కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 2/8 పేజీ 32
  • “బాలుర . . . నోట”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “బాలుర . . . నోట”
  • తేజరిల్లు!—1996
తేజరిల్లు!—1996
g96 2/8 పేజీ 32

“బాలుర . . . నోట”

దక్షిణ ఆఫ్రికాలోని నేటాల్‌నందలి బలిటోనుండి ఒక స్త్రీ, నా బైబిలు కథల పుస్తకము (ఆంగ్లం) ఎడల తన హృదయపూర్వక మెప్పుదలను వ్యక్తం చేస్తూ ఇలా వ్రాసింది:

“ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే వయస్సున్న రూడి నైడూ అనే మేనల్లుడు నాకున్నాడు, వాడు ఆ పుస్తకంలో పాత్రధారుల చిత్రాలను చూసి దాదాపు ప్రతి పాత్రధారి పేరును చెబుతాడు. కొన్ని బైబిలు పాత్రలు ఆ చిత్రాలలో ఏమి చేస్తున్నాయో కూడా మీకు చెప్పగలడు. ఉదాహరణకు, 11 వ కథ నోవహు బలి అర్పించుటను చూపిస్తుంది. రూడి మనకిలా చెబుతాడు, ‘నోవహు—యెహోవాకు ప్రార్థిస్తున్నాడు.’

“49 వ కథలో యెహోషువ ఏం చేస్తున్నాడని అడిగినప్పుడు, రూడి ‘సూర్యుడా, నీవు నిలువుము!’ అని చెబుతూ, చిత్రంలోని యెహోషువ భంగిమలో నిల్చుంటాడు. వాడు పదాలను సరిగ్గా పలుకలేడు, కానీ నవ్వు తెప్పించే తన స్వంత రీతిలో తమాషాగా ముద్దుగా చెబుతాడు.

“ఈ అద్భుతమైన ప్రచురణ కొరకు నేను మరలా కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. కొంతమంది పెద్దలకు తెలియని కొన్నింటిని చిన్న పిల్లలు వర్ణించగల్గుతున్నారు. మత్తయి 21:16 నందలి యేసు మాటలు నిశ్చయంగా వాస్తవమయ్యాయి: ‘బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి.’ ”

మీరు నా బైబిలు కథల పుస్తకము (ఆంగ్లం) పొందాలని ఇష్టపడుతున్నట్లయితే లేక బైబిలు విద్యాభ్యాసం యొక్క విలువను మీతో చర్చించేందుకు ఎవరైనా మీ ఇంటికి రావాలని ఇష్టపడుతున్నట్లయితే, దయచేసి, Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India, లేదా ఐదవ పేజీలో ఇవ్వబడిన చిరునామాలలో మీ కనుకూలమైన దానికి వ్రాయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి