3వ భాగం
దేవుణ్ణి సంతోషపెట్టేలా ప్రవర్తించండి, వ్యవహరించండి
‘యెహోవా మిమ్మల్ని ఏమి అడుగుతున్నాడు?’ ఈ ప్రశ్నకు మీ జవాబు ఏమిటి? (మీకా 6:8) ఈ విషయంలో ఆ 12 పుస్తకాలు మీకు ఎంతో అవగాహన కల్పిస్తాయి. మనం మాట్లాడే ప్రతీ మాటలో నిజం ఉండడం, మనం హింస జోలికి వెళ్లకుండా ఉండడం ఈ లోకంలో చాలా కష్టమే. కానీ, దాన్ని అధిగమించడానికి ఆ 12 పుస్తకాలు ఎలా సహాయం చేస్తాయో ఈ పుస్తకంలోని 8 నుండి 10 అధ్యాయాల్లో చూస్తాం. కుటుంబ జీవితానికి ఉపయోగపడే సలహాల్ని కూడా చూస్తాం.