కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 5/8 పేజీలు 22-23
  • దుఃఖపడటం తప్పా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దుఃఖపడటం తప్పా?
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాళ్లు బాధపడ్డారు
  • ‘ఇతరులవలె దుఃఖపడవద్దు’
  • దుఃఖిస్తున్నప్పటికీ, మనం నిరీక్షణలేనివారం కాము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • చనిపోయిన వారికిగల నిశ్చయమైన నిరీక్షణ
    మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే
  • ఇప్పుడు మరణించియున్న కోట్లకొలది ప్రజలు తిరిగి జీవించెదరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • “నీ సహోదరుడు లేస్తాడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 5/8 పేజీలు 22-23

బైబిలు ఉద్దేశము

దుఃఖపడటం తప్పా?

“నాకు పునరుత్థానమందు దృఢమైన నిరీక్షణ నమ్మకమున్నది, కాబట్టి నా బాధను అందరిముందు వ్యక్తపరచుట తప్పని నేను తలంచాను. నేను దుఃఖిస్తూ, కలిగియున్న దృఢమైన నిరీక్షణయందు నా నమ్మకాన్ని సందేహించుటకు అవకాశమివ్వడం నేను తప్పని దృష్టిస్తాను. నేను పునరుత్థానమందు వాస్తవమైన నమ్మకాన్ని కలిగియున్నయెడల, నాకు కలిగిన నష్టానికి మిక్కిలి బాధపడనని నేను భావించాను.”—బాప్తిస్మం పొంది 21 సంవత్సరాలు పైగా దాటిన చార్లిన్‌ చెప్పింది.

ఎపుడైన మీకు ప్రియమైనవారు మరణించినట్లయితే, మీ భావాలు, దృక్పథాల మీద మీరు ఊహించమని—అనగా భయం, కోపం, తప్పుచేసినబాధ, మరియు కృంగుదల కలుగుతాయి. దేవుని రాజ్యపరిపాలన క్రింద పరదైసు భూమిపై జీవించుటకు మృతుల పునరుత్థానాన్ని గూర్చిన హృదయాన్ని ఉత్సాహపరచే క్రైస్తవుని కోసమైన బైబిలు వాగ్దానము ఆకస్మిక మరణ ప్రభావం వలన దిగ్భ్రాంతి నొందిన వారు ఉపశాంతి పొందుటకు సహాయపడును. (యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:15; ప్రకటన 21:1-4) చార్లిన్‌ మాటలు చూపుతున్నట్లు, ప్రియమైన వారొకరు మరణించినప్పుడు దుఃఖించడం తప్పు, ఏడవడమనేది ఏదో విధంగా బైబిలు చేసే పునరుత్థాన వాగ్దానమందు విశ్వాసమును అంతగా చూపకపోవడం అనే భావంతో అనవసరభారంతో నలుగుతున్నట్లు చూపుతుంది.

అయినప్పటికిని, బైబిలు బాధపడటాన్ని గూర్చి ఏమి చెపుతుంది? ఎప్పుడైన ప్రియమైనవారు మరణిస్తే దుఃఖపడటం తప్పా?

వాళ్లు బాధపడ్డారు

అబ్రాహాము విశ్వాసము అందరూ ఎరిగియున్న విషయమే. శోధన వచ్చినపుడు, అబ్రాహాము “విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.” (హెబ్రీయులు 11:17; ఆదికాండము 22:9-13) స్పష్టంగా, అతని కాలానికి ముందు ఎవ్వరుకూడా పునరుత్థానం చేయబడలేదు. కాని అబ్రాహామునకు విశ్వాసమున్నది, తప్పనిసరయితే, “మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు” అని విశ్వసించాడు. (హెబ్రీయులు 11:19) అబ్రాహాము విశ్వాసము పరీక్షించబడిన 12 సంవత్సరాల తరువాత, అతని భార్య, శారా, మరణించింది. విశ్వాసముగల ఆయన ఎలా ప్రతిస్పందించాడు? ఆయన “శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి యేడ్చుటకు వచ్చెను,” అని బైబిలు వివరిస్తుంది.a (ఆదికాండము 23:2) ఔను, దేవుడు మృతులను పునరుత్థానము చేయగలడనే విశ్వాసమున్న ఆయనే బహిరంగంగా ఏడ్చాడు. అయినప్పటికిని, అబ్రాహాము ఇంకా విశ్వాసమునకు మాదిరి కర్తగానే చెప్పబడ్డాడు.—హెబ్రీయులు 11:8-10.

కోల్పోయిన ప్రియమైనవారి విషయం బహిరంగంగా బాధపడిన ఉదాహరణలలో హృదయాన్ని ద్రవింపజేసే మాదిరి యేసుక్రీస్తు. యేసుకు ప్రియస్నేహితుడైన, లాజరు మరణమునకు సంబంధించి, మనము ఇలా చదువుతాము: “అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడి ‘ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను.’ ఆమె ఏడ్చుటయు, ఆమెతోకూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు ‘అతని నెక్కడ నుంచితిరని’ అడుగగా, వారు ‘ప్రభువా, వచ్చి చూడుమని’ ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను.”—యోహాను 11:32-35.

పరిపూర్ణుడైన దేవుని కుమారుడే బహిరంగంగా ఏడ్చుటకు సిగ్గుపడలేదనే దాన్ని గమనించుట నిజంగా హృదయాన్ని ఉత్తేజపరచే విషయం. “కన్నీళ్లు విడిచెను” అనే దానికి మూల పదభావము (డాక్రే) అర్థం “నిశ్చలంగా కన్నీళ్లు రాల్చెను.” ఇంకా గమనించదగిన విషయమేమిటంటే యేసు అంతకు పూర్వం ఇద్దరు వ్యక్తులను పునరుత్థానం చేసాడు. నాయీనులోని విధవరాలి కుమారుడు మరియు యాయీరు కుమార్తె. ఆయన లాజరును పునరుత్థానం చేయడానికి పూర్తిగా ఉద్దేశించాడు. (లూకా 7:11-15; 8:41, 42, 49-55; యోహాను 11:11 పోల్చండి.) కొన్ని క్షణాల క్రితమే మార్తాతో ఆయన “పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.” అని చెప్పాడు. (యోహాను 11:25) అయినను, ఇటువంటి గాఢమైన భావావేశము యేసును ఆవరించగా ఆయన కన్నులనుండి కన్నీళ్లు పొంగి పొర్లాయి.

ఇంకను యోచింపదగిన ముఖ్యాంశము మరొకటుంది. యేసు “ఆయన [యెహోవా] తత్వముయొక్క మూర్తిమంతమునైయుండెను.” (హెబ్రీయులు 1:3) ప్రియమైనవారి మరణం పట్ల యేసుయొక్క మృదువైన మరియు ప్రగాఢమైన భావాలు మన పరలోక తండ్రి యెహోవాకు చిత్రీకరణగా ఉన్నాయి. అవి తన సేవకుల దుఃఖాన్నిబట్టి తన హృదయంలో తాము వ్యధను పొందే ఆయనకు ప్రతిబింబంగా ఉన్నాయి.—కీర్తన 56:8 పోల్చండి.

కాబట్టి స్పష్టంగా, మీ ప్రియమైన వారు ఒకరు మరణిస్తే బాధపడటం తప్పు కాదు. శారా మరణముపట్ల అబ్రాహాము అంగలార్చాడు. లాజరు మరణించినపుడు యేసు బహిరంగంగా ఏడ్చాడు. యెహోవా దేవుడు మన బాధను అర్థము చేసుకొనును ఎందుచేతననగా మనలనుగూర్చి “ఆయన చింతించుచున్నాడు (శ్రద్ధను)” కలిగియున్నాడు.—1 పేతురు 5:8.

అయినప్పటికి, క్రైస్తవ నిరీక్షణను విషయమేమిటి? దానిలో ఏమైనా వ్యత్యాసముందా?

‘ఇతరులవలె దుఃఖపడవద్దు’

మొదటి శతాబ్దంలో థెస్సలొనీకలోని క్రైస్తవ సంఘంవారు కోల్పోయిన తమ తోటి విశ్వాసులనుబట్టి బాధపడుతున్నప్పుడు, పౌలు వారిని ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఆయన ఇలా వ్రాశాడు: “సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మా కిష్టములేదు.” (1 థెస్సలొనీకయులు 4:13) నిజమే, పునరుత్థాన నిరీక్షణ లేని వారికన్న మృతులను లేపుతానను దేవుని వాగ్దానంపై విశ్వాసము కలిగియున్నవారు శ్రేష్ఠమైన స్థితిలో ఉన్నారు.b ఏ విధంగా?

మరణం సంభవించినపుడు, పునరుత్థాన నిరీక్షణ లేనివారు నిరాశగా ఉంటారు. దాని తరువాత మరల ఏదో ఒక జీవితమున్నదని నమ్మకమున్నదన్న దానిద్వారా ఆదరణ పొందేవారు కొంతమందే. కొంత ఉపశమనమును మాత్రమే దానినుండి పొందుతారు. చాలామందికి, వారి దుఃఖమునకు ఒక కారణం ప్రియమైనవారు మరణముద్వారా యెడబాటయ్యారనేకాక ఆ యెడబాటు శాశ్వతమైనందువలన కల్గుతుంది. పునరుత్థానమందు సరైన స్పష్టమైన అవగాహన నందు వారి ప్రియులతోపాటు వారి నిరీక్షణనుకూడా పాతిపెడుతున్నారు. వారి నమ్మకం ప్రకారం తిరిగి వాళ్లెన్నటికి ఇంక చూడరు.—1 కొరింథీయులు 15:12-19, 32 పోల్చండి.

ఏమైనప్పటికి, నిజ క్రైస్తవుల విషయంలో ఇది వేరుగా ఉంది. మరణం, పౌలు వివరించినట్లుగా, ఒక నిద్రవలె ఉంది—ఎందుకనగా అది ఏమీ ఎరుగని స్థితేకాక, తిరిగి పునరుత్థానముద్వారా మేల్కొల్పబడునట్లు గాఢనిద్రవలె ఉంది. (కీర్తన 13:3, 4; ప్రసంగి 9:5, 10) అందుకే బైబిలుపై ఆధారపడిన నిరీక్షణలో తేడా కలదు.

ఒక క్రైస్తవుడు తన ప్రియమైన వారిని మరణముద్వారా కోల్పోయినపుడు ఒక అవిశ్వాసి ఏలా భావిస్తాడో, అలాగే భావిస్తాడు. సహవాసము ముగుస్తుంది, కళ్లముందున్న ముఖం ఇక కనబడదు, ప్రియమైన స్వరం వినిపించకపోవడం, పునరుత్థాన నిరీక్షణ హృదయం భావావేశమును ఉప్పొంగకరంగా చేయదు. కేవలం అది దుఃఖమును తగ్గించగలదు, లేక సమతూకంగా పెట్టగలదు. నిరీక్షణ ఏడ్వవలసిన అవసరత లేకుండా చేయలేదుగాని, బాధను సులభంగా భరించునట్లు చేయగలదు. (g94 5/8)

[అధస్సూచీలు]

a “అంగలార్చుట” అను పదమునకు మూలమైన హెబ్రీ పదమును గూర్చి, థియోలాజికల్‌ వర్డ్‌బుక్‌ ఆఫ్‌ ది టెస్ట్‌మెంట్‌ ఇలా చెబుతుంది. “చనిపోయిన వ్యక్తిని గూర్చి బాధననుభవించే వారంతా, తమ దుఃఖాన్ని ఆ కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి వస్తారు. . . . తరచు తమ దుఃఖములో విపరీతమైన శబ్దముతో వచ్చు ఏడ్పులు, కేకలు ఉంటాయి.” “యేడ్పు” అను పదానికి మూలమైన హెబ్రీ పదాన్ని గూర్చి, అదే పుస్తకం వివరించేదేమంటే: “ఇందులో కండ్లనుండి కన్నీళ్లు, యేడ్పులో శబ్దము యిమిడి ఉంది. షేము వంశస్థులు మౌనంగా ఏడ్వరు. బిగ్గరగానే ఏడుస్తారు. పాత నిబంధనంతటిలో, సహజముగా, అదే సమయములో బలమైన భావోద్రేకానికి వ్యక్తీకరణై ఉంది.”

b పౌలు ఎవరికైతే రాస్తున్నాడో వారు మొదటి శతాబ్దములోని క్రైస్తవులు, వారు పరలోక పునరుత్థానము పొందే నిరీక్షణ కలిగివున్నారు. వాళ్లు అక్కడ క్రీస్తుతో సహాపరిపాలకులుగా పాలిస్తారు. (1 థెస్సలొనీకయులు 4:14-17; లూకా 22:29, 30 పోల్చండి) క్రీస్తు ప్రత్యక్షతాకాలంలో నమ్మకంగా ఉండి చనిపోయినవారు పునరుత్థానము పొంది క్రీస్తుతోను వారు ఒకరితో మరొకరు యేకమై పరలోక పునరుత్థానము పొందుతామనే నిరీక్షణతో వాళ్లు ఒకరినొకరు ఆదరించు కోవాలని పౌలు వారిని ప్రోత్సాహించాడు. అయితే చనిపోయిన వాళ్లల్లో ఎక్కువ మంది బైబిలు చూపునట్లు పునరుద్ధరించబడిన భూపరదైసులోకి, పునరుత్థానము అవుతారు.—యోహాను 5:28, 29; ప్రకటన 21:1-4.

[Picture Credit Line on page 22]

Jean-Baptiste Greuze, Le fils puni, Louvre; © Photo R.M.N.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి