కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 5/8 పేజీలు 18-21
  • ప్రజలు సమాధానముగా ఎలా కలిసి జీవించగలరు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రజలు సమాధానముగా ఎలా కలిసి జీవించగలరు
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బందీగా
  • ఎందుకు ఇంత అనైక్యత మరియు ద్వేషం?
  • జైలు జీవితం
  • జాంటీనాను తిరిగి కలుసుకొనుట
  • నా జీవితంలో ఓ మలుపు తిరిగిన సమయం
  • ఆత్మీయాభివృద్ధికి కృషిచేయుట
  • జర్మనీకు, అక్కడనుండి క్రొత్త ప్రాంతమునకు
  • “సిగ్గుపడనక్కరలేని పనివానిగా” ఉండేందుకు శ్రమించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • యెహోవాపై ఆధారపడడాన్ని నేర్చుకున్నాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • యుద్ధ వీరుడు క్రీస్తు సైనికుడు కావడం
    తేజరిల్లు!—1999
  • యెహోవా సహాయంతో మేము నిరంకుశ పరిపాలనల నుండి కాపాడబడ్డాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 5/8 పేజీలు 18-21

ప్రజలు సమాధానముగా ఎలా కలిసి జీవించగలరు

అది సెప్టెంబరు 1944, ప్రపంచమంతా ద్వేషంతో నిండివుంది. రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రమగుచున్నది మరియు లక్షలాది మంది భయంకరంగా బాధపడుతున్నారు. నేను జర్మనీ యుద్ధఖైదీగా ఫ్రాన్స్‌లో ఉన్నాను.

ఒకసారి నేను కాల్పులు జరిపే దళం ముందు ఉంచబడ్డాను. అయితే కొంతసేపటికి చంపే వాళ్లు అటువైపుగా జారుకోవడం ప్రారంభించారు. అది అంతాకూడ బెదిరింపుకొరకు మాత్రమే. నేను దిగ్భ్రాంతి చెందాను, అయినా జీవించి యున్నందుకు కృతజ్ఞతలు. కొన్ని వారాల తరువాత, మరలా అదే మాదిరిగా నాకు జరిగింది. నేను రక్షించబడినప్పటికి, ఎంతోమంది ఖైదీలు ఉరితీయబడ్డారు. వ్యాధులతోను లేదా ఆకలితోను చనిపోవటం జరిగింది. నేను ఇటువంటి పరిస్థితుల్లోకి ఎలా వచ్చాను?

బందీగా

కొన్ని నెలల ముందు, 1944 జూన్‌లో, మిత్రసేనలు ఇంగ్లీషు జలసంధిని దాటారు, మరియు ఫ్రెంచ్‌ తీరప్రాంతంలో సమర్థవంతంగా స్థావరం ఏర్పచుకొన్నాయి. వారు ఉత్తర ఫ్రాన్స్‌ను ముట్టడివేసిన పిమ్మట జర్మనీ సైన్యం వెనక్కు మరలక తప్పలేదు. నేను జర్మనీ వైమానిక దళంలో సైనికుల శిక్షణాధికారిగా నియమితుడైనాను. ఆగస్టులో మా కంపెనీలో ఒక భాగం, నాతోపాటు 16 మంది యితరులు, పేరుగావించిన మాక్సీ అనే ఫ్రెంచ్‌ రహస్య సిబ్బందిచే పట్టబడ్డాము. కొన్ని నెలల తరువాత యుద్ధ ఖైదీల శిబిరం నుండి దక్షిణ ఫ్రాన్స్‌లోని మాన్‌ట్లాకాన్‌ అనే మరో శిబిరానికి బదిలీ చేయబడ్డాము.

ఖైదీలందరు కష్టపడి పనిచేయుటకు బలవంతం చేయబడేవారు, కాని ఒక అధికారిగా నేను మినహాయింపబడ్డాను. అయినప్పటికి, నేను స్వచ్ఛందంగా పని చేయగా, వంటగదిలో పనులు చూచుటకు నియమింపబడ్డాను. ఒకరోజు క్రొత్త ఖైదీల గుంపు ఒకటి వచ్చింది, వారిలో విల్లీ అనే పేరుగల యౌవనుడు, నా స్వగ్రామమైన హుపార్ట్స్‌ నుండి వచ్చాడు. విల్లీ నాకు వంటగదిలో సహాయం చేయగలడేమోనని అధికారిని అడుగగా, ఆ ఏర్పాటు చేయబడింది.

తరువాత, నేను విల్లీ ఒకరకమైన స్నేహాన్ని ఆనందించాము, అదే ప్రజలందరినీ సమాధానంతో ఐక్యం చేయగలదు. నేను యిలా సమాధాన మార్గంలోనికి ఎలా వచ్చానో చెప్పుటకు ముందు, నా జీవితంలో విసిగించిన కొన్ని పరస్పర విరుద్ధాలను వివరిస్తాను.

ఎందుకు ఇంత అనైక్యత మరియు ద్వేషం?

జర్మనీలోని ఆచెన్‌ అనే ఊరిలో పెరుగుతూ, నా స్వంత కుటుంబంలోకూడా అలుముకునివున్న మతపరమైన అనైక్యతతో కలత చెందాను. తండ్రి లూథరన్‌, అయితే తల్లి ఒక రోమన్‌ కాథోలిక్కు. కాబట్టి, నా తల్లి కచ్చితంగా నన్ను, నా సహోదరిని కూడా కాథోలిక్కు విశ్వాసంలో పెంచాలని చూసింది. నా చిన్నతనంలో, నేను క్రమంగా కాథోలిక్కు చర్చికి వెళ్లేవాడ్ని, అయినప్పటికి, నా తండ్రి వేరే విశ్వాసాన్ని ఎందుకు అనుసరిస్తూన్నాడో ఎప్పుడును నాకర్థం కాలేదు. ‘దేవుడు కేవలం ఒక్కడే అయితే ఎందుకు యిన్ని మతాలున్నాయి?’ అని కాలం గడిచేకొలది, నేను తరచూ ఆశ్చర్యపడేవాడిని.

రెండవ ప్రపంచ యుద్ధం 1939లో మొదలైనప్పుడు, నేను జర్మనీ వైమానికదళంనకు పంపబడ్డాను. నేను జర్మనీలో ప్రాథమిక శిక్షణ పొందిన తర్వాత, సైనిక దళాలలో క్రొత్తగా చేరిన సైనికులకు శిక్షణను ఇవ్వడానికి వియన్నా, ఆస్ట్రియా దేశాలకు పంపబడ్డాను. ఆ తర్వాత డిశంబరు 1941లో నేను ఉత్తర హాలెండునకు పంపబడ్డాను (ఇప్పుడు నెదర్లాండ్స్‌). అక్కడ డెన్‌ హెల్డ్‌ర్‌ నుండి వచ్చిన జాంటినా అనే యౌవన స్త్రీని కలిశాను. మా ఇరువురి దేశాల మధ్య శత్రుత్వము, ఈర్ష్య ఉన్నప్పటికి మేము ప్రేమించుకున్నాము.

కొద్దికాలానికే, 1942 ఏప్రిల్‌లో నేను అనుకోని విధంగా లా రోచెల్లి అనే దక్షిణప్రాంతమైన ఫ్రాన్స్‌కు బదలీ చేయబడ్డాను. అప్పుడు అక్కడ సైనిక శిక్షణాధికారి హోదాను పొందాను మరియు మా సేనాదళం క్రొత్త సైనికులకు శిక్షణ యిచ్చు బాధ్యతకు, విమానాశ్రయాన్ని సంరక్షించుటకు నియమించబడింది. దాని ఫలితంగా, యుద్ధ జరిగేకాలంలో నేనెప్పుడును పోరాడలేదు. ఎప్పుడూకూడ నేను ఎవ్వరినీ చంపాలని కోరుకోలేదు గనుక, దానికి నేను కృతజ్ఞుడను.

అయినప్పటికి, యుద్ధం జరుగు సంవత్సరాలలో, కాథోలిక్కు, లూథరన్‌, ఎపిస్కోపల్‌ మొదలైన మతశాఖలకు సంబంధించిన మతగురువులు—విమానాలు మరియు నావికగణాలు, బాంబులు వేయడానికి పైకెగిరే ముందు ఆశీర్వదించడం నన్ను కలతపర్చేది. నేను అనేకసార్లు, ‘దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు?’ అని ఆలోచించేవాడ్ని. అయినప్పటికి, నేనెన్నడూ వాస్తవానికి సైనిక మతగురువులను అడగలేదు, ఎందుకంటే కచ్చితంగా వారికి ఏమీ తెలియదని నేను భావించాను.

గాట్‌ మిట్‌ ఉన్స్‌ (దేవుడు మాతో ఉన్నాడు) అని లిఖించబడిన కేడెమును, దట్టిని జర్మనీ సైనికులందరు ధరించుకొనేవారు, అయితే, ‘ఎందుకు దేవుడు అవతలవైపున సైనికులకు తోడుగా లేడు, వాళ్లుకూడా అదే మతాన్ని కలిగియుండి, అదే దేవునికి ప్రార్థన చేస్తున్నారు కదా?’ అని నేను ఆలోచించాను.

సంవత్సరాలు గడిచాయి, యుద్ధం కొనసాగుతునే ఉంది. అనిశ్చితంగా, అంటే 1943 డిశంబరులో, చివరసారి బంధీగా పట్టుబడక ముందు మా వివాహ ఒప్పందం కుదిరినప్పుడు, నేను జాంటినాను చూడటానికి హాలెండ్‌ వెళ్లాను. మరలా 1944లో పోరాటం తిరిగి మొదలైనది, ఫ్రాన్స్‌లోని మిత్ర సైనిక దళాలు స్థావరం వేయడంతో, మొదటిసారిగా జర్మనీ యుద్ధంలో ఓడిపోయే అవకాశం ఉందని మేము గుర్తించాము. ఆ ఆలోచన నిజంగా దిగ్భ్రాంతిపరచేదే! ఆగస్టు వచ్చేటప్పటికి మాలో 17 మందిమి బందీలుగా పట్టబడ్డాము.

జైలు జీవితం

ఆఖరికి మాన్‌ట్లూకాన్‌ నందున్న ఖైదీలమైన మేము బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకొనుటకు అనుమతింపబడ్డాము. ఆవిధంగా నేను, జాంటినా తిరిగి సంబంధం ఏర్పరుచుకొన్నాము. ఈలోపున, ఎక్కడైతే మేము యుద్ధ ఖైదీలుగా ఉంటున్నామో అక్కడ, కొంతమంది ఖైదీలతో కలసి, నేను ఉమ్మడి వ్యవసాయాన్ని స్వచ్ఛందంగా చేశాను. వ్యవసాయపు జీవితం నాకు బాగున్నట్టుగానే కనిపించడంతో దాన్ని నేను యిష్టపడ్డాను. ఒక నగర బాలునికి జీవిత శైలిలో గొప్పమార్పే అది.

ఐరోపాలోని యుద్ధం 1945, మే నెలలో ముగింపునకు వచ్చినప్పటికి, ఫ్రెంచి ప్రభుత్వం 1947 డిశంబరు వరకు మమ్మల్ని యుద్ధఖైదీలుగానే ఉంచింది. మాకు ఫ్రెంచ్‌ విదేశీ సైన్యంలో చేరడానికి లేదా ఫ్రాన్స్‌లోనే 1948 చివరివరకు స్వచ్ఛంద కార్మికులుగా కొనసాగడానికి అవకాశం ఇవ్వబడింది. నేను రెండవ దానినే ఎంపిక చేసుకొన్నాను, ఇతర ఖైదీలతో కలిసి ఉమ్మడి వ్యవసాయం చేయసాగాను. ఈ ఏర్పాటుక్రింద, యుద్ధఖైదీలకన్నా, వ్యవసాయ పనిలో కలిసి పనిచేయడంలోనే మేము ఎక్కువ స్వాతంత్ర్యమును పొందాము. అయినప్పటికి, మేము నిర్భందంలో మరియు పరిమితులలోనే ఉంచబడ్డాం. ఆవిధంగా మా బంధువుల దగ్గరనుండి ఉత్తరాలు అందుకోవడమే మాకున్న గొప్ప సంతోషము.

జాంటీనాను తిరిగి కలుసుకొనుట

ఒకరోజున 1947లో, నేను జాంటీనా నుండి ఒక ఉత్తరాన్ని అందుకున్నాను, ఆమె పొరపాటున పెట్టిన ఒక ముద్రించిన చిన్న స్లిప్‌లో కొన్ని ఇంటి నెంబర్లు మరియు కొన్ని పుస్తకాల, పత్రికల రికార్డు అందులో ఉంది. ‘అయితే, జాంటీనా పుస్తకాలు అమ్మి కొంత డబ్బు సంపాదిస్తుందన్నమాట’ అని తలంచాను. ఆమెను యెహోవా సాక్షులు కలిశారని మరియు ఇంటింటి సువార్తలో చురుకుగా పాల్గొంటూ, బైబిలు సాహిత్యాలను పంచిపెట్టుతున్నదేకాని, ‘పుస్తకాలు అమ్మడం’ లేదని మాత్రం నాకు తెలియదు.

కొద్దికాలంలోనే, 1947 డిశంబరులో ఖైదీలైన మేము ఒక ఉల్లాసకరమైన విస్మయం పొందాం—మా యింటిని దర్శించుటకు మాకు కరుణతో నాలుగు వారాల సెలవు అనుమతించ బడింది. యిదికూడా మళ్లీ మేము ఫ్రాన్స్‌కు తిరిగి వచ్చే షరతు మీద, మాపనిని పూర్తిచేయు నిబద్దతపైన ఆధారపడియుంది. జాంటీనా కూడా హాలెండ్‌నుండి జర్మనీకి ప్రయాణించి, రెండు వారాలు నాతో మరియు నా తల్లిదండ్రులతో గడపటాన్కి వచ్చింది. మీరు ఊహించగల్గినట్లుగా నాలుగు కంటే ఎక్కువ సంవత్సరాల వియోగం తరువాత, మాకు ఇది ఒక మంచి భావపూరితమైన కలయిక. ఆమె ఉత్తరంలో నేను కనుగొన్న ముద్రించిన స్లిప్‌యొక్క అర్ధాన్ని ఆ తర్వాతనే నేను తెలుసుకొన్నాను. జాంటినా తాను యెహోవా సాక్షులలో ఒకతెయని మరియు తాను తెలుసుకొన్న అద్భుతకరమైన విషయాలను ఆసక్తితో నాకు వివరించింది.

అయినప్పటికి ఆమె చెప్పిన దానిలో సత్యమున్నట్లు నాకు అనిపించినప్పటికి, నేను మాత్రం కాథోలిక్కుగానే ఉండుటకు ఇష్టపడుచున్నానని చెప్పాను. ఎన్నో సంవత్సరాలు మతాన్ని అధ్యయనం చేసిన మతగురువులకన్నా ఆమెకు ఎక్కువ ఎలా తెలుసో, నేను గ్రహించలేదు. పరిస్థితులను ఇంకనూ భారము చేయుటకు, నా తల్లిదండ్రులు జాంటినా తెలుసుకొన్న క్రొత్త నమ్మకాలను దయతో స్వీకరించలేదు. నిజానికి, వాళ్ళు వ్యతిరేకించారు, మరి వారియొక్క ప్రతికూలాభిప్రాయం నాపై చాలా ప్రభావం చూపింది.

నా జీవితంలో ఓ మలుపు తిరిగిన సమయం

నా నాలుగువారాల సెలవు ముగియగానే, నేను మరలా ఫ్రాన్స్‌కు తిరిగి వచ్చాను. సర్దిన నా దుస్తులను విప్పేటప్పుడు, అందులో డెలివరెన్స్‌ అనే పుస్తకాన్ని నేను కనుగొన్నాను. జాంటినా నా సూట్‌కేసును సర్దుతున్నపుడు ఆమె దానిని పెట్టింది. ఆమెను సంతోషపెట్టుట కొరకు నేను దానిని కూర్చొని చదవడం ప్రారంభించాను. నేను చెరసాలలో ఉన్నపుడు, నేను ఆలోచించిన చాలా ప్రశ్నలకు సమాధానములను ఇంత త్వరలో కనుగొనినందుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను పుస్తకాన్ని పూర్తిగా చదవాలని ఎంతో ఆసక్తితో ఉన్నాను.

జాంటినా చెప్పిన ఒక లేఖనం జ్ఞప్తికి వచ్చింది: “మీరు సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” (యోహాను 8:32) వాస్తవంగా, నేను సత్యాన్నిగూర్చి అలా అనేక విషయాలు నేర్చుకోవడం ప్రారంభించానని తలంచాను. ప్రజలందరునూ ఒకే కుటుంబము, వారిలో జాతి భేదములేదు. (అపొస్తలుల కార్యములు 17:26-28) నిజ క్రైస్తవులు ఒకరి యెడల ఒకరు ప్రేమను కలిగియుందురనియు, క్రైస్తవులమని చెప్పుకునే వారివలే వారు యుద్ధం చేయరనియు, ఎవ్వరినీ చంపారనియు నేను తెలిసికొన్నాను. (యోహాను 13:34, 35; 1 యోహాను 3:10-12) అయితే, స్పష్టంగా, సాతాను ఉపకరణమైన జాతీయత ప్రజలను విభాగిస్తుంది, నిజ సహోదరత్వాన్ని అడ్డగిస్తుంది.

యేసుక్రీస్తు బోధలను ప్రజలందరూ అన్వర్తింప చేసికొన్నట్లయితే, నిజమైన సమాధానం వచ్చునని నేను గ్రహించడం మొదలుపెట్టాను. దేశాలు దానిని ఎన్నటికీ చేయలేవు గనుక, యేసుక్రీస్తు ప్రార్థించమని, తన అనుచరులకు బోధించిన దేవుని ప్రభుత్వమే శాంతి కొరకున్న ఏకైక నిరీక్షణైయున్నది. (మత్తయి 6:9, 10) అప్పటికే నేను నిజ స్వాతంత్ర్యమును పొందిన అనుభూతిని మరియు నేను నేర్చుకొనిన విషయాలనుండి తృప్తిని అనుభవించుటకు ప్రారంభించాను. ఆ పుస్తకాన్ని నా సూట్‌కేసులో పెట్టిన నా ప్రియమైన జాంటినాకు నేను ఎంత కృతజ్ఞుడను! అయితే నేను ఇప్పుడు ఏమి చేయాలి?

ఆత్మీయాభివృద్ధికి కృషిచేయుట

సరే, నేను వ్యాకులపడాల్సిన పనిలేదు. కొన్ని రోజుల తరువాత, ల్యూసియన్‌ అనే పేరుగల ఓ వ్యక్తి నేను పనిచేయు వ్యవసాయపు పొలానికి వచ్చి, తాను యెహోవా సాక్షులలో ఒక పరిచారకుడని తనను తాను పరిచయం చేసుకొన్నాడు. నాకు నిశ్చితమైన వధువుయొక్క విజ్ఞప్తిపై పారిస్‌లోని సాక్షుల బ్రాంచి కార్యాలయంనుండి నన్ను కలిసికొనుటకు పంపబడ్డానని వివరించాడు. ల్యూసియన్‌ దయగల, మంచి వ్యక్తి గనుక నేను త్వరగా ఆయనతో కలిసిమెలగుటకు సహాయపడింది. అన్నట్టుగా, ప్రస్తుతానికి నేను ఫ్రెంచ్‌ ధారాళముగా మాట్లాడగలను కాబట్టి, ఈ పరిస్థితులు చాలా అనుకూలించాయి.

ఆయనతో నేను బైబిలు పఠించడానికి అంగీకరించాను, అందుకే ప్రతి ఆదివారం ల్యూసియన్‌ ఆయన భార్య సీమోన్‌ కూడా కలిసి నా పొలానికి వచ్చి, పఠనం చేయడానికి వారి ఇంటికి నన్ను తీసుకొని వెళ్లేవారు. దాని తరువాత మేము కొంతదూరం అలా నడుస్తూ, యెహోవాయొక్క అద్భుతమైన సృష్టినిగూర్చి మాట్లాడుకొనేవారం. వాళ్లిద్దరు మంచి బోధకులు, చాలాకాలంనుండి నేను పొందలేనిది వారినుండి పొందాను—అదే నిజమైన స్నేహం. బాంబు వేసి చంపుటకు తర్ఫీదును పొందిన ప్రజలనుండి—అదే ఒక ఫ్రెంచ్‌ దంపతులనుండి దీనిని పొందగలిగాను!

పఠనములందు నేను మంచి పురోభివృద్ధి పొందాను. మరియు మార్చి 25, 1948న జరిగే క్రీస్తు మరణ దిన వార్షిక జ్ఞాపకార్ధ కూటమునకు హజరవ్వడానికి ల్యూసియన్‌ నన్ను ఆహ్వానించాడు. సామాన్యమైందే అయినా గంభీరమైన ఈ కూటంతో నేను ముగ్ధుడనయ్యాను. అప్పటినుండి జ్ఞాపకార్ధకూటానికి హజరవ్వకుండా తప్పిపోలేదు.

జాంటినా నా ఆత్మీయాభివృద్ధి పట్ల ఆనందించి, ఆమె నాతో ఫ్రాన్స్‌లో కలిసింది. అక్కడ మాకు 1948 నవంబరులో వివాహం జరిగింది. ల్యూసియన్‌ మరియు సీమోన్‌ కలిసి మాకు మంచి వివాహవిందును చేశారు, మాతోపాటుగా ఇద్దరు పయినీర్లు (యెహోవా సాక్షుల పూర్తికాల సేవకులు) కూడా ఈ శుభసందర్భంలో పాల్గొన్నారు. యేసు తన శిష్యులను గుర్తిస్తుందని చెప్పిన ప్రేమను సాక్షులు నిజంగా ప్రదర్శిస్తారనే నా తలంపును, మరచిపోలేని ఆ సాయంత్రం దృఢం చేసింది.—యోహాను 13: 35.

జర్మనీకు, అక్కడనుండి క్రొత్త ప్రాంతమునకు

డిశంబరు 1948లో, మేము జర్మనీకి తిరిగి వచ్చాం, క్రైస్తవ పరిచర్యయే మా జీవితమార్గమైనది. మా కుటుంబం మా పనిని వ్యతిరేకిస్తున్నప్పటికి, అదే మమ్ములను ఆపుచేయుటకు మేము అనుమతించలేదు. మానవజాతి నిజమైన శాంతి భద్రతలను అనుభవించగల ఏకైక మార్గాన్ని గూర్చి నేర్చుకొనుటకు దీనులకు, సాత్వికులకు సహాయం చేస్తూనే ఉన్నాము.

నేను, జాంటినా కలసి 1955లో ఆస్ట్రేలియాకు వలసవెళ్లాం. మేము ప్రారంభంలో విస్తారమైన ముఖ్య ప్రదేశపు దక్షిణకొన నుండి బాస్‌ సెయిట్‌ మీదుగావున్న సుందరమైన టాస్మేనియా ద్వీపంలో నివాసమేర్పరచుకున్నాం. అక్కడున్న ఆత్మీయ సహోదర, సహోదరీల ప్రేమపూర్వకమైన సహాయము, ఓర్పు తుదకు మేము మాకు తెలిసిన భాషలతోపాటు ఇంగ్లీషునుకూడా నేర్చుకొనుటకు తోడ్పడింది.

టాస్మేనియాలో 13 సంవత్సరాలు గడిపిన తరువాత, 1969లో ఉత్తర రాష్ట్రమైన క్వీన్స్‌లాండ్‌నకు వచ్చి, అప్పటినుండి ఇప్పటివరకు అక్కడనే ఉంటున్నాం. నేను ప్రస్తుతం స్థానిక సంఘంలో ఒక క్రైస్తవ పెద్దగావుంటూ, జాంటినా సాంగత్యంలో ఆనందాన్ని పంచుకొంటూ, యెహోవాను సేవించుటలో కొనసాగుతున్నాను. ఎప్పుడు సెలవుపై జర్మనీకి వెళ్లినా, మేము విల్లీ హుప్పార్‌ట్చ్‌ కోసం వెదకి, అతనితో బైబిలు పఠనం చేసేవారం. తుదకు అతడుకూడ యెహోవాకు తన జీవితాన్ని సమర్పించుకొని సేవచేస్తూ, ప్రజలందరినీ సమాధాన ఐక్యపర్చే స్నేహభావాన్ని మేము అనుభవిస్తున్నాము.

ఖైదీగా ఫ్రాన్స్‌ యుద్ధంలో గడిపిన సంవత్సరాలను, ఒకసారి నా జీవితాన్ని వెనుకకు తిరిగిచూసిన యెడల వాస్తవంగా నేను మన ప్రేమ పూర్వక సృష్టికర్తయైన యెహోవాను గూర్చి తెలుసుకున్నందుకు నేను కృతజ్ఞుడను. జాంటినా స్వంతంగా ముందు నిర్ణయం తీసుకొని నా సూట్‌కేస్‌లో ఆ డెలివరెన్స్‌ పుస్తకం పెట్టి, ఫ్రాన్స్‌లోని సాక్షులకు వ్రాసి నన్ను కలుసుకొనమని ఏర్పాటు చేసినందుకు నేనెంత ధన్యుడను! దాని ఫలితంగా, నా వ్యక్తిగత జీవితము మరియు భార్యాభర్తలుగా మా యిద్దరి జీవితంకూడ మెరుగుగలదై ఎన్నో విధాల ఫలితాలను తెచ్చింది.—హాన్స్‌ చెప్పాడు. (g94 4/22)

[21వ పేజీలోని చిత్రం]

ఈరోజు జాంటినాతో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి