హెమోఫీలియా వచ్చిన వారికి కలుషితమైన రక్తం ఇవ్వబడింది
ప్రపంచ వ్యాప్తంగా రక్తం, ప్రతి సంవత్సరం 200 కోట్ల డాలర్ల వ్యాపారానికి దోహదపడింది. దానినుండి లాభాల కొరకు అన్వేషించడం ఫ్రాన్స్‌లో అతి పెద్ద విశాదంగా పరిణమించింది. హెచ్ఐవిచేత కలుషితం అయిన రక్తం, హెమోఫీలియాగల 250 మంది ఎయిడ్స్ సంబంధంగా మరణించడానికి, ఇంకా వందలాదిమంది దానికి గురవ్వడానికి దారితీసింది.—ది బూస్టన్ గ్లోబ్, అక్టోబరు 28, 1992, పుట 4.
వైద్యపర అశ్రద్ధ, వాణిజ్యపర పేరాశ యొక్క “అపరిశుద్ధ కలయిక” హెచ్ఐవిచేత కలుషితమైన రక్తం జర్మనీలో హెమోఫీలియాగల 400 మంది మరణానికి, కనీసం 2,000 మంది దాని బారినపడడానికి నడిపింది.—గార్డియన్ వీక్లి, ఆగష్టు 22, 1993, పుట 7.
రక్తానికి సంబంధించిన అపనింద కెనడాకు కూడ ఉంది. కెనడాలోని హెమోఫీలియాగల 700 కంటే ఎక్కువమందికి హెచ్ఐవి చేత కలుషితమైన రక్తాన్నిచ్చి చికిత్స చేసారని అంచనా వేయబడింది. కెనడాలోని హెమోఫీలియాగల వారికి ఎయిడ్స్ చేత కలుషితమైన రక్తాన్ని రెడ్‌క్రాస్ సంస్థ యిస్తుందని ప్రభుత్వానికి జూలై 1984లో హెచ్చరిక ఇవ్వబడింది, కానీ కలుషితమైన రక్తోత్పత్తులు, ఒక సంవత్సరం తర్వాత, ఆగష్టు 1985లో గానీ మార్కెట్లో నుండి తొలగించబడలేదు.—ది గ్లోబ్ అండ్ మెయిల్, జూలై 22, 1993, పుట A21, మరియు ది మెడికల్ పోస్ట్, మార్చి 30, 1993, పుట 26.
మెడ్రిడ్, స్పెయిన్, నుండి ఏప్రిల్ 21, 1993న బయలుదేరిన రాయిటర్జ్ ఏజెన్సి, ఆరోగ్య శాఖ చెప్పినట్లుగా, 1980లో రక్తం మరియు ప్లాస్మా మార్పిడి వలన ఎయిడ్స్ వైరస్ సోకిన హెమోఫీలియాగల 1,147 మందికి స్పెయిన్ నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పింది. మరి 400 కంటే ఎక్కువమంది ఇప్పటికే ఎయిడ్స్ వచ్చి, చనిపోయారు.—ది న్యూయార్క్ టైమ్స్, ఏప్రిల్ 22, 1993, పుట A13.
వ్యాధిని నిరోధించడానికై నెలకొల్పబడిన కేంద్రాలు, 1982 అంతానికల్లా, రక్తాన్ని గడ్డకట్టించే మూలం VIII యొక్క ప్రమాదాలను గురించి ఎన్హెచ్ఎఫ్ను (నేషనల్ హెమోఫీలియా ఫౌండేషన్) హెచ్చరించడం ప్రారంభించాయి. దాన్ని ఒక్కసారి ఎక్కించుకోడం అంటే 20,000 మందినుండి తీయబడిన రక్తం అని అర్థం, ఆ ఇంజెక్షన్‌ను కలుషితం చేయడానికి వారిలో కేవలం ఒకరికి ఎయిడ్స్ ఉన్నా చాలు. మార్చి 1983లో ఒక తీవ్ర హెచ్చరిక వెలువడింది, కానీ ఆ సంవత్సరం మే నెలలో, “రక్తాన్ని గడ్డకట్టించే మూలం యొక్క ఉపయోగాన్ని కొనసాగించమని ఎన్హెచ్ఎఫ్ కోరుతుంది,” అనే వార్తాశీర్షిక ఉన్న ప్రకటనను ఎన్హెచ్ఎఫ్ పంపింది. అప్పడికల్లా మృతుల సంఖ్య పెరుగుతోంది, వేలకొలది మంది ఇంకా ప్రమాదానికి గురి అవుతున్నారు. హెమోఫీలియా ఉన్నవారికి నయం కావడానికి ఈ గడ్డకట్టించే మూలం అవశ్యకమేమి కాదు; చికిత్స కొరకు ఇతర ఎంపికలు ఉన్నాయి. వేలకొలది ప్రాణాలు కాపాడబడగలిగేవి. ఆ మూలాన్ని వేడిచేయడం ద్వారా, అది నిరపాయకరం అవుతుందని 1985 నాటికి మందుల కంపెనీలు తెలుసుకున్నాయి. అయినప్పటికీ, వేడిచేయబడని మూలం యొక్క అమ్మబడిన స్టాకు మార్కెట్లోకి వచ్చేసింది.—డేట్లైన్ ఎన్బిసి, డిసెంబరు 14, 1993. (g94 6/8)
[Picture Credit Line on page 31]
CDC, Atlanta, Ga.