“దైవ భయము” జిల్లా సమావేశం దగ్గరపడుతోంది
యెహోవాసాక్షుల “దైవ భయము” జిల్లా సమావేశంలో ప్రయోజనాత్మకమైన మూడు దినాల బైబిలు బోధ మీ కొరకు సిద్ధంగా ఉంది. కేవలం ఇండియాలోనే, అక్టోబరు 1994 నుండి జనవరి 1995 వరకు 16 సమావేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి మీరు నివసించే ప్రాంతానికి దగ్గరగా ఉండే ఒకదానికి మీరు హాజరవ్వగలరు. సమావేశం శుక్రవారం ఉదయం 10:20కి సంగీతంతో ప్రారంభమై, ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు కార్యక్రమం ముగుస్తుంది. శనివారం, ఆదివారం కార్యక్రమం ఉదయం 9:30కి ఆరంభమై, శనివారం సాయంత్రం ఐదు గంటలకు, ఆదివారం 4:15కు ముగుస్తాయి.
శుక్రవారం ఉదయం ఉండే ముఖ్య ప్రసంగం, దైవ భయం అంటే ఏమిటో చూపడమే కాక, అటువంటి భయాన్ని పెంపొందించుకునేవాళ్లు పొందే లాభాలను కూడ తెలియజేస్తుంది. సమావేశ కార్యక్రమమంతా ఈ ప్రయోజనాలను ఉన్నతంగా వివరిస్తుంది.
శుక్రవారం మధ్యాహ్నం ఒక గంటసేపు ఉండే ప్రసంగాలు, ప్రదర్శనల గోష్ఠుల్లో, దైవ భయము వివాహాన్ని, కుటుంబ జీవితాన్ని ఎలా బలపర్చగలదో, అలాగే యౌవనస్థులు దేవునికి యథార్థంగా ఉండడంలో నిలకడగా ఉండడానికి వారికి అదెలా సహాయం చేయగలదో కూడా మీరు వింటారు. “మరణంలో తమవారిని కోల్పోయిన వారికి ఓదార్పు,” అనే హృదయాన్ని ఉప్పొంగజేసే ప్రసంగంతో శుక్రవారం కార్యక్రమాలు ముగుస్తాయి. మరణమందు తమ ప్రియమైనవారిని పోగొట్టుకున్న వారికి మద్దతునివ్వడం కొరకు ఆ ప్రసంగంలో అందించబడు ఆచరణయోగ్యమైన సహాయాన్ని మీరు మెచ్చుకుంటారు.
శనివారపు కార్యక్రమం సంఘము మరియు మన పరిచర్య విషయంలో మనం యెహోవా నడిపింపుకు హత్తుకొనడాన్ని దైవ భయము ఎలా దృఢపర్చగలదో చూపిస్తుంది. “యెహోవా ఎడబాయని ప్రజలు” అనే ప్రసంగం తన ప్రజలను ఎడబాయనను దేవుని వాగ్దానం వారిని నేటి ప్రపంచంలో ఎలా ప్రభావితం చేయాలో వివరిస్తుంది. తర్వాత ఆ మధ్యాహ్నం, “దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిలును, అనుదినం చదవండి,” అనే ప్రసంగంలో సభికులు బైబిలును చదవడం, పఠించడంలో ఆచరణాత్మక సలహాలను పొందుతారు. శనివారం కార్యక్రమం “యెహోవా యొక్క భయంకరమైన దినము సమీపించింది,” అనే ఆసక్తిదాయకమైన అంశంగల ప్రసంగంతో ముగుస్తుంది.
ఆదివార కార్యక్రమంలో ఒక భాగం “నీతిమంతులకు పునరుత్థానం కలుగబోతుంది,” అనే ప్రసంగం ఉంటుంది. దాని తర్వాత “మహాశ్రమలను జీవముతో తప్పించుకున్న వారు,” అనే ప్రసంగంలో ఎన్నడునూ చనిపోనివారిని గూర్చి యేసు చేసిన అద్భుతమైన వాగ్దానం వివరణ ఇవ్వబడుతుంది.—యోహాను 11:26.
ఆదివారం ఉదయపు కార్యక్రమం మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు అనే ఆలోచింపజేసే 40 నిమిషాల నాటకంతో ముగుస్తుంది. ప్రేక్షకులు యెహోషువ దినాలకు తీసుకువెళ్లబడి, యెహోవాను సేవించాలనే ఆయన దృఢ తీర్మానం ప్రదర్శింపబడగా చూస్తారు. ప్రేక్షకులు ఏలీయా కాలంనాటి అగ్ని పరీక్షను కూడా తిలకిస్తారు, ఈ రెండు సంఘటనలు ఈనాడు దైవ భయమును ప్రదర్శించడానికి గుణపాఠాలు నేర్చుకోడానికి తగిన సహాయం చేస్తాయి.
సమావేశానికి ఉన్నతాంశంగా ఆదివారం మధ్యాహ్నం ముఖ్య విషయం, “సత్య దేవునికి ఇప్పుడు ఎందుకు భయపడాలి,” అనే బహిరంగ ప్రసంగముంటుంది. ఈ మూడు దినాలు అక్కడ ఉండడం ద్వారా మీరు నిశ్చయంగా లాభం పొందగలరు! హాజరవ్వమని మీరు హృదయపూర్వకంగా ఆహ్వానింపబడుతున్నారు. మీ గృహానికి దగ్గరి ప్రాంతాన్ని కనుగొనడానికి, యెహోవాసాక్షుల ప్రాంతీయ రాజ్య మందిరంలో సంప్రదించండి లేదా ఈ పత్రిక ప్రకాశకులకు వ్రాయండి. (g94 5/22)