పాట 92
నీ పేరు పెట్టబడిన మందిరం
1. యెహోవా నీ మందిరం కట్టే
గొప్ప గౌరవం ఇచ్చావు!
నీ మహిమ కోసమై దాన్ని
అర్పిస్తున్నాము ఇప్పుడు.
మేమిచ్చేది ఏదైనా గానీ
నీ నుండే మేము పొందాము.
మా శక్తిసామర్థ్యాలు, ధనం
సంతోషంగా ఇస్తాం నీకు.
(పల్లవి)
అర్పిస్తున్నాం దీన్ని మేము
నీ నామ ఘనతకై.
దయతో నీ మందిరంగా
స్వీకరించు మా దేవా.
2. తండ్రీ, ఈ మందిరంలో నిన్ను
స్తుతిస్తూ ఘనపరుస్తాం.
నీ మార్గాల్ని ఇంకా ఎందరో
నేర్చుకునేలా దీవించు.
నీ ఆరాధనా మందిరాన్ని
చూసుకుంటాం జాగ్రత్తగా.
సాక్ష్యంగా ఇది నిలవాలి,
సువార్తకు మద్దతిస్తూ.
(పల్లవి)
అర్పిస్తున్నాం దీన్ని మేము
నీ నామ ఘనతకై.
దయతో నీ మందిరంగా
స్వీకరించు మా దేవా.
(1 రాజు. 8:18, 27; 1 దిన. 29:11-14; అపొ. 20:24 కూడా చూడండి.)