిలపర్చుకోవచ్చు?
20 ఈ ప్రపంచాంతం అనివార్యంగా సమీస్తుండగా, క్రైస్తవమత సామ్రాజ్యం యిర్మీయా కాలంనాటి యెరూషలేము వలె ఉంది: “సమాధానము కొరకు [“శాంతి కొరకు,” NW] కనిపెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు; చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది.” (యిర్మీయా 14:19) దేశాలు అబద్ధమతం తట్టుతిరిగి దానిని క్రూరంగా నాశనం చేసినప్పుడు ఆ భీతి పరాకాష్టకు చేరుకుంటుంది. అటుతరువాత త్వరలోనే దేవుని చివరి యుద్ధమైన అర్మగిద్దోనులో దేశాలు నాశనం చేయబడతాయి. (మత్తయి 24:29, 30; ప్రకటన 16:14, 16; 17:16-18; 19:11-21) అదెంతటి కల్లోలిత కాలమై ఉంటుందో కదా!
21 సత్యాన్ని ప్రేమించి ‘శాంతి విత్తనాన్ని’ పెంపొందించుకొనే వారిని వీటన్నింటి నుండి యెహోవా కాపాడతాడు. (జెకర్యా 8:12; జెఫన్యా 2:3) కాబట్టి బహిరంగంగా ఆసక్తితో ఆయనను స్తుతిస్తూ, సాధ్యమైనంతమంది ‘యెహోవాను ప్రసన్న ముఖుని చేసుకోవడానికి’ సహాయపడ్తూ ఆయన ప్రజల దేశములోనే సురక్షితంగా నిలిచి ఉందాం. అలా చేసినట్లైతే, మనం ఎల్లవేళలా యెహోవా శాంతిని అనుభవిస్తాం. అవును, “యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము [“శాంతిని,” NW] కలుగజేసి వారి నాశీర్వదించును.”—కీర్తన 29:11.
మీరు వివరించగలరా?
◻ జెకర్యా కాలంలో దేవుని ప్రజలు ఎలా ‘తమ చేతుల్ని బలపర్చుకున్నారు’? నేడెలా బలపర్చుకున్నారు?
◻ హింస, నిర్లక్ష్యత మరియు ప్రతికూలతలకు మనమెలా ప్రతిస్పందిస్తాం?
◻ మనం ‘ఒకరితోనొకరు సత్యాన్ని మాట్లాడడంలో’ ఏమి ఇమిడివున్నది?
◻ ఒక వ్యక్తి యెహోవాను ఎలా ‘ప్రసన్న ముఖుని చేసుకొన’గలడు?
◻ జెకర్యా 8:23 నెరవేర్పునందు ఆనందించడానికి గల ఏ గొప్ప కారణాన్ని చూశాం?
[18వ పేజీలోని చిత్రం]
గత సంవత్సరం, దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రజలతో మాట్లాడడానికి యెహోవాసాక్షులు 115,03,53,444 గంటల్ని వెచ్చించారు