కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wtsbr 5/1 పేజీలు 52-56
  • యేసుక్రీస్తు బయలుపర్చబడినప్పుడు విడుదల

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసుక్రీస్తు బయలుపర్చబడినప్పుడు విడుదల
  • కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసుక్రీస్తు “రాకడ”
  • సంఘటనల క్రమము
  • మహాబబులోనుతోపాటు నాశనం!
  • గొఱ్ఱెపిల్ల వివాహము
  • సాతాను లోకం నాశనమైంది
  • ఆయన తీర్పులనుబట్టి యెహోవాను స్తుతించుడి!
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • ప్రకటన మరియు మీరు
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • ప్రకటన గ్రంథపు ధన్యులైన పాఠకులై ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ప్రకటన గ్రంథం—దాని అర్థం ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
wtsbr 5/1 పేజీలు 52-56

యేసుక్రీస్తు బయలుపర్చబడినప్పుడు విడుదల

“క్రీస్తుమహిమ బయలుపరచబడునప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము . . . సంతోషించుడి.”—1 పేతురు 4:13.

1. ఏవిధంగా యెహోవా తన సేవకులను దీవించారు?

యెహోవా తన సాక్షులను అనేక ఈవులతో దీవించాడు. మన గొప్ప బోధకుడుగా, పూర్తి జ్ఞానముతో ఆయన చిత్తము, సంకల్పము తెలుసుకొనుటకు మనకు జ్ఞానమును అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ధైర్యంగా వెలుగును ప్రకాశించుటకుగల సామర్థ్యాన్ని మనయందుంచాడు. “క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయంలోను, అనగా ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు” అని ప్రేరేపితుడగు అపొస్తలుడైన పౌలు మనకు 1 కొరింథీయులకు 1:6, 7 లో తెల్పుతున్నాడు.

2. “మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమ బయలుపరచుట” యనేది కలిగియున్న ఆనందభరితమైన ఉత్తరాపేక్ష ఏమిటి?

2 “యేసుక్రీస్తు ప్రత్యక్షత”—దీని భావమేమిటి? యిది యేసు మహిమగల రాజుగా ఆయన ప్రత్యక్షతను, నమ్మకమైన అనుచరులకు ప్రతిఫలమిచ్చుటకు, భక్తిహీనులపై పగతీర్చుకొను సమయమును సూచిస్తుంది. 1 పేతురు 4:13 ఇది సాతాను విధానమునకు అంతమును సూచిస్తుంది గనుక ఆత్మచేత అభిషేకించబడిన యథార్థత క్రైస్తవులు, వారి యథార్థ సహచరులైన గొప్ప సమూహము “మహానందముతో సంతోషించుటకు” సమయమై ఉంటుంది.

3. థెస్సలొనీకయలోని మన సహోదరులవలె, మనం ఎలా దృఢంగా నిలబడాలి?

3 ఆ సమయం సమీపించే కొలది, సాతాను క్రోధముతో మనమీద ఒత్తిడిని అధికంచేస్తున్నాడు. గర్జించు సింహమువలె, అతడు మనలను మ్రింగుటకు ప్రయత్నిస్తున్నాడు. మనం దృఢంగా నిలబడాలి! (1 పేతురు 5:8-10) పురాతన థెస్సలొనీకయలో మన సహోదరులు సత్యములో క్రొత్తవారుగానున్నప్పుడు, ఈనాడు యెహోవా సాక్షులలో అనేకమంది అనుభవించినటువంటి అనేకమైన శ్రమలననుభవించారు. కాబట్టి, అపొస్తలుడైన పౌలు వారికి వ్రాసిన మాటలు ఈనాడు మనకు చాలా అర్థవంతంగానున్నవి. ఆయనిలా వ్రాశాడు: “ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని ఎరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడనివారికిని ప్రతిదండన చేయునపుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.” (2 థెస్సలొనీకయులకు 1:6-8) అవును, విడుదల వస్తుంది!

4. యేసుక్రీస్తు ప్రత్యక్షతాకాలంలో చేసే తీర్పుకు మతగురువులు ఎందుకు తగినవారైయున్నారు?

4 పౌలు కాలములో శ్రమ ఎక్కువగా యూదా మతగురువుల కారణంగానే వచ్చింది. అదేవిధంగా ఈనాడు, శాంతి-ప్రియులైన యెహోవాసాక్షులకుకూడా వ్యతిరేకతయనేది, తరచూ దేవుని ప్రతినిధులమని చెప్పుకునే వారిచేత అనగా ముఖ్యంగా నేటి క్రైస్తవమత సామ్రాజ్య మతగురువుల చేతనే ప్రేరేపించబడుతుంది. దేవుడు వారికి తెలుసునని నటిస్తున్నారు, కాని వారు బైబిలులోని అద్వితీయ ‘యెహోవాను’ తృణీకరించి, ఆయనకు బదులుగా మర్మంతోకూడిన త్రిత్వము స్వీకరించారు. (మార్కు 12:29) వారు మన ప్రభువైన యేసును గూర్చిన సువార్తకు లోబడరు, క్రీస్తు యొక్క రాబోయే నీతియుక్తమైన రాజ్య పరిపాలనను తృణీకరించి, విడుదలకోసం మానవ-పరిపాలనవైపు చూస్తున్నారు. “పరలోకంనుండి యేసు మహిమ బయలుపర్చబడిన” సమయంలో ఈ మత వ్యతిరేకులందరూ నాశనం గావలసినదే.

యేసుక్రీస్తు “రాకడ”

5. యేసు మహిమ బయలుపరచుట మత్తయి 24:29, 30 లో స్పష్టంగా ఎలా వర్ణించబడింది?

5 మత్తయి 24:29, 30 లో యేసు ఈ మహిమ బయలుపరచుటను విశదముగా వర్ణించాడు. యుగాంతానికి, తన ప్రత్యక్షతకు సంబంధించిన సూచనయొక్క వివిధ విషయాలను వివరిస్తూ, ఆయన యిలా చెబుతున్నాడు: “చీకటి సూర్యుని కమ్మును, మరియు చంద్రుడు కాంతిని యియ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును.” అప్పుడు “మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. మనుష్యకుమారుడు [దేవుని మెస్సీయ రాజు] ప్రభావముతోను మహామహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమీమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.” ఈ “రాకడ” అనగా గ్రీకులో ఎర్‌కోమినోన్‌, యెహోవాను మహిమపరచువాడుగా యేసు ప్రత్యక్షతను సూచిస్తుంది.

6, 7. ఎలా “ప్రతి నేత్రము ఆయనను చూచును” దీనిలో ఎవరు యిమిడియున్నారు?

6 ఈ “రాకడ” అనేది అపొస్తలుడైన యోహానుచేత కూడా ప్రకటన 1:7 లో వర్ణించబడింది, అక్కడ ఆయన యిలా చెబుతున్నాడు: “ఇదిగో ఆయన మేఘారూడుడై వచ్చుచున్నాడు.” ఆ శత్రువులు యేసుని అక్షరార్థమైన కన్నులతో చూడరు గాని “మేఘములు” ఆయన అదృశ్యంగా తీర్పుతీర్చుటకు వచ్చుటను సూచిస్తాయి. ఒకవేళ సామాన్య మానవులు ఆయన పరలోక మహిమను మామూలు కంటితో చూచినట్లయితే, సౌలు దమస్కుకు ప్రయాణిస్తున్న సమయంలో మహిమగల యేసు గొప్పవెలుగుతో కనబడినపుడు అతడు గ్రుడ్డివాడైనట్లుగా, వారు గ్రుడ్డివారౌతారు,.—అపొస్తలుల కార్యములు 9:3-8; 22:6-11.

7 “ప్రతి నేత్రము ఆయనను చూచును, మరియు ఆయనను పొడిచినవారును; భూమి మీదనున్న అన్ని గోత్రములవారు తమకుతామే కొట్టుకొని ఆయన గూర్చి బాధననుభవిస్తారు” అని ప్రకటన వృత్తాంతం వివరిస్తున్నది. దీనిభావమేమనగా, బలముతోను గొప్ప మహిమతోను యెహోవా తీర్పులను అమలుపరచేవాడుగా వచ్చి, భూమిమీదనున్న వ్యతిరేకుల మీదికి నాశనాన్ని తీసుకువచ్చేది యేసే అని వారు ఆ సమయంలో గ్రహించుటయే. ఎందుకు ఈ శత్రువులు “ఆయనను పొడిచినవారిగా” వర్ణించబడిరి? ఎందుకంటే యేసుక్రీస్తును హింసించినవారివలెనే, ఈనాడు యెహోవా సేవకుల ఎడల కఠినంగా ప్రవర్తించినవారి దృక్పథమున్నది. వారు, నిజముగా ‘తమకుతామే కొట్టుకొని ఆయన గూర్చి బాధననుభవిస్తారు.’

8. ఆకస్మిక నాశనమును గూర్చి పౌలు మరియు యేసు ఎలాంటి హెచ్చరికనిచ్చారు?

8 యెహోవా తీర్పు తీర్చే ఆ దినము ఏవిధంగా వస్తుంది? లూకా 21 వ అధ్యాయములోని ప్రవచనములో, యేసు 1914 నుండి మొదలైన తన ప్రత్యక్షత సమయానికి సూచనగానున్న విపత్కర సంఘటనలనుగూర్చి వర్ణించాడు. తరువాత, 34, 35 వచనాలలో యేసు ఈవిధంగా హెచ్చరిస్తున్నాడు: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును.” అవును, యెహోవా ఆ ఉగ్రత దినము ఆకస్మికంగా, హఠాత్తుగా వస్తుంది! అపొస్తలుడైన పౌలు దీన్ని స్థిరపరుస్తూ 1 థెస్సలొనీకయులకు 5:2, 3  లో ఈ విధంగా చెప్పుతున్నాడు: “రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగుననే ప్రభువు దినమును వచ్చును. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమి లేదని చెప్పుకొనుచుండగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును.” ప్రస్తుతం కూడా ఆయాదేశాలు శాంతిభద్రతలను గూర్చి మాట్లాడుతూ, పోలీసు సంకట ప్రాంతాలకు మిలటరీబలగాన్ని పంపడానికి ఐక్యరాజ్యసమితిని బలపరచుటకు ఆలోచిస్తున్నారు.

9. ఎవరికొరకు ‘వెలుగు ప్రకాశించును’ ఎందుకు?

9 అపొస్తలుడు 4, 5 వచనాలలో ఈ విధంగా మనకు ఇంకను యీవిధంగా తెల్పుతున్నాడు: “సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు, మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు, మనము రాత్రివారము కాము చీకటివారము కాము.” దేవుని నూతన ప్రపంచములో ఎవరైతే శాంతి భద్రతలను కోరుదురో వారికి వెలుగు ప్రకాశింపజేస్తూ—మనము వెలుగు సంబంధులుగా ఉండుటకు ఆనందించుచున్నాము. కీర్తన 97:10, 11 లో మనమీవిధంగా చదువుదుము: “యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు; భక్తిహీనుల చేతిలోనుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతులకొరకు వెలుగును యథార్థహృదయములకొరకు ఆనందమును విత్తబడియున్నవి.”

సంఘటనల క్రమము

10. దేవుని విమర్శదినం విషయాన్నిగూర్చి, ముందుగా తెలిపిన ఏ ముందు హెచ్చరికలను మనం లక్ష్యపెట్టాలి? (ప్రకటన 16:15)

10 మహాశ్రమలు సంభవించినపుడు జరిగే సంఘటనల క్రమమేమైయుంటుంది? మనము ప్రకటన 16 వ అధ్యాయమువైపు మళ్లుదాం. ఆ అపవిత్రాత్మలైన దయ్యముల ఆత్మలు భూమిమీదనున్న అన్ని జనాంగములను, సర్వాధికారియైన దేవుని మహాయుద్ధమైన హార్‌మెగిద్దోనను చోటుకు పోగుచేయుటను గమనించుము. మరలా, దొంగవలె సమీపించు ఆ విమర్శ దినమునుగూర్చి నొక్కిచెప్పబడింది, మరియు మనం రక్షణకు గుర్తుగా ఆత్మీయవస్త్రాలను ధరించుటకు—మనం మెలకువగా వుండుటకు హెచ్చరించబడ్డాం. భూమిమీదనున్న ప్రజలకు, జనాంగములను—మరో ప్రముఖవ్యక్తికి తీర్పుతీర్చుటకు సమయం ఆసన్నమైంది. ఆ వ్యక్తి ఎవరు?

11. ప్రకటన 17:5 లో స్త్రీ తనంతటతానే ఏవిధంగా గుర్తించబడింది?

11 ఒక అలంకారార్థ స్త్రీ “ఒక ముఖ్యవ్యక్తిగా” తనకు తానే నిరూపించుకుంది. ఆమె ప్రకటన 17:5 నందు ఆమె యిలా వివరించబడింది: “ఒక మర్మముగా” “వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహాబబులోను.” కాని ఆమె యెహోవా సాక్షులకు యిక మర్మంగా లేదు. అది తనంతటతానే క్రైస్తవమతసామ్రాజ్య శాఖలలో ఉన్నతమైన భాగాలను తయారుచేసుకొని, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యముగా గుర్తించబడింది. అది రాజకీయవ్యవహారములలో తలదూర్చడమనేది, అది నిజక్రైస్తవులను హింసించడంద్వారా “పరిశుద్ధుల రక్తమును త్రాగడమనేది,” మరియు ఈ 20 వ శతాబ్దంలోనే పది కోట్లకుపైగా యుద్ధాలలో మరణించినవారందరితో కలిపి “భూమిమీద వధింపబడినవారందరి యొక్క రక్తమునకు” ఉత్తరవాదిగావడమనేది యెహోవా కన్నులకు హేయమైనది.—ప్రకటన 17:2, 6; 18:24.

12. క్రైస్తవమత శాఖలు ఎందుకు దూషించబడుటకు తగియున్నవి?

12 అన్నిటికంటే అసహ్యమైనదేమనగా, క్రైస్తవమతసామ్రాజ్య మతశాఖలు కపటంగా, దేవుని ప్రతినిధులమని చెప్పుకుంటూ ఆయనకే అవమానం తెచ్చారు. వారు దేవుని స్వచ్ఛమైన వాక్యానికి బదులు, బబులోను మరియు గ్రీకుల తత్వాలు నేర్పించారు, మరియు బైబిలు నియమాలను హేళనపరచే అదుపుతప్పిన జీవిత-విధానమును అనుమతించడంద్వారా అన్నిజనాంగముల నైతిక అపరాధాలకు దోహదపడ్డారు. వారిలోని అత్యాశపరులైన వ్యాపారస్తులు యాకోబు 5:1, 5 లోని మాటలచే ఖండించబడ్డారు: “ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి యేడువుడి. మీరు భూమిమీద సుఖముగా జీవించి యున్నారు. భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.”

మహాబబులోనుతోపాటు నాశనం!

13. మహాశ్రమలు ఎలా ప్రారంభమౌతాయి, మరియు ప్రకటన 18:4, 5 లో ఏ అత్యవసరత గూర్చి నొక్కిచెప్పబడింది?

13 మహా బబులోను మీద యెహోవా తీర్పు విధించడంతో మహాశ్రమలు ప్రారంభమవుతాయి. ఆమెను నాశనం చేయుటకు క్రూరమృగమైన ఐక్యరాజ్యసమితిలోని, “పదికొమ్ములను” అనగా శక్తివంతమైన సైన్యాన్ని యుక్తిగా నడుపుటకు చేయు దేవుని “ఆలోచనను” గూర్చి ప్రకటన 17:15-18 లో స్పష్టంగా వివరించబడుచున్నది. “నీవు ఆ పది కొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు. తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను.” ప్రకటన 18:4, 5 లో పరలోకమునుండి ఒక స్వరము అవశ్యమైన హెచ్చరిక నిస్తుందనుటలో ఆశ్చర్యం లేదు: “నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.” ఇంకను ఆ పిలుపు ఇలా కొనసాగుతున్నది: ఆలస్యము కాకముందే, అబద్ధమతముతోనున్న బంధాలన్నిటిని త్రెంచుకోండి!

14. మహా బబులోను యొక్క నాశనాన్ని గూర్చి ఎవరు దుఃఖిస్తారు, ఎందుకు?

14 మహాబబులోను నాశనమును గూర్చి ప్రపంచము ఏవిధంగా ఎంచుతుంది? సుదూరమునుండి, చెడిపోయిన రాజకీయనాయకులు—“భూరాజులు”—ఆమెనుగూర్చి దుఃఖిస్తున్నారు, ఎందుకంటే వారు శతాబ్దములుగా ఆమెతో ఆత్మీయవ్యభిచారము చేయుటలో పరస్పర ఆనందాన్ని అనుభవించారు. “ఆ పట్టణముచేత ధనవంతులైన ఈ సరకుల వర్తకులు,” అనగా దురాశపరులైన వాణిజ్యవేత్తలుకూడా ఏడ్చుచు, దుఃఖపడుతున్నారు. వీరు కూడా ఆమెనుండి చాలాదూరంగా వుండి ఈవిధంగా అంటున్నారు: “అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రరక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్కగడియలోనే పాడైపోయెనే!” ఖరీదైన మతదుస్తులు, వారి వైభవోపేతమైన ప్రఖ్యాత కేథడ్రెల్స్‌ ఇక వుండవు! (ప్రకటన 18:9-17) కాని మహాబబులోను గూర్చి అందరూ దుఃఖిస్తారా?

15, 16. దేవుని ప్రజలు ఆనందించుటకు ఏకారణము కలదు?

15 ప్రకటన 18:20, 21 దానికి జవాబిస్తుంది: “పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు!” గొప్ప తిరుగటి రాయినెత్తి సముద్రములో పడవేసినట్టు, “మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.”

16 ఆనందించుటకు గల కారణమేమిటి? ప్రకటన 19:1-8 దీనిని బయల్పరుస్తుంది. నాలుగు సార్లు “ప్రభువును [యెహోవాను] స్తుతించుడి” అని పరలోకమునుండి గొప్ప స్వరము వినబడింది. మొదటి మూడు హల్లెలూజాలు యెహోవాను స్తుతించుచున్నాయి, ఎందుకంటే మహాబబులోనయిన నీతాచినీచమైన వేశ్యమీద యెహోవా న్యాయమైన తీర్పును విధించాడు. ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యము నాశనమైపోయింది! “కొద్దివారేమి, గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి,” అని చెప్పుచున్న యొక స్వరము దేవుని సింహాసనమునొద్దనుండి వచ్చెను. ఆ పాటలో మనము కూడా భాగము వహిస్తామంటే ఎంత ఆధిక్యత!

గొఱ్ఱెపిల్ల వివాహము

17. ప్రకటన 11:17 మరియు 19:6 ను పోల్చినట్లయితే, ఏరెండు సందర్భాల్లో యెహోవా రాజుగా ఏలనారంభించాడు?

17 నాల్గవ హల్లెలూజ మరొక ముఖ్యాంశము పరిచయంచేస్తుంది: “సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి.” కాని అటువంటి పల్లవి ప్రకటన 11:17లోకూడా వివరింపబడలేదా? అక్కడ మనమిలా చదువుదము: “దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.” అవును, ప్రకటన 11:17 వ వచనము యొక్క సందర్భము “సమస్త జనములను ఇనుపదండముతో ఏలుటకు” 1914 లో యెహోవా చేత తీసుకొనిరాబడిన ఈ మెస్సియ రాజ్యమును సూచిస్తుంది. (ప్రకటన 12:5) ప్రకటన 19:6 లో మహాబబులోను నాశనమును గూర్చిన సందర్భంలో చెప్పబడింది. వేశ్యలాంటి మతాన్ని తీసివేయుటతో, యెహోవా యొక్క దైవత్వం మహిమపర్చబడుతుంది. అత్యున్నత సర్వాధిపతిగా, రాజుగా యెహోవాను ఆరాధించడమనేది యిప్పుడును, శాశ్వతకాలము కొనసాగుతుంది.

18. మహా బబులోను తీసివేయుట ఏ ఆనందకరమైన ప్రకటనకు మార్గము తెరిచియున్నది?

18 కాబట్టి ఆనందించే ప్రకటన చేయవచ్చును: “సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్లవివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్యతన్నుతాను సిద్ధపరచుకొనియున్నది, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను అవి పరిశుద్ధుల నీతిక్రియలు.” (ప్రకటన 19:7, 8) అయితే, అభిషక్తులయి ఇంకను భూమిమీదనున్నవారు పరలోక పునరుత్థానమును ఎప్పుడు పొందుతారో వివరించబడలేదు. కాని గొఱ్ఱెపిల్లయైన యేసుక్రీస్తు వివాహంలో వారు భాగంవహించుట సంతోషదాయకమైనదని, దీనికంటే మరి వారు మొట్టమొదటిగా మహావేశ్యయైన మహాబబులోను పతనం గురించి సాక్ష్యమివ్వగలవారై యుంటారని ఈ సందర్భవాక్యంలో మనకు అభయమివ్వబడింది.

సాతాను లోకం నాశనమైంది

19. ప్రకటన 19:11-21 లో ఏ ఇతర విషయాలు వర్ణించబడ్డాయి?

19 ప్రకటన 6:2 లో మొదట చెప్పబడిన తెల్లని గుఱ్ఱము మరలా కనబడుతది. ప్రకటన 19:11 లో మనమిలా చదివెదము: “దాని మీద [తెల్లని గుఱ్ఱము] కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు, మరియు ఆయన నీతినిబట్టి విమర్శచేయుచు యుద్ధము జరిగించుచున్నాడు.” ఆవిధంగా “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును” స్వారీచేస్తూ జనాంగములన్నిటిని కొట్టివేయును. “మరియు ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.” నిష్ఫలముగా, “భూరాజులు ఆయన సేనలు” హార్‌మెగిద్దోను అనుచోటికి యుద్ధము చేయుటకు కూడుకుంటారు. తెల్లని గుఱ్ఱముమీద స్వారీ చేయువాడు జయిస్తాడు. సాతాను భూసంస్థ ఏదియు మిగలదు.—ప్రకటన 19:12-21.

20. సాతానుకు ఏమి సంభవించనైయున్నది?

20 అయితే అపవాదికి ఏంజరుగుతుంది? ప్రకటన 20:1-6 “పెద్దసంకెళ్లను చేతపట్టుకొని అగాధముయొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చునట్లు” యేసును వర్ణించెను. ఆయన ఆది సర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వానిని బంధించి అగాధములో పడవేసి దానిని మూసివేసి దానికి ముద్రవేయును. సాతాను యిక ఎన్నటికిని జనములను మోసగించలేదు, దాంతో గొఱ్ఱెపిల్ల మరియు అతని పెండ్లికుమార్తె మహిమగల వెయ్యేండ్ల పరిపాలన మొదలౌతుంది. ఏడ్పైనను బాధయైనను ఇక ఉండదు! ఆదాము వలన వచ్చిన మరణము ఇక ఉండదు! దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనయైనను ఇక ఉండదు! “మొదటి సంగతులు గతించిపోయెను.”—ప్రకటన 21:4.

21. మనము ఆశతో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షతను ఎదురుచూస్తుండగా, మన తీర్మానమేమైయుండాలి?

21 మనము ఆశతో మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షతను వాటికోసం ఎదురుచూస్తూ, దేవుని ప్రేమపూర్వకమైన రాజ్యవాగ్దానాలను గూర్చి యితరులకు తెలియజేయుటలో ఆసక్తిని చూపించెదము. విడుదల సమీపంలో ఉన్నది! సర్వాధిపతి, ప్రభువునైన యెహోవాయొక్క జ్ఞానముపొందిన పిల్లలుగా మనము ముందుకు సాగుదాం, ఎల్లప్పుడు ముందుకు సాగుదాం! (w93 5/1)

పునర్విమర్శ

▫ యేసుక్రీస్తు బయలుపర్చబడుట అతి సమీపములోవున్నదని మనకేది సూచిస్తుంది?

▫ యెహోవా ఉగ్రత దినము ఏవిధంగా వస్తుంది?

▫ “యెహోవాను ప్రేమించువారు” ఈనాటి ప్రపంచ పరిస్థితిని ఏవిధంగా దృష్టించాలి?

▫ మహాశ్రమలు సంభవించినపుడు జరిగే సంఘటనల క్రమమేమైయుండును?

[బాక్సు]

యేసు తీర్పుతీర్చుటకు అదృశ్యంగా, ‘మేఘారూడుడై’ వస్తాడు

[బాక్సు]

త్వరలో అబద్ధ మతము, సాతాను దుష్టవిధానము, మరియు సాతాను లేకుండా పోవును

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి