సెక్షన్ 3
మెస్సీయ, ఆయన శిష్యులు ఉన్న కాలం
ముద్రిత ప్రతి
ఈ సెక్షన్‌లో, దాదాపు 100 ఏళ్ల చరిత్ర గురించి తెలుసుకుంటాం. ఈ సెక్షన్ మొదట్లో, మరియ అనే ఒక యూదురాలు గురించి చూస్తాం; యెహోవా ఇంతవరకు ఏ అపరిపూర్ణ మనిషికీ ఇవ్వని పెద్ద బాధ్యతను వినయం ఉన్న ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఈ సెక్షన్ చివర్లో, యేసుకు ఎంతో ఇష్టమైన అపొస్తలుడైన యోహాను గురించి చూస్తాం. అలాగే బాప్తిస్మమిచ్చే యోహాను, అపొస్తలుడైన పేతురు, మగ్దలేనే మరియ, స్తెఫను, పౌలు లాంటి వాళ్లు చూపించిన అసాధారణ ధైర్యం గురించి తెలుసుకుంటాం. ఆ కాలంలోని చాలామంది నమ్మకపోయినా, యేసే మెస్సీయ అని వాళ్లు ధైర్యంగా ప్రకటించారు. వ్యతిరేకత-హింస వచ్చినా, వాళ్లు యేసు ఆదర్శాన్ని పాటిస్తూ ఆయన గురించిన మంచివార్తను చెప్తూ వచ్చారు.