పాట 91
ప్రేమతో మేము చేసిన కృషి
1. ప్రార్థిస్తున్నాం యెహోవా,
రానేవచ్చింది సమయం;
వర్ణించలేం మేము మాటల్లో
నీ గొప్ప దయ.
ప్రేమతో మేం చేసిన
కృషినెంతో దీవించావు.
అందుకు రుజువే ఇక్కడి
ఈ మందిరము.
(పల్లవి)
ఎంతటి గౌరవం యెహోవా,
నిర్మించడం నీ మందిరం.
జీవితాంతం నిన్నే సేవిస్తూ,
నీ పేరును ఘనపర్చే వరం ఇవ్వు.
2. ప్రాణ స్నేహితుల్లాగా
దగ్గరయ్యాం మేమందరం;
మరువలేం మేము ఎప్పుడూ
ఈ ఆనందాన్ని.
నీ శక్తి వల్లే మేము
ఐక్యంగా పనిచేశాము.
నీ పేరుకు ఎంతో కీర్తిని
తీసుకువచ్చాం!
(పల్లవి)
ఎంతటి గౌరవం యెహోవా,
నిర్మించడం నీ మందిరం.
జీవితాంతం నిన్నే సేవిస్తూ,
నీ పేరును ఘనపర్చే వరం ఇవ్వు.
(కీర్త. 116:1; 147:1; రోమా. 15:6 కూడా చూడండి.)