కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 5/1 పేజీలు 8-9
  • ఆమె అతని వస్త్రము ముట్టినది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆమె అతని వస్త్రము ముట్టినది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆమె అతని వస్త్రము ముట్టినది
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • ఒక స్త్రీ యేసు వస్త్రాన్ని ముట్టుకొని బాగైంది
    యేసే మార్గం, సత్యం, జీవం
  • యేసు మృతులను లేపడం
    నా బైబిలు కథల పుస్తకము
  • మనం చనిపోయినా తిరిగి లేస్తాం!
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 5/1 పేజీలు 8-9

యేసు జీవితము పరిచర్య

ఆమె అతని వస్త్రము ముట్టినది

దెకపొలినుండి యేసుతిరిగి వచ్చుచున్నాడను వార్త కపెర్నహూమునకు చేరినది. మరియు ఒక గొప్ప జనసమూహము ఆయనను తిరిగి ఆహ్వానించుటకు సముద్రతీరమున కూడినది. ఆయన తుఫానును నిమ్మళపరచటము, దయ్యములు పట్టిన వారిని బాగుచేయటము అను విషయములు వారు వినుటలో ఏమాత్రము సందేహములేదు. ఇప్పుడు ఆయన తీరమున కాలు మోపినపుడు ఆసక్తితో మరియు ఆయనను చూడవలెననే కోరికతో వారాయనచుట్టు మూగిరి.

యేసును చూడవలెననే కాంక్షగలవారిలో సమాజమందిరపు అధికారియైన యాయీరు ఒకడు. అతను యేసుపాదములపై బడి పదేపదే అర్ధించుచున్నాడు. “నా చిన్నకుమార్తె చావనైయున్నది. మీరు దయచేసి వచ్చి మీచేతులను ఆమెమీద ఉంచినట్లయితే ఆమె బాగుపడి బ్రతుకును.” ఆమె తనకు 12 సంవత్సరముల ఏకైక పుత్రిక గనుక యాయీరుకు ఆమె చాలా విలువైన వ్యక్తి.

యేసు దీనికి ప్రతిస్పందించెను. గొప్ప జనసమూహము వెంట రాగా యేసు యాయీరు ఇంటివైపు సాగెను. మరొక సూచక క్రియ జరుగుతుందని ముందుగనే తెలిసికొనియున్న ప్రజలారా ఉత్సాహభరితులైరో మనము ఊహించవచ్చును. అయితే ఆ గుంపులో నున్న ఒకస్త్రీ తన అవధానమును తనకున్న తీవ్రమైన సమస్యపై నిలిపెను.

గత 12 సంవత్సరములుగా ఈ స్త్రీ రక్తస్రావరోగముతో బాధపడుచుండెను. ఆమె ఒక వైద్యుని తరువాత మరొక వైద్యుని వద్దకు వెళ్లుచు తన ధనమంతయు చికిత్సకొరకు ఖర్చుచేసెను. అయితే అది ఆమెను బాగుచేయలేదుగాని సమస్యను మరి తీవ్రతరముచేసెను.

ఆరోగ్యము ఆమెను బహుబలహీనపరచటమే కాకుండా, అవమానపరచునదిగాను, ఇబ్బంది పెట్టునదిగాను ఉన్నదనుటను బహుశ మీరు ఒప్పుకొందురు. సహజముగా అటువంటి రోగమునుగూర్చి ఎవరైనను బహిరంగముగా చెప్పరు. అంతేకాకుండా మోషే చట్టప్రకారము రక్తస్రావముగలస్త్రీ అపవిత్రురాలు మరియు ఆమెనుగాని ఆమె వస్త్రమునుగాని ముట్టినవాడు తన్నుతాను శుభ్రపరచుకొని సాయంత్రమువరకు అపవిత్రుడైయుండును.

ఈ స్త్రీ యేసుచేసిన అద్భుతములను గూర్చి విన్నది మరియు ఇప్పుడు ఆయనద్వారా స్వస్థతపొందగోరుచున్నది. తనకున్న అపవిత్రతనుబట్టి సాధ్యమైనంతవరకూ గుర్తింపబడకుండా ఆ జనసమూహము మధ్య దూరి తనలో తానిట్లనుకొనెను: “నేను ఆయన వస్త్రములు మాత్రముముట్టి బాగుపడుదును” ఆమె అట్లు ముట్టినపుడు వెంటనే తనరక్తస్రావము ఆగిపోయెనని తెలిసికొనెను!

“నన్ను ముట్టినదెవరు?” యేసు యొక్క ఈ మాటలు ఆమెకెంత దిగ్భ్రమము కలిగించినవి! ఆయన కెట్లు తెలిసినది? అందుకు పేతురు “బోధకుడా, జనసమూహములు క్రిక్కిరిసి నీమీద పడుచుండగా నన్ను ముట్టినదెవరని ప్రశ్నించుచున్నావా?” అనెను.

ఆ స్త్రీ కొరకు తనచుట్టు చూచి యేసు “ఎవరో నన్నుముట్టిరి గనుక నాలోని ప్రభావము బయలువెళ్లినది” అనెను. నిజమే! అది సామాన్యంగా ముట్టటంకాదు ఏలయనగా ఆమె యేసునుంచి బయలువెడలిన శక్తిఫలితముగా బాగుపడెను.

ఇక తాను వారికనుదృష్టినుంచి తప్పించుకోలేనని గ్రహించిన ఆ స్త్రీ వణకుచూ, భయపడుతూ యేసు ముందుకు వచ్చి సాగిలపడెను. ఆ ప్రజలందరిముందు తనవ్యాధిని గూర్చిన వృత్తాంతమంతయు తెలియజేసి ఇప్పుడు తానెట్లు స్వస్థపడెనో వివరించెను.

ఆమె చెప్పినదంతయు విని జాలితో కదలిపోయిన యేసు ఆమెను ఊఱడించుచూ “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానము గలదానివై పొమ్ము; నీ బాధ నివారణయై నీకుస్వస్థత కలుగును” అని చెప్పెను. భూమిని పరిపాలించుటకు అట్టి కనికరము, ప్రేమగలవ్యక్తిని తన ప్రజలయెడల శ్రద్ధకనపరచివారికి సహాయముచేయగల శక్తిగలిగిన వ్యక్తిని దేవుడు ఎన్నుకొన్నాడని తెలిసికొనుట మనకెంత సంతోషముకలిగించును! మత్తయి 9:18-22; మార్కు 5:21-34; లూకా 8:40-48; లేవీయకాండము 15:25-27.

◆ యాయీరు ఎవరు? అతనెందుకు యేసునొద్దకు వచ్చెను?

◆ స్త్రీకున్న సమస్య ఏమి? మరియు సహాయము కొరకు యేసు యొద్దకు వచ్చుటకామె కెందుకు కష్టతరమాయెను?

◆ స్త్రీ ఎట్లు స్వస్థపరచబడినది, మరియు యేసు ఆమెనెట్లు ఓదార్చెను? (w87 6/1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి