కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 45 పేజీ 110-పేజీ 111 పేరా 2
  • రాజ్యం విడిపోయింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రాజ్యం విడిపోయింది
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాజ్యం విభాగించబడడం
    నా బైబిలు కథల పుస్తకము
  • యెహోవా తన భక్తులను విడువడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • దేవుని అనుగ్రహాన్ని ఆయన పొందగలిగేవాడే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • మొదటి రాజుల గ్రంథములోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 45 పేజీ 110-పేజీ 111 పేరా 2
అహీయా యరొబాము ముందు తన అంగీని 12 ముక్కలు చేస్తాడు

లెసన్‌ 45

రాజ్యం విడిపోయింది

సొలొమోను యెహోవాను ఆరాధించినంతకాలం ఇశ్రాయేలు దేశం ప్రశాంతంగా ఉంది. కానీ సొలొమోను చాలామంది వేరే దేశాల స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వాళ్లు విగ్రహాలను ఆరాధించేవాళ్లు. మెల్లమెల్లగా సొలొమోను మారిపోయి విగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టాడు. యెహోవాకు కోపం వచ్చింది. అతను సొలొమోనుతో, ‘ఇశ్రాయేలు నీ కుటుంబం నుండి తీసివేయబడి రెండు భాగాలుగా విడిపోతుంది. అందులో పెద్ద భాగాన్ని నీ సేవకుల్లో ఒకరికి ఇస్తాను, నీ కుటుంబం కొంత భాగాన్ని మాత్రమే పరిపాలిస్తుంది’ అని చెప్పాడు.

యెహోవా తన నిర్ణయాన్ని మరోలా కూడా స్పష్టం చేశాడు. సొలొమోను సేవకుల్లో ఒకరైన యరొబాము ప్రయాణిస్తున్నప్పుడు దారిలో అహీయా ప్రవక్త ఆయనను కలుస్తాడు. అహీయా తన అంగీని 12 ముక్కలు చేసి యరొబాముతో ఇలా చెప్తాడు: ‘యెహోవా ఇశ్రాయేలు దేశాన్ని సొలొమోను కుటుంబం నుండి తీసేసి రెండు భాగాలు చేస్తాడు. ఈ అంగీలో 10 ముక్కలు నువ్వు తీసుకో ఎందుకంటే 10 గోత్రాలకు నువ్వే రాజు అవుతావు.’ రాజైన సొలొమోనుకు ఈ విషయం తెలిసినప్పుడు యరొబామును చంపాలని చూస్తాడు. అందుకే యరొబాము ఐగుప్తుకు పారిపోతాడు. ఈలోగా సొలొమోను చనిపోతాడు, అతని కొడుకు రెహబాము రాజు అవుతాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకు తిరిగి వస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని యరొబాము అనుకుంటాడు.

యరొబాము పెట్టిన బంగారు దూడకు చాలామంది ఇశ్రాయేలీయులు బలులు అర్పించారు

ఇశ్రాయేలు పెద్దలు రెహబాముతో, ‘నువ్వు ప్రజలను బాగా చూసుకుంటే వాళ్లు నీకు నమ్మకంగా ఉంటారు’ అని చెప్పారు. కానీ చిన్నవాళ్లు అయిన రెహబాము తోటి స్నేహితులు, ‘నువ్వు ప్రజలతో కఠినంగా ఉండు! వాళ్లకు ఇంకా కష్టమైన పనులు ఇవ్వు!’ అని చెప్తారు. రెహబాము తన స్నేహితుల మాట వింటాడు. అతను ప్రజలతో కఠినంగా ఉంటాడు. అప్పుడు పది గోత్రాలవాళ్లు ఆయనకు ఎదురు తిరిగి యరొబామును రాజును చేస్తారు. దాన్ని వాళ్లు ఇశ్రాయేలు రాజ్యం అని పిలుస్తారు. మిగతా రెండు గోత్రాలను యూదా రాజ్యం అని పిలుస్తారు, ఆ రెండు గోత్రాలవాళ్లు రెహబాముకు నమ్మకంగా ఉన్నారు. ఇలా ఇశ్రాయేలు 12 గోత్రాలు విడిపోయాయి.

తన ప్రజలు రెహబాము రాజ్యంలో ఉన్న యెరూషలేముకు వెళ్లి ఆరాధించడం యరొబాముకు ఇష్టం లేదు. ఎందుకో మీకు తెలుసా? ప్రజలు యరొబాముకు ఎదురు తిరిగి రెహబాము వైపు వెళ్లిపోతారని అతను భయపడ్డాడు. కాబట్టి ఆయన రెండు బంగారు దూడలు చేసి ప్రజలతో ఇలా చెప్పాడు: ‘యెరూషలేము చాలా దూరంలో ఉంది కాబట్టి మీరు ఇక్కడే ఆరాధించండి.’ ప్రజలు బంగారు దూడలను ఆరాధించడం మొదలుపెట్టి మళ్లీ యెహోవాను మర్చిపోయారు.

“అవిశ్వాసులతో జతకట్టకండి. నీతికి, అవినీతికి పొత్తు ఉంటుందా? . . . విశ్వాసికి, అవిశ్వాసికి పోలిక ఉంటుందా?”—2 కొరింథీయులు 6:14, 15

ప్రశ్నలు: ఇశ్రాయేలు ఎందుకు విడిపోయింది? రాజులైన రెహబాము, యరొబాము ఏ చెడ్డపనులు చేశారు?

1 రాజులు 11:1-13, 26-43; 12:1-33

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి