కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 7 పేజీ 10
  • ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారం
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • చెబుతున్న వివరాలు ఖచ్చితమైనవిగా ఉండడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • లేఖనాల్ని సరిగ్గా పరిచయం చేయడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ప్రశ్నలు వేయడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 7 పేజీ 10

అధ్యాయం 7

ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారం

లేఖనం

లూకా 1:3

ఏమి చేయాలి? వినేవాళ్లు సరైన ముగింపుకు వచ్చేలా నమ్మదగిన రుజువులు చూపించండి.

ఎలా చేయాలి?

  • నమ్మదగిన సమాచారం కోసం వెదకండి. దేవుని వాక్యం ఆధారంగా మాట్లాడండి, వీలైనప్పుడు దానిలో నుండి నేరుగా చదవండి. మీరు విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ఒక విషయాన్ని గానీ, వార్తను గానీ, అనుభవాన్ని గానీ, మరో రుజువును గానీ చెప్పాలనుకుంటే అది ఖచ్చితమైనదో కాదో ముందే చూసుకోండి.

  • సేకరించిన సమాచారాన్ని సరిగ్గా ఉపయోగించండి. లేఖనాల్ని వివరిస్తున్నప్పుడు ఆ వివరణ, లేఖన సందర్భానికి, బైబిల్లో ఉన్న సందేశానికి, ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుని’ ప్రచురణలకు విరుద్ధంగా ఉండకూడదు. (మత్త. 24:45) బయటి ప్రచురణల నుండి ఏదైనా ప్రస్తావిస్తే, ఆ మాటల సందర్భాన్ని, రచయిత ఉద్దేశాన్ని మనసులో ఉంచుకోండి.

    సలహా

    వాస్తవాలను, సంఖ్యలను ఎక్కువ చేసి చెప్పకండి. “కొంతమంది” అని ఉంటే “చాలామంది” అని, “కొన్ని సందర్భాల్లో” అని ఉంటే “ఎప్పుడూ” అని, “ఇలా జరిగివుండవచ్చు” అని ఉంటే “ఇలా జరిగింది” అని చెప్పకండి.

  • రుజువుల ఆధారంగా మాట్లాడండి. ఒక లేఖనం గానీ మరో రుజువు గానీ చెప్పిన తర్వాత, వినేవాళ్లు సరైన ముగింపుకు వచ్చేలా ప్రశ్నలు వేయండి లేదా ఉదాహరణలతో వివరించండి.

పరిచర్యలో

మీరు ప్రకటించడానికి సిద్ధపడుతున్నప్పుడు, ప్రజలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఊహించి వాళ్లకు ఎలా జవాబు ఇవ్వవచ్చో పరిశోధన చేయండి. ఒకవేళ మీకు తెలియని ప్రశ్న వాళ్లు అడిగితే, దాని మీద పరిశోధన చేసి వస్తానని చెప్పండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి