కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 2/8 పేజీ 29
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వేడి చీమలు
  • సిగరెట్లకన్నా హానికరమైనవి
  • ప్రయాణ అస్వస్థత
  • ఒంటరి పిల్లలు
  • శబ్దాన్ని నివారించండి
  • రక్తమార్పిడి–ఎంత వరకు సురక్షితము?
    రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?
  • “దాదాపు డిజైన్‌ చేసినట్లే ఉంది”?
    తేజరిల్లు!—2005
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1998
  • శబ్దం—దాని గురించి మీరు చేయగలిగినది
    తేజరిల్లు!—1997
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 2/8 పేజీ 29

ప్రపంచ పరిశీలన

వేడి చీమలు

స్విట్జర్లాండ్‌లోని ఇద్దరు పరిశోధకులు సహారా ఎడారిలోని కొన్ని చీమలు మలమలలాడే 60 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలకు కూడా ఎందుకు తట్టుకోగలవో కనుగొన్నారు. జూరిచ్‌ విశ్వవిద్యాలయంయొక్క జంతుశాస్త్ర సంస్థలోని ర్యూడిగర్‌ వేనర్‌ మరియు బాసెల్‌ విశ్వవిద్యాలయంలోని జన్యుశాస్త్రవేత్త వాల్టర్‌ గెరింగ్‌లు, “వేడివలన హానికలగకుండా శరీర మాంసకృత్తులను కాపాడేందుకు సహాయపడే హీట్‌ షాక్‌ ప్రొటీన్లు (హెచ్‌.ఎస్‌.పి. లు) అనబడే పదార్ధాలను” చీమలు ఉత్పత్తి చేస్తాయని కనుగొన్నారని సైన్స్‌ పత్రిక నివేదిస్తుంది. అత్యధిక ఉష్ణోగ్రతలకు గురిచేసినప్పుడు, “హాని [హీట్‌ షాక్‌] మొదలైన తరువాత జంతువులన్నీ కొంత హెచ్‌.ఎస్‌.పి. లను తయారుచేస్తాయి” కానీ “చీమలు ముందే వాటిని తయారుచేస్తాయి” అని ఆ పత్రిక చెబుతుంది. ఏవిధంగా? చీమలు హీట్‌ షాక్‌ను అనుకరిస్తూ అవి వాటి గూడును విడిచిపెట్టకమునుపే హెచ్‌.ఎస్‌.పి. లను ఉత్పత్తి చేస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. గెరింగ్‌ ఇలా జతచేర్చాడు: “దీనిగురించి ఆలోచించడానికి మనమంత తెలివిమంతులము కాదు, కానీ చీమలు తెలివిగలవి.” లేక తెలివిగలవాడు వాటి సృష్టికర్తేనా?

సిగరెట్లకన్నా హానికరమైనవి

బీదవాడి సిగరెట్టని కూడా పిలువబడే బీడీని గురించి భారతదేశంలోని పార్లమెంటరీ కమిటీ ఈ ముగింపుకు వచ్చింది. 40 లక్షలకంటె ఎక్కువ మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు పొగాకు పొడిని టెండు ఆకులలో చుడుతూ ఆ చిన్న చుట్టను దారంతో కడుతూ, రోజుకు 30 కోట్లకుపైగా బీడీలను ఉత్పత్తి చేస్తారని అంచనా వేయబడింది. ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం, బీడీలలో సిగరెట్లకంటె రెండున్నర రెట్లు ఎక్కువ క్యాన్సర్‌కారక సాధ్యత ఉన్నట్లు, అవి సెలికోసిస్‌ మరియు క్షయవ్యాధిని కలుగజేయగలవని మరియు ప్రామాణిక భారతీయ సిగరెట్టులో ఉండే 36 శాతం టార్‌ మరియు 1.9 శాతం నికోటిన్‌తో పోలిస్తే బీడీలో 47 శాతం టార్‌ మరియు 3.7 శాతం నికోటిన్‌ ఉందని, ఇటీవలి నివేదిక ఒకటి తెలుపుతుంది. పొగత్రాగేవారు మాత్రమే ప్రమాదంలో లేరు. సాధారణంగా, బీడీలను తయారుచేసే లక్షలాదిమంది ప్రజలు అపరిశుభ్ర పరిస్థితులలో గంటలకొలది పనిచేస్తూ, గాలి ప్రసరణం సరిగ్గాలేని గుడిసెల్లో పొగాకు పొడిని లోనికి పీలుస్తూ కనిపిస్తారు. ప్రాముఖ్యంగా బాలకార్మికులు కష్టమనుభవిస్తున్నారు.

ప్రయాణ అస్వస్థత

మీరు ప్రయాణ అస్వస్థతకు గురౌతారా? అలాగైతే మీరొక్కరే అలా లేరు. పూర్తిగా ప్రతి 10 మందిలో 9 మంది ప్రజలు వివిధ స్థాయిల్లో చలన అస్వస్థతకు గురౌతారని ఇంటర్నేషనల్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ నివేదిస్తుంది. కుక్కలు ప్రాముఖ్యంగా కుక్కపిల్లలు కూడా సులభంగా ఈ అస్వస్థతకు గురికాగలవు. ఆఖరికి చేపలు కూడా నిమ్మళంగా లేని సముద్రంలో పడవద్వారా రవాణా చేయబడినప్పుడు సముద్రపు అస్వస్థతకు గురౌతాయి! దీనికి పరిష్కారమేమిటి? చాలామంది ప్రజలు అనేక మందు దుకాణాల్లో కొనుగోలు చేయగలిగే మందుల వైపు తిరుగుతారు. ఇక్కడ సహాయపడగల ఇతర సూచనలున్నాయి: కదులుతున్న వాహనంలో చదవవద్దు. అతి తక్కువగా కదిలే చోట కూర్చోండి—ఉదాహరణకు కారు ముందు సీటులో, విమానంలో రెక్క వైపున కూర్చోండి. క్షితిజంవంటి దూర వస్తువులపై దృష్టిని కేంద్రీకరించండి. అలా చేయవద్దని మీరనుకుంటే, కళ్ళు మూసుకోండి.

ఒంటరి పిల్లలు

ఒక ఆస్ట్రేలియా జాతీయ సర్వే, ఆరు సంవత్సరాల వయస్సున్న పిల్లలు, తలిదండ్రులిద్దరు ఉద్యోగస్థలంలో లేక బయట ఇతరులతో కలుస్తూ ఉండగా ఇంటి వద్ద ఒంటరిగా విడిచిపెట్టబడుతున్నారని తెలియజేస్తుందని ద కాన్‌బెర్రా టైమ్స్‌ నివేదిస్తుంది. బోయ్స్‌ టౌన్‌ నేషనల్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్‌కు ప్రతినిధియైన వెండీ రీడ్‌ ప్రకారం, “సగం కంటె ఎక్కువమంది పిల్లలు వారు ఒంటరిగా ఉన్నారని, తమ తలిదండ్రుల సహవాసాన్ని కోల్పోతున్నారనీ చెప్పగా, 12 సంవత్సరాల క్రింది వయస్సువారిలో గొప్పశాతం చీకటి, తుపానులు, చొరబాటుదారులు, లేక అపహరణల ఎడల భయాన్ని కలిగివున్నారు.” దానికి తోడు, “పిల్లల్లో 71 శాతం మందికి సమస్య ఉత్పన్నమైనప్పుడు అనుసరించడానికి వ్యూహరచన ఏమీ లేదు మరియు 12 సంవత్సరాల వయస్సున్న పిల్లల్లో సగంమందికి తమ తలిదండ్రులు ఎక్కడ ఉన్నారో వారితో మాట్లాడడం ఎలా సాధ్యమౌతుందో కూడా తెలియదు” అని రీడ్‌ చెప్పిందని టైమ్స్‌ నివేదించింది.

శబ్దాన్ని నివారించండి

“దయచేసి ఆ శబ్దాన్ని నివారించండి” అని ద టొరెంటో స్టార్‌ వార్తాపత్రికలోని ముఖ్యశీర్షిక వేడుకుంటుంది. గ్యాస్‌ లాన్‌ మోవర్లు, లీఫ్‌ బ్లోవర్లు, కారు హార్న్‌లు మరియు అలారంలు, బూమ్‌ బాక్స్‌లు, మొరిగే కుక్కలు, ఏడుస్తున్న బిడ్డలు, అర్ధరాత్రిదాకా సాగే పార్టీలు, ఇలా ఎడతెగక ఉండే నగర శబ్దం, శబ్దానికి విరుద్ధంగా మాట్లాడేవారు శాంతి మరియు నిశ్శబ్దత కొరకు ప్రచారం చేసేందుకు కారణమైంది. అటువంటి శబ్దం ఎడతెగక వినడం “అలసటను మరియు వ్యాకులతను పెంచగలదని” స్టార్‌ చెబుతుంది. అదిలా జతచేరుస్తుంది: “రక్తపోటు పెరగగలదు, గుండె కొట్టుకోవడం మారి రక్తనాళాలను ప్రభావితం చేయగల ఎడ్రినలిన్‌ మరియు ఇతర హార్మోన్‌లను శరీరం ఉత్పత్తిచేస్తుందని వైద్య పరిశోధన చూపిస్తుంది.” ఆరోగ్య అధికారుల ప్రకారం, శబ్దంచేసే లాన్‌ మోవర్‌ లేక మోటారు వాహనంవంటి, 85 డెసిబెల్స్‌ కంటె ఏదైనా ఎక్కువ ధ్వని ఎనిమిది గంటలకంటే ఎక్కువసేపు వినడం మీ వినికిడికి అపాయకరం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి