కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 3/1 పేజీలు 3-4
  • విజయానికి పోటీ కీలకమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విజయానికి పోటీ కీలకమా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిజంగా ఫలవంతమైందా?
  • పోటీతత్వం గల సమాజంలో మనశ్శాంతి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • పోటీతత్వాన్ని కలిగించకుండా శాంతిని పెంపొందించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • రక్షణ కేవలం క్రియలద్వారా కాదు, కృపద్వారా లభిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • క్రీడల్లో పోటీ తప్పా?
    తేజరిల్లు!—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 3/1 పేజీలు 3-4

విజయానికి పోటీ కీలకమా?

“గెలవడం కంటే ప్రాముఖ్యమైంది మరేదీలేదు.” అమెరికన్‌ ఫుట్‌బాల్‌ శిక్షకుడైన విన్స్‌ లాంబార్డీకి తరచూ ఆపాదింపబడే ఈ మాటల కనుగుణ్యంగా నేడు అనేకులు జీవిస్తున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టు దేశాలుగావున్నవి కూడా ఇప్పుడు పోటీ సిద్ధాంతాన్ని కొనియాడుతున్నాయి. తమ వ్యాపార రంగాల్లోకి పోటీని ప్రవేశపెట్టడమనేది ఐశ్వర్యం పొందటానికి ఒక టిక్కెట్టుగా భావించబడుతున్నది. తూర్పు దేశాల్లో అనేకమంది తలిదండ్రులు తమ పిల్లల్ని ఇతర పిల్లలతో పోటీపడేలా చేస్తూ, ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణులుకాగల చాతుర్యాన్ని నేర్పే పాఠశాలలకు వారిని పంపిస్తున్నారు. ఈ విషయాన్ని గురించి అధిక శ్రద్ధగల తలిదండ్రులు, పేరు ప్రతిష్టలుగల పాఠశాలల్లో ప్రవేశం భవిష్యత్‌ క్షేమాభివృద్ధికి కీలకమని భావిస్తున్నారు.

విజయానికి పోటీ కీలకమని అనేకమంది గట్టిగా నమ్ముతారు. ఒకరితో ఒకరు పోటీ పడటం ద్వారా మానవులు అభివృద్ధి చెందారని వారి నమ్మకం. జపాన్‌ యొక్క ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ ఆర్గనైజేషన్స్‌ సర్వే చేసిన ప్రముఖ కార్పోరేషన్లలోని 65.9 శాతం మంది అధికారులు “పదోన్నతి కొరకైన పోటీయే జపాన్‌ కార్పోరేషన్ల సామర్థ్యానికి మూలం” అన్నారు. కొంతకాలం నుండి జపాన్‌ కంపెనీలు విజయం సాధిస్తున్నట్లుగానే ఉన్నాయి. అయినా, పోటీ నిజంగా విజయానికి కీలకమా?

నిజంగా ఫలవంతమైందా?

ఇతరులతో పోటీపడే ప్రజలు స్వార్థపూరిత, నేను మొదట అనే దృక్పథాన్ని కనబరుస్తారు. ఇతరులు సరిగ్గా చేయలేకపోయినప్పుడు, దానితో తమ సామర్థ్యం మంచిగా కనిపిస్తుందని భావించి, వారు సంతోషిస్తారు. తమ స్వంత స్వార్థపూరిత లాభం కొరకు, ఇతరులకు బాధ కలిగించే ఎత్తుగడలు వారు వేయవచ్చు. పోటీ ద్వారా విజయం సాధించాలనే అలాంటి ప్రయత్నం దేనికి నడిపించవచ్చు? తన కంపెనీలో ప్రముఖవ్యక్తిని కావాలనే తపనతో తాను పూర్తిగా నిమగ్నమైన యాసువో, తన గత అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ఇలా అన్నారు: “పూర్తిగా పోటీ స్వభావం, ఉన్నతి చెందాలనే ఆలోచనావిధానం గల నేను, నన్ను నేను ఇతరులతో పోల్చుకుని ఉన్నతంగా భావిస్తుండేవాన్ని. వాళ్లు నాకంటే ఉన్నత స్థితికి వెళ్లినప్పుడు నేను ప్రతిరోజు కంపెనీ సిబ్బంది వ్యవహారాల శాఖను గురించి ఫిర్యాదు చేసేవాడిని. నిజం చెప్పాలంటే నాకు స్నేహితులెవరూ లేరు.”

పోటీ స్వభావం అకాల మరణానికి కూడా దారితీయవచ్చు. ఎలా? మైనిచీ డైలీ న్యూస్‌ అనే జపాన్‌ పత్రిక కారోషీని లేదా అధికపనివల్ల సంభవించే మరణాన్ని టైప్‌-ఎ ప్రవర్తనతో జతచేస్తున్నది. సమయాన్ని ఏమాత్రం పోనీయకుండా పనిలో మునిగియుండుట ద్వారా కలిగే వత్తిడిని, పోటీతత్వాన్ని, విరోధాన్ని ఎదుర్కొనే ప్రవర్తనను టైప్‌-ఎ వర్ణిస్తుంది. అమెరికానందలి గుండె నిపుణులైన ఫ్రీడ్‌మాన్‌ మరియు రోజెన్‌మాన్‌లు టైప్‌-ఎ ప్రవర్తనను దమనుల నుండి రక్తప్రసరణ తగ్గిపోయే హృద్రోగంతో జతచేస్తున్నారు. అవును, పోటీతత్వం ప్రాణాంతకం కాగలదు.

ఉద్యోగ స్థలంలో పోటీ అనేది ఇతర శారీరక, మానసిక రుగ్మతలకు కూడా దారితీయవచ్చు. జపాన్‌లోని ఒక పెద్ద కార్ల వ్యాపారి వద్ద ప్రముఖ విక్రయదారుడైన కానొస్కే ఈ విషయంలో ఒక ఉదాహరణగా ఉన్నాడు. ఆయన మొత్తం 1,250 కార్లను అమ్మడం ద్వారా ఒక రికార్డు సృష్టించాడు. కంపెనీ ముఖ్యకార్యాలయంలోని బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ఉపయోగించే గది గోడకు అతని ఫోటో ఫ్రేమ్‌ కట్టించి తగిలించబడింది. తాను ఉన్నత స్థితికి చేరడానికి తన సహోద్యోగులను నిచ్చెన మెట్లుగా ఉపయోగించటాన్ని అసహ్యించుకున్నప్పటికీ, పోటీ పడునట్లుగా కంపెనీ అతన్ని బలవంతపెట్టింది. దాని ఫలితంగా, ఆయనకు ఒక సంవత్సరంలోనే ఉదర, ఆంత్ర సంబంధ పుండ్లు వచ్చాయి. అదే సంవత్సరంలో, అతని కంపెనీలోని మరో 15 మంది అధికారులు ఆసుపత్రి పాలయ్యారు, ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.

ఇంటివద్ద, తమ పొరుగువారికున్నంత వస్తుసంపద తమకూ ఉండాలని పాటుపడే స్వభావం నిరంతర విరోధభావంతో తమ జీవనోపాధిని డాబుగా చూపించుకొనేలా చేస్తుంది. (1 యోహాను 2:16) లోకములోని వర్తకుల చేతిలో డబ్బుపడేలా చేస్తూ, ఇది కేవలం వాణిజ్యపరమైన ప్రయోజనాలనే కలుగజేస్తుంది.—ప్రకటన 18:11ను పోల్చండి.

విరోధం, పోటీతత్వం పనిలో నిపుణతను కలుగజేసినప్పటికీ, రాజైన సొలొమోను ఇలా చెప్పడంలో ఆశ్చర్యంలేదు: “కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నమువలెనున్నది.” (ప్రసంగి 4:4) కాబట్టి పోటీతత్వం గల సమాజంలో జీవిస్తూ మనమెలా మనశ్శాంతిని కలిగివుండగలము? అది తెలుసుకోవటానికి, మొదట మనం ఈ పోటీ ఉద్దేశం ఎక్కడ ప్రారంభమైందో చూద్దాము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి