పాఠకులనుండి ప్రశ్నలు
గలతీయులు 6:8 ప్రకారం, “తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.” “ఆత్మ” అంటే అర్థమేమిటి మరి మనం జీవాన్ని ఎలా పొందగలం?
హెబ్రీ మరియు గ్రీకు నుండి అనువదించబడిన “ఆత్మ” అనే పదాలకు ఇలాంటి వివిధ భావాలున్నాయి: (1) దేవుని చురుకైన శక్తి, (2) మానవులు లేక జంతువుల్లోని జీవ శక్తి, (3) ఒక వ్యక్తి యొక్క పురికొల్పే మానసిక శక్తి, (4) ఒక ఆత్మీయ వ్యక్తి లేక దేవదూత. వీటిలో మొదటిది—దేవుని చురుకైన శక్తి—దాని భావాన్ని గలతీయులు 6:8 నందు మనం కనుగొనగలం.
దాని సందర్భం కొరకు, గలతీయుల పుస్తకంలో మొట్టమొదటి సారిగా “ఆత్మ” అని ఉపయోగించబడిన గలతీయులు 3:2ను గమనించండి. పౌలు క్రైస్తవులను ఇలా ప్రశ్నించాడు: “ధర్మశాస్త్ర సంబంధ క్రియలవలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుటవలన పొందితిరా?” అప్పుడు, గలతీయులు 3:5 నందు ఆయన ఆ “ఆత్మ”ను శక్తివంతమైన పనులను చేయడంతో పోల్చాడు. కనుక ఆయన సూచించిన “ఆత్మ” పరిశుద్ధాత్మ అంటే దేవుని అదృశ్యమైన చురుకైన శక్తి.
ఆ తర్వాత, గలతీయులు 5:16 నందు పౌలు ఆత్మకు శరీరానిక మధ్య తేడాను చూపించాడు. అక్కడ ఇలా చదువుతాము: “ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.” “శరీరేచ్ఛ” అంటే ఆయన భావం పాపపూర్ణమైన మానవ శరీరం అని. ఆ విధంగా, గలతీయులు 5:19-23 నందు ఆయన “ఆత్మఫలాలకు” భిన్నంగా “శరీరకార్యములను” చూపించాడు.
కనుక, గలతీయులు 6:8 నందు, “శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు,” “శరీరకార్యముల్లో” పాల్గొనడంతో పాపపూర్ణమైన మానవ కోరికలతో నడిపించబడేందుకు అనుమతించేవాడైవుండాలి. అతను అలాంటి ప్రవర్తన యొక్క క్షయమైన పరిణామాలను అనుభవించగలడు మరి అతను మారకపోతే, అతను దేవుని రాజ్యమందుగానీ లేక దాని ఆధ్వర్యంలోగానీ జీవమును పొందడు.—1 కొరింథీయులు 6:9, 10.
సమర్పిత క్రైస్తవులుగా మనం ‘దేవుని ఆత్మనుబట్టి విత్తాలనే’ కోరికను కల్గివుండాలి. అంటే, పరిశుద్ధాత్మ ఏ అడ్డంకులూ లేకుండా మన జీవితాల్లో ప్రసరించేందుకు అది అనుమతిస్తుంది, తద్వారా అది మనం దాని ఫలాలను ఫలింపజేసేదిగా చేస్తుంది. మనం ఎలాంటి పుస్తకాలను చదవాలి లేక ఎలాంటి దూరదర్శని కార్యక్రమాలను చూడాలన్న నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మనం దాన్ని మనస్సులో ఉంచుకోవాలి. మనం సంఘ కూటాల్లో శ్రద్ధగా విని, ఆత్మచే నియమించబడిన పెద్దల సలహాలను మనం అమలుపర్చేందుకు ప్రయత్నించినట్లైతే ఆత్మానుసారంగా విత్తినవాళ్లమౌతాము.—అపొస్తలుల కార్యములు 20:28.
ఆసక్తికరంగా, మనం పరిశుద్ధాత్మకు అనుగుణంగా విత్తినప్పుడు, “ఆత్మనుండి నిత్య జీవమను పంటను” కోసే స్థితిలో మనం ఉంటామనే అభయంతో గలతీయులు 6:8 ముగుస్తోంది. అవును, క్రీస్తు విమోచన క్రయధనాధారంగా ఆ పరిశుద్ధాత్మ పనిచేయడం ద్వారా, దేవుడు నిరంతర జీవితాన్ని అందిస్తాడు.—మత్తయి 19:29; 25:46; యోహాను 3:14-16; రోమీయులు 2:6, 7; ఎఫెసీయులు 1:7.