కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 5 పేజీ 8
  • తప్పులు లేకుండా చదవడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తప్పులు లేకుండా చదవడం
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • తప్పులు లేకుండా చదవడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • చదవడం మీద శ్రద్ధ వహించండి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • మీ పరిధులను విస్తృతపర్చుకొనుటకు చదవండి
    తేజరిల్లు!—1992
  • ప్రశ్నాభాగం
    మన రాజ్య పరిచర్య—1996
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 5 పేజీ 8

అధ్యాయం 5

తప్పులు లేకుండా చదవడం

లేఖనం

1 తిమోతి 4:13

ఏమి చేయాలి? పేజీలో ఉన్న సమాచారాన్ని ఉన్నదున్నట్లు గట్టిగా చదవండి.

ఎలా చేయాలి?

  • బాగా సిద్ధపడండి. మీరు చదువుతున్న సమాచారాన్ని ఎందుకు రాశారో ఆలోచించండి. పదాలను విడివిడిగా కాకుండా, కలిపి చదవాల్సిన పదాలను కలిపి చదవడం ప్రాక్టీసు చేయండి. కొత్త పదాలను చేర్చడం, కొన్నిటిని మింగేయడం, వేరే పదాలు పెట్టి చదవడం చేయకండి. విరామ చిహ్నాలన్నీ (కామా, ఫుల్‌స్టాప్‌ లాంటివి) చూసుకోండి.

    సలహా

    మీరు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా విని, ఎక్కడెక్కడ తప్పుగా చదివారో చెప్పమని మీ స్నేహితుణ్ణి అడగండి.

  • ప్రతీ పదాన్ని సరిగ్గా పలకండి. ఒక పదాన్ని ఎలా పలకాలో తెలియకపోతే ఆ ప్రచురణ ఆడియో రికార్డింగ్‌ వినండి, లేదా బాగా చదివేవాళ్ల సహాయం తీసుకోండి.

  • స్పష్టంగా మాట్లాడండి. మీ తల ఎత్తి, నోటిని పూర్తిగా తెరిచి పదాలను జాగ్రత్తగా పలకండి. ప్రతీ అక్షరాన్ని పలకడానికి కృషిచేయండి.

    సలహా

    మరీ పట్టిపట్టి చదవకండి, అప్పుడు వినడానికి అసహజంగా ఉంటుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి