ఒత్తిడి నుండి బయటపడండి
ఒత్తిడికి కారణాలు
“చాలామంది తాము ఎక్కువ ఒత్తిడికి గురౌతున్నామని చెప్తున్నారు. నేడు జీవితంలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి, అనుకోని సంఘటనలు ఎక్కువైపోతున్నాయి” అని పేరుగాంచిన మేయో క్లినిక్ చెప్తుంది. మనల్ని ఒత్తిడికి గురిచేస్తున్న అలాంటి కొన్ని విషయాల్ని గమనించండి:
విడాకులు
ఇష్టమైనవాళ్లు చనిపోవడం
తీవ్ర అనారోగ్యం
పెద్దపెద్ద యాక్సిడెంట్లు
నేరం
ఉరుకులు పరుగుల జీవితం
ప్రకృతి విపత్తులు లేదా మనుషుల వల్ల కలిగే విపత్తులు
స్కూల్లో లేదా ఉద్యోగస్థలంలో ఉండే టెన్షన్లు
ఉద్యోగం, డబ్బు గురించి ఆందోళన