పాట 51
దేవా, సమర్పించా నా జీవితం
1. క్రీస్తుదారిలో మనము నడిచేలా
ఆకర్షించాడుగా యెహోవా.
ఆయన సింహాసనం
వెదజల్లింది సత్యం;
వెలిగింది విశ్వాసం
బ్రతకను నాకోసం.
(పల్లవి)
దేవా, నే సమర్పించేసా నా జీవితం
నీకే నే లోబడి ఉంటానుగా.
2. ‘చేస్తాం నీ సేవ మేమంతా సంతోషంగా’
అని చెప్పాముగా ప్రార్థించి.
నీ పేరు ధరించాము
సత్యాన్ని చల్లేస్తాము.
ఇచ్చిన మాట కోసం
పెట్టేస్తాను నా ప్రాణం.
(పల్లవి)
దేవా, నే సమర్పించేసా నా జీవితం
నీకే నే లోబడి ఉంటానుగా.
(కీర్త. 43:3; 107:22; యోహా. 6:44 కూడా చూడండి.)