గుండె శస్త్రచికిత్స పురోగతికి యెహోవాసాక్షులు కారణమయ్యారు
“రక్తరహిత శస్త్రచికిత్స” అనే నివేదికను న్యూయార్క్‌లోని డైలీ న్యూస్, ఆగస్టు 27, 1995 సంచికలో ముఖ్యశీర్షికనందు ప్రచురించింది. న్యూయార్క్ ఆసుపత్రి-కొర్నెల్ వైద్య కేంద్రం, “మాజీ-మేయర్ డేవిడ్ డింకన్స్కు ఇటీవలె అవసరమైన శస్త్రచికిత్స వంటిదే అయిన కరొనరి బైపాస్ శస్త్రచికిత్సను ఒక్క రక్తపు చుక్క పోకుండా చేయడాన్ని ఒక విప్లవాత్మక రీతిని ప్రకటించబోతున్నదని” అది తెలిపింది.
“యెహోవాసాక్షుల ఆవశ్యకతల వలన పురికొల్పబడిన ఈ క్రొత్త పద్ధతియొక్క అద్భుతం, . . . ఆసుపత్రులకు లక్షల డాలర్ల ఆదాలోను మరియు రోగుల రక్తం కలుషితమయ్యే ప్రమాదం తక్కువగా ఉండడంలోను ప్రతిబింబిస్తుంది” అని ఆ వార్తాపత్రిక తెలియజేసింది. ఆసుపత్రియొక్క రక్తరహిత శస్త్రచికిత్సా కార్యక్రమం డైరెక్టరు, డాక్టర్ టాడ్ రోసెన్‌గార్ట్ ఇలా అన్నాడు: “ఇప్పుడు మేము, ఈ శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో ఎక్కించవలసివచ్చే రెండునుండి నాలుగు యూనిట్ల రక్త పరిమాణాన్ని సున్నాకు తగ్గించగలిగాము.”
ఈ పద్ధతికి మార్గదర్శిగా ఉండడానికి సహాయం చేసిన ఆసుపత్రియొక్క గుండె శస్త్రవైద్యుడు, డాక్టర్ కార్ల్ క్రీగర్ ఇలా ఆన్నాడు: “దానం చేయబడిన రక్తం మరియు రక్త ఉత్పత్తుల అవసరతను తగ్గించడంద్వారా, శస్త్రచికిత్స తరువాత వచ్చే రక్తమార్పిడులకు సంబంధించిన కొన్ని జ్వరాలు మరియు అంటురోగాల ప్రమాదాలను కూడా మేము తగ్గిస్తున్నాము.”
ఇతర నిపుణులు, “రక్తరహిత బైపాస్, శస్త్రచికిత్స తరువాత ఇంటెన్సివ్ కేర్‌కు వెచ్చించబడే సమయాన్ని, 24 గంటలు లేక ఇంకా ఎక్కువనుండి ఆరు గంటలకు తగ్గిస్తుంది. క్లినికల్ పరీక్షలలో రోగులు 48 గంటలు ముందుగానే బాగవుతున్నారు మరియు ఆసుపత్రినుండి బయటికి వస్తున్నారు.” ఆసుపత్రులకు, ప్రభుత్వాలకు మరియు భీమా సంస్థలకు గొప్ప ఆదా అని దానర్థం. “ఈ శస్త్రచికిత్స ఒక రోగికి దాదాపు 1,600 అమెరికన్ డాలర్లు ఆదా చేయగలదు” అని డాక్టర్ రోసెన్‌గార్ట్ అంచనా వేశాడు.
డైలీ న్యూస్ వృత్తాంతం ఇలా కొనసాగింది:
“పరిహాసకరమైన విషయమేమంటే, క్రొత్త శస్త్రచికిత్స పురికొల్పబడింది ఆర్థిక అత్యవసరత వల్ల కాదు లేదా వైద్య అత్యవసరత వల్ల కూడా కాదు గానీ మత సంబంధ ఉత్సాహం వలననే పురికొల్పబడింది. రక్తమార్పిడుల ఉపయోగాన్ని నిరోధించే విశ్వాసాలుగల యెహోవాసాక్షుల సమాజం హృద్రోగానికి గురౌతున్న వృద్ధులైన సభ్యుల కొరకు సహాయాన్ని అర్ధిస్తున్నది. . . .
“యెహోవాసాక్షుల సమాజ అభ్యర్ధన మేరకు వైద్యులు బ్లడ్ సాల్వేజ్ టెక్నిక్‌లతో క్రొత్త మందులను చేర్చారు. గుండె సంబంధ శస్త్రచికిత్స సమయంలో రోగులను సజీవంగావుంచే సాంప్రదాయిక గుండె, ఊపిరితిత్తుల యంత్రాన్ని ఉపయోగించడంలో క్రొత్త విధానాన్ని కనుగొన్నారు.
“తొలి క్లినికల్ అధ్యయనంలోని యెహోవాసాక్షులైన 40 రోగులకు తోడు ఆరు నెలల క్రితం న్యూయార్క్-కొర్నెల్ జట్టు ఈ శస్త్రచికిత్సను సాధారణ రోగుల సమాజంలో ప్రవేశపెట్టారు. ‘అప్పటినుండి, వారు ఒక్క మరణం కూడా సంభవించకుండా వరుసగా 100 రక్తరహిత బైపాస్ శస్త్రచికిత్సలు పూర్తిచేశారు,’ అని క్రీగర్ చెప్పాడు. సాధారణ బైపాస్ శస్త్రచికిత్సకు మర్త్యత్వరేటు దాదాపు 2.3%.”
ప్రపంచవ్యాప్తంగా భూగోళవ్యాప్త సాధారణ రోగుల సమాజానికి సురక్షిత శస్త్రచికిత్సా విధానాలను అందుబాటులో ఉంచుతూ, 102 ఆసుపత్రులు తమ సదుపాయాలకు రక్తరహిత శస్త్రచికిత్స కార్యక్రమాలను జతచేర్చాయి.