కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 2/8 పేజీలు 18-19
  • యెహోవా యుద్ధ దేవుడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా యుద్ధ దేవుడా?
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పూర్వపు తీర్పులు
  • శాంతి కొరకు దేవుని యుద్ధాలు అవసరమయ్యాయి
  • యెహోవా కట్టడలు శాంతిని పెంపొందిస్తాయి
  • దేవుని తీర్పులు—ఆయన క్రూరత్వానికి నిదర్శనాలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • నూతన లోకములోనికి విడుదల కొరకు సిద్ధపడుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • మనం అప్రమత్తంగా ఉండడం ఇప్పుడు మరింత అత్యవసరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • దైవభక్తిగల ప్రజల కొరకు విడుదల సమీపముగా ఉన్నది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 2/8 పేజీలు 18-19

బైబిలు ఉద్దేశము

యెహోవా యుద్ధ దేవుడా?

యెహోవా యుద్ధ దేవుడని, రక్తపిపాసియని కొందరు బైబిలు పాఠకులు ఎప్పుడో నిందించారు. ఉదాహరణకు, బైబిలు దేవుడైన యెహోవా “దోపిడీదారుల, హింసకుల, యుద్ధ వీరుల దేవుడని, ప్రతి క్రూర విజయం యెడల ఆశగల దేవుడని” ది స్టోరీ ఆఫ్‌ సివిలైజేషన్‌—మాన్స్‌ ఓన్‌ షో అనే తన పుస్తకంలో జార్జ్‌ ఎ. డార్‌సే ఆరోపించాడు. బైబిలు విమర్శకుడైన రోలాండ్‌ హెచ్‌. బాన్‌టెన్‌ ఇలా అన్నాడు: “దేవుడు యుద్ధంలో భాగం వహించకుండా ఉంటే అది ఎక్కువ మానవత్వం గలదై ఉంటుంది.”

యెహోవా నిజంగా యుద్ధ దేవుడా? కొంతమంది అన్నట్లు, నిజంగా ఆయన నిర్దోషులను చంపడాన్ని ఇష్టపడతాడా?

పూర్వపు తీర్పులు

నిజమే, యెహోవా దేవుని పూర్వపు ప్రతికూల తీర్పులను గురించి బైబిలు నిష్పక్షపాతంగా తెలియజేస్తుంది. అయితే, అవి ఎప్పుడూ భక్తిహీనులైన వారికి వ్యతిరేకంగా జరిగినవే. ఉదాహరణకు, నోవహు దినాల్లో భూమి “బలాత్కారముతో నిండిన” తరువాత మాత్రమే, యెహోవా ఇలా చెప్పాడు: “ఇదిగో నేనే జీవవాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును.” (ఆదికాండము 6:11, 17) మరో తీర్పు ఏమిటంటే సొదొమ గొమొర్రా పట్టణాలు “వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారులైనందు” వల్లనే దేవుడు “గంధకమును అగ్నిని” కురిపించాడు.—యూదా 7; ఆదికాండము 19:24.

నోవహు దినాల్లో శరీరులందరినీ నాశనం చేయడాన్ని దేవుడు ఇష్టపూర్వకంగా ఆనందించాడా? లేక సొదొమ గొమొర్రా నివాసులను నాశనం చేయడం ద్వారా ఆయన ఒక విధమైన రాక్షస ఆనందాన్ని పొందాడా? జవాబు కొరకు మనం నోవహు దినాల జలప్రళయపు ముందు వెనుకటి సంఘటనలను పరిశీలిద్దాం. భూమిపైనుండి దౌర్జన్యాన్ని తీసివేయడానికి దుష్ట మానవులను దేవుడు నిర్మూలిస్తాడని చెప్పిన తరువాత బైబిలిలా చెబుతుంది: “యెహోవా . . . తన హృదయములో నొచ్చుకొనెను.” అవును, “వారి [మానవుని] హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు” దేవుడు సంతాపమునొందెను. కాబట్టి, రాబోయే జలప్రళయం నుండి సాధ్యమైనంతమందిని కాపాడాలని, హెచ్చరిక చేయడానికి, కాపాడడానికి ఒక ఓడను నిర్మించాలని దేవుడు “నీతిని ప్రకటించిన” నోవహును పంపించాడు.—ఆదికాండము 6:3-18; 2 పేతురు 2:5.

అదే విధంగా, సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికై దూతలను పంపించే ముందు దేవుడు ఇలా చెప్పాడు: “నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; . . . నేను తెలిసికొందుననెను.” (ఆదికాండము 18:20-32) తన పరిశోధనలో కేవలం పదిమంది నీతిమంతులున్నట్లు తెలిసినా ఆ పట్టణాలను విడిచి పెడతానని యెహోవా (ఎవరి అన్న కుమారుడైన లోతు సొదొమలో నివసిస్తున్నాడో) ఆ అబ్రాహాముకు హామీ ఇచ్చాడు. రక్తాన్ని చిందించడంలో ఆనందాన్ని పొందే దేవుడు అలాంటి కనికరంగల శ్రద్ధను చూపిస్తాడా? దానికి భిన్నంగా, యెహోవాకున్న అత్యంత ప్రధానమైన లక్షణాల్లో కనికరం ఒకటని మనం చెప్పలేమా? (నిర్గమకాండము 34:6) ఆయన స్వయంగా ఇలా చెబుతున్నాడు: “దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును.”—యెహెజ్కేలు 33:11.

ప్రజలను చంపడం యెహోవాకిష్టమైనందుకు కాదుగాని, దుష్ట ప్రజలు తమ చెడు నడవడిని విడిచిపెట్టడానికి వారు ఖచ్చితంగా నిరాకరించినందుకు మాత్రమే దేవుని యొద్ద నుండి వ్యతిరేకమైన తీర్పులు వారికి వచ్చాయి. అయితే, ‘ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేసి వారిని నిర్మూలించాలని యెహోవా ప్రోత్సహించలేదా?’ అని మీరు అనుకోవచ్చు.

శాంతి కొరకు దేవుని యుద్ధాలు అవసరమయ్యాయి

కనానీయుల జీవితాన్ని గురించి చరిత్ర చాలా అసహ్యమైన వివరణ ఇస్తుంది, వారు ఎంతో దుష్టులైయుండిరి. ఆ దినాల్లో అభిచారం, పిల్లలను బలి ఇవ్వడం, హింసాయుత దౌర్జన్యం, నానా విధమైన అక్రమ లైంగికారాధన పెచ్చుపెరిగిపోయింది. అనితర భక్తిని పొందదగిన న్యాయం తీర్చగల దేవునిగా యెహోవా, ఈ హేయమైన ఆచారాలు అమాయక ప్రజల యొక్క, ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయుల శాంతి భద్రతలను భంగపరచడానికి అనుమతించడు. (ద్వితీయోపదేశకాండము 5:9) ఉదాహరణకు, మీరు నివసించే సమాజంలో చట్టాన్ని అమలులో పెట్టడానికి మంచి పేరుగాంచిన పోలీసులు లేక సైన్యం లేరనుకోండి, అప్పుడు అరాచకత్వం, భయంకరమైన దౌర్జన్యం ప్రబలిపోవా? అలాగే, కనానీయుల స్వేచ్ఛావిహారాన్నిబట్టి, స్వచ్ఛారాధనకు వారు కలుగజేసే ప్రమాదాన్నిబట్టి, యెహోవా వారికి వ్యతిరేకంగా చర్య గైకొనవలసి వచ్చింది. అందుకే ఆయనిలా ఆజ్ఞాపించాడు: “ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను.”—లేవీయకాండము 18:25.

దేవుని ఆజ్ఞలు అమలుపరిచే ఇశ్రాయేలీయుల సైన్యాలు కనానీయులను నాశనం చేసినప్పుడు దైవిక న్యాయం నెలకొల్పబడింది. ఈ తీర్పులను జరిగించడానికి దేవుడు అగ్ని లేక జలప్రళయానికి బదులు మానవులను ఉపయోగించడానికి ఎన్నుకున్నాడన్న వాస్తవం ఆ తీర్పును తక్కువ చేయలేదు. కాబట్టి, కనాను యొక్క ఏడు జనాంగాలతో యుద్ధం చేసేటప్పుడు, ఇశ్రాయేలీయుల సైన్యాలు ఇలా ఉపదేశింపబడ్డాయి: “ఊపిరి గల దేనిని బ్రదుకనియ్యకూడదు.”—ద్వితీయోపదేశకాండము 20:16.

అయినా, జీవాన్ని గౌరవించే దేవునిగా, ఆయన విచక్షణారహిత సంహారాన్ని అనుమతించలేదు. ఉదాహరణకు, ఒక కనాను పట్టణమైన గిబ్యోను నివాసులు కనికరించుమని కోరినప్పుడు యెహోవా కనికరించాడు. (యెహోషువ 9:3-27) ఒక దుష్టుడైన యుద్ధ దేవుడు ఇలా చేసివుండేవాడా? కాదు, గాని శాంతిని, న్యాయాన్ని ప్రేమించే దేవుడైతేనే అలా చేస్తాడు.—కీర్తన 33:5; 37:28.

యెహోవా కట్టడలు శాంతిని పెంపొందిస్తాయి

బైబిలు, దేవుని దీవెనలను శాంతితో జతచేస్తున్నది. ఎందుకంటే, యెహోవా శాంతిని ప్రేమించేవాడే గాని యుద్ధాన్ని ప్రేమించేవాడు కాదు. (సంఖ్యాకాండము 6:24-26; కీర్తన 29:11; 147:12-14) కాబట్టి, యెహోవా ఆరాధన కొరకు ఒక ఆలయాన్ని కట్టాలని రాజైన దావీదు ఇష్టపడినప్పుడు, దేవుడాయనతో యిలా చెప్పాడు: “నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి.”—1 దినవృత్తాంతములు 22:8; అపొస్తలుల కార్యములు 13:22.

భూమి మీద ఉన్నప్పుడు గొప్ప దావీదైన యేసుక్రీస్తు, న్యాయం యెడల దేవునికున్న ప్రేమ, ప్రస్తుతకాలంలో మనం చూస్తున్న దుష్టత్వాన్ని ఆయన ఇక సహించడానికి అనుమతించని సమయాన్ని గురించి మాట్లాడాడు. (మత్తయి 24:3, 36-39) నోవహు దినాలనాటి జలప్రళయంలో, సొదొమ గొమొర్రాల నాశనంలో చేసినట్లే దేవుడు త్వరలోనే భూమి మీద నుండి స్వార్ధపర, దుష్ట మనుష్యులను నిర్మూలించి, తన పరలోక రాజ్యపరిపాలన క్రింద శాంతియుతమైన పరిస్థితులు ఏర్పడడానికి మార్గం సుగమం చేస్తూ న్యాయపరమైన చర్యగైకొంటాడు.—కీర్తన 37:10, 11, 29; దానియేలు 2:44.

స్పష్టంగా, యెహోవా రక్తదాహంగల యుద్ధ దేవుడు కాదు. మరోవైపు, న్యాయపరమైన శిక్ష విధించడం తగినదైనప్పుడు అలా చేయకుండా ఆయన వెనుదీయడు. మంచితనం యెడల దేవునికున్న ప్రేమ, ఆయనను ప్రేమించే వారిని అణచివేస్తున్న దుష్ట విధానాన్ని నాశనం చేయడం ద్వారా వారి కొరకు చర్యగైకొనడానికి ఆయన్ని నడిపిస్తుంది. ఆయనలా చేసినప్పుడు, “సమాధానకర్తయగు దేవుడైన” యెహోవాను నిజంగా సాత్వికులైన వారు ఐక్యంగా ఆరాధిస్తుండగా నిజమైన శాంతి భూమ్యంతటా వ్యాపిస్తుంది.—ఫిలిప్పీయులు 4:9. (g93 11/8)

[Picture Credit Line on page 18]

David and Goliath/The Doré Bible Illustrations/Dover Publications, Inc.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి