లక్షలాది మంది వెళ్లుచున్నారు. మీరు వెళ్లుచున్నారా?
ఎక్కడికి వెళ్లుచున్నారు? యేసుక్రీస్తు మరణము యొక్క సాంవత్సరిక జ్ఞాపకార్థ దినమునకు హాజరగుటకు. లోకమంతటా 1991లో 1,06,50,158 మంది హాజరయ్యారు. ప్రజలు ఎందుకు వెళతారు? మానవజాతికి యేసుక్రీస్తు మరణము యొక్క ప్రాముఖ్యతను బట్టి. దాని ద్వారా మానవులు త్వరలో రోగము, వేదన, మరియు మరణము నుండి విడుదల పొందనైయున్నారు. చనిపోయిన మన ప్రియులు పరదైసుగా మార్చబడిన భూమిపైన తిరిగి జీవించుటకు పునరుత్థానము చేయబడతారు. యేసుయొక్క మరణము అటువంటి ఆశీర్వాదములను ఎట్లు తేగలదు? మీరు వచ్చి తెలిసికొనుటకు ఆహ్వానించబడుతున్నారు. ఈ ప్రాముఖ్యమైన సంఘటనలో వారితో కూడుకొనుటకు యెహోవాసాక్షులు మిమ్మును ఆహ్వానించుచున్నారు. మీ ఇంటికి దగ్గరలో ఉన్న రాజ్యమందిరములో హాజరగుము. ఈ సంవత్సరము అది శుక్రవారము, ఏప్రిల్ 17, సూర్యాస్తమయము తరువాత జరుగును. మీ ప్రాంతములోని సాక్షుల దగ్గరనుండి సరియైన సమయమును తెలిసికొనుము.