కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 12/8 పేజీలు 24-25
  • క్షుద్రవిద్య వెనుక ఉన్నదేమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్షుద్రవిద్య వెనుక ఉన్నదేమిటి?
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తీరని అవసరాలు
  • నిజమైన ఆధ్యాత్మికత—ఎక్కడినుండి?
  • మంత్రవిద్య గురించి మీకేమి తెలుసు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • మంత్రవిద్య గురించి మీకేమి తెలిసి ఉండాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • మ్యాజిక్‌, మంత్రాలు, క్షుద్రవిద్య గురించిన సత్యం
    శాశ్వత జీవితానికి నడిపించే దారి—మీరు దాన్ని కనుగొన్నారా?
  • దయ్యాలు నిజంగానే ఉన్నాయా?
    తేజరిల్లు!—1998
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 12/8 పేజీలు 24-25

బైబిలు ఉద్దేశము

క్షుద్రవిద్య వెనుక ఉన్నదేమిటి?

“మంత్రగత్తెలు.” ఈ మాట విన్నప్పుడు మీ మనస్సులోకి ఏమి వస్తుంది? శాపాలు పెడ్తున్న వికారమైన ఆకారంలోని వృద్ధ స్త్రీలు లేదా సాతానుతో మంతనాలు జరుపుతున్న నీతిబాహ్యమైన స్త్రీలు కొందరి మనస్సుల్లోకి వస్తారు. దీనికి భిన్నంగా చాలామంది ఆధునిక మంత్రగత్తెలమని చెప్పుకునేవారు సామాన్య ప్రజల్లానే కన్పిస్తారు. కొందరైతే న్యాయవాదులు, టీచర్లు, రచయితలు, నర్సులు వంటి గౌరవనీయమైన వృత్తుల్లో కూడా ఉన్నారు. అతీంద్రియ శక్తుల పరిధిలోకి వచ్చే ప్రకృతి మతాలు, నియోపేగనిజమ్‌ వంటి మతపరమైన కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ పెరిగాయి.a “ఈ రోజుల్లో రష్యాలో ఎక్కడికి వెళ్ళినా క్షుద్రవిద్య సామాన్య విషయంగా కన్పిస్తుంది” అని ఆ దేశంలోని ఒక పోలీసు అధికారి చెబుతున్నాడు. అమెరికాలో 50,000 నుండి 3,00,000 మంది మంత్రగత్తెలు లేదా “విక్కాన్లు”b అని కొందరు తమను తాము పిలుచుకునేవారు ఉన్నారని అంచనా.

సేడు “మంత్రగత్తె” అన్న మాట చాలా సామాన్యార్థంలో ఉపయోగించబడుతుంది, దీనికి ఒకొక్కరి మనస్సులో ఒక్కొక్క అర్థం వస్తుంది. ఆధునిక కాలంలో క్షుద్రవిద్యలో పెరుగుదల, మానసిక శక్తుల్లో గట్టి నమ్మకం ఉన్న దేవతల ఆరాధన, ప్రకృతి ఆరాధన ఉన్న మతాలకు సంబంధించినదనిపిస్తుంది. కొందరు మంత్రగత్తెలు ఒంటరివారు—వారు తమ ఆచారకర్మలను ఒంటరిగానే పాటిస్తారు, ఋతువుల మార్పులను, చంద్రునిలో మార్పులను, ప్రకృతిలో జరిగే మరితర సంఘటనలను గమనిస్తూ కొన్ని ఆచారాల్ని పాటిస్తుంటారు. ఇతరులు కవెన్‌ అని పిలువబడే, సాధారణంగా 13 మంది మంత్రగత్తెలున్న గుంపులో భాగంగా ఆరాధన జరుపుకుంటూ శాపాల్ని పెడుతుంటారు.

మధ్య యుగాల్లో మంత్రగత్తెలను సజీవంగా కాల్చేసిన ప్రజలున్న పాశ్చాత్య దేశాల్లో నేడు అదే క్షుద్రవిద్యపట్ల పూర్తి భిన్నంగా ప్రతిస్పందిస్తున్నారన్నది నిజమే. అయితే, అక్కడక్కడ మంత్రగత్తెలపై విరుచుకుపడుతూ హింసాత్మక చర్యల్ని చేపట్టడం కూడా జరుగుతుంది. ఉదాహరణకు, 1998 అక్టోబరులో ఇండోనేషియాలో మంత్రగత్తెలని అనుమానించబడిన 150కిపైగా స్త్రీలను కొన్ని గ్యాంగులు వేటకత్తులతో వేటాడి చంపేశాయి. దక్షిణ ఆఫ్రికాలో 1990 నుండి 1998 మధ్యకాలంలో మంత్రగత్తెలపై 2,000 కంటే ఎక్కువ హింసాత్మక దాడులు జరిగినట్లు, వాటిలో 577 మంది చనిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. క్షుద్రవిద్యలో విపరీతమైన ఆసక్తి చూపించే వ్యక్తులు, మరోవైపు దానిపట్ల ద్వేషాన్ని వెళ్ళగక్కే వ్యక్తులు ఉన్నారు గనుక, క్రైస్తవులు ఈ విషయాన్ని ఎలా దృష్టించాలి?

తీరని అవసరాలు

కొందరు ఈ ఆధునిక కాలంలో క్షుద్రవిద్యను అభ్యసించటానికి ఏమి పురికొల్పుతోంది? వారు చెప్పుకునే ఒక కారణం ఏమిటంటే ప్రకృతి పట్లా జీవం పట్లా భక్తి. నిజానికి తమ ఆరాధనలో జంతువుల్ని బలివ్వటం ఉండదని కొందరు ఉత్సాహంగా వివరించటానికి ప్రయత్నిస్తారు. మరితరులు క్షుద్రవిద్యను పైపైన ఆచరించటానికి కారణం, తాము తమ బాహాటత్వాన్ని, నమ్మకాన్ని, ఉమ్మడి ఆధ్యాత్మిక అవసరాల్ని తీర్చుకునేందుకు అలాంటి ఇతర ప్రజల్ని వెదకటం కోసమేనని చెబుతారు. “ఈ ఉద్యమంలో నాకు తెలిసిన ప్రతి ఒక్కరు ఎంతో స్నేహపూర్వకంగా దాపరికం లేనివారిగా ఉన్నారు . . . ఎంతో అద్భుతమైన ప్రజలు” అని ఒక ఆధునిక మంత్రగత్తె చెబుతుంది. చాలామంది తమకు సాతానుతో సంబంధం లేదని చెప్పుకుంటారు, తమ మత వ్యవస్థలో దుష్టశక్తులు లేవని నొక్కి చెప్తారు.

మంత్రగత్తెలుగా మారటానికి వారిలో అత్యధికమంది చెప్పే ప్రధాన కారణం ఏమిటంటే అనేక పెద్ద మతాల్లో కన్పించే ఆధ్యాత్మిక శూన్యత, వాటిలో అకర్షణశక్తి లేకపోవడం. తమ కవెన్‌ను గురించి విక్కన్ల ప్రధాన పూజారిణి అయిన ఫిలిస్‌ కూరోట్‌ ఇలా చెబుతుంది: “మేమందరము పెరిగిన మతాల్లోని బోధలు ఆచారాలు మాకు సంతృప్తిని తేలేదు.” ‘పవిత్రతను మనమెలా తిరిగి కనుగొనగలము?’ వంటి ప్రశ్నలకు ఆధునిక మంత్రగత్తెలు జవాబుల్నివ్వటానికి ప్రయత్నిస్తారని కూరోట్‌ వివరిస్తుంది. కానీ క్షుద్రవిద్య నిజమైన ఆధ్యాత్మికతకు దారితీస్తుందా?

నిజమైన ఆధ్యాత్మికత—ఎక్కడినుండి?

యెహోవాయే సత్య దేవుడనీ ఆయన మాత్రమే విశ్వ సర్వాధిపతి అని బైబిలు స్పష్టంగా చూపిస్తుంది. (కీర్తన 73:28; 1 పేతురు 1:14; ప్రకటన 4:10, 11) ప్రజలందరు తనను వెదకి ‘కనుగొనాలని’ ఆయన అందరినీ ఆహ్వానిస్తున్నాడు. (అపొస్తలుల కార్యములు 17:26-27) అందుకని, నిజమైన ఆధ్యాత్మికత సత్య దేవుడైన యెహోవాను గురించిన కచ్చితమైన జ్ఞానాన్ని పొందటం ద్వారానే లభ్యం కాగలదు. దీన్ని ఆయన వాక్యమైన పరిశుద్ధ బైబిలును అధ్యయనం చేయటం ద్వారా సాధించవచ్చు. “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అని బైబిలు రచయిత అయిన యాకోబు మనకు హామీ ఇస్తున్నాడు.—యాకోబు 4:8.

అయితే, దేవుని వాక్యం దుష్ట ఆధ్యాత్మికతకు హానికరమైన మూలాన్ని గురించి హెచ్చరిస్తుంది. (1 యోహాను 4:1) అది యెహోవాకు బద్ధవిరోధి అయిన అపవాదియైన సాతాను, వాని తోడి దయ్యాలు నేడు విస్తరించివున్న, వక్రమార్గం పట్టిన ఆధ్యాత్మికతకు మూలం అని చెబుతుంది.c బైబిలు ప్రకారం, సాతాను అనేకుల “మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.” నిజానికి వాడు, వారు ఒప్పుకున్నా లేకపోయినా క్షుద్రవిద్యల్లో పాల్గొనే వారితో సహా, “సర్వలోకమును మోసపుచ్చుచు” ఉన్నాడు. ఎందుకిలా?—2 కొరింథీయులు 4:4; ప్రకటన 12:9.

ఆధునిక క్షుద్రవిద్యల్లో చాలా అభ్యాసాలు, ఆచారాలకు సాతానువాదంలోని కొన్ని అంశాలకు దగ్గరి పోలికలున్నాయి. అందుకని, కేవలం ఆసక్తి మాత్రమే చూపించటం కూడా సులభంగా అతీంద్రియ శక్తుల్లో పాల్గొనడానికి దారితీయగలదు. నిజంగానే అనేకమంది ఈ విధంగా సాతాను దుష్ట ప్రభావానికి బలయ్యారు.

ఆధునిక క్షుద్రవిద్యను అభ్యసించేవారు అధికార దాహం మూలంగా, కక్ష తీర్చుకోవాలన్న కోరిక మూలంగా దానిపట్ల ఆకర్షితులౌతారన్న వాస్తవాన్ని ఉపేక్షించకూడదు. “తాము మంత్రగత్తెలమని చెప్పుకుంటూ ఆ మాటను దుష్ట ఉద్దేశాల్ని నెరవేర్చుకోవటానికి ఉపయోగించుకునే వారున్నారు” అని ఆధునిక మంత్రగత్తె అయిన జెన్నిఫర్‌ చెబుతుంది. ఏదేమైనా, అటు సాధుస్వభావులైన మంత్రగత్తెలు ఇటు కక్షపూరితమైన మంత్రగత్తెలు పూర్తిగా సాతానూ వాని దయ్యాల ఆధీనంలోనికి వచ్చే ప్రమాదంలో ఉన్నారు. కొందరు మంత్రగత్తెలు దుష్టులైన ఆత్మ ప్రాణుల ఉనికిని ఖండిస్తుండవచ్చు, కానీ దీని మూలంగా వారు దయ్యాల మోసాలకు మరింత సులభంగా బలౌతారు.—పోల్చండి 1 కొరింథీయులు 10:20, 21.

అభిచారము, తాంత్రికవిద్య, మంత్రతంత్రాలు అభ్యసించటం, శాపాలు పెట్టటం, మృతులతో సంభాషించటానికి ప్రయత్నించటం వంటివాటిని బైబిలు ఖండిస్తుంది. అది ఇలా స్పష్టంగా చెబుతుంది: “వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు.” (ద్వితీయోపదేశకాండము 18:10-12) నిజమే, క్రైస్తవులు ‘అందరియెడల మేలు చేయాలని’ కృత నిశ్చయం చేసుకుని ఉన్నారు, వారు అన్ని రకాల ప్రేతాత్మ సంబంధిత ఆచారాల నుండి సంబంధాల్ని తెంచుకోవటానికి తమ పరిచర్యలో అనేకమందికి సహాయపడ్డారు. (గలతీయులు 6:10; అపొస్తలుల కార్యములు 16:14-18) ఏదేమైనా, నిజ క్రైస్తవులు క్షుద్రవిద్యతోపాటు, అబద్ధారాధనతో ఎటువంటి సంబంధాల్నైనా విసర్జిస్తారు.—2 కొరింథీయులు 6:15-18.

[అధస్సూచీలు]

a “ప్రకృతి మతం” అనే మాట, ఈ భూమి, జీవచరాలు అన్నీ దైవంలో భాగమనే, అన్నింటికీ ఒకే జీవశక్తి ఉన్నదనే నమ్మకాన్ని సూచిస్తుంది; “నియోపేగనిజమ్‌” క్రైస్తవ పూర్వమున్న అన్య దేవతల ఆరాధనకు ఇవ్వబడిన పేరు.

b విక్కాన్లు అనేవారు విక్కా అనుచరులు. “ఇది పాశ్చాత్య యూరప్‌లోని క్రైస్తవపూర్వ చరిత్రలో వేళ్ళూనుకొని ఉన్న అన్య ప్రకృతి మతం” అని ద అమెరికన్‌ హెరిటేజ్‌ కాలేజ్‌ డిక్షనరీ చెబుతుంది.

c “నిజంగా అపవాది ఉన్నాడా?” (జనవరి 8, 1990 [ఆంగ్లం] 12-13 పేజీలు) మరియు “దయ్యాలు నిజంగానే ఉన్నాయా?” (మే 8, 1998, 18-19 పేజీలు) వంటి ప్రశ్నలకు “బైబిలు ఉద్దేశము” అనే శీర్షికల పరంపరలలో తేజరిల్లు! జవాబిచ్చింది.

[24వ పేజీలోని చిత్రసౌజన్యం]

Picture Book of Devils, Demons and Witchcraft/Ernst and Johanna Lehner/Dover

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి