కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • be అధ్యాయం 7 పేజీ 105-పేజీ 106 పేరా 2
  • ప్రధాన తలంపులను నొక్కిచెప్పడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రధాన తలంపులను నొక్కిచెప్పడం
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • భావాన్ని సరిగ్గా నొక్కిచెప్పడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ముఖ్యాంశాలను ప్రత్యేకంగా గుర్తించబడేలా చెప్పడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • సంఘంలో ప్రసంగాలివ్వడానికి సిద్ధపడడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • లేఖనాలను సరిగ్గా నొక్కిపలుకుతూ చదవడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
మరిన్ని
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
be అధ్యాయం 7 పేజీ 105-పేజీ 106 పేరా 2

7

ప్రధాన తలంపులను నొక్కిచెప్పడం

మీరు ఏమి చెయ్యాలి?

బిగ్గరగా చదివేటప్పుడు ఒక్కో వాక్యంలోని ప్రధాన తలంపులనే కాక, మీరు చదువుతున్న సమాచారమంతటిలోని ప్రధాన తలంపులను ప్రత్యేకంగా నొక్కిచెప్పండి.

ఎందుకు ప్రాముఖ్యం?

ప్రధాన తలంపులను నొక్కిచెబితే మీరు తెలియజేసే సందేశాన్ని గుర్తుంచుకోవడం శ్రోతలకు మరింత సులభమవుతుంది.

ప్రతిభావంతుడైన పాఠకుడు, చదివేటప్పుడు కేవలం ఒక్కో వాక్యాన్నే కాక దాన్ని మించి చూస్తాడు, ఆ వాక్యం ఉన్న పేరాను కూడా మించి చూస్తాడు. ఆయన చదివేటప్పుడు అందించబోతున్న సమాచారమంతటిలో ఉన్న ప్రధాన తలంపులు ఆయన మనస్సులో ఉంటాయి. వాటిని బట్టే ఆయన పదాలను నొక్కిపలుకుతాడు.

ఈ పద్ధతిని పాటించకపోతే మీ పఠనంలో గానీ ప్రసంగంలో గానీ విశిష్టమైన అంశాలున్నట్లు అనిపించదు. ఏ అంశమూ అంత స్పష్టంగా ప్రత్యేకంగా గుర్తించబడదు. పఠనం గానీ ప్రసంగం గానీ పూర్తయినప్పుడు, గమనించదగిన అంశమేదో గుర్తుచేసుకోవడం కష్టమవుతుంది.

ప్రధాన తలంపులను నొక్కిపలకడానికి సరైన శ్రద్ధనిస్తే, బైబిలు వృత్తాంతపు పఠనం తరచూ ఎంతో సమర్థంగా ఉంటుంది. గృహ బైబిలు అధ్యయనంలో గానీ సంఘ కూటంలో గానీ పేరాలను చదువుతున్నప్పుడు ఆ విధంగా నొక్కిపలికితే చదవడం మరింత అర్థవంతంగా ఉంటుంది. ప్రత్యేకించి మన సమావేశాల్లో కొన్నిసార్లు వ్రాతప్రతి ప్రసంగాలు ఇవ్వబడతాయి, అలా వ్రాతప్రతి నుండి ప్రసంగమిస్తున్నప్పుడు నొక్కిచెప్పడం చాలా ముఖ్యం.

ఎలా నొక్కి పలకవచ్చు? బైబిలులోని ఒక భాగాన్ని చదవడానికి మీరు పాఠశాలలో నియమించబడివుండవచ్చు. ఆ భాగాన్ని చదివేటప్పుడు దేనిని నొక్కిపలకాలి? ఆ భాగంలో ప్రధాన తలంపు గానీ ముఖ్య సంఘటన గానీ కేంద్రంగా తీసుకోబడి విపులీకరించబడినట్లయితే, ఆ తలంపు లేదా సంఘటన ప్రత్యేకంగా గుర్తించబడేలా చదవండి.

మీరు చదవవలసిన భాగం పద్యభాగమైనా గద్యభాగమైనా సామెతలైనా కథావృత్తాంతమైనా ఏదైనా సరే, మీరు సరిగ్గా చదివితే మీ ప్రేక్షకులు ప్రయోజనం పొందుతారు. (2 తిమో. 3:16,17) ఆ విధంగా చదవాలంటే మీరు చదవనున్న భాగాన్నీ మీ ప్రేక్షకులనూ పరిగణలోకి తీసుకోవాలి.

మీరు బైబిలు అధ్యయనంలో గానీ సంఘ కూటంలో గానీ ఒక ప్రచురణ నుండి బిగ్గరగా చదవాలంటే, మీరు నొక్కిచెప్పవలసిన ప్రధాన తలంపులు ఏవి? అధ్యయనంలోని ముద్రిత ప్రశ్నల జవాబులను ప్రధాన తలంపులుగా ఎంచండి. అలాగే ముద్దక్షరాల్లో ఉన్న ఉపశీర్షిక క్రిందవున్న సమాచారాన్ని చదివేటప్పుడు ఆ ఉపశీర్షికతో సంబంధమున్న ఆలోచనలను కూడా నొక్కిచెప్పండి.

సంఘంలో ఇచ్చే ప్రసంగాలకు వ్రాతప్రతులను ఉపయోగించే అలవాటును సిఫారసు చేయడం లేదు. అయితే, సమావేశాలు జరిగే అన్నిచోట్లా ఒకే సమాచారం అందించబడేందుకుగాను సమావేశపు ప్రసంగాల్లో కొన్నింటికి వ్రాతప్రతులు ఇవ్వబడతాయి. అలాంటి వ్రాతప్రతిలోని ప్రధాన తలంపులను నొక్కిచెప్పేందుకు ప్రసంగీకుడు మొదట ఆ సమాచారాన్ని జాగ్రత్తగా విశ్లేషించాలి. ఏవి ముఖ్యాంశాలన్నది ఆయన గుర్తించగలగాలి. ఆయనకు ఆసక్తికరంగా అనిపించినవే ముఖ్యాంశాలు కావు. సమాచారమంతా వేటిని కేంద్రంగా చేసుకొని విపులీకరించబడిందో ఆ కీలకమైన ఆలోచనలే ముఖ్యాంశాలు. కొన్నిసార్లు, వ్రాతప్రతిలోని ప్రధాన తలంపుకు సంబంధించిన క్లుప్తమైన వ్యాఖ్య ఒక కథనాన్ని గానీ, ఒక తర్కసరళిని గానీ ప్రవేశపెడుతుంది. చెబుతున్న విషయాన్ని బలపరిచే రుజువును ఇచ్చిన తర్వాత, శక్తివంతమైన వ్యాఖ్య తరచూ కనిపిస్తుంటుంది. ప్రసంగీకుడు వ్రాతప్రతిలో ఆ కీలకాంశాలను గుర్తించిన తర్వాత, వాటికి అక్కడే ఏదైనా గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా కీలకాంశాలు కొన్నే ఉంటాయి, నాలుగైదు కన్నా ఎక్కువగా ఉండకపోవచ్చు. తర్వాత, ప్రేక్షకులు వాటిని సులభంగా గుర్తించేలా చదవడానికి అభ్యసించడం అవసరం. అవి ప్రసంగంలోని విశిష్టమైన అంశాలు. సమాచారాన్ని సరైనవిధంగా నొక్కిచెబితే, ఆ ప్రధాన తలంపులను గుర్తుంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ప్రసంగీకుని లక్ష్యంగా ఉండాలి.

ముఖ్యాంశాలను గుర్తించగలిగేలా ప్రేక్షకులకు సహాయపడేందుకూ ప్రసంగీకుడు వాటి ప్రాముఖ్యతను నొక్కి చెప్పేందుకూ వేర్వేరు మార్గాలున్నాయి. ఆయన ఉపయోగించగల మార్గాల్లో మరింత ఉత్సాహాన్నీ ప్రగాఢమైన భావానుభూతినీ వ్యక్తం చేయడం, మాట్లాడే వేగాన్ని తగ్గించడం, సముచితమైన సంజ్ఞలను చేయడం వంటివి మచ్చుకు కొన్ని మాత్రమే.

మనస్సులో ఉంచుకోవలసిన విషయాలు

  • కేంద్రంగా తీసుకొని విపులీకరించబడిన ప్రధాన తలంపులు ఏవో గుర్తించేందుకు సమాచారాన్ని విశ్లేషించండి. వాటికి ఏదైనా గుర్తుపెట్టుకోండి.

  • బిగ్గరగా చదివేటప్పుడు ముఖ్యాంశాలు ప్రత్యేకంగా గుర్తించబడేందుకుగాను మరింత ఉత్సాహాన్ని చూపించండి, వేగాన్ని తగ్గించండి, లేదా సముచితమైన చోట్ల ప్రగాఢమైన భావానుభూతిని స్వరంలో పలికించండి.

అభ్యాసం: అధ్యయనం కోసం కేటాయించబడిన కావలికోట ఆర్టికల్‌లోని ఐదు పేరాలను ఎంపిక చేసుకోండి. ఆ పేరాలకు ఇవ్వబడిన అధ్యయన ప్రశ్నలకు జవాబులైన వాటికి ఏదైనా గుర్తుపెట్టుకోండి. జవాబును గ్రహించడం శ్రోతలకు సులభమయ్యేలా పేరాలను బిగ్గరగా చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి