కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 46 పేజీ 112-పేజీ 113 పేరా 1
  • కర్మెలు పర్వతం మీద పరీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కర్మెలు పర్వతం మీద పరీక్ష
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్వచ్ఛారాధనను సమర్థించిన వ్యక్తి
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • స్వచ్ఛారాధనను సమర్థించిన వ్యక్తి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ఏలీయా సత్య దేవుణ్ణి ఉన్నతపర్చుతాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మీరు ఏలీయావలె నమ్మకంగా ఉంటారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 46 పేజీ 112-పేజీ 113 పేరా 1
యెహోవా నుండి అగ్ని వచ్చి ఏలీయా అర్పణను కాల్చేసింది

లెసన్‌ 46

కర్మెలు కొండ మీద పరీక్ష

ఇశ్రాయేలు పది గోత్రాల రాజ్యాన్ని చాలామంది చెడ్డ రాజులు పరిపాలించారు, వాళ్లలో ఆహాబు బాగా చెడ్డవాడు. ఆయన బయలును ఆరాధించే దుష్ట స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు యెజెబెలు. ఆహాబు, యెజెబెలు బయలు ఆరాధనతో దేశాన్ని నింపేసి యెహోవా ప్రవక్తలను చంపేశారు. యెహోవా ఏమి చేశాడు? ఆయన ప్రవక్త అయిన ఏలీయాతో ఆహాబుకు ఒక సందేశాన్ని పంపించాడు.

నీ చెడుతనం వల్ల ఇశ్రాయేలులో వర్షాలు ఉండవని ఏలీయా రాజైన ఆహాబుతో చెప్పాడు. మూడు సంవత్సరాలు పంటలు పండక ప్రజలు ఆకలితో బాధపడ్డారు. తర్వాత యెహోవా ఏలీయాను మళ్లీ ఆహాబు దగ్గరకు పంపిస్తాడు. అప్పుడు రాజు, ‘నువ్వు ఎప్పుడూ సమస్యలు తీసుకొస్తావు! ఇదంతా నీ తప్పే’ అని అంటాడు. ఏలీయా ‘వర్షం రాకపోవడానికి కారణం నేను కాదు. నువ్వు బయలు ఆరాధన చేయడం వల్లే ఇలా జరిగింది. ఒక పని చేద్దాం. నువ్వు ప్రజలను, బయలు ప్రవక్తలను కర్మెలు కొండ పైకి తీసుకురా’ అని చెబుతాడు.

ప్రజలు కొండ పైకి వచ్చారు. ఏలీయా ఇలా చెప్పాడు: ‘ఈరోజు మీరు ఒక నిర్ణయానికి రండి. యెహోవా నిజమైన దేవుడైతే ఆయనను ఆరాధించండి. బయలు అయితే బయలును ఆరాధించండి. నేను మీ ముందు ఈ సవాలు చేస్తున్నాను. 450 బయలు ప్రవక్తలు అర్పణను సిద్ధం చేసి వాళ్ల దేవుడిని పిలవాలి, నేను నా అర్పణను సిద్ధం చేసి యెహోవాను పిలుస్తాను. అగ్ని ద్వారా ఏ దేవుడు సమాధానం ఇస్తాడో అతనే నిజమైన దేవుడు.’ ప్రజలు దానికి ఒప్పుకున్నారు.

బయలు ప్రవక్తలు అర్పణను సిద్ధం చేశారు. రోజంతా వాళ్ల దేవుడిని ఇలా పిలిచారు: ‘ఓ బయలా! సమాధానం ఇవ్వు!’ బయలు వాళ్లకు సమాధానం ఇవ్వనప్పుడు, ఏలీయా బయలును ఎగతాళి చేస్తాడు. ఆయన ఇలా అంటాడు: ‘మీరు పిలవగలిగినంత గట్టిగా పిలవండి. ఆయన నిద్రపోతున్నాడేమో, ఎవరైన ఆయనిని నిద్ర లేపాలేమో.’ సాయంత్రం అయిపోయింది, బయలు ప్రవక్తలు ఇంకా పిలుస్తూ ఉన్నారు. కానీ వాళ్లకు ఏ సమాధానం రాలేదు.

ఏలీయా తన అర్పణను బలిపీఠం మీద పెట్టి, దానిమీదంతా నీళ్లు పోశాడు. తర్వాత ఇలా ప్రార్థన చేశాడు: ‘ఓ యెహోవా, ఈ ప్రజలు నువ్వే నిజమైన దేవుడని తెలుసుకునేలా చెయ్యి.’ వెంటనే, యెహోవా ఆకాశం నుండి అగ్నిని పంపించి ఆ అర్పణను కాల్చేస్తాడు. ప్రజలు ఇలా అరుస్తారు: ‘యెహోవాయే నిజమైన దేవుడు!’ ఏలీయా ఇలా చెప్తాడు: ‘బయలు ప్రవక్తల్లో ఒక్కర్ని కూడా తప్పించుకోనివ్వకండి!’ ఆ రోజు 450 బయలు ప్రవక్తలను చంపేశారు.

ఒక చిన్న మేఘం సముద్రం మీద కనిపించినప్పుడు ఏలీయా ఆహాబుతో ఇలా చెప్పాడు: ‘గాలివాన రాబోతుంది. నీ రథాన్ని సిద్ధం చేసుకుని ఇంటికి వెళ్లు.’ ఆకాశం మేఘాల వల్ల నల్లగా మారింది, గాలి వీస్తుంది, పెద్ద వర్షం కురవడం మొదలైంది. చివరికి, కరువు ఆగిపోయింది. ఆహాబు చాలా వేగంగా రథాన్ని నడిపాడు. కానీ యెహోవా సహాయంతో ఏలీయా రథం కన్నా ముందు పరిగెత్తాడు! అయితే ఏలీయా సమస్యలన్నీ అక్కడితో ఆగిపోయాయా? చూద్దాం.

“యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే భూమంతటి పైన మహోన్నతుడివని ప్రజలు తెలుసుకోవాలి.”—కీర్తన 83:18

ప్రశ్నలు: కర్మెలు పర్వతం మీద ఏ పరీక్ష జరిగింది? ఏలీయా ప్రార్థనకు యెహోవా ఎలా జవాబు ఇచ్చాడు?

1 రాజులు 16:29-33; 17:1; 18:1, 2, 17-46; యాకోబు 5:16-18

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి