కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 10/1 పేజీలు 10-15
  • దేవుడు చేసియున్న దానిని మీరు మెచ్చుకొందురా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు చేసియున్న దానిని మీరు మెచ్చుకొందురా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రియలు మరియు విశ్వాసము
  • జీవితములు ప్రభావితము చెందియున్నవి
  • బాప్తిస్మమును ఆటంకపరచు వాటిని జయించుట
  • వస్తుసంబంధమైన విషయములు
  • దేవుని సహాయముతో దైవిక సేవ
  • రక్షణ పొందడానికి మనం ఏమి చేయాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • విశ్వాసం, పనులు మనల్ని నీతిమంతుల్ని చేస్తాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • యెహోవా వాగ్దానాలపై విశ్వాసం ఉంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • మీకు సువార్తలో నిజంగా విశ్వాసం ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 10/1 పేజీలు 10-15

దేవుడు చేసియున్న దానిని మీరు మెచ్చుకొందురా?

“ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన హింసాకొయ్యను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.”—లూకా 9:23 NW.

1. దేవుడు దయచేసిన కొన్ని అద్భుతమగు వరములేవి?

దేవునికి మనము మన జీవితములను అచ్చియున్నాము. ఆయన మానవజాతిని సృష్టించకపోతే మనము జన్మించికయే పోదుము. అయితే దేవుడు జీవముతోపాటు ఇంకా ఎక్కువ సృష్టించాడు. మనము అనేకమైన వాటిని అనుభవించునట్లు, రుచిగల ఆహారము, వెచ్చని సూర్యకాంతి, సంగీత స్వరము, వసంతకాలపు తాజాదనము, ప్రేమయందలి ఆప్యాయతలను ఆయన కలుగజేసెను. వీటికంటే ఎక్కువగా ఆయనను గూర్చి నేర్చుకొనే మనసును మరియు కోరికను మనకిచ్చాడు. మంచి నడిపింపుతోపాటు, సంతోషకర జీవితములను ఎట్లు జీవించగలమో చూపుటకు ఆయన బైబిలును ప్రేరేపించెను. అది ఆయన నీతియుక్తమైన నూతనలోకములో నిత్యము జీవించు నిరీక్షణనిస్తుంది. అంతేగాక మనము ఆయన సేవలో బలముగా ఉండునట్లు సహాయపడుటకై తన పరిశుద్ధాత్మను, స్థానిక సంఘ మద్దతును, ప్రేమగల అనుభవజ్ఞులైన స్త్రీ, పురుషులను దేవుడు దయచేస్తున్నాడు.—ఆదికాండము 1:1, 26-28; 2 తిమోతి 3:15-17; హెబ్రీయులు 10:24, 25; యాకోబు 5:14, 15.

2. (ఎ) దేవుడు మనకొరకు చేసిన అతిప్రధానమైన విషయమేమి? (బి) క్రియల ద్వారా మనము రక్షణను సంపాదించగలమా?

2 వీటన్నిటితోపాటు, మనలనుండి తండ్రి కోరుదానిని గూర్చి ఎక్కువగా తెలియజేసి, అంగీకరించు ప్రతివారికి “విమోచన క్రయధనము” ద్వారా విడుదలను కలుగజేయుటకు దేవుడు తన జ్యేష్ట కుమారుని పంపెను. (ఎఫెసీయులు 1:7; రోమీయులు 5:18) ఆ కుమారుడైన యేసుక్రీస్తు ఇలా చెప్పెను: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16 కింగ్‌ జేమ్సు వర్హన్‌) ఆ విమోచనముద్వారా సాధ్యపరచబడిన రక్షణ ఎంతో విలువైనది. ఎందుకనగా ఒకడు కేవలం తన క్రియల ద్వారా దానిని పొందగలిగిన మార్గమేమియులేదు. మోషే ధర్మశాస్త్రము క్రింద కోరబడిన ఏ క్రియలద్వారాను అది సాధ్యము కాదు. అందుకొరకే పౌలు దానినిగూర్చి ఇట్లు వ్రాసెను: “మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడు.”—గలతీయులు 2:16; రోమీయులు 3:20-24.

క్రియలు మరియు విశ్వాసము

3. విశ్వాసము మరియు క్రియలను గురించి యాకోబు ఏమి చెప్పెను?

3 రక్షణ విశ్వాసముద్వారా వస్తుంది, అయితే విశ్వాసము మరియు దేవుడుచేసిన వాటన్నిటియెడలగల మెప్పు మనలను క్రియచేయుటకు కదలించవలెను. అది మనము మన విశ్వాసమును ప్రదర్శించే క్రియలను చేయుటకు మనలను పురికొల్పవలెను. యేసు స్వంత సహోదరుడైన యాకోబు యిలా వ్రాసెను: “విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.” ఇంకను ఆయన ఇట్లనుచున్నాడు: “ఒకడు క్రియలులేకుండ నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనపరతునని చెప్పును.” యాకోబు చివరకు “దయ్యములును నమ్మి వణకుచున్నవి” అని సూచించెను. అయితే దయ్యములు దైవిక క్రియలు చేయవు. కాని అబ్రాహాము మాత్రము క్రియలను మరియు విశ్వాసమును కలిగియుండెను. “విశ్వాసము అతని క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసినదై, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది.” యాకోబు మరలా ఇట్లనెను: “క్రియలు లేని విశ్వాసము మృతము.”—యాకోబు 2:17-26.

4. తనను అనుసరించగోరువారు ఏమి చేయవలెనని యేసు చెప్పెను?

4 యేసు కూడ సరైన క్రియలయొక్క ప్రాముఖ్యతను చూపిస్తూ ఇట్లనెను: “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.” “ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన హింసాకొయ్యను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.”a ఔను, మనలను మనము “ఉపేక్షించుకొనినట్లయిన” వ్యక్తిగతముగా మనము కోరుకొను అనేకమైనవాటిని విడిచిపెట్టుదుము. మనము సమస్తమును దేవునికి అచ్చియున్నామని గుర్తించి, మనలను మనము ఆయన సేవకులుగా అప్పగించుకొని, యేసు వలె ఆయన చిత్తమును నేర్చుకొని, దానిని చేయగోరుదుము.—మత్తయి 5:16; లూకా 9:23; యోహాను 6:38.

జీవితములు ప్రభావితము చెందియున్నవి

5. (ఎ) మన జీవిత మార్గమంతటిపై ఏది ప్రభావము చూపవలెనని పేతురు చూపాడు? (బి) ఏ సత్క్రియలను ఆయన సిఫారసుచేసెను?

5 మనకొరకు ఇవ్వబడిన క్రీస్తుయొక్క “అమూల్యమైన రక్తము,” దానియెడల మనకుగల మెప్పు, మన జీవిత మార్గమంతటిలో వెల్లడి కావలసినంత విలువగలదని పేతురు సూచించెను. ఆ మెప్పు చేయుటకు మనలను పురికొల్పవలసిన అనేక విషయములను అపొస్తలుడు చూపించెను. ఆయన ఇట్లు ఉపదేశించెను: “సమస్తమైన దుష్టత్వమును మానుడి.” “నిర్మలమైన వాక్యమను పాలను అపేక్షించుడి.” “చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయుడి.” “కీడునుండి తొలగి మేలుచేయవలెను.” “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సమాధానము చెప్పుడి” “శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనుడి.”—1 పేతురు 1:19; 2:1, 2, 9; 3:11, 15; 4:2.

6. (ఎ) మొదటి శతాబ్దపు క్రైస్తవులు తమ విశ్వాసమును ఎట్లు ప్రదర్శించారు? (బి) ఇది మనకు ఏ మాదిరినుంచవలెను?

6 మొదటిశతాబ్దపు క్రైస్తవులు వారి విశ్వాసమునకు తగినట్లు జీవించారు. అది వారి బాహ్యదృక్పథమును, వ్యక్తిత్వములను మార్చివేసి, తమ జీవితములను దేవుని చిత్తానికి అనుగుణ్యముగా తెచ్చుకొనునట్లు పురికొల్పినది. వారు పరవాసులుగా చేయబడి బాధననుభవించారు, రాళ్లతో కొట్టబడిరి, దెబ్బలు తిన్నారు, చెరసాలలో వేయబడిరి, చివరకు తమ విశ్వాసమును చెరుపుకొనకుండుటకై మరణాన్ని సహితం అనుభవించారు. (అపొ. కార్యములు 7:58-60; 8:1; 14:19; 16:22; 1 కొరింథీయులు 6:9-11; ఎఫెసీయులు 4:22-24; కొలొస్సయులు 4:3; ఫిలేమోను 9, 10) సా.శ. 56లో జన్మించిన పేరుగాంచిన రోమా చరిత్రకారుడు టాకిటస్‌ ఇలా చెప్పుచున్నాడు: “పగలు వెలుతురు గతించిన తర్వాత రాత్రులందు వెలిగిచ్చుటకై క్రైస్తవులు మంటలలో వేయబడి, కాల్చబడిరి.” అయినను వారు జడియలేదు!—ది ఆనల్స్‌, బుక్‌ XV, పేరా 44.

7. కొంతమంది ప్రజలు తమమట్టుకు తాము ఏ పరిస్థితిలో ఉన్నట్లు కనుగొనవచ్చును?

7 కొన్ని సంఘములలో అనేక సంవత్సరములుగా కూటములకు హాజరగుచున్న వారిని మీరు చూడవచ్చును. వారు యెహోవా సంస్థను ప్రేమిస్తారు, భూమిమీద వారు కలుసుకున్న ప్రజలందరిలోకెల్లా ఆయన ప్రజలు శ్రేష్టమైనవారని తలస్తూ, సత్యమును గూర్చి మంచి వ్యాఖ్యానం చేస్తారు. బయటివారి ముందు సత్యమును సమర్ధిస్తారు. అయితే వారు ముందుకు రాకుండా ఏదో ఆటంకంగా నిలచి, వారిని వెనుకకు లాగుతుంది. పెంతెకొస్తునాడు 3,000 మంది తీసుకొనిన చర్యను వారు ఎప్పుడును తీసుకొనలేదు. అనగా విశ్వసించిన ఐతియోపీయుడు అడిగిన దానిని, లేక గతంలో హింసకునిగా ఉన్న సౌలు యేసును నిజమైన మెస్సియాగా గుర్తించినవెంటనే అననీయా ఆయనను తీసుకొనమని తొందరపెట్టిన చర్యను వారు తీసుకొనలేదు. (అపొ. కార్యములు 2:41; 8:36; 22:16) నేడు అటువంటివారిలో లోపించిన దేమిటి? “దేవుని యెదుట మంచి మనస్సాక్షిని పొందుటకు చేసికొను విన్నపము” అని బైబిలు పిలుచు చర్యను వారు ఎందుకు తీసుకొనలేదు? (1 పేతురు 3:21) మీ మట్టుకు మీరు ఈ స్థితిలో ఉన్నట్లుగా అనగా— సత్యమును తెలుసుకొని దానిని గూర్చి క్రియచేయుటకు వెనుకాడుచున్నట్లయిన—ఈ శీర్షికను మీయెడలగల ప్రత్యేక ప్రేమతో తయారు చేయబడినదానిగా దృష్టించుము.

బాప్తిస్మమును ఆటంకపరచు వాటిని జయించుట

8. మీరు ఎప్పుడును నేర్చుకునే ఒక మంచి విద్యార్థిగా లేనట్లయిన, ఇప్పుడు తీసుకొనవలసిన జ్ఞానయుక్తమైన పని ఏమి?

8 మీకు ఆటంకముగా ఏమి ఉన్నది? గత సంచికలోని శీర్షిక చూపినట్లు కొందరికి వ్యక్తిగత పఠనము సమస్యగా ఉండవచ్చును. దేవుడు మనకు అద్భుతమైన మనస్సునిచ్చి, దానిని ఆయన సేవలో ఉపయోగించమని కోరుతున్నాడు. కొందరు చివరకు చదువురాకపోయినను దేవునిని, ఆయన సంకల్పములనుగూర్చి ఎక్కువగా తెలిసికొనుటకు చదువు నేర్చుకొన్నారు. మరి మీ విషయమేమి? మీరు ఇప్పటికే చదువ గలిగినట్లయిన బెరైయ వారివలె సంగతులు ఆలాగున్నవో లేదో చూచుటకు “లేఖనములను ప్రతిదినము పరిశోధించుచు,” మీరు నిజముగా పఠిస్తారా? సత్యముయొక్క “వెడల్పు పొడుగు లోతు ఎత్తును” అన్వేషిస్తారా? దేవుని వాక్యాన్ని అవసరమైనంత మేరకు లోతుగా పరిశీలిస్తారా? అది ఎంత ఉల్లాసభరితంగా ఉంటుందో మీరు చూశారా? దేవుని చిత్తమును తెలిసికోవాలను నిజమైన కోరికను మీరు వృద్ధిచేసుకున్నారా? సత్యముయెడల మీకు నిజమైన ఆకలి ఉందా?—అపొ. కార్యములు 17:10, 11; ఎఫెసీయులు 3:18.

9. సంఘములోని ఒకరితో నీవు సమస్యను కలిగియున్నట్లయిన చేయవలసిన సరైన పని ఏమి?

9 కొన్నిసార్లు ప్రజలు సంఘములోని ఒకరితో తమకున్న నిజమైన లేదా ఊహించుకొన్న సమస్యనుబట్టి వెనుకాడుదురు. ఎవరైన మీయెడల తీవ్రంగా దోషము చేసి మిమ్మును బాధపరచియున్నారా? అట్లయిన, యేసు మాటలలో సూచించబడిన మార్గమును అనుసరించుము: “నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము.” (మత్తయి 18:15) ఒకవేళ దానిని దోషముగా యెంచి నీవు బాధపడ్డావన్న సంగతి ఆ వ్యక్తికి అసలు తెలియదని కనుగొని నీవు ఆశ్చర్యపడవచ్చును. ఒకవేళ తనకు తెలిసేయుంటే యేసు చెప్పినట్లు “నీవు నీ సహోదరుని సంపాదించుకొనవచ్చును.” కనీసం మరొకరినైన తాను అభ్యంతరపరచుకుండునట్లు నీవు ఆయనకు సహాయముచేయవచ్చును. అంతేగాక దానిని గూర్చి నీవు ఆలోచించినట్లయిన నిజంగా నీవు ఎవరిని సేవిస్తున్నావు,—ఆ వ్యక్తినా లేక దేవునినా? కేవలం ఒక అసంపూర్ణ మానవ పొరపాటు ఆయన యెడలగల నీ ప్రేమలో ఆటంకంగా నిలుచునంత పరిమితిగల ప్రేమనే నీవు దేవుని యెడల కలిగియున్నావా?

10, 11. ఏదైనను ఒక రహస్య పాపము మిమ్ములను వెనుకకు లాగుచున్నట్లయిన మీరేమి చేయవలెను?

10 రహస్య పాపము ఒకవ్యక్తిని బాప్తిస్మము పొందకుండా వెనుకకు లాగవచ్చును. ఇది ఎప్పుడో గతములో సంభవించినదైయుండవచ్చును లేదా ఇప్పటికిని కొనసాగుచున్న చెడు విధానమైయుండవచ్చును. ఒకవేళ ఇదే నీ సమస్యయైన యెడల, విషయమును చక్కదిద్దుకొనుటకు ఇది సమయము కాదా? (1 కొరింథీయులు 7:29-31) యెహోవా ప్రజలలో అనేకమంది తమ జీవితములలో గతమందు అనేక మార్పులు చేసికొనవలసియుండిరి. బైబిలు ఇలా చెప్పుచున్నది: “యెహోవా సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును,. . .మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి.”—అపొ. కార్యములు 3:19 NW.

11 గతములో మీరు ఏమి చేసియుండినప్పటికిని, మీరు పశ్చాత్తాపమునొంది, మార్పుచేసికొని క్షమాపణకొరకు దేవుని వేడుకొనవచ్చును. ఎట్లనగా “భూమిమీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను. . .చంపివేయుడి. . . .ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడ పరిత్యజించి, జ్ఞానముద్వారా దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి.” మీ జీవితమును ఆయన మార్గములకు అనుగుణంగా తెచ్చుకొని, మంచి మనస్సాక్షినిబట్టి ఆనందిస్తూ, ఆయన నీతియుక్తమైన నూతనలోకములో నిత్యజీవ నిరీక్షణను కలిగియుండవచ్చును. దానికి ఎంతటి కృషి అవసరమైనను అది యోగ్యమైనది కాదా?—కొలొస్సయులు 3:5-10 NW; యెషయా 1:16, 18; 1 కొరింథీయులు 6:9-11; హెబ్రీయులు 9:14.

12. పొగాకు, మత్తుపానీయముల దుర్వినియోగము, మత్తుమందులు పవిత్రమైన మనస్సాక్షిని కలిగియుండుటలో నీకు ఆటంకముగా నిలచినట్లయిన నీవు ఏమి చేయవలెను?

12 నీవు పవిత్రమైన మనస్సాక్షిని కలిగియుండుటకు పొగాకు ఉపయోగించుట, మత్తుపానీయముల దుర్వినియోగము, మత్తుమందులు ఆటంకముగా ఉంటున్నవా? జీవితమునకు హానికరమైన అట్టి అలవాట్లు దేవుని అద్భుత వరమైన జీవముయెడల అమర్యాదను ప్రదర్శించుటలేదా? అట్టి అలవాట్లు నీకు ఆటంకముగా నిలిచినట్లయిన దిద్దుకొనుటకు ఇది సమయమైయున్నది. ఈ అలవాట్లు నీ ప్రాణముకంటె యోగ్యమైనవా? పౌలు ఇలా అన్నాడు: “దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసికొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.” అలా చేయ గలుగునంతగా నీవు దేవుని పవిత్రమైన నీతియుక్తమైన ప్రమాణములను మెచ్చుకొందువా?b—2 కొరింథీయులు 7:1.

వస్తుసంబంధమైన విషయములు

13, 14. (ఎ) వస్తుసంబంధమైన గురులను గూర్చి లేఖనములు ఏమి చెప్పుచున్నవి? (బి) పరలోకసంగతులను ముందుపెట్టుట ఎందుకు ప్రాముఖ్యము?

13 ప్రస్తుత లోకము “జీవపు డంబమును” దానియందలి విజయమును ఇతరదేనికంటెను ప్రధానమైనదానిగా ముందుంచుచున్నది. అయితే యేసు “ఐహిక విచారములును ధనమోసమును” దేవుని వాక్యమును అణచివేయు “ముండ్లకు” పోల్చెను. ఆయన ఇంకను ఈవిధముగా అడుగుచున్నాడు: “ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము?”—1 యోహాను 2:16; మార్కు 4:2-8, 18, 19; మత్తయి 16:26.

14 దేవుడు పక్షులకు ఆహారము దొరకునట్లుజేసి, అడవి పువ్వులను వైభవంగా అలంకరించుచున్నాడని యేసు సూచించెను. తరువాత ఆయన ఇట్లడుగుచున్నాడు: “మీరు పక్షులకంటే ఎంత శ్రేష్టులు?. . .దేవుడు మిమ్మును ఎంతగా అలంకరించును!” జ్ఞానయుక్తముగా యేసు వాటిని గురించి “విచారించుట మానుడి” అని మనకు చెప్పెను. ఆయన ఇలా అన్నాడు: “మీరైతే ఆయన రాజ్యమును మొదట వెదకుడి; దానితో కూడ ఇవి మీ కనుగ్రహింపబడును.” మనకు ఆయన పరలోకపు సంగతులను మొదట పెట్టుడని సూచించెను. ఎందుకనగా “మన ధనమెక్కడ ఉండునో అక్కడనే మన హృదయముండును.”—లూకా 12:22-31; మత్తయి 6:20, 21.

దేవుని సహాయముతో దైవిక సేవ

15. మొదటిశతాబ్దపు క్రైస్తవుల మాదిరి మనకు ఏ మంచి ప్రోత్సాహమును యిస్తుంది?

15 ఇతరులకు సాక్ష్యమిచ్చుట నీకు ఒక సమస్యగా ఉందా? నీవు వెనుకకు పోవుటకు సిగ్గుపడుట ఒక కారణమైయున్నదా? అలాగైన, మొదటిశతాబ్దపు క్రైస్తవులును నేడు మనము కలిగియున్న లాంటి మనోభావములనే కలిగియున్నారని గుర్తుంచుకొనుట ప్రాముఖ్యము. ఎందుకనగా దేవుడు జ్ఞానవంతులను, బలవంతులను ఎన్నుకొనలేదు. “బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.” (1 కొరింథీయులు 1:26-29) బలవంతులైన మతనాయకులు ఇట్టి ‘సామాన్యులైన’ వారిని ఎదిరించి ప్రకటించుటను ఆపమని ఆజ్ఞాపించిరి. అయితే క్రైస్తవులు ఏమి చేశారు? వారు ప్రార్థించిరి. దేవునిని ధైర్యముకొరకు అడుగగా దానిని దేవుడు వారి కనుగ్రహించాడు. ఫలితంగా వారి వర్తమానము యెరూషలేమంతయు నిండి, లోకమంతటిని కదలించెను!—అపొ. కార్యములు 4:1-4, 13, 17, 23, 24, 29-31; 5:28, 29; కొలొస్సయులు 1:23.

16. హెబ్రీయులు 11వ అధ్యాయములో వర్ణించబడిన “సాక్షి సమూహము” నుండి మనము ఏమి నేర్చుకొందుము?

16 ఆవిధంగా మనుష్యుల భయము మనలను ఎన్నడూ దేవుని సేవలో ఆటంకపరచనీయ కూడదు. హెబ్రీయులు 11వ అధ్యాయము మనుష్యులకు కాక దేవునికి భయపడిన “గొప్పసాక్షి సమూహమును” గూర్చి చెప్పుచున్నది. మనమును అలాంటి విశ్వాసమునే చూపవలెను. అపొస్తలుడు ఇట్లు వ్రాసెను: “ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి. . .మనయెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.”—హెబ్రీయులు 12:1,2.

17. యెషయా ద్వారా దేవుడు ఏ ప్రోత్సాహము నిచ్చియున్నాడు?

17 దేవుడు తన సేవకులకు అత్యంత గొప్ప సహాయమును చేయగలడు. విశ్వమునకు సృష్టికర్తయైన ఆయన యెషయాతో ఇలా చెప్పెను: “యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.”—యెషయా 40:31.

18. రాజ్యప్రకటన పనిలో పాల్గొనునట్లు నీవు బిడియమును ఎట్లు పోగొట్టుకొనగలవు?

18 స్థానిక సంఘములో మీరు చూచే సంతోషము, ధైర్యముగల సాక్షులు భూవ్యాప్తముగాయున్న 40 లక్షల ఆసక్తిగల సేవకులలో కేవలము కొద్ది భాగమై మాత్రమే యున్నారు. యేసు ప్రవచించిన పనిలో భాగము వహించుటకు వారు ఆనందించెదరు. అదేమనగా: “ మరియు ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటుతరువాత అంతము వచ్చును.” అందు పాల్గొనుటకు నీవు అర్హుడవైనను, రాజ్యప్రకటన పనిలో పాల్గొనుట నీకు సమస్యగా ఉన్నట్లయిన, పరిచర్యలో బాగుగా పనిచేయు ఒక సాక్షిని ఆయన లేక ఆమెతో ప్రకటించు పనిలో భాగము వహించునట్లు తీసుకెళ్లమని ఎందుకు అడగకూడదు. దేవుడు నిశ్చయముగా “సాధారణమైనదానికంటే ఎక్కువైన బలమును” దయచేయును. అప్పుడు ఈ దైవిక సేవ నిజముగా ఎంత ఆనందదాయకమైనదో కనుగొనుటకు నీవు ఆశ్చర్యపడుదువు.—మత్తయి 24:14; 2 కొరింథీయులు 4:7; కీర్తన 56:11; మత్తయి 5:11, 12; ఫిలిప్పీయులు 4:13లను కూడ చూడుము.

19. బోధించు ఏ పనిని చేయమని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించెను?

19 రాజ్యవర్తమానమును మెచ్చుకొనువారిని దానియెడల పనిచేయవలెనని యేసు కోరుచున్నాడు. ఆయన ఇలాచెప్పెను: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.”—మత్తయి 28:19, 20.

20. మీరు ఆత్మీయముగా ముందుకు వెళ్లుచున్నట్లయిన, త్వరగా ఏ ప్రశ్నను అడుగుట యుక్తమైనది?

20 దేవుని ఆశీర్వాదములయెడల, యేసు “అమూల్య రక్తము” యెడల, నిరంతరము జీవించు అద్భుత నిరీక్షణయెడల నీకు గల మెప్పు నిన్ను క్రియ చేయుటకు నడిపించుచున్నదా? (1 పేతురు 1:19) నీవు నీ జీవితమును దేవుని నీతియుక్తమైన షరతులకు అనుగుణంగా తెచ్చుకొనియున్నావా? శిష్యులను తయారుచేయు పనిలో నీవు క్రమంగా పాల్గొనెదవా? నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ జీవితమును దేవునికి సమర్పించుకొనియున్నావా? ఈ ప్రశ్నలన్నిటికి నీవు ఔను అని ఖచ్చితముగా సమాధానము చెప్పినట్లయిన, నీవు హాజరగుచున్న సంఘములోని ఒక పెద్దను విశ్వసించు ఐతియోపీయుడు ఫిలిప్పును అడిగినట్లే నీవునూ: “నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని” అడుగవచ్చును.—అపొ. కార్యములు 8:36. (w90 8/1)

[అధస్సూచీలు]

a దీనిని ది జెరూసలేమ్‌ బైబిలు “తన్ను తాను త్యజించుట” అని తర్జుమా చేయుచున్నది. ది వర్హన్‌ బై జె.బి. ఫిలిప్స్‌, “తనపై తనకుగల సమస్త హక్కును వదలివేయుట” అని చెప్పుచున్నది. ది న్యూ ఇంగ్లీష్‌ బైబిలు “తనను తాను వెనుక పెట్టుకొనుట” అని చెప్పుచున్నది.

b ఇట్టి అలవాట్లను విడిచిపెట్టుటను గూర్చి తగిన సమాచారము కొరకు ది వాచ్‌టవర్‌, ఫిబ్రవరి 1, 1981 పేజిలు 3-12; జూన్‌ 1, 1973, పేజిలు 336-43; అవేక్‌! జూలై 8, 1982, పేజిలు 3-12; మే 22, 1981, పేజిలు 3-11 చూడుము. ఇవి స్థానిక యెహోవాసాక్షుల రాజ్యమందిరపు గ్రంథాలయములో లభ్యము కావచ్చును.

మీకు జ్ఞాపకమున్నవా?

◻ దేవునికి కృతజ్ఞులమైయుండుటకు మనము ఏ ప్రత్యేక కారణములను కలిగియున్నాము?

◻ విశ్వాసము మరియు మెప్పు మనలను ఏమి చేయుటకు నడుపవలెను?

◻ దేవునికి విధేయతచూపుటయందు మనకు ఏ సమస్యలు ఆటంకముగా ఉండవచ్చును?

◻ ఇంకనూ బాప్తిస్మము పొందని వ్యక్తులు తమకై తాము ఏ ప్రశ్నలను అడుగుకొనవలెను?

[13వ పేజీలోని బాక్సు]

‘నేను ఎటువంటి “నేల”నై యున్నాను’

యేసు విత్తనములు విత్తుటకు వెళ్లిన ఒక మనుష్యుని ఉపమానమును చెప్పెను. కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడగా పక్షులు వచ్చివాటిని మ్రింగివేసెను. కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను. అవి మొలిచెను గాని, సూర్యుడు ఉదయించినప్పుడు మాడి, ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలో పడగా ముండ్ల పొదలు వాటిని అణచివేసెను. యేసు ఈ మూడు తరగతులు సూచించుదానినిగూర్చి ఇట్లు చెప్పెను: మొదటిది, “రాజ్యమునుగూర్చిన వాక్యమును విని దానిని గ్రహింపని” వ్యక్తి; రెండు, వాక్యమును అంగీకరించి “శ్రమ లేక హింస” యను వేడి తగలగా తొలగిపోవు వ్యక్తి; మూడు, వాక్యమును వినినను “ఐహిక విచారము ధనమోసముచే” ఆ వాక్యము అణచివేయబడిన వ్యక్తి.

అయితే యేసు మంచి నేలను పడిన విత్తనమును గూర్చియు చెప్పెను. దానినిగూర్చి ఆయన: “వాక్యము విని గ్రహించువాడు; నిజముగా ఫలించు వాడు” అని చెప్పెను.—మత్తయి 13:3-8, 18-23.

కావున మనకై మనము, ‘నేను ఎటువంటి “నేల”నై యున్నానని’ అడుగుకొనుట మంచిది.

[14వ పేజీలోని బాక్సు]

వారు తమ విశ్వాసముకొరకు మరణించిరి

తమ విశ్వాసమును భంగపరచుకొనకుండ, దానికై మరణించినవారు ఎవరైన మీకు తెలుసా? డా. క్రిస్‌టయిన్‌ ఇ. కింగ్‌, ది నాజి స్టేట్‌ అండ్‌ ది న్యూ రిలిజియన్స్‌: ఫైవ్‌ కేస్‌ స్టడీస్‌ ఇన్‌ నాన్‌-కన్‌ఫార్మటి అను పుస్తకములో ఇలా వ్రాసెను: “జర్మను సాక్షులలో ప్రతి ఇద్దరిలో ఒకరు జైలులో వేయబడ్డారు, నలుగురిలో ఒకరు తమ ప్రాణములను పోగొట్టుకున్నారు.”

చివరకు శిబిరములలోని భయంకర పరిస్థితి 1945లో ముగిసినప్పుడు, “సాక్షుల” సంఖ్య పెరిగినదే గాని ఏమాత్రము రాజీలు ఏర్పడలేదు.” ది నాజి పర్హిక్యూషన్‌ ఆఫ్‌ ది చర్చ్‌స్‌ అను దానిలో జె.యస్‌. కాన్‌వే సాక్షులనుగూర్చి ఇలా వ్రాసెను: “గెస్టపో యొక్క పూర్తి దౌర్జన్యకాండలో ఏ ఇతర శాఖ ఇలాంటి దృఢ తీర్మానమును చేపట్టలేదు.”

యెహోవాసాక్షులు రాజకీయమునుబట్టి గాని లేక జాతిని బట్టిగాని హింసించబడలేదు. సంపూర్తిగా దేవునియెడల వారు కలిగియున్న ప్రేమనుబట్టి మరియు బైబిలుచే శిక్షణపొందబడిన తమ మనస్సాక్షిని భంగపరచుకొనుటకు తిరస్కరించుటను బట్టియే బాధననుభవించిరి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి