కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g20 No. 1 పేజీ 4
  • ఒత్తిడికి కారణాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒత్తిడికి కారణాలు
  • తేజరిల్లు!—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రయోజనకరమైన ఒత్తిడి, హానికరమైన ఒత్తిడి
    తేజరిల్లు!—1998
  • ఒత్తిడి అంటే ఏంటి?
    తేజరిల్లు!—2020
  • మీరు ఒత్తిడికి గురౌతున్నారా?
    తేజరిల్లు!—2020
  • విషయసూచిక
    తేజరిల్లు!—2020
మరిన్ని
తేజరిల్లు!—2020
g20 No. 1 పేజీ 4

ఒత్తిడి నుండి బయటపడండి

ఒత్తిడికి కారణాలు

“చాలామంది తాము ఎక్కువ ఒత్తిడికి గురౌతున్నామని చెప్తున్నారు. నేడు జీవితంలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి, అనుకోని సంఘటనలు ఎక్కువైపోతున్నాయి” అని పేరుగాంచిన మేయో క్లినిక్‌ చెప్తుంది. మనల్ని ఒత్తిడికి గురిచేస్తున్న అలాంటి కొన్ని విషయాల్ని గమనించండి:

  • విడాకులు

  • ఇష్టమైనవాళ్లు చనిపోవడం

  • తీవ్ర అనారోగ్యం

  • పెద్దపెద్ద యాక్సిడెంట్లు

  • నేరం

  • ఉరుకులు పరుగుల జీవితం

  • ప్రకృతి విపత్తులు లేదా మనుషుల వల్ల కలిగే విపత్తులు

  • స్కూల్లో లేదా ఉద్యోగస్థలంలో ఉండే టెన్షన్‌లు

  • ఉద్యోగం, డబ్బు గురించి ఆందోళన

ఉద్యోగం పోవడం

“ఉద్యోగం పోతే పరిస్థితి చాలా ఘోరంగా ఉండొచ్చు. అనారోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆందోళన, డిప్రెషన్‌ వంటి సమస్యలు రావచ్చు, ఆఖరికి ఆత్మహత్యకు కూడా పాల్పడవచ్చు. ఉద్యోగం పోవడం జీవితంలో ప్రతీ విషయంపై ప్రభావం చూపిస్తుంది” అని అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌ చెప్తుంది.

చిన్నవయసులో కలిగే ఒత్తిడి

పిల్లలు ఒత్తిడివల్ల బాధపడడం సహజమే. కొంతమందిని స్కూల్లో బాగా ఏడ్పిస్తారు, ఇంకొంతమందిని ఇంట్లో పట్టించుకోరు. మరికొందరినైతే శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధిస్తారు. చాలామంది పిల్లలు పరీక్షల గురించి, మార్కుల గురించి ఆందోళన పడుతుంటారు. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం వల్ల తమ కుటుంబం విచ్ఛిన్నమవ్వడం కూడా కొంతమంది పిల్లలు చూసి ఉంటారు. ఒత్తిడికి గురైన పిల్లలకు పీడకలలు రావచ్చు, దేన్నైనా నేర్చుకోవడం కష్టం కావచ్చు, వాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లవచ్చు, లేదా నలుగురిలో కలవడానికి వెనకాడవచ్చు. కొంతమంది తమ భావోద్వేగాలను (ఫీలింగ్స్‌ని) అదుపు చేసుకోలేకపోవచ్చు. ఒత్తిడితో బాధపడుతున్న పిల్లలకు వెంటనే సహాయం అవసరం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి