కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 2/8 పేజీలు 25-26
  • జార్జియా—ఒక ప్రాచీన వారసత్వం కాపాడబడింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జార్జియా—ఒక ప్రాచీన వారసత్వం కాపాడబడింది
  • తేజరిల్లు!—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • జార్జియాలో జరిగిన ఒక సమావేశంలో రెండు “అద్భుతాలు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • దౌర్జన్యానికి గురైనవారి హక్కులు సమర్థించబడ్డాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • కమ్యూనిస్టు నిషేధం క్రింద 40 ఏళ్లకుపైగా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
తేజరిల్లు!—1998
g98 2/8 పేజీలు 25-26

జార్జియా—ఒక ప్రాచీన వారసత్వం కాపాడబడింది

తేజరిల్లు! విలేఖరి ద్వారా

మంచుతో కప్పబడిన 4,600 మీటర్ల పొడవైన పర్వత శ్రేణి మధ్య ఒదిగివున్న ఫలవంతమైన లోయలున్న దేశంలో, కొంతమంది ప్రజలు నూరేళ్లూ అంతకంటే ఎక్కువ కాలం జీవించే దేశంలో, నివసించడం మీకిష్టమేనా? జార్జియా నివాసులకు అది కేవలం ఒక కలకాదు. వాళ్లకది వాస్తవం.

జార్జియా యూరప్‌ మరియు ఆసియాల మధ్య భూగోళశాస్త్ర సాంస్కృతిక సరిహద్దుపైనుంది. ప్రాచీన కాలాల్లో, ప్రసిద్ధి గాంచిన సిల్క్‌ రోడ్డు మీద జార్జియా ఒక ప్రముఖ స్థానంగా ఉండేది, మార్కోపోలో ఆ రోడ్డు మీదుగానే చైనాకు వెళ్లాడు. తూర్పు పశ్చిమ దేశాల మధ్యనున్న సంబంధం మూలంగా జార్జియా ఆర్థికంగానూ, సాంస్కృతికంగానూ ప్రయోజనం పొందింది, కాని కొన్నిసార్లు ఈ మార్గంగుండా వెళ్లడం లాభదాయకమైనదేనని దోపిడీదారులు కూడా కనుగొన్నారు. ఒక అంచనా ప్రకారం, జార్జియా రాజధానియైన టబిలసీ 29 సార్లు నాశనం చేయబడింది. నేడు టబిలసీ సందడిగా ఉండే ఉజ్వలమైన నగరం, దానిలో ప్రాచీన కట్టడాలతోపాటు ఒక సబ్‌వే, ఆధునిక భవనాలు కలగలిసి ఉంటాయి.

జార్జియా భూభాగంలోని దాదాపు 87 శాతం పర్వత ప్రాంతమే. మంచుతో కప్పబడి ఏకాంతంగా ఉండే ఎత్తైన ప్రాంతం నుండి పల్లపు ప్రాంతాల్లోకి 25,000 నదులు ప్రవహిస్తుంటాయి, వాటిలో అనేకం చేపలతో నిండివుంటాయి. దేశంలోని మూడు వంతులకంటే ఎక్కువ భాగం చెట్లతో లేదా పొదలతో నిండివుంటుంది. జార్జియా ఉత్తర సరిహద్దునున్న కాకాసస్‌ పర్వత శ్రేణి, ఉత్తరం నుండి వచ్చే శీతల వాతావరణం నుండి దేశ అంతర్భాగాన్ని కాపాడుతుంది. ఈ పరిస్థితి, నల్ల సముద్రం నుండి వచ్చే తేమగాలి పశ్చిమ జార్జియాను వెచ్చబరిచేందుకు అనుమతిస్తుంది. పర్యాటకులకు జార్జియా అభిమాన గమ్యస్థానం కావడానికి ఇదీ ఒక కారణమే. సమశీతోష్ణ వాతావరణం ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైనటువంటి, చక్కని వైన్‌ను చేసే సాంప్రదాయాల్లో ఒకదానికి కూడా దోహదపడింది. వాస్తవానికి, జార్జియా 500 రకాల ద్రాక్షలనూ, వైన్లనూ ఉత్పత్తి చేస్తుంది.

అయితే, జార్జియా యొక్క గొప్ప సొత్తు దాని ప్రజలే. వారు తమ వీరత్వం, తెలివితేటలు, ఉదార ఆతిథ్య స్ఫూర్తి, అలాగే హాస్యం, జీవితం మీద మక్కువ వంటి వాటిని బట్టి యుగాలుగా పేరుగాంచారు. వారి సంస్కృతి పాటలూ, నృత్యాల విషయంలో సంపన్నమైనది, ఇప్పటికీ జార్జియా దేశస్థుల ఇండ్లలో భోజనపు బల్లవద్ద తరచూ జానపద గీతాలు పాడుతుంటారు.

జార్జియాకు సాహిత్య సంబంధంగా కూడా ఐదవ శతాబ్దం మొదలుకొని సుధీర్ఘమైన చరిత్ర ఉంది. అనుపమానమైన, అందమైన జార్జియన్‌ అక్షరాలను ఉపయోగిస్తూ, బైబిలు అనువదించబడిన తొలి భాషల్లో జార్జియన్‌ ఒకటి. ఈ సంస్కృతంతా జార్జియా గతంతో సజీవ లింకును కల్పిస్తుంది—ఒక ఆధునిక దేశంలో కాపాడబడిన ప్రాచీన వారసత్వం.

[25వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pat O’Hara/Corbis

[26వ పేజీలోని చిత్రం]

1. జార్జియా బైబిలు

2. కొంతమంది నివాసులు 100 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తారు!

3. టిబిలిసిలో ఒక రద్దీ వీధి

[క్రెడిట్‌ లైను]

Dean Conger/Corbis

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి