పాట 102
‘బలహీనులకు సహాయం చేయండి’
1. మంటివారము మనం,
బలహీనులం.
ఐనా యెహోవా ప్రేమ,
తగ్గదేమాత్రం.
చూపిస్తాడు దయ,
జాలి, ప్రేమాగుణం.
మనమూ యెహోవాలా
ప్రేమ చూపిద్దాం.
2. బలంగా కనిపించే
వాళ్లకు సైతం
కావాలి కొన్నిసార్లు
ఓదార్పు, ధైర్యం.
దేవుడే వాళ్లకు
అందిస్తాడు బలం.
సానుభూతి చూపిద్దాం,
ఓదార్పునిద్దాం.
3. బలహీనుల్ని మనం
అవమానించం.
దయ చూపి వాళ్లను
బలపరుద్దాం.
చూపిస్తూ ప్రేమను,
ప్రోత్సాహాన్ని ఇద్దాం.
సాయమందిస్తూ మనం
సాంత్వననిద్దాం.
(యెష. 35:3, 4; 2 కొరిం. 11:29; గల. 6:2 కూడా చూడండి.)