కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 10/8 పేజీలు 8-11
  • వివాహ జీవితం—దాన్ని ఆనందభరితంగా చేయుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వివాహ జీవితం—దాన్ని ఆనందభరితంగా చేయుట
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వైవాహిక ఆనందానికి మూలం
  • మీ అతిసమీప బంధువుకు ప్రేమను కనబరచుట
  • “వివాహ పానుపు నిష్కల్మషమైనదిగా” ఉండనీయండి
  • భర్తలారా, మీ భార్యలను ప్రేమించి, పోషించండి
  • “ఉప్పువేసినట్టు రుచిగలదిగా ఉండనియ్యుడి”
  • క్రైస్తవులు తమ వివాహబంధాన్ని ఎలా సంతోషమయం చేసుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • నిరంతరం నిలిచే వివాహానికి రెండు కీలకాలు
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • మీ వివాహాన్ని చిరకాల బంధంగా చేసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఒకవేళ వివాహం విచ్ఛిన్నం కాబోయే స్థితిలో ఉంటే
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 10/8 పేజీలు 8-11

వివాహ జీవితం—దాన్ని ఆనందభరితంగా చేయుట

వివాహాన్ని విజయవంతం చేయగల్గేదేమిటి?

ఎవరి మార్గదర్శకం వైవాహిక ఆనందానికి నడుపగలదు?

ఒకరితోనొకరు సంభాషించుటలోగల సమస్యలు ఎలా పరిష్కరించబడగలవు?

స్త్రీల స్వతంత్రతను గూర్చిన పుస్తకాలు చదవడంద్వారా ప్రభావితులై, యాసుహీరొ, అతని స్నేహితురాలు కాయొకొ ఎప్పుడైనా తెగతెంపులు చేసుకోవచ్చనే తలంపుతో కలసి జీవించడం మొదలుపెట్టారు. కేవలం కాయొకొ గర్భం ధరించిన తర్వాతనే వారి వివాహాన్ని చట్టబద్ధం చేసుకున్నారు. అయినప్పటికి, యాసుహీరొ కుటుంబ ఏర్పాటును సందేహిస్తూనేవుండెను. ఆర్ధికసమస్యలు రావడంతోను, ఇద్దరికి పొసగదనే భావంతోను, వారిరువురు విడాకులు తీసుకొనుటకు వెనుకాడలేదు.

విడాకులు తీసుకున్న కొంతకాలం తర్వాత, ఒకరికొకరు తెలియకుండానే, యాసుహీరొ, కాయొకొ యిద్దరూ యెహోవాసాక్షులతో బైబిలును పఠించడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత, ఈ విషయం యిద్దరికీ తెలిసింది, బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా ఒకరు మరొకరి జీవితంలో చేసుకున్న మార్పులను గమనించగల్గారు. వారు తిరిగి వివాహం చేసుకోడానికి నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం, వివాహం యెడల వారికున్న దైవిక దృక్పథంతో, వారి సమస్యలను పరిష్కరించుకోడానికి వారు త్యాగం చేయుటకు యిష్టపడుతున్నారు.

వారు తిరిగి చేసుకున్న వివాహాన్ని విజయవంతం చేసిందేమిటి? వివాహ ఏర్పాటుచేసిన వానియెడల వారికిగల గౌరవమే విజయానికి దోహదమైంది. (ఆదికాండము 2:18-24) అత్యంత అనుభవజ్ఞుడును, వివాహ సలహాదారుడైన యెహోవా దేవునిద్వారా యివ్వబడిన మార్గదర్శకమే వైవాహిక ఆనందానికి ముఖ్యమైన మార్గాన్ని తెరస్తుంది.

వైవాహిక ఆనందానికి మూలం

“నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును [యెహోవాను NW] ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే” అని యేసుక్రీస్తు చెప్పినదానిని దంపతులిద్దరూ అన్వయించినప్పుడు వైవాహిక సమస్యలు పరిష్కరించబడగలవు, వివాహాలు సంరక్షించబడగలవు. (మత్తయి 22:37-39) ఇదే వైవాహిక ఆనందానికి మూలం. భార్యాభర్తలిద్దరూ తమ్మునుతాము ఒకరినొకరు ప్రేమించుకునే ముందు యెహోవాను ప్రేమించాలి. ఈ బంధాన్ని మూడు పేటల త్రాడుకు పోల్చవచ్చును. “ఒంటరియగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?”—ప్రసంగి 4:12.

దేవుని ఆజ్ఞలను పాఠించడమే ఆయనను ప్రేమించడం గనుక, భార్యాభర్తలిద్దరు, మానవ ప్రవర్తనకు సంబంధించిన ఆయన సూత్రాలను నియమాలను మొదటిగా వారి జీవితాల్లో అమలుపర్చాలి. తద్వారా వారు మూడు పేటల త్రాడును తయారు చేస్తున్నారు, దానిలో దృఢమైన పేట యెహోవా యెడల వారికిగల ప్రేమయే. అంతేకాకుండ “ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని 1 యోహాను 5:3 చెబుతుంది.

వివాహాన్ని ఒక శాశ్వత ఏర్పాటుగా దృష్టించడానికి యిది నడిపిస్తుంది. (మలాకీ 2:16) వివాహజీవితంలో అలాంటి పునాదిగల జంట విడాకులు పొందడంద్వారా సమస్యలను ఎదుర్కొనలేక దొడ్డిదారిన పారిపోవడంకంటే, వైవాహిక సమస్యలను దిగ్విజయంగా ఎదుర్కొనడానికి తీర్మానించుకుంటారు.

మీ అతిసమీప బంధువుకు ప్రేమను కనబరచుట

మీ సహవాసితో శాశ్వత బంధం కల్గివుండటానికి మీరు మీ అతి సమీప బంధువైన ఆమె లేదా అతనియెడల మీకున్న ప్రేమను విలువైందిగా పరిగణించి పోషించాలి. ఈ ప్రేమ నిస్వార్ధమైనదై వుండాలి. బైబిలు ప్రోత్సహించే ఈ సూత్రాన్ని గమనించండి: “మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.”—ఫిలిప్పీయులు 2:2-4.

నిజమే, ఈ స్వార్ధపూరిత ప్రపంచంలో కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయకుండుటయనేది కష్టమే. మీ సహవాసి ప్రేమను కనబరచుటలో సాహసించకపోతే, నిస్వార్ధమనేది యింకా కష్టమౌతుంది; కాని వినయమైన మనస్సుకలిగి యుండటంద్వారా, మీ సహవాసి మీకంటే యోగ్యమని యెంచినట్లైతే, మీ సహవాసి అభిరుచులనుగూర్చి కూడ ఆలోచించడం సులభమని మీరు గుర్తించగలరు. యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు కలిగియుండుమని బైబిలు మనకు ఉద్బోధిస్తున్నది. ఆయన ఒక బలమైన ఆత్మయైయుండి కూడ ఆయన “దాసుని స్వరూపమును ధరించుకొని,” మానవునిగా పుట్టాడు. అంతేకాదు, ఆయన భూమిపైనున్నప్పుడు, “మరణము పొందునంతగా, . . . విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.” అది ఆయనను అంగీకరించని వారికి కూడ ప్రయోజనమిచ్చింది. (ఫిలిప్పీయులు 2:5-8) ఈ మనోవైఖరిని ప్రదర్శించుటద్వారా, యేసు అనేకమంది విరోధుల హృదయాలను ఆకట్టుకున్నాడు, ఆయన అనుచరులు యేసును అనుకరించడం ద్వారా వారును అలాగే చేశారు. (అపొస్తలుల కార్యములు 6:7; 9:1, 2, 17, 18) ఇది మీకూ సంభవించగలదు. మీ సహవాసిని మీకంటే యోగ్యమని యెంచడం ద్వారా, మీ సహవాసి ఇష్టాయిష్టాల యెడల శ్రద్ధ చూపటంద్వారా, నెమ్మదిగా మీరొకవేళ ఆమె లేదా అతని హృదయాన్ని ఆకట్టుకోగలరు.

అయినను, మీ సహవాసిని మీకంటె యోగ్యంగా యెంచడమంటే తూర్పు దేశాల్లో వలే, ఒక భర్తయొక్క నిరంకుశత్వాన్ని భార్య ఎదిరించకుండా సహించుకోవాలని కాదు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు యోగ్యమైనవారుగా దృష్టిస్తూ, ఒకరికొరకు ఒకరు యిష్టపూర్వకంగా త్యాగాలు చేయాలి. ఒక జంట ఈవిధమైన వినయ మనస్సుతో వారి సమస్యలను గూర్చి మాట్లాడుకుంటూ, ఒకరికొరకు మరొకరు నిస్వార్ధమైన ఆసక్తి వ్యక్తపరచి, దైవిక సలహాను అనుసరించినప్పుడు వారు వారి సమస్యలను పరిష్కరించే మార్గంలో ఉంటారు. మనమిప్పుడు దేవుని సలహాలను కొన్నింటిని పరిశీలిద్దాం.

“వివాహ పానుపు నిష్కల్మషమైనదిగా” ఉండనీయండి

వివాహ ఏర్పాటును మొదటిగా ప్రారంభించిన యెహోవా యొద్ద పురుషునికి అతని భార్యకు మధ్య సరైన బంధానికి సంబంధించిన అసలు నియమమున్నది. ఏ హేతువుచేతనైనను ఒక పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగినప్పుడు, యేసుక్రీస్తు యిలా చెప్పాడు: “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.” ఆయన ఇంకనూ చెబుతూ, విడాకులిచ్చుటకు, తిరిగి వివాహం చేసుకొనుటకు సహేతుకమైన ఆధారం కేవలం ఒక్కటేనని గుర్తించాడు: “వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితోననెను.”—మత్తయి 19:3-9.

వివాహేతర లైంగికత ప్రేమ అనే పేరుతో అనుభవించినప్పటికి, అది స్త్రీ పురుషులెవరికైనా ప్రేమతో కూడినది కానే కాదు. సెంట్రల్‌ జపాన్‌లో ఒక పురుషునికి తన భార్యతో కాకుండా అనేకమంది యితర స్త్రీలతో సంబంధమున్నది. అతని భార్య అనుమానపడి, నిరాశ చెందింది. వారి వివాహం సంకటస్థితిని ఎదుర్కొంది. అతని ప్రియురాళ్లలో ఒకతె తనకు అతనితోనున్న సంబంధాన్నిగూర్చి అతని భార్యకు తెలియచేస్తానని చెప్పి తన్ను వివాహం చేసుకోమని ఒత్తిడి చేసింది. “అలాంటి బాంధవ్యాలు ఎవరినీ ఆనందపర్చలేవని,” అనుశోకంతో జ్ఞప్తితెచ్చుకుంటున్నాడు. అతడు ఈ బురదలో నుండి బయటపడింది కేవలం దానిలో యిమిడిన వాళ్లందర్నీ నొప్పించిన తర్వాతనే. ఈ విషయంలో బైబిలు ప్రమాణికత స్పష్టంగా వుంది. “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.” (హెబ్రీయులు 13:4) ఈ ఆజ్ఞను పాటించడం ద్వారా, ఒకడు లైంగికంగా సంక్రమించే సుఖవ్యాధులు, వైవాహిక ఉద్రిక్తతలు, రహస్య ప్రేమకలాపాలకు సంబంధించిన బాధను తప్పించుకొంటాడు.

భర్తలారా, మీ భార్యలను ప్రేమించి, పోషించండి

కుటుంబంలో శిరస్సత్వపు నియమాన్ని కూడ దేవుడు ఏర్పర్చాడు. “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు.” అని ఎఫెసీయులు 5:22, 23 వివరిస్తున్నది. ఈ సలహాను పాటించడం అంత సులభంకాదు. “అది ఒక పర్వతంలాంటి సవాలుగా ఉండెనని,” ఆమె భర్త చేసే తుదినిర్ణయాల హక్కును ఒకప్పుడు తన గుప్పిట్లో పెట్టుకున్న షోకో ఒప్పుకుంటున్నది. పురుషుడు తన 20వ దశకాంతానికి చేరుకున్నప్పుడు ఒక ఇల్లు కొనితీరాలని ఆమె తలంచి, తాను యింతకు ముందే చూచివచ్చిన ఒక యిల్లును కొనమని తన భర్తను ఒత్తిడి చేసింది. దానిలో యిమిడియున్న బైబిలు సూత్రాలను నేర్చుకున్నప్పుడు ఆమె తన భర్తయెడల మరొకవిధంగా వ్యవహరించడం ప్రారంభించింది. తలవంచి, పౌరుషంలేనివాడుగా కన్పించిన ఇతడే, సరైన దృష్టితో చూసినప్పుడు సాత్వీకునిగా, వినయస్థునిగా కన్పించాడు.

భర్తలు తమకంటే ఉన్నతమైన యేసుక్రీస్తు అధికారం క్రింద ఉన్నారనే సంగతి గుర్తెరగాలని వారిని ఈ నియమం కోరుతున్నది. (1 కొరింథీయులు 11:3) యేసు తన అనుచరులను ప్రేమించువిధంగానే, ఒక భర్త క్రీస్తు అధికారం క్రింద ఉంటూ, తన భార్యను ప్రేమించి, పోషించాలి. (ఎఫెసీయులు 5:28-30) ఆవిధంగా, క్రైస్తవ భర్త, నిర్ణయాలు చేసేముందు తన భార్య భావాలను, కోరికలను, హద్దులను ఆలోచనాపూర్వకంగా పరిశీలిస్తాడు.

“ఉప్పువేసినట్టు రుచిగలదిగా ఉండనియ్యుడి”

హెసాకో తన భర్తతో సంభాషించుటలో సమస్య కలిగివుండేది. అతనితో ఎప్పుడైనా ఏదైనా చర్చించాలని ప్రయత్నించినపుడెల్లా, “నీకు ఎలా నచ్చితే అలాగే చెయ్యి,” అంటూ ఆయన దానిని తప్పించుకునేవాడు. హెసాకో యిలా గుర్తుకు తెచ్చుకుంటున్నది: “నాలో మృదువుగా మాట్లాడే స్వభావం లేకపోవడమే మా సమస్యకు కారణమని నేననుకుంటున్నాను. నేను ఒకవేళ మెషీన్‌గన్‌ వలే కాకుండా నెమ్మదిగా మాట్లాడివుంటే చాలా బాగుండేది.” ఈనాడు, ఎంతో ఆనందంగా నవ్వుతూ ఆమె, ఆమె భర్త కలసి విషయాలను చర్చించగలరు. హెసాకో ఈ క్రింది సలహాను పాటించినప్పటినుండి ఆ మార్పు వచ్చింది: “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.” (కొలొస్సయులు 4:6) ఉప్పువేసిన ఆహారం ఎలా నోటికి రుచిగా ఉంటుందో, సౌమ్యమైన పద్ధతిలో బాగా ఆలోచించి పలికిన మాటలను కూడ స్వీకరించడం చాలా సులభం. (సామెతలు 15:1) నిజానికి, మీరు కేవలం దయతో మాట్లాడితే చాలు తరచు వైవాహిక భేదాలను సరిచేయగలరు.

ఔను, యెహోవా దేవుని ప్రేమించడం, ఆయన నియమాలను గౌరవించడం నిజంగా పనిచేస్తాయి. యెహోవా యెడలగల ప్రేమ మీ వివాహాన్ని ఒక శాశ్వత బంధంగా దృష్టించడానికి మిమ్మును పురికొల్పుతుంది, దానిని సంరక్షించుకొనుటకై నిశ్చయించుకోడానికి సహాయపడుతుంది. అవి ఎంత పర్వతంలాంటివైననూ, వైవాహిక భేదాలన్నిటితో వ్యవహరించడానికి, మీ సమస్యలను పరిష్కరించుకోడానికి మీకు సహాయపడే మంచి మార్గదర్శకాలను దేవుడు దయచేశాడు. చాలా దృష్టాంతాల్లో, విడాకులనేది ఆనందమయ జీవితానికి మార్గంకాదు, కాని బైబిలు సూత్రాలను పాటించడమే దానికి మార్గము. యెహోవా యెడల ప్రేమను అభివృద్ధి చేయడం ద్వారా మీరు ఆ మార్గంలో ప్రవేశించగలరు. వివాహ మార్గదర్శకత్వానికి అత్యంత ప్రమాణ గ్రంథమైన బైబిలునుండి ఆయన సలహాలను గూర్చి ఎందుకు నేర్చుకొనకూడదు.? (g93 7/8)

[9వ పేజీలోని బాక్సు]

విడాకులే ఒక ఎంపిక అయినప్పుడు

వ్యభిచార నిమిత్తమై విడాకులిచ్చుటకు, తిరిగి వివాహం చేసుకొనుటకు బైబిలు అనుమతించినప్పటికి, భార్యాభర్తల మధ్యనున్న బంధాన్ని జారత్వం నిర్మూలించలేదు. విడాకులు పొందాలా వద్దా అనే ఎంపిక కల్గివుండేది నిరపరాధియైన భర్త లేక భార్య మాత్రమే.—మత్తయి 19:9.

యాసుకో యిదే నిర్ణయాన్ని ఎదుర్కొంది. ఆమె భర్త అతని ఉంపుడుగత్తెతో కాపురం చేసేవాడు. తన అత్త యాసుకోను నిందిస్తూ యిలా అంది: “నా బిడ్డ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే ఇదంతా నీ తప్పే.” యాసుకో రేయింబగళ్లు కన్నీళ్లు విడిచింది. చాలామంది ఆమెకు సలహా యిచ్చారు, కాని ఎవరూ కూడ ఆమె భర్త వ్యవహారాన్ని ఖండించలేదు. తర్వాత, ఆమె తల్లే బైబిలును పఠించడం ప్రారంభించి ఆమెకు యిలా చెప్పింది: “జారత్వం చేయడం తప్పు అని బైబిలులో వివరంగా వ్రాయబడింది.” (1 కొరింథీయులు 6:9) ఈ ప్రపంచంలో యింకనూ మంచి, చెడులకు ఒక ప్రమాణికత ఉందని తెలిసికోవడంతో యాసుకో బాధనుండి చాలా విముక్తి పొందింది.

ఇప్పుడు యాసుకోకు ఎంపిక చేసుకునే అవకాశముంది. ఆమె తన భర్తకు విడాకులివ్వాలని అనుకున్నప్పటికి, యెహోవా సాక్షులతో బైబిలు పఠించిన తర్వాత ఆమె కూడ తన వంతు చేయడం లేదని తెలిసికోగల్గింది. కాబట్టి ఆమె తన సమస్యలను పరిష్కరించుటలో బైబిలు నియమాలను పరీక్షించడానికి నిర్ణయించుకుంది. ఆమె వాటిని అన్వయించుకోవడం మొదలుపెట్టింది. (ఎఫెసీయులు 5:21-23) “అది అంత సులభం కాదు,” అంటూ ఆమె గుర్తుకు తెచ్చుకుంటున్నది. “తిరిగి పదే పదే పాతస్థితిని అనుభవించాను. నేను కన్నీటితో యెహోవాకు ప్రార్థించిన సమయాలు ఎన్నో వున్నవి.” ఆమె మారింది, అలాగే ఆమె భర్త కూడ నెమ్మదిగా మార్పుచెందాడు. ఐదు సంవత్సరాల తర్వాత, ఆమె భర్త తన ఉంపుడుగత్తెతో గల సంబంధాలన్నింటిని తొలగించుకున్నాడు. యాసుకో చివరిగా యిలా అంటుంది: “దేవుని వాక్యానికి లోబడియుండటం ఖచ్ఛితంగా ప్రయోజనకరమని నేను నమ్మాను.”

[11వ పేజీలోని బాక్సు]

లైంగిక అసమర్ధత మరియు విడాకులు

చాలామంది దంపతులు విడాకులు తీసుకోవడానికి కారణం లైంగిక అసమర్ధత అని చెప్తారు. దానికి గల అసలు సమస్యను సూచిస్తూ, సెకుషుయారొటొ టొ కాజొకూ అనే పేరుకల్గి, ఈనాటి మారుతున్న కుటుంబ ఏర్పాట్లతో వ్యవహరించే పుస్తకం (కుటుంబం మరియు లైంగికత) యిలా చెబుతున్నది: “ఒక్కసారి మాత్రమే వివాహమాడే ఏర్పాటుకు, శృంగార మోహంతో నిండిన లైంగిక సమాచారమునకు ఏవిధమైన పొత్తూలేదు. మితిమీరిన లైంగిక సమాచారం వైవాహిక శృంగారాన్ని అపార్థం చేసి, సాధారణ అనురాగాన్ని నాశనం చేస్తుంది. లైంగికతను ఒక అమ్మకపు వస్తువులా అందించడమే కాదుకాని అశ్లీల వీడియో టేపులు, స్త్రీల శరీరభాగాల్ని బజారు వస్తువులవలే చిత్రించే హాస్య పుస్తకాలు కూడ మానవ జ్ఞానేంద్రియాలను, హృదయాలను తప్పుదారి పట్టిస్తున్నాయి. ఆ విధంగా, భార్యలు [వారి భర్తలచే] లైంగికంగా ఒత్తిడి చేయబడి పీడించబడుతున్నారు, మరి తిరస్కరించబడ్డ భర్తలు దుర్బలులౌతున్నారు.

అవినీతికర సాహిత్యాలు, వీడియోలు, టివీ కార్యక్రమాలు లైంగికతను పెడత్రోవపట్టిస్తున్నాయి. వాస్తవమైన వివాహ ఆనందాన్ని రూపించేదేమిటో అవి బోధించవు. విజయవంతమైన వివాహం అనుభవించడానికి భార్యాభర్తలు యిద్దరూ అభివృద్ధిచేయవలసిన నమ్మకాన్ని అవి నాశనం చేస్తాయి. సైకాలజి టు డే యిలా వివరిస్తున్నది: “వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని గ్రహించి, మీ భాగస్వామి యెడలగల నమ్మకాన్నిబట్టి, మీ లోతైన భావాలను, భయాలను గూర్చి చెప్పడానికి నమ్మకమనేది మీకు సహాయపడుతుంది. ప్రేమ భావాలు లేదా లైంగిక ఉద్రేకం సమయం గడిచే కొలది వృద్ధికావచ్చు లేదా తగ్గిపోవచ్చు కాని, మానసికంగా నమ్మకం అనేది శాశ్వతమైనది.”

లైంగికతే విజయవంతమైన వివాహానికి మూలంకాదు. కష్టమైన వైవాహిక సమస్యలను దాటి వచ్చిన ఒక భార్య యిలా చెబుతున్నది: “నన్ను ఎక్కువగా ప్రోత్సహించినవేమంటే నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకంలోని మాటలే: ‘సాధారణ భాషలో, వివాహంలో ఇతర సంబంధాలన్నీ మంచివైనట్లైతే, ప్రేమ, గౌరవము, మంచి సంభాషణ, అర్థంచేసుకొనే స్వభావం వున్నట్లైతే, ఆ తర్వాత లైంగికత ఎన్నడూ ఒక సమస్యేకాదు.’”a

వాస్తవంగా భార్యాభర్తల మధ్య సమీప వ్యక్తిగత బంధాన్ని చేకూర్చేది లైంగికత కాదుగాని ప్రేమే. ప్రేమలేని లైంగికత నిష్ఫలమైనది, కాని లైంగికతలేని ప్రేమ నిలువగలదు. భార్యాభర్తలు వారి జీవితాల్లో లైంగికతకు ప్రధమస్థానమివ్వకుండా, దానికీయవలసిన స్థానాన్నివ్వడంద్వారా, వారు వారి భాగస్వామ్యాన్ని ఆనందించగలరు, లైంగిక అసమర్ధత అనే సమస్యను షరిష్కరించగలరు.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటిచే ప్రచురించబడింది.

[10వ పేజీలోని చిత్రం]

బైబిలు సూత్రాలను గౌరవించడమనేది దంపతులిద్దరు స్వతంత్రంగా సంభాషించుకోడానికి సహాయం చేస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి