కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 6 పేజీ 9
  • లేఖనాన్ని స్పష్టంగా వివరించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • లేఖనాన్ని స్పష్టంగా వివరించడం
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • లేఖనాల్ని సరిగ్గా పరిచయం చేయడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • లేఖనాలను సరిగ్గా అన్వయించడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • మంచి ముగింపు
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 6 పేజీ 9

అధ్యాయం 6

లేఖనాన్ని స్పష్టంగా వివరించడం

లేఖనం

యోహాను 10:33-36

ఏమి చేయాలి? ఒక లేఖనం చదివి, వేరే అంశంలోకి వెళ్లిపోకండి. ఆ లేఖనానికి, మీరు చెప్తున్న విషయానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో వినేవాళ్లకు అర్థమయ్యేలా చూడండి.

ఎలా చేయాలి?

  • లేఖనంలోని ముఖ్యమైన పదాలను నొక్కిచెప్పండి. లేఖనం చదివి, అందులో మీ ముఖ్యాంశానికి సంబంధమున్న పదాలను నొక్కిచెప్పండి. దాని కోసం, మీరు ఆ పదాలను మళ్లీ చెప్పవచ్చు లేదా వినేవాళ్లు ఆ పదాలను గుర్తించేలా ఒక ప్రశ్న వేయవచ్చు.

    సలహా

    ఒకవేళ మీరు లేఖనాన్ని సొంత మాటల్లో చెప్పాలనుకున్నా, మీరు చెప్తున్న అంశానికీ లేఖనానికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటో వినేవాళ్లకు అర్థమవ్వాలి.

  • లేఖనంలో గుర్తుంచుకోవాల్సిన విషయం నొక్కిచెప్పండి. కొన్నిసార్లు మీరు లేఖనాన్ని పరిచయం చేయడానికి కొన్ని మాటలు చెప్పివుండవచ్చు లేదా ప్రశ్నలు వేసివుండొచ్చు. అలాంటప్పుడు లేఖనంలోని ముఖ్యమైన పదాలకు ఆ పరిచయ మాటలతో ఎలాంటి సంబంధం ఉందో వివరించండి.

    సలహా

    లేఖనాన్ని వివరిస్తున్నప్పుడు, మీ బైబిల్ని తెరిచే ఉంచండి. అప్పుడు వినేవాళ్లు కూడా బైబిళ్లను తెరిచే ఉంచి, మీరు వివరిస్తున్న మాటల్ని చూడగలుగుతారు.

  • తేలిగ్గా అర్థమయ్యేలా వివరించండి. ముఖ్యాంశంతో సంబంధంలేని అనవసరమైన వివరాలు చెప్పకండి. మీరు చెప్తున్న సమాచారం గురించి వినేవాళ్లకు ఎంతవరకు తెలుసో, ఇంకా ఏ వివరాలు చెప్తే సరిపోతుందో ఆలోచించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి