కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 3/1 పేజీ 31
  • పాఠకులనుండి ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకులనుండి ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవదూతలు అంటే ఎవరు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • దేవదూతలు మనపై ఎలా ప్రభావం చూపిస్తారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • దేవదూతలు—‘పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • దేవదూతలు మీకు ఎలా సహాయం చేయగలరంటే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 3/1 పేజీ 31

పాఠకులనుండి ప్రశ్నలు

దూతలు భౌతిక శరీరములు లేని ఆత్మీయ ప్రాణులు, అయితే మీ రేఖాచిత్రాలలో వారికి రెక్కలు ఉన్నట్టు ఎందుకు చూపిస్తారు? అది కేవలము ఒక మతసంబంధమైన సాంప్రదాయమా?

మేము సాధారణముగా దూతలకు రెక్కలున్నట్టే చిత్రీకరిస్తున్నాము, ఎందుకంటే బైబిలులోని వర్ణనలు చిహ్నార్థకముగా ఉన్నాయి.

ఆత్మీయ ప్రాణులు భౌతిక శరీరములను అక్షరార్థమైన రెక్కలను—లేక ముఖములను, చేతులను, కాళ్లను, లేక ఇతర శరీర భాగములను—కలిగి లేవని మీరు చెప్పిన మాట నిజమే. అయితే కొన్ని సందర్భములలో, దూతలు దేవుని సేవకులకు కనిపించినప్పుడు, వారు మామూలు మనుష్యులవలె కనబడి యుండవచ్చును, ఎందుకనగా చూచువారు వారిని మనుష్యులనుకున్నారు.—ఆదికాండము 18:2, 22; 19:1; న్యాయాధిపతులు 6:11-22.

అయితే, కొన్నిసార్లు, మానవులు దూతలను గూర్చిన దర్శనములు పొంది వాటిని వర్ణించారు. ప్రవక్తయైన యెహెజ్కేలు నాలుగు “జీవుల రూపములను” చూశాడు, మరియు తరువాత పొందిన దర్శనములో వీరిని కెరూబులు అని పిలువబడిన శ్రేణికి చెందిన దూతలుగా ఆయన గుర్తించాడు. (యెహెజ్కేలు 1:5; 9:3; 10:3) ఆ నాలుగు దూతలకు ప్రతిదానికి నాలుగు రెక్కలు ఉండెను, అవి దేవుని ఆజ్ఞల ప్రకారము ఏ దిశలోనైనా వేగముగా ప్రతిస్పందించగల సామర్థ్యమును సూచించుచున్నవి. “ఏవైపునకైనను తిరుగక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను . . . అవి వెనుకకు తిరుగక ఆత్మ యేవైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను.”—యెహెజ్కేలు 1:6, 9, 12.

అయితే దర్శనములలో కనబడే దూతలు ఎల్లప్పుడు ఒకేవిధంగా కనిపించలేదు. యెషయా చూసిన సెరాపులు అనబడిన దూతలు ఆరేసి రెక్కలను కలిగియుండెను. (యెషయా 6:1, 2) యెహెజ్కేలు పొందిన దర్శనములలో కూడా భేదములు ఉండెను. మొదటి దానిలో, దూతలకు కాళ్లు, నాలుగు రెక్కల క్రింద చేతులు, మరియు నాలుగు ముఖములు (మనుష్యుని వంటి ముఖము, సింహము వంటిది, ఎద్దు వంటిది, మరియు గద్ద వంటిది) ఉండెను. తన తరువాతి దర్శనములో, ఆ ముఖములలో ఒకటి ఎద్దువలె కాక కెరూబు వంటిదిగా ఉండెను, బహుశా కెరూబుల గొప్ప శక్తిని సూచించుటకై యుండవచ్చును. చిహ్నార్థకమైన దేవాలయము యొక్క అలంకారములను గూర్చిన దర్శనములో, యెహెజ్కేలు రెండు ముఖములు గల దూతలను చూసెను, ఒకటి మనుష్యునిది, మరియొకటి సింహముది. (యెహెజ్కేలు 1:5-11; 10:7-17; 41:18, 19) గుడారములోని అతి పరిశుద్ధ స్థలములో, మరియు సొలొమోను యెరూషలేములో కట్టించిన దేవాలయములో, రెండు రెక్కలుగల కెరూబులు ఉండెను. మందసము అని పిలువబడిన పెట్టెపైయున్న బంగారముతో చేయబడిన కరుణాపీఠము అను మూతపైన అవియుండెను. (నిర్గమకాండము 25:10-22; 37:6-9) సొలొమోను యొక్క దేవాలయములోని మందసము (మరియు దాని మూత) పైన బంగారముతో కప్పబడిన, ఇంకా పెద్దవైన రెండు కెరూబులు ఉండెను, ఒక్కొక్కటి పైకివిప్పిన రెండు రెక్కలను కలిగియుండెను.—1 రాజులు 8:6-8; 1 దినవృత్తాంతములు 28:18; 2 దినవృత్తాంతములు 5:7, 8.

జోసీఫసు ఇట్లు వ్రాసెను: “ఆ కెరూబుల విషయమైతే, అవి ఎలా కనిపించాయో ఎవరు చెప్పలేరు లేక ఊహించలేరు.” కావున, కొందరు విద్వాంసులు మరియు చిత్రకారులు దూతల చిత్రీకరణకు (విశేషముగా కెరూబులు) రెక్కలు గల జంతువుల రూపములో ఉన్న దేవతల ప్రాచీన సమీప తూర్పు నమూనాలు అనబడిన వాటిపై ఆధారపడ్డారు. అయితే “వాటి రూపము మానవ స్వరూపము వంటిది” అని యెహెజ్కేలు తాను చూసిన దానిని గూర్చి చెప్పినది నమ్మదగిన నడిపింపును ఇచ్చుచున్నది. (యెహెజ్కేలు 1:5) కావున మా ప్రచురణలలో దూతలను చిత్రీకరించినప్పుడు, మేము సాధారణంగా మానవ రూపములోనే చూపిస్తాము. బైబిలులోని అనేక వర్ణనలు దూతలకు రెక్కలు ఉన్నట్లు ఉన్నందున మరియు దూతలు “ఎగురుచుండెను” అను వాక్యాలను బట్టి వారికి రెక్కలు ఉన్నట్లు చిత్రీకరిస్తాము.—ప్రకటన 14:6; కీర్తన 18:10.

చివరిగా, రెవిలేషన్‌—ఇట్స్‌ గ్రాండ్‌ క్లెమాక్స్‌ ఎట్‌ హ్యాండ్‌! లోని 288వ పుటలో రెక్కలుగల ఒక జీవి, తల మీద కిరీటమును మరియు చేతిలో ఒక తాళపు చెవిని పట్టుకొని ఉండుటను చూపించుచున్నది. ఈ రూపులేఖనం ప్రకటన 20:1ని గూర్చినదై యున్నది: “మరియు పెద్దసంకెళ్లను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూతను పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని.” తాళపుచెవిని చేతపట్టుకొని ఉన్న దూత మహిమ పరచబడిన యేసుక్రీస్తు అని మేము అర్థము చేసికొంటున్నాము. దూతలు దర్శనములలో సాధారణంగా రెక్కలతో కనిపిస్తారు, కాబట్టి ఆ చిత్రము ఆయనకు రెక్కలు ఉన్నట్లు చూపిస్తుంది. (w91 3/1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి