పాట 42
దేవుని సేవకుల ప్రార్థన
1. ఓ మా దేవా, యెహోవా మా తండ్రి,
ఘనపర్చు నీ పవిత్ర నామాన్ని.
నెరవేర్చు నీ చిత్తమంతా,
తీసుకొచ్చి రాజ్యాన్ని త్వరలో.
కుమ్మరించు మాపైన
మెండైన దీవెనలు.
2. గొప్ప తండ్రి, కృతజ్ఞులం మేము;
రోజు నువ్వు ఇస్తున్న వాటికోసం.
జీవానికి నువ్వేగా మూలం.
జ్ఞానం, తెలివి దయచేస్తావు.
ప్రేమమయం నీ మార్గం,
స్తుతిస్తాం నిన్నే నిత్యం.
3. ఈ లోకంలో ఎన్నో కష్టాలున్నా,
ఓదార్పుకై నీవైపే చూస్తున్నాము.
వేస్తున్నాము మా భారం నీపై.
తండ్రి మాలోన ధైర్యాన్ని నింపి,
బలపర్చు మమ్మల్ని
చేసేలా నీ చిత్తాన్ని.
(కీర్త. 36:9; 50:14; యోహా. 16:33; యాకో. 1:5 కూడా చూడండి.)