కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 1/1 పేజీ 3
  • సూచన కేవలం గతించిన చరిత్రకాదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సూచన కేవలం గతించిన చరిత్రకాదు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • భూకంపాల గురించి బైబిలు ముందే ఏం చెప్పింది?
    అదనపు అంశాలు
  • అర్మగిద్దోను దగ్గరపడిందని ఎలా చెప్పవచ్చు?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • యేసు ప్రత్యక్షతా సూచనను మీరు గుర్తిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • ప్రపంచాన్ని కుదిపేసే సంఘటనల గురించి యేసు ప్రవచించాడు
    బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 1/1 పేజీ 3

సూచన కేవలం గతించిన చరిత్రకాదు

నేడు యోచించే ప్రజల ఆవధానాన్ని చూరగొను అద్భుతమైన చారిత్రక ప్రదేశము మధ్య ఆసియాలో యెరూషలేమునందున్నది. ఆ ఎత్తైన ప్రదేశమందు “గొప్ప సంపదగల్గిన దేవాలయము” ఉండెనని మొదటి శతాబ్దపు రోమా చరిత్రకారుడు టాసిటస్‌ వ్రాసెను. ఇప్పుడైతే దేవాలయ భవన జాడ ఏమిలేదుగాని ఆ బల్లపరుపు ప్రదేశమున్నది. నిన్ను ప్రభావితము చేయు ప్రవచనాత్మక సూచనయొక్క వాస్తవానికి అది సాక్ష్యముగా నిలిచియున్నది.

దేవాలయమునకు దక్షిణంగా పురావస్తుపరిశోధకులు అనేక పరిశోధనలు జరిపారు. “కనుగొన్నవాటిలో అత్యంత ఆసక్తికరమైన విషయము ఏమంటే క్రీ. శ. 70లో యెరూషలేము నాశనము చేయబడిన సమయాన దేవాలయ శిఖరమునుండి పెద్ద పెద్ద రాతి దిమ్మలు అనేకమైనవి నేలనుపడవేయబడినవి” అని జె. ఎ. థాంస్సన్‌ ది బైబిల్‌ అండ్‌ ఆర్కియాలజీ అను పుస్తకములో తెల్పెను.

యెరూషలేము అందలి దేవాలయము యొక్క నాశనము అది సంభవించుటకు 37 సం. ముందే ప్రవచించబడింది. “వాటిలో రాతి మీద రాయి ఉండకుండ అవి పడద్రోయబడునను” యేసు క్రీస్తు మాటలను ముగ్గురకు తక్కువకాని చరిత్రకారులు వ్రాసారు. (లూకా 21:6; మత్తయి 24:1, 2; మార్కు 13:1, 2) దాని తరువాత జరిగిన సంభాషణ నీతో సహా అందరికి వర్తించునదైయున్నది.

“బోధకుడా, ఇవి జరుగబోవునని సూచన ఏమిటి?” అని ఆయన శిష్యులు ఆయనను అడిగిరి. యేసు మాటలను బట్టి దేవాలయము నాశనమయ్యే కాలము యుద్ధములు, భూకంపములు, క్షామము, తెగుళ్లచే గుర్తించబడును. ఆయన యింకా చెప్పిందేమంటే “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదు.”—లూకా 21:7, 10, 11, 32.

ఆ “సూచన యొక్క నెరవేర్పును అప్పటి తరము అనుభవించినదా? అవును. “గొప్పకరువు” అలాగే మూడు భూకంపములు వాటిలో రెండు ‘మహాభూకంపములు’ సంభవించెనని బైబిలు తెల్పుచున్నది. (అపొస్తలుల కార్యాలు 11:28; 16:26; మత్తయి 27:51; 28:1, 2) లౌకిక చరిత్ర ప్రకారము ఆకాలమందు యితర భూకంపములు కరవులు సంభవించినవి. అది యుద్ధములు జరిగిన కాలము కూడా, వాటిలో రెండు, రోమా సైన్యముచే యెరూషలేము నివాసులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటములు. యెరూషలేము రెండవసారి ముట్టడి వేయబడినప్పుడు భయంకరమైన తెగుళ్లు. క్షామము సంభవించి సా. శ. 70 సం. లలో ఆ పట్టణము దానిలోని దేవాలయము నాశనమాయెను. మొదటి శతాబ్దములో జరిగిన ఆ భయంకర సంఘటనలకు యెరూషలేములో మునుపు దేవాలయమున్న ప్రదేశము మూగసాక్ష్యంగా నిలిచియున్నది.

‘ఆసక్తిగానే ఉన్నది. కాని అది నాకు ఎలా వర్తిస్తుంది?’ అని ఎవరైనా అనవచ్చు. అయితే ఆ సూచన కేవలం గతించిన చరిత్రకాదు. మొదటి శతాబ్దములో అది కేవలం పాక్షికంగా నెరవేరింది. ఉదాహరణకు, ‘సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు, సముద్రతరంగముల ఘోషవలన’ మానవులు కలవరపడే కాలముండునని ఇక్కడ యేసు ప్రవచించెను. సూచనలోని భాగము లోక కలవరములనుండి శాశ్వత విముక్తిని తెచ్చు ప్రభుత్వమైన—“దేవుని రాజ్యము” సమీపముననున్నదని గుర్తించును.”—లూకా 21:25-31.

ఆ సంఘటనలు మొదటి శతాబ్దములో సంభవించలేదు. నేడు, 1900 సం.ల తరువాత కూడా మానవులు యుద్ధములు, భూకంపములు, కరవులు, తెగుళ్లనుండి విముక్తి కొరకు యింకను కనిపెట్టుచున్నారు. అందుచేత, ఆ సూచనకు రెండవ సంపూర్ణ నెరవేర్పు యుండవచ్చును. దీనిని దృష్టియందుంచుకొని, ఆ సూచనకు సరిపడు ప్రవచనాత్మక దర్శనములను ప్రకటన గ్రంథము కల్గియున్నది. అయితే అది యెరూషలేము నాశనము తరువాత వ్రాయబడింది. (ప్రకటన 6:1-8) అలాగైతే, ఉత్పన్నమగు ప్రాముఖ్యమైన ప్రశ్న: ఆ సూచన మన దినములలో కన్పించుచున్నదా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి