కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 4/1 పేజీలు 8-9
  • అసంభావితుడైన ఒక శిష్యుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అసంభావితుడైన ఒక శిష్యుడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • అసంభవమని తలంచిన శిష్యుడు
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • యేసుకు చెడ్డదూతల మీద అధికారం ఉంది
    యేసే మార్గం, సత్యం, జీవం
  • యేసుకు దయ్యాలను నాశనం చేయగల శక్తి ఉంది
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • దయ్యాలు నిజంగానే ఉన్నాయా?
    తేజరిల్లు!—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 4/1 పేజీలు 8-9

యేసు జీవితము పరిచర్య

అసంభావితుడైన ఒక శిష్యుడు

యేసు తీరము చేరుకునేసరికి ఎంతటి భయంకర దృశ్యం! సమీపమున ఉన్నసమాధులలోనుండి ఇద్దరువ్యక్తులు అసాధారణమైన ఉగ్రరూపముతో ఆయనవైపు పరుగెత్తుచు వస్తున్నారు. వారు దయ్యము పట్టినవారు. వారిలో ఒకడు మరొకని కంటె ఎక్కువక్రూరంగా ఉన్నందునను, దయ్యంయొక్క ఆధీనములో ఎక్కువకాలం బాధింపబడినందున అందరిదృష్టి అతనిపైపడింది.

దీనస్థితిలో ఉన్న ఈ వ్యక్తి ఎంతోకాలంనుండి సమాధుల మధ్య నగ్నంగా జీవిస్తున్నాడు. దివారాత్రులు ఎడతెరిపిలేకుండా అతడు కేకలువేయుచు రాళ్లతో తన్నుతానే కొట్టుకొనుచుండెను. ఎవ్వరూ ఆ మార్గమున వెళ్లడానికి ధైర్యంచేయజాలనంత క్రూరంగా అతడున్నాడు. అతనిని బంధించడాన్కి ప్రయత్నాలు జరిగినవి, కాని అతడు సంకెళ్లను విరగగొట్టి అతని కాళ్లకున్న ఇనుపసంకెళ్లను తుత్తునీయలుగా చేసెను. అతనిని లోపరచుకొనుటకు ఎవనికి శక్తిలేదు.

అతడు యేసును సమీపించి, ఆయన పాదములపైపడెను, అతనిలోని దయ్యములు అతనిచే యిలా కేకలు వేయించినవి: “యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవునిపేరట నీకు ఆనబెట్టుచున్నాను.”

“అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచిపొమ్ము,” అని యేసు చెప్పుచునే యుండెను. అటుపిమ్మట యేసు: “నీపేరు ఏమిటి?” అని అడిగెను.

“నా పేరు సేన, యేలయనగా మేము అనేకులము” అని సమాధానమిచ్చెను. తాము ఆవరించియున్నవాని బాధలనుచూచి, ఆ దయ్యములు ఉల్లసించుచు, వానిపై మూకుమ్మడి దాడిచేయుట మూలంగా బహు సంతోషమును పొందుచున్నట్లు కన్పించుచున్నది. కాని యేసును ఎదుర్కొని, అగాధములోనికి తమ్మును పంపివేయవద్దని వారు వేడుకున్నారు. దయ్యములను కూడ జయించగల గొప్పశక్తిని యేసు కల్గియుండుటను మనము మరలచూడగలము. తమనాయకుడైన అపవాదియగు సాతానుతో పాటు తమ్మును కూడ అగాధములో పడవేయుట దేవుని తీర్పు అని దయ్యములు ఎరిగియున్నట్లు యిది బయలు పర్చింది.

సమీపమున కొండమీద యించుమించు 2,000 పందులున్న మంద కన్పించుచున్నది. “ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మునువాటి యొద్దకు పంపుము,” అని దయ్యములు అడిగాయి. భౌతికప్రాణుల శరీరములపై దాడి చేయునప్పుడు దయ్యములు ఒకవిధమైన అసాధారణ పైశాచిక అనుభూతిని పొందునట్లు కన్పించుచున్నది. ఆ పందులలోనికి ప్రవేశించుటకు యేసు అనుమతించినప్పుడు, ఆ 2,000 పందులు కొండచరియ నుండి సముద్రములోపడి కొట్టుకొనిపోయెను.

ఆ పందులను కాయుచున్నవాళ్లు దీనినిచూచి, ఈ వార్తను తెలియజేయుటకు పట్టణములోనికి, గ్రామములోనికి పరుగెత్తి పోయిరి. అంతట సంభవించినదేమిటో చూడడాన్కి జనులు వచ్చారు. వారువచ్చేసరికి, అదిగో, దయ్యములు విడిచిన ఆ వ్యక్తి, బట్టలు వేసికొని, మనస్సుకుదుటపడినవాడై యేసు పాదముల చెంత కూర్చున్నాడు!.

ఆ మనుష్యుడు ఎలా బాగుచేయబడెనో దానిని చూచినవారు ఆ జనులకు సాక్ష్యమిచ్చారు. పందులు ఎంత భయంకరంగా చచ్చినవోకూడ వారు తెలియజేసారు. అది విన్నప్పుడు, గొప్పభయము వారిని ఆవరించింది. తమ ప్రాంతాన్ని విడిచి వెళ్లి పొమ్మని వారు యేసును బతిమాలారు. కనుక ఆయన దానికి అంగీకరించి పడవ ఎక్కి కూర్చున్నాడు. తనను కూడా రానియ్యుమని దయ్యమువిడిచిన వ్యక్తి యేసును వేడుకున్నాడు. కాని యేసు అతనితో యిలా చెప్పెను: “నీవు నీయింటి వారియొద్దకు వెళ్లి, యెహోవా నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుము.”

సర్వసాధారణంగా యేసు తాను స్వస్థపర్చిన వారికి, ఎవనితోను చెప్పవద్దని ఉపదేశించేవాడు, ఎందుకంటె అట్టి భావోద్రేకసంబంధమైన నివేదికల మూలంగా ప్రజలు ఒక ముగింపు కొచ్చుట ఆయనకు యిష్టములేదు. కాని యిచ్చట అనుమతించడం సహేతుకమే, ఎందుకంటె దయ్యము విడిచిన ఈ వ్యక్తి సాక్ష్యమియ్యవలసియున్నది. అంతేకాదు పందులు నాశనమయ్యినందున ఎటువంటి ప్రతికూలమైన సమాచారము వ్యాపించకుండ యేసుయొక్క శక్తి మంచిని చేకూర్చునదేయని సాక్ష్యమిచ్చుటకు ఆవ్యక్తి అచ్చట ఉండుట అవసరము.

యేసు ఉపదేశానుసారంగా, దయ్యము విడిచిన వ్యక్తి వెళ్లిపోతాడు. యేసు తనకు చేసినదంతయు అతడు దెకపొలి యందంతట ప్రకటించడం ప్రారంభిస్తాడు, ప్రజలు అది విని విస్మయమొందుతారు. మత్తయి 8:28-34; మార్కు 5:1-20; లూకా 8:26-39; ప్రకటన 20:1-3.

◆ దయ్యము పట్టినవారు యిద్దరుండగా, ఒకనిపైనే అవధానము బహుశ ఎందుకు నిలుపబడింది?

◆ భవిష్యత్తులో అగాధమందు పడవేయబడుదుమని దయ్యములకు తెలిసినట్లు ఏది చూపుచున్నది?

◆ మనుష్యులను, జంతువులను ఆవరించుటకు దయ్యములు ఎందుకు కోరుచున్నవి?

◆ దయ్యములు విడిచిన వానితో తాను అతనికి చేసిన దాని నంతటిని యితరులకు తెలియజెప్పుమని యేసు ఎందుకు అనుమతినిచ్చెను? (w87 5/15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి