అపాయకరమైన పరిసరాల్లో మీరు ఎలా జీవించి ఉండగలరు?
“నాకెప్పుడూ భయంగా ఉండేది. లిఫ్ట్‌లోనూ భయమే. నా కారులో కూర్చున్నా భయమే. నా ఇంట్లోవున్నా భయమే. ప్రతి చోటా నేరమే. ప్రజలు ఎల్లప్పుడు దోచుకోబడుతుండేవారు” అని మారియా చెబుతోంది. ఈ బ్రెజిల్ దేశ స్త్రీవలె మీరు మీ పరిసరాల్లో భయంతో ఉంటున్నారా, ముఖ్యంగా రాత్రుల్లో?
గూఢాచారీ కథలు చదివేందుకు ఎంతో ఉత్తేజవంతంగానే ఉంటాయి, కానీ నిజజీవితంలో తరచూ ఆనందకరమైన ముగింపు ఉండదు. ఒక నేరం ముడివిడువబడకుండానే ఉండిపోవచ్చు. లేక నరహత్య కేసుల్లో ఎవరో ఒకరు భర్త, తండ్రి, లేక కుమారుడు లేకుండా, భార్య, తల్లి, లేక కూతురు లేకుండా జీవనం కొనసాగించాల్సి ఉంటుంది. మీ ప్రాంతంలో దౌర్జన్యపూరితమైన నేరం పెరుగుతోందా? మీ కుటుంబం క్షేమంగా ఉండే ఓ ప్రాంతం కొరకు మీరు అపేక్షిస్తున్నారా? లేక, మీరు మీ పిల్లలను నేరంతో నిండివున్న ప్రాంతంలో పెంచడం తప్పనిసరైనట్లైతే, మీరు జీవించి ఉండేందుకు ఏమి చేయగలరు?
నిజమే, నేరం ఎక్కువగా నమోదు చేయబడని పట్టణాలు ఇంకా ఉన్నాయి. అనేక దేశాల్లో, ప్రజలు నేటివరకూ పల్లెటూరి ప్రశాంత వాతావరణంలో లేక హాయిగా ఉండే గ్రామ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. మునుపు నేరరహితంగా పరిగణించబడిన ప్రాంతాల్లో సహితం నేడు పరిస్థితులు ఎంతో వేగంగా మారుతున్నాయి. ఉదాహరణకు బ్రెజిల్‌నందు 50 సంవత్సరాల క్రితం, దాని జనాబాలో 70 శాతం మంది గ్రామాల్లో నివసించే వారు. ఇప్పుడు 70 శాతం మంది పట్టణాల్లో జీవిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలతో పాటు, నగరానికి సంబంధించిన నేరం మరియు దౌర్జన్యం వంటి సమస్యలు పెరిగాయి. అపాయకరమైన ప్రాంతంలో జీవిస్తున్నా లేకపోయినా, ఉద్యోగానికిగానీ పాఠశాలకుగానీ వెళ్లాల్సి ఉంటుంది మరియు బయట ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది.
ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న “భయ సిండ్రోమ్‌ను” గుర్తిస్తూ రియో డి జనిరియో పట్టణ పోలీసు చీఫ్, దానికి సంఘంలో జరిగే అన్యాయమూ మరియు పథకం ప్రకారం చేసే దౌర్జన్యం కారణాలని చెబుతున్నాడు. వార్తా పత్రికలు మరియు దూరదర్శని “విషాదకరమైన వార్తలతో ప్రజల మనస్సులను ప్రభావితంచేస్తూ” అంతటా భయం వ్యాపించేందుకు తోడ్పడుతున్నాయని కూడా ఆయన భావిస్తున్నాడు. మాదక ద్రవ్యాల దురలవాటు, కుటుంబ విచ్ఛిన్నం మరియు మతపరమైన తప్పుడు బోధలు కూడా పెరిగే అన్యాయానికి కారణమౌతున్నాయి. మరి భవిష్యత్తు మనకు ఏమి తెస్తుంది? పుస్తకాలలోనూ సినిమాల్లోనూ క్లుప్తీకరించి వినోదంగా చూపించబడే దౌర్జన్యపూరితమైన దృశ్యాలను క్రమంగా అందించడం ప్రజలు ఇతరుల విషయంలో బొత్తిగా భావరహితంగా తయారయ్యేటట్లు చేస్తుందా? నేర రహితంగా పరిగణించబడే ప్రాంతాలు కూడా అపాయకరంగా తయారౌతాయా?
దౌర్జన్యానికి గురవ్వడం తమాషా కాదు కనుక, క్షేమంగా ఉండాలనే బలమైన కోరిక మనకుంది. వీధుల్లో అనేకమంది పోలీసు అధికారులవసరమని మరియు శిక్షలనూ మరింత కఠినపర్చాలని లేక మరణ శిక్షను సహితం విధించాలని శ్రద్ధగల పౌరులు కోరడంలో ఏ ఆశ్చర్యమూ లేదు! అపాయాలున్నప్పటికీ, కొందరు స్వయం రక్షణకొరకు తుపాకీలను సంపాదిస్తారు. మరి కొందరు మందుగుండు సామాను అమ్మకాన్ని అదుపు చేయాలని అధికారులను కోరుతున్నారు. అయితే నేరాలు పెరుగుతున్నాయనే చెడు వార్త ఉన్నప్పటికి, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వాస్తవానికి, జోహానస్బర్గ్, మెక్సికో పట్టణం, న్యూయార్క్, రియో డి జనిరియో మరియు సావోపాలో వంటి పెద్ద పెద్ద పట్టణాల్లో జీవించే అనేకమంది నివాసులు దోచుకొనబడలేదు. అపాయకరమైన పరిసరాల్లో ఉంటున్న ప్రజలు వీటిని ఎలా తాళుకుంటున్నారో మనం పరిశీలిద్దాము.
అనుకూల దృక్పథాన్ని నిలుపుకోవడం
నేరాలు జరుగుతున్న ప్రాంతాన్ని గూర్చి, “ఇంకా కఠినమైన జీవన పరిస్థితుల్లోను గౌరవ మర్యాదలతో జీవించగల్గుతున్న వేలమంది బ్రెజిల్ దేశీయుల నేర్పు మరియు పట్టుదలపై” ఓ రచయిత వ్యాఖ్యానించాడు. రియో డి జనిరియోలో 38 సంవత్సరాలు ఉన్న తర్వాత జార్జే ఇలా చెబుతున్నారు: “నేను కొన్ని వీధుల్లోనూ కొన్ని ప్రాంతాల్లోను నడవను మరి ఎటువంటి వీధి కార్యక్రమాల్లోనూ నేను ఆసక్తి కనపర్చను. బాగా చీకటి పడిన తర్వాత నేను వీధుల్లో తిరగను, ఎక్కువగా భయముందన్నట్లు కనపడనివ్వను. నేను జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ప్రజలను గౌరవ మర్యాదలతో చూస్తూ వారు నిజాయితీపరులన్నట్లుగానే వారిని దృష్టిస్తాను.”
అవును, అనవసరమైన బాధను నివారించండి. మీ పని మీరు చూసుకోండి. మరి విపరీతమైన భయం మంచిగా ఉన్న వ్యక్తిని సహితం తెలివి లేకుండా ప్రవర్తించేలా చేస్తూ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపగలదనే విషయాన్ని మరవకండి. అపాయకరమైన ప్రాంతాల్లో తన ఉద్యోగాన్ని గూర్చి ఓడార్ ఇలా చెప్పారు: “జరిగే అవకాశమున్న చెడువిషయాల భయంతో నా మనస్సును నేను నింపుకోకుండా నేను అనుకూల దృక్పథం కల్గివుండేందుకు ప్రయత్నిస్తాను, ఎందుకంటే అది అనవసరంగా ఉద్రిక్తతనూ భయాన్ని కలిగిస్తుంది. నేను ప్రజలందరి ఎడల గౌరవాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తాను.” మెలకువగా ఉండడం మరియు అనుమానాస్పదమైన వారినుండి దూరంగా ఉండడమే కాకుండ, ఒకరి భావోద్రేకాలను అదుపులో పెట్టుకునేందుకు ఆయన ఇలా మరొక సహాయాన్ని గూర్చి కూడా చెప్పారు: “అన్నిటి కంటే ప్రాముఖ్యంగా, యెహోవా దేవుని దృష్టిని ఏదీ తప్పించుకోదని మరి జరిగే ప్రతిదీ ఆయన అనుమతి వల్లనే జరుగుతుందని జ్ఞాపకముంచుకుని ఆయనయందు విశ్వాసాన్ని నేను అలవర్చుకుంటున్నాను.”
అయినప్పటికీ, ఎడతెగని భయంలో జీవించాలని ఎవ్వరూ కోరుకోరు. అంతేకాకుండ, అధిక భయమూ ఒత్తిడి భావోద్రేక మరియు శారీరక ఆరోగ్యానికి హానికరమన్న విషయాన్ని ఎవరు కాదనగలరు? కనుక, తాము ఏ క్షణంలోనైన ముట్టడించబడతామని భయపడే వారికి ఏ నిరీక్షణ ఉంది? నేరాన్ని గూర్చిన మరి దారుణమైన పరిస్థితి మున్ముందు వస్తుందని అనేకులు భయపడుతున్నారు కనుక, మనం ఎన్నడైన దౌర్జన్యం అంతమవ్వడాన్ని చూస్తామా? “భయం ఎప్పుడు అంతమౌతుంది?” అనే తర్వాతి శీర్షికను చదవాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.