కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wt అధ్యా. 20 పేజీలు 175-183
  • యెహోవా దినము కోసం కనిపెట్టుకొని ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా దినము కోసం కనిపెట్టుకొని ఉండండి
  • అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సూచన విషయంలో అప్రమత్తంగా ఉండండి
  • ప్రజలను వేరుచేయడం
  • భవిష్యత్తులో ఏమి జరుగుతుంది?
  • యెహోవా దినాన్ని మనస్సునందుంచుకోండి
    అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
  • మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామా?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • దేవుని సంకల్పం త్వరలో నిజమౌతుంది
    జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?
  • అపొస్తలులు యేసును ఒక సూచన అడిగారు
    యేసే మార్గం, సత్యం, జీవం
మరిన్ని
అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
wt అధ్యా. 20 పేజీలు 175-183

అధ్యాయం ఇరవై

యెహోవా దినము కోసం కనిపెట్టుకొని ఉండండి

1. ప్రస్తుత విధానపు హృదయవేదనల నుండి విడుదల సమీపంగా ఉందని మీరు మొదటిసారిగా తెలుసుకున్నప్పుడు, మీరెలా భావించారు?

మీరు బైబిలు నుండి నేర్చుకున్న మొదటి విషయాల్లో, భూమంతటిని పరదైసుగా మార్చడం యెహోవా సంకల్పమనే విషయం ఒకటి. ఆ నూతనలోకంలో యుద్ధం, నేరం, పేదరికం, అనారోగ్యం, బాధలు, మరణం గతించిపోతాయి. మరణించినవారు సహితం తిరిగి జీవానికి వస్తారు. ఆ ఉత్తరాపేక్షలు ఎంత అద్భుతమైనవో కదా! రాజుగా క్రీస్తు అదృశ్య ప్రత్యక్షత 1914 లో ఆరంభమయ్యింది, అప్పటినుండి మనం ఈ దుష్ట లోకపు అంత్యదినాల్లో ఉన్నామని చూపించే రుజువులు ఆ ఉత్తరాపేక్షలన్నింటి నెరవేర్పు సమీపంలోనే ఉందని నొక్కిచెబుతున్నాయి. ఈ అంత్యదినాల ముగింపులో, యెహోవా ఈ ప్రస్తుత విధానాన్ని నాశనం చేసి వాగ్దాన నూతనలోకాన్ని ప్రవేశపెడతాడు!

2. “యెహోవా దినము” అంటే ఏమిటి?

2 రాబోయే ఆ నాశన కాలాన్ని బైబిలు “యెహోవా దినము” అని పిలుస్తోంది. (2 పేతురు 3:​10, NW) అది సాతాను లోకమంతటిపైకి వచ్చే “యెహోవా ఉగ్రతదినము.” (జెఫన్యా 2:​2, 3) అది “లోకమంతట ఉన్న రాజులు” నాశనం చేయబడే, “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము . . . హెబ్రీభాషలో హార్‌మెగిద్దోను” అని పిలువబడే యుద్ధంతో ముగుస్తుంది. (ప్రకటన 16:​14-16) “యెహోవా దినము” సమీపించిందనే విషయాన్ని మీరు దృఢంగా నమ్ముతున్నట్లు మీ జీవన విధానం ప్రదర్శిస్తోందా?​—⁠జెఫన్యా 1:​14-18 యిర్మీయా 25:​33.

3. (ఎ) యెహోవా దినము ఎప్పుడు వస్తుంది? (బి) యెహోవా ‘ఆ దినమును లేదా ఆ గడియను’ వెల్లడిచేయకపోవడం ప్రయోజనకరమని ఎలా నిరూపించబడింది?

3 యెహోవా నియమిత న్యాయాధిపతిగా యేసుక్రీస్తు సాతాను విధానానికి తీర్పుతీర్చేందుకు వచ్చే ఖచ్చితమైన తేదీ గురించి బైబిలు మనకు చెప్పడం లేదు. “ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు” అని యేసు చెప్పాడు. (మార్కు 13:​32) యెహోవాను నిజంగా ప్రేమించనివారు తమ మనస్సుల్లో ఆయన దినమును వాయిదా వేయడానికి మొగ్గుచూపిస్తూ, లౌకిక విషయాలను వెంబడిస్తారు. అయితే యెహోవాను నిజంగా ప్రేమించేవారు, ఈ దుష్ట విధానాంతము ఎప్పుడు వచ్చినా ఆయనను పూర్ణప్రాణముతో సేవిస్తారు.​—⁠కీర్తన 37: 4; 1 యోహాను 5: 3.

4. హెచ్చరికగా యేసు ఏమని చెప్పాడు?

4 యెహోవాను ప్రేమించేవారిని అప్రమత్తం చేస్తూ యేసు ఇలా అన్నాడు: “జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి, ఆ కాలమెప్పుడువచ్చునో మీకు తెలియదు.” (మార్కు 13:​33-37) మన కాలాల గంభీరతను గ్రహించలేనంతగా తినడం త్రాగడం, “ఐహిక విచారములు” మనలను ముంచెత్తడానికి మనం అనుమతించకూడదని యేసు మనకు ఉద్బోధిస్తున్నాడు.​—⁠లూకా 21:​34-36; మత్తయి 24:​37-42.

5. పేతురు వివరించినట్లుగా, యెహోవా దినము ఏమి తెస్తుంది?

5 పేతురు కూడా అదే విధంగా, “ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడకొరకు” కనిపెట్టుకొని ఉండాలని ఉపదేశిస్తున్నాడు. మానవ ప్రభుత్వాలన్ని అంటే “ఆకాశములు” నాశనం చేయబడతాయి, అదేవిధంగా సాధారణ దుష్ట మానవ సమాజం అంటే “భూమి,” దానితోపాటు దాని “కృత్యములు” అంటే దేవుని నుండి స్వతంత్రంగా ఉండే స్వభావం, అనైతికత, ధనాపేక్షగల జీవన విధానం వంటి ఈ దుష్ట లోకపు యోచనలు, కార్యకలాపాలు కూడా నాశనం చేయబడతాయి. వాటి స్థానంలో “క్రొత్త ఆకాశములు [దేవుని పరలోక రాజ్యం] క్రొత్త భూమి [నూతన భూసమాజం]” స్థాపించబడతాయి, వాటిలో ‘నీతి నివసిస్తుంది.’ (2 పేతురు 3:​10-13) ప్రపంచాన్ని కుదిపివేసే ఈ సంఘటనలు ఊహించని దినములో, ఘడియలో ఆరంభమౌతాయి.​—⁠మత్తయి 24:​44.

సూచన విషయంలో అప్రమత్తంగా ఉండండి

6. (ఎ) తన శిష్యుల ప్రశ్నకు యేసు ఇచ్చిన సమాధానం, యూదా విధానాంతానికి ఎంతమేరకు వర్తిస్తుంది? (బి) యేసు ఇచ్చిన సమాధానంలోని ఏ భాగాలు, 1914 నుండి కనిపించే సంఘటనలపై, వైఖరులపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి?

6 మనం జీవిస్తున్న కాలాల దృష్ట్యా, అంత్యదినాలను అంటే “యుగసమాప్తిని” గుర్తించే సంయుక్త సూచన వివరాలు మనకు బాగా తెలిసివుండాలి. మత్తయి 24:3 లో వ్రాయబడినట్లుగా యేసు తన శిష్యుల ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు, 4 నుండి 22 వచనాల్లో ఆయన వివరించినదానిలో కొంతభాగం సా.శ. 33 నుండి 70 మధ్యకాలంలో యూదా విధానంపై కొద్దిపరిమాణంలో నెరవేరిందని మనసులో ఉంచుకోండి. అయితే ఆ ప్రవచన భారీ నెరవేర్పు, 1914 నుండి ఆరంభమైన క్రీస్తు ‘ప్రత్యక్షత మరియు యుగసమాప్తి’ కాలంలో జరుగుతుంది. సా.శ. 70 నుండి క్రీస్తు ప్రత్యక్షతా కాలం వరకూ జరిగే విషయాల గురించి మత్తయి 24:23-28 తెలియజేస్తోంది. మత్తయి 24:​29-25:​46 లో వర్ణించబడిన సంఘటనలు అంత్యకాలంలో జరుగుతాయి.

7. (ఎ) ప్రస్తుత పరిస్థితులు సూచనను ఎలా నెరవేరుస్తున్నాయో మనం వ్యక్తిగతంగా ఎందుకు గమనించాలి? (బి) ఆ సూచన 1914 నుండి ఎలా నెరవేరుతోందో చూపిస్తూ, ఈ పేరా చివర ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలివ్వండి.

7 ఆ సూచనను నెరవేర్చే సంఘటనలను, వైఖరులను మనం వ్యక్తిగతంగా గమనిస్తుండాలి. వాటిని బైబిలు ప్రవచనంతో కలిపి చూడడం, మనం యెహోవా దినమును కనిపెట్టుకొని ఉండడానికి సహాయం చేస్తుంది. ఆ దినము సమీపించిందని ఇతరులకు హెచ్చరించేటప్పుడు మనం ఒప్పించగలిగేలా ఉండేందుకు కూడా అది మనకు సహాయం చేస్తుంది. (యెషయా 61:​1, 2) ఈ లక్ష్యాలను మనసులో ఉంచుకొని, మత్తయి 24:​7, లూకా 21:​10, 11 లో వ్రాయబడిన ఆ సూచనలోని భాగాలను నొక్కి తెలిపే ఈ క్రింది ప్రశ్నలను మనం సమీక్షిద్దాం.

‘జనముమీదికి జనము, రాజ్యముమీదికి రాజ్యము’ లేచుననే ప్రవచనం 1914తో మొదలుకొని అసాధారణ రీతిలో ఎలా నెరవేరింది? అప్పటి నుండి యుద్ధాల విషయంలో ఏమి జరిగింది?

1918 లో, మొదటి ప్రపంచ యుద్ధంకంటే ఎక్కువ ప్రాణాలను బలిగొన్న తెలుగు ఏది? మానవుడు ఎంతో వైద్య పరిజ్ఞానం సంపాదించినా, ఏ వ్యాధులు ఇప్పటికి లక్షలాదిమంది ప్రాణాలు తీస్తున్నాయి?

గత శతాబ్దంలో ఎంతో వైజ్ఞానిక అభివృద్ధి సాధించబడినప్పటికి, ఆహార కొరతలు భూమిని ఎంతమేరకు ప్రభావితం చేశాయి?

రెండవ తిమోతి 3:​1-5, 13 వచనాలు, ఎప్పుడూ ఉండే జీవన పరిస్థితులను కాదుగాని, మనం అంత్యదినాల ముగింపుకు చేరువయ్యే కొద్దీ చెడు పరిస్థితులు తీవ్రస్థాయికి చేరుకొనే విధానాన్ని వర్ణిస్తున్నాయని మిమ్మల్ని ఏది ఒప్పిస్తోంది?

ప్రజలను వేరుచేయడం

8. (ఎ) మత్తయి 13:​24-30, 36-43 లో వర్ణించబడినవాటిలో ఏ ఇతర విషయాలను యేసు యుగసమాప్తితో జతచేశాడు? (బి) యేసు చెప్పిన ఉపమాన భావమేమిటి?

8 యేసు యుగసమాప్తితో జతచేసిన ఇతర విశేషమైన పరిణామాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి, ‘రాజ్య సంబంధులను’ ‘దుష్టుని సంబంధుల’ నుండి వేరుచేయడం. శత్రువు గురుగులను విత్తిన గోధుమ పొలం గురించి చెప్పిన ఉపమానంలో యేసు దాని గురించి మాట్లాడాడు. ఆయన ఉపమానంలోని “గోధుమలు,” నిజమైన అభిషిక్త క్రైస్తవులను సూచిస్తున్నాయి. క్రైస్తవులమని చెప్పుకుంటూనే అపవాది పరిపాలిస్తున్న ఈ లోకాన్ని అంటిపెట్టుకొని ఉండడంవల్ల ‘దుష్టుని సంబంధులుగా’ నిరూపించుకొన్నవారు “గురుగులు.” వారు “[దేవుని] రాజ్య సంబంధుల” నుండి వేరుచేయబడి, నాశనం చేయబడడానికి గుర్తించబడతారు. (మత్తయి 13:​24-30, 36-43) ఇలా వేరుచేయడం నిజంగా జరిగిందా?

9. (ఎ) మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, క్రైస్తవులమని చెప్పుకొనే వారందరు ఎలా వేరుచేయబడ్డారు? (బి) అభిషిక్త క్రైస్తవులు తాము నిజంగా రాజ్య సేవకులమని ఎలా రుజువుచేసుకున్నారు?

9 మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, క్రైస్తవులమని చెప్పుకొనే వారందరిని రెండు తరగతులుగా వేరుచేయబడడం జరిగింది: (1) తమ దేశ విశ్వాస్యతకే హత్తుకొని ఉంటూ నానాజాతి సమితికి (ఇప్పుడది ఐక్యరాజ్యసమితి) బలమైన మద్దతునిచ్చే క్రైస్తవ మతసామ్రాజ్య మతనాయకులు, వారి అనుచరులు (2) ఆ యుద్ధానంతర కాలంలో జీవించిన నిజ క్రైస్తవులు, వారు ఈ ప్రపంచ దేశాలకు కాదుగాని దేవుని మెస్సీయ రాజ్యానికే తమ సంపూర్ణ మద్దతిచ్చారు. (యోహాను 17:​16) వారు “ఈ రాజ్య సువార్త”ను భూవ్యాప్తంగా ప్రకటించే పని చేపట్టడం ద్వారా తాము దేవుని రాజ్యానికి నిజమైన సేవకులమని నిరూపించుకున్నారు. (మత్తయి 24:​14) దాని ఫలితాలెలా ఉన్నాయి?

10. రాజ్య ప్రకటనా పని మొదటి ఫలితమేమిటి?

10 మొదట, పరలోకరాజ్యంలో భాగంగా క్రీస్తుతో ఉండే నిరీక్షణగల దేవుని ఆత్మాభిషిక్తుల శేషం సమకూర్చబడింది. ఆ కోవకు చెందినవారు వేర్వేరు దేశాల్లో ఉన్నప్పటికి, వారు సంస్థాగతంగా ఐక్యంచేయబడ్డారు. ఆ అభిషిక్తులను ముద్రించడం పూర్తికావస్తోంది.​—⁠ప్రకటన 7: 3, 4.

11. సమకూర్చే ఏ పని కొనసాగుతోంది, ఏ ప్రవచనానికి అనుగుణంగా అది జరుగుతోంది? (బి) ఈ ప్రవచన నెరవేర్పు దేనికి సూచనగా ఉంది?

11 ఆ తర్వాత, క్రీస్తు నడిపింపు క్రింద “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు . . . యొక గొప్పసమూహం” సమకూర్చబడడం ఆరంభమయ్యింది. వారు “మహాశ్రమలు” తప్పించుకొని దేవుని నూతనలోకంలో ప్రవేశించే ‘వేరే గొఱ్ఱెలుగా’ ఉంటారు. (ప్రకటన 7:​9, 14; యోహాను 10:​16) అంతం రావడానికి ముందు దేవుని రాజ్యం గురించి ప్రకటించే ఈ పని ప్రస్తుత కాలం వరకు కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు లక్షల సంఖ్యలోవున్న వేరే గొఱ్ఱెల గొప్ప సమూహం, అత్యావశ్యకమైన రాజ్య సందేశాన్ని ప్రకటించడంలో అభిషిక్త శేషానికి విశ్వసనీయంగా సహాయం చేస్తోంది. ఈ సందేశం అన్ని దేశాల్లోను వినబడుతోంది.

భవిష్యత్తులో ఏమి జరుగుతుంది?

12. యెహోవా దినము రాకముందు ఇంకెంత ప్రకటనా పని జరగాలి?

12 పైన ప్రస్తావించబడినవన్ని మనం అంత్యదినాల ముగింపుకు చేరువలో ఉన్నామని, యెహోవా దినము సమీపించిందని సూచిస్తున్నాయి. కాని భయంకరమైన ఆ మహాదినము ఆరంభమవడానికి ముందు ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒకటేమిటంటే, రాజ్య వివాదానికి సంబంధించి ప్రజలను వేరుచేయడం ఇంకా పూర్తికాలేదు. అనేక సంవత్సరాలుగా తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్న కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు కొత్త శిష్యులు అధికమవుతున్నారు. సువార్తను ప్రజలు తిరస్కరించే ప్రాంతాల్లో సహితం, మనం సాక్ష్యమివ్వడం ద్వారా యెహోవా కనికరము ప్రదర్శించబడుతోంది. కాబట్టి మన సేవ కొనసాగాలి! ఆ పని పూర్తవగానే అంతము వస్తుందని యేసు మనకు హామీ ఇస్తున్నాడు.

13. మొదటి థెస్సలొనీకయులు 5:2, 3 లో వ్రాయబడినట్లు, గమనార్హమైన ఏ సంఘటన ఇంకా జరగాలి, మనకు దాని భావమేమై ఉంటుంది?

13 అత్యంత ప్రాముఖ్యమైన మరో బైబిలు ప్రవచనమిలా చెబుతోంది: “లోకులు​—⁠నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.” (1 థెస్సలొనీకయులు 5:​2, 3) “నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదు” అనే ప్రకటన ఎలా జరుగుతుందో వేచి చూడాల్సిందే. అయితే ప్రపంచ నాయకులు మానవజాతి సమస్యలను నిజంగా పరిష్కరించారని మాత్రం దానర్థం కాదు. యెహోవా దినము కోసం కనిపెట్టుకొని ఉండేవారు ఆ ప్రకటనచేత మోసగించబడరు. ఆ వెంటనే ఆకస్మిక నాశనం వస్తుందని వారికి తెలుసు.

14. మహాశ్రమలప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఏ క్రమంలో జరుగుతాయి?

14 మహాశ్రమల ఆరంభంలో పరిపాలకులు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోనుకు వ్యతిరేకంగా తిరిగి దానిని నాశనం చేస్తారు. (మత్తయి 24:​21; ప్రకటన 17:​15, 16) ఆ తర్వాత, జనాంగాలు యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించే వారికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు, రాజకీయ ప్రభుత్వాలపై, వారి మద్దతుదార్లపై యెహోవా కోపం రగులుకుంటుంది, తత్ఫలితంగా వారందరు సర్వనాశనం చేయబడతారు. ఆ విధంగా మహాశ్రమలు అర్మగిద్దోనుతో ముగుస్తాయి. ఆ తర్వాత సాతాను అతని దయ్యాలు మానవులపై ఇక ప్రభావం చూపడానికి వీల్లేకుండా అగాధంలో బంధించబడతారు. అప్పుడు యెహోవా నామం సర్వోన్నత స్థానంలో ఉంచబడడంతో ఆయన దినము ముగింపుకొస్తుంది.​—⁠యెహెజ్కేలు 38:​18, 22, 23; ప్రకటన 19:​11-20: 3.

15. యెహోవా దినము ఇంకా చాలా దూరంలో ఉందని తర్కించడం ఎందుకు అవివేకం?

15 దేవుని కాలపట్టిక ప్రకారం, ఈ విధానాంతం సరైన సమయానికే జరుగుతుంది. అది ఆలస్యంగా జరగదు. (హబక్కూకు 2: 3) యెరూషలేము నాశనం సా.శ. 70 లో యూదులు అనుకోని సమయంలో ఆ ప్రమాదం దాటిపోయిందని వారు భావించినప్పుడు, అకస్మాత్తుగా వచ్చిందని గుర్తుంచుకోండి. మరి ప్రాచీన బబులోను విషయమేమిటి? అదెంతో శక్తివంతమైన, నిబ్బరమైన, దుర్భేద్యమైన గొప్ప ప్రాకారాలుగలది. కాని ఒక్కరాత్రిలోనే అది కూలిపోయింది. అదే ప్రకారంగా, ప్రస్తుత దుష్ట విధానం ఆకస్మికంగా నాశనమౌతుంది. దాని నాశనం వచ్చినప్పుడు, మనం యెహోవా దినము కోసం కనిపెట్టుకొని ఉన్నవారిగా సత్యారాధనలో ఐక్యమై ఉందుము గాక.

పునఃసమీక్షా చర్చ

• యెహోవా దినము కోసం కనిపెట్టుకొని ఉండడం ఎందుకు అత్యావశ్యకము? దానిని మనమెలా చేయవచ్చు?

• ప్రస్తుతం జరుగుతున్న ప్రజలను వేరుచేసే పనివల్ల వ్యక్తిగతంగా మనమెలా ప్రభావితమయ్యాము?

• యెహోవా దినారంభానికి ముందు ఇంకా ఏమిజరగాలి? కాబట్టి వ్యక్తిగతంగా మనమేమి చేస్తుండాలి?

[180, 181వ పేజీలోని చిత్రాలు]

సాతాను విధాన నాశనంతో త్వరలోనే అంత్యదినాలు ముగుస్తాయి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి