కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 9/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1995
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1994
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1994
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1995
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 9/8 పేజీ 30

మా పాఠకుల నుండి

ఆలకించడం “మీరు శ్రద్ధగా ఆలకిస్తారా?” (డిశంబరు 8, 1994) అనే శీర్షిక సరిగ్గా నాకవసరమైనది. తన సమస్యలు అంత పెద్దవి కావని చెబుతూ, నేను వెంటనే కోరని సలహానివ్వడం నా స్నేహితునికి నచ్చదని చాలా సార్లు నాతో చెప్పాడు. మీతో నిజంగా చెబుతున్నాను, అతడు తప్పుడు దృక్పథాన్ని కలిగి ఉన్నాడని నేననుకున్నాను. నేనే పొరబడ్డానని ఇప్పుడు నేను గ్రహించాను!

ఎస్‌. హెచ్‌., అమెరికా

నేనిలాంటి ఒక శీర్షిక కొరకు వేచి ఉన్నాను, కాని ఇది నా అంచనాలన్నింటినీ మించిపోయింది. తరచూ మనం వినడంలోని ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేస్తాము. అయినప్పటికీ, మనలో చాలా మంది అలాంటి శ్రద్ధను పొందడానికి ఆశించాము.

ఎస్‌. డి., ఇటలీ

నాకు 18 ఏండ్లు, నేను కొన్ని పరిస్థితుల్లో ఏమి చెప్పాలో తరుచూ తెలియకుండా ఉన్నాను. కాని, ఆ చక్కని శీర్షికను చదివిన తరువాత, నేను నిజంగా సానుభూతిగల శ్రోతగా ఉండగలనని భావిస్తున్నాను.

జె. ఎమ్‌., ఆస్ట్రేలియా

మనం వినే ప్రతి సమస్యను పరిష్కరించనవసరం లేదని, తరచూ వినడమే సరిపోతుందని తెలుసుకోవడం ఎంతో మంచిది. ముఖ్యంగా సొంత బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించని కుటుంబాల్లోని వారమైన మేము ప్రాథమిక సంభాషణా నైపుణ్యాలను నేర్చుకోవలసిన అవసరం ఉంది. ఎలా జీవించాలి అని మాకు నేర్పడానికి బైబిలును ఉపయోగిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు.

జె. డి., అమెరికా

మెరుగుపరచబడిన ఆర్ట్‌వర్క్‌ నేను పాఠశాలలో గ్రాఫిక్‌ ఆర్ట్‌లో పట్టా తీసుకున్నాను. అదే సమయంలో, నేను యెహోవాసాక్షులతో బైబిలు పఠిస్తూ ఉండేదాన్ని. అయితే నేను ఎప్పుడైతే పాఠశాలకు తేజరిల్లు!ను తీసుకువెళ్ళినప్పుడెల్లా నా తోటి విద్యార్థులు దాని డిజైన్‌ గురించి, ‘రంగు గురించి’ బాగోలేదని అదని ఇదని చెప్పేవారు. అయితే ఇటీవలి నెలల్లో, డిజైన్‌ నిజంగా చాలా బాగా వస్తోంది. నిజంగా నేను ఈ పత్రికలనుబట్టి గర్విస్తున్నాను!

ఎన్‌. ఐ., జపాన్‌

హానికలిగిన వాతావరణం “మన వాతావరణానికి హాని కలిగినప్పుడు” అనే శీర్షికను చదివి, నేనెంతో ఆనందించాను. (జనవరి 8, 1995) వ్రాయడానికి అర్థవంతమైన విషయాలను ఎంపిక చేసుకునే ప్రత్యేక సామర్థ్యం కచ్చితంగా మీకుంది. అయితే అనేక సార్లు, మీరు భౌగోళిక ఉష్ణోగ్రత గురించి పేర్కొన్నప్పటికీ, ఏ ఋజువునూ ఇవ్వలేదు. జాగ్రత్తపడండి! ఒకవేళ అది తప్పని నిరూపించబడినట్లయితే, మీ సంపాదకీయం అప్రతిష్ఠపాలవుతుంది.

ఎమ్‌. ఎల్‌., అమెరికా

మేము భౌగోళిక ఉష్ణోగ్రత అనే సిద్ధాంతాన్ని బలపరచడంలేదు, కాని ప్రఖ్యాతిగాంచిన అనేక శాస్త్రజ్ఞులు అది సంభవిస్తుందని నమ్ముతున్నారన్న వాస్తవాన్ని నివేదించామంతే. ఒకవేళ తరువాయి పరిశోధనలో ఈ వివాదాస్పద సిద్ధాంతం పరీక్షించబడుతుందా లేదా తప్పని నిరూపించబడుతుందా అన్నది ఇంకా చూడవలసిన విషయం.—ఎడిటర్‌.

తరగతి ట్రిప్పులు “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . తరగతి ట్రిప్పులను గూర్చిన మాటేమిటి?” (అక్టోబరు 22, 1994, ఆంగ్లం) చదివి నేను ఆనందించాను. సంవత్సరాల క్రితం మా తరగతి ఒక వారం ట్రిప్పుకు పథకం వేసుకుంది. ఆ విషయాన్ని ప్రార్థనలో పెట్టిన తరువాత, వెళ్ళవద్దని నేను తీర్మానించుకున్నాను. తరగతివారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, నా తరగతి విద్యార్థుల్లో అనేకులు లైంగిక అవినీతికి పాల్పడ్డారని నేను తెలుసుకున్నాను. నిజంగా, అలాంటి ట్రిప్పులు ఒక క్రైస్తవునికి చాలా క్లిష్టమైన పరీక్షలు కాగలవు.

జె. ఎస్‌., నార్వే

నేను అధికారికంగా అనేక ట్రిప్పులకు వెళ్ళాను కనుక, నాకీ శీర్షిక నిజంగా ఎంతో సహాయపడింది. మీరు వేసిన ప్రశ్నలు ఒక యౌవనుడు తన పరిస్థితిని విశ్లేషించడాన్ని సాధ్యపరుస్తాయి. తరగతి ట్రిప్పులను గూర్చి ఆలోచించడానికి మీరు సహాయపడినందుకు మీకు కృతజ్ఞతలు.

ఎమ్‌. ఆర్‌., అమెరికా

చూడాలని నేనెప్పుడూ ఆశించిన స్థలానికి వెళ్ళే ఇటీవల తరగతి ట్రిప్పుకు నేను ఆహ్వానించబడ్డాను. నేను అప్పటికే టికెట్టు కొనుక్నున్నప్పటికీ, నేను ఆ ట్రిప్పుకు వెళ్ళవద్దనే తీర్మానించుకున్నాను. నేను జారవిడుచుకున్న దానిని గూర్చి తర్వాత ఆలోచించడం మొదలెట్టాను. కాని మీ శీర్షిక సరైన సమయానికి వచ్చింది. దానిని చదివిన తరువాత, నేను సరైన తీర్మానమే తీసుకున్నాననే నమ్మకం నాకు కుదిరింది.

ఎల్‌. ఎస్‌. బి., బ్రెజిల్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి