కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 3/8 పేజీలు 10-11
  • భవిష్యత్‌ సంగతేమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భవిష్యత్‌ సంగతేమిటి?
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆదిసంకల్పము నెరవేరాలి
  • భూపరదైసులో నిత్యము జీవించుము
    జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?
  • శాంతియుతమైన నూతనలోకంలో జీవితము
    శాంతియుతమైన నూతనలోకంలో జీవితము
  • జీవితానికొక గొప్ప సంకల్పముంది
    జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?
  • “దేవుని సమాధానము” మీ హృదయములకు కావలిగా ఉండనీయుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 3/8 పేజీలు 10-11

భవిష్యత్‌ సంగతేమిటి?

మనిషి మృగము మధ్య సమాధానమెందుకంత వాంఛనీయం? ఎందుకంటే, కౄరమృగాలని పేరుపెట్టబడిన వాటితోసహా జంతువులతో సమాధానంగా ఉండుటకే మానవులు ఆదిలో సృజింపబడిరి.

దేవుడు మొదటి స్త్రీపురుషులను చేసినపుడు జీవించుటకై భూలోకములోని పరదైసు ప్రాంతములోనేవుంచాడు. వారు పిల్లలను కని, ఆ తొలి పరదైసును భూదిగంతమువరకు విస్తరింపజేయవలెననియే వారిఎడల ఆయన ఉద్దేశ్యము. ఆ పరదైసు అంతటిలోను జంతువులు సమాధానముతో మనుష్యులకు లోబడివుండాలి.

ఆదికాండము నందలి వృత్తాంతమిట్లు తెల్పుచున్నది: “వారు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్తభూమిని భూమిమీద ప్రాకు ప్రతిజంతువును ఏలుదురుగాక . . . దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగానుండెను.”—ఆదికాండము 1:26-31; 2:9.

జంతువులను లోబరచుకునే పద్ధతిలో కౄరత్వమునకు తావులేకుండెను. మానవులు జంతువులును సమాధానముతో కలిసి జీవించవలసియుండెను. పేర్లుపెట్టుటకు జంతువులను మనుష్యుని యొద్దకు తెచ్చినప్పుడు అతడెట్టి ఆయుధం ధరించలేదను వాస్తవాన్ని బట్టి ఈ విషయాన్ని గమనించవచ్చును. మరి మనిషిగానీ మృగముగాని భయపడినట్లు ఏమీ వ్రాయబడలేదు.—ఆదికాండము 2:19, 20.

ఆదిసంకల్పము నెరవేరాలి

పరలోకమునుండి పరిపాలించు దేవుని రాజ్యము మానవనిర్మిత ప్రభుత్వాలన్నిటిని తీసివేసినప్పుడు దేవుని ఆది సంకల్పము త్వరలో నెరవేరుననుట సంతోషకరమే. (దానియేలు 2:44; మత్తయి 6:9, 10) భూమియంతట దైవ—పరిపాలన పూర్తిగా పునఃస్థాపించబడినప్పుడు, భూమి, అందులోని మానవకోటి, జంతుజాలములయెడల దేవుని ఆదిసంకల్పము నెరవేరుట కారంభిస్తుంది

దేవుని పరిపాలన మూలంగా వచ్చు మార్పుల ఫలితాలనుగూర్చి అనేక బైబిలు ప్రవచనములలో చక్కగా వర్ణించబడినవి. ఉదాహరణకు ప్రేరేపణతో యెషయా వ్రాసిన విషయాన్ని గమనించండి: “తోడేలు గొర్రెపిల్లయొద్ద వాసము చేయును. చిరుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటినితోలును. ఆవులు ఎలుగులు కూడిమేయును. వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డిమేయును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హానిచేయదు నాశనముచేయదు. సముద్రము జలములతో నిండియున్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును.”—యెషయా 11:6, 7, 9.

దేవుని నూతన లోకంలో వుండబోవు గొప్ప సమాధానాన్ని గూర్చి ఇతర ప్రవచనములు కూడ తెలుపుచున్నవి. దీన్ని గూర్చి మీకా ఇలా ప్రవచించాడు: “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు, జనముమీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును. యుద్ధము చేయనేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టుక్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును.”—మీకా 4:3, 4.

కౄరజంతువులేవియు మానవ జాతియొక్క సమాధానమును చెరుపలేవు ఏలయనగా దేవుని ప్రవచనార్థక వాక్యమిట్లు చెబుతుంది: “అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనునట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్టమృగములు దేశములో లేకుండ చేయుదును . . . వారు దేశములో నిర్భయముగా నివసింతురు.”—యెహెజ్కేలు 34:25, 27.

కావున పునరుద్ధరించబడు ఆ పరదైసు యంతటను సంపూర్ణ సమాధానసామరస్యములు నిండుగా ఉండును. అందుకే అచ్చట వుండబోవు పరిస్థితులను గూర్చి బైబిలులోని చివరి పుస్తకంలో ఈ విధంగా వర్ణించబడియున్నది: “దేవుడు వారి కన్నుల ప్రతి బాష్పబిందువులను తుడిచి వేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైను వేదనయైనను ఇక ఉండదు . . . అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు—ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను; మరియు—ఈ మాటలు నమ్మకమును నిజమునైయున్నవి గనుక వ్రాయుమని నాతో చెప్పుచున్నాడు.”—ప్రకటన 21:4, 5.

అవును అవి నమ్మదగిన, నిజమైన మాటలే. దీని అర్థం మనం దేవుని వాగ్దానములపై ఆధారపడవచ్చును. ఎందుకనగా అసంపూర్ణులైన మానవులవలెగాక, ఆయన సంకల్పములను నెరవేర్చగల శక్తి, జ్ఞానము, పట్టుదల ఆయనకున్నవి. ప్రాచీన కాలములోని దేవుని నమ్మకమైన దాసులలో ఒకరు ఇలా అన్నారు: “మీ దేవుడైన యెహోవా మీవిషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలోను ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవ పూర్వకముగా ఎరుగుదురు. అవన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.”—యెహూషువ 23:14; మరియు యెషయా 55:11 చూడండి.

దేవుని నూతన లోకంలో ఈ భూమి, మానవులు, జంతువుల యెడల ఆయన ఆది సంకల్పము త్వరలో నెరవేరునని మనము అటువంటి దృఢ నమ్మకమునే కల్గియుందాము. దేవుడనుగ్రహించు సమాధానము భూదిగంతములవరకు వాస్తవమై ఉండును. అటువంటి సమాధానము మనుష్యుల మధ్యనే గాక జంతు ప్రపంచములోను ప్రతిబింబించును. (g91 4/8)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి