కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 10/8 పేజీలు 9-10
  • మీ భవితవ్యాన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ భవితవ్యాన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పూర్వనిర్ణీత భవితవ్యం, స్వేచ్ఛా చిత్తం
  • కారణం, ఫలితం
  • మీ భవిష్యత్తు ఏమై ఉంటుంది?
  • మానవుని నిర్ణీత భవితవ్యం అన్వేషణలో
    తేజరిల్లు!—1999
  • మీ భవిష్యత్తు, మీ నిర్ణయం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2018
  • మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • విధి విలాసమా లేక కేవలం యాదృచ్ఛికమా?
    తేజరిల్లు!—1999
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 10/8 పేజీలు 9-10

మీ భవితవ్యాన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు

“ప్రాచీన ప్రపంచమంతటిలో ఒక ప్రముఖ మేధోసంబంధమైన సాఫల్యంగా” పరిగణించబడుతున్న సోదె చెప్పటమన్నది, “హెబ్రీ ప్రవక్తలు హేళన చేసిన ఒక నైపుణ్యం” అని పురాతత్వ శాస్త్రవేత్త జేన్‌ ఓట్స్‌ పేర్కొంది. ఎందుకు?

జీవితాన్ని గురించి ప్రమాదకరమైన దృక్పథం కల్గివున్న జనాంగాల మధ్య నివసించినప్పటికీ ప్రాచీన ఇశ్రాయేలీయులు తమ జీవితాలను అంధకారమయమైన ఒక శక్తి రూపించటమనే తలంపును తిరస్కరించారు. ఆ జనాంగానికి ఇవ్వబడిన ఉపదేశాలలో, దేవుడు వారితో ఇలా చెప్పాడు: “శకునముచెప్పు సోదెగానినైనను, మేఘశకునములనుగాని సర్ప శకునములనుగాని చెప్పువానినైనను, . . . కర్ణపిశాచి నడుగువానినైనను . . . మీ మధ్య ఉండనియ్యకూడదు.”—ద్వితీయోపదేశకాండము 18:10, 11.

విధిని గురించిన తలంపు లేకుండానే లేక భవిష్యకారుల అవసరం లేకుండానే ఇశ్రాయేలీయులు భవిష్యత్తునందు నమ్మకం ఉంచగలిగారు. దీనికి కారణాన్ని వివరిస్తూ, “మానవుడూ ప్రపంచమూ ఏదో అంధకారమయమైన శక్తి మూలంగా ఉనికిలోకి రాలేదు. మానవుని కోసం దేవునికి ఒక సంకల్పం ఉంది” అని ఆ జనాంగం నమ్మిందని ఫ్రెంచ్‌ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా థియో పేర్కొంటుంది. ఆ సంకల్పమేమిటి?

పూర్వనిర్ణీత భవితవ్యం, స్వేచ్ఛా చిత్తం

ఇశ్రాయేలీయులు తన కట్టడలకు కట్టుబడి ఉంటే శాంతి సౌభాగ్యాలను ఇస్తానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. (లేవీయకాండము 26:3-6) అంతేగాక, భూమిపై నీతియుక్తమైన పరిస్థితులను స్థాపించగల మెస్సీయవైపు వాళ్లు చూశారు. (యెషయా, 11వ అధ్యాయం) అయితే, దేవుడు వీటిని వాగ్దానం చేశాడన్న వాస్తవం యొక్క భావం, వ్యక్తులు ఇక ఊరికే కూర్చుని విషయాలు జరిగిపోనివ్వాలని కాదు. బదులుగా, వాళ్లకిలా చెప్పబడింది: “చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము.”—ప్రసంగి 9:10.

దీనికి కేంద్రం స్వేచ్ఛా చిత్తాన్ని గురించిన తలంపు. ఇశ్రాయేలీయులకు దేవుని సేవ చేస్తూ తమ భవితవ్యాన్ని రూపించుకునే స్వేచ్ఛ ఉంది. దేవుడు వారికిలా వాగ్దానం చేశాడు: “కాబట్టి మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినయెడల మీ దేశమునకు వర్షము, అనగా తొలకరివానను కడవరివానను దాని దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు.” (ద్వితీయోపదేశకాండము 11:13, 14) ఇశ్రాయేలీయులు విధేయులైనప్పుడు వారు దేవుని ఆశీర్వాదాలను అందుకున్నారు.

దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి వాగ్దానం చేసిన దేశంలోకి వారు ప్రవేశించటానికి కొంతకాలం ముందు, ఆయన వారికి ఎంపిక చేసుకునే ఈ అవకాశాన్నిచ్చాడు: “నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ యెదుట ఉంచియున్నాను.” (ద్వితీయోపదేశకాండము 30:15) ప్రతి వ్యక్తి భవితవ్యం ఆయన స్వంత చర్యలపైనా, నిర్ణయాలపైనా అధారపడి ఉంది. దేవుని సేవ చేయటం అంటే జీవము, ఆశీర్వాదాలు, అయితే అలా చేయటానికి నిరాకరించటమంటే కష్టాలే. కాని నేటి మాటేమిటి?

కారణం, ఫలితం

మనం మన మంచి కోసం నియుక్తం చేయబడిన అనేకానేక సహజ సూత్రాలచే నిర్బంధించబడి ఉన్నాము. వీటిలో ఒకటి క్రియ-ప్రతిక్రియ సూత్రం, లేదా బైబిలు వ్యక్తపరుస్తున్నట్లుగా, “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.” (గలతీయులు 6:7) మనమొకసారి ఆ సూత్రాన్ని గుర్తించిన తర్వాత, కొన్ని భవిష్యత్‌ సంఘటనల సంభావ్యతను పరిశీలించటం సాధ్యమే.

మనం జాగ్రత్తతో వాహనం నడిపించినప్పటి కంటే, నిర్లక్ష్యంతో అతి వేగంగా వాహనం నడిపించినప్పుడు దుర్ఘటన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం పొగత్రాగనప్పటి కంటే పొగ త్రాగినప్పుడు క్యాన్సరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిజమే, ఈ పరంపరలోని ప్రారంభ శీర్షికలో ప్రస్తావించబడినట్లు ఉగ్రవాదుల దాడుల వంటి సంఘటనలు మనకు జరుగకపోవచ్చు, అవి సంభవించగల సాధ్యతను బేరీజు వేయటం అర్థరహితమైనదై ఉండగలదు. అయితే, విధి అనే తలంపును ఆశ్రయించటం వల్ల కూడా ప్రయోజనమేమీ లేదు. అది మనకు ప్రస్తుతం గురించిగానీ, భవిష్యత్తు గురించిగానీ ఏమీ తెలియజేయదు. ఒక అబద్ధాన్ని నమ్మటం భవిష్యత్తు కోసం నిజమైన హామినివ్వదు. అలాగే అన్ని విషయాల్లో దేవుని హస్తం ఉందన్న తలంపు కూడా నిష్ప్రయోజనకరమైనదే.

మీ భవిష్యత్తు ఏమై ఉంటుంది?

మన భవిష్యత్తు ముందే వ్రాసిపెట్టబడలేదు గాని అది ప్రస్తుతంచే రూపించబడగలదు. జీవం దేవుడిచ్చిన బహుమానమే అయినప్పటికీ, మన ప్రస్తుత జీవితాన్ని, మన భవితవ్యాన్ని నిర్ణయించటంలో మనం కీలక పాత్ర నిర్వహించవలసి ఉందని బైబిలు స్పష్టంగా సూచిస్తుంది. దేవుడ్ని సంతోషపర్చటం లేక దానికి భిన్నంగా, ఆయనను దుఃఖపర్చటం అనే ఎంపిక చేసుకునే అవకాశం మనకుందన్న వాస్తవం, దేవుడు మన జీవితాలపై మనకు కొంత అధికారాన్ని ఇచ్చాడని చూపిస్తుంది.—ఆదికాండము 6:6; కీర్తన 78:40; సామెతలు 27:11.

అంతేగాక, మన భవిష్యత్తు మన సహనానికీ మన జీవన గతికీ ముడిపెట్టబడి ఉందని పరిశుద్ధ లేఖనాలు పదే పదే నొక్కి చెప్తున్నాయి, విషయాలు ముందే పూర్వనిర్ణయం చేయబడి ఉంటే ఇదంతా అర్థరహితమైనదై ఉండేది. (మత్తయి 24:13; లూకా 10:25-28) మనం దేవునికి విధేయులమై, నమ్మకంగా ఉండటానికి ఎంపిక చేసుకుంటే మనకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుందని నిరీక్షించవచ్చు?

మానవజాతికి ఎంతో చక్కని భవిష్యత్తు ఉందని బైబిలు తెలియజేస్తుంది. భూమి శాంతి భద్రతలు రాజ్యమేలే పరదైసుగా మారుతుంది. (కీర్తన 37:9-11; 46:8, 9) ఆ భవిష్యత్తు తప్పక వస్తుంది ఎందుకంటే సర్వశక్తిమంతుడైన సృష్టికర్త తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. (యెషయా 55:11) అయితే మనం పరదైసులో జీవించటానికి ఆశీర్వదించబడటమన్నది విధి పై ఆధారపడి ఉండదు; ఈ సమయంలో విధేయంగా దేవుని చిత్తాన్ని చేయటం ఫలితంగా దాన్ని ఆనందించగల్గుతాము. (2 థెస్సలొనీకయులు 1:6-8; ప్రకటన 7:14, 15) దేవుడు మనకు స్వేచ్ఛా చిత్తాన్నిచ్చి, ఇలా ప్రోత్సహిస్తున్నాడు: ‘మీరు బ్రదుకునట్లు జీవమును కోరుకొనుడి.’ (ద్వితీయోపదేశకాండము 30:20) మీరేమి ఎంపిక చేసుకుంటారు? విధికి విడిచిపెట్టబడే బదులు, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది.

[10వ పేజీలోని చిత్రాలు]

విధేయులైన మానవజాతి కోసం దేవుడు అద్భుతమైన భవితవ్యాన్ని సంకల్పించాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి