కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 5/8 పేజీలు 28-29
  • ఇరవయవ శతాబ్దపు ఫాక్స్‌

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇరవయవ శతాబ్దపు ఫాక్స్‌
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అదెలా పనిచేస్తుంది?
  • ఈ సాంకేతిక జ్ఞానము ఎక్కడ ఆరంభమైంది?
  • ఫాక్స్‌ ఎలా ఉపయోగించబడుతుంది?
  • ఫాక్స్‌ యొక్క భవిష్యత్తేమిటి?
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1993
  • కాగితాలు అవసరంలేని నిర్వచనాతీతమైన కార్యాలయం
    తేజరిల్లు!—1999
  • నత్తి నుండి విముక్తి!
    తేజరిల్లు!—1998
  • ఉద్యోగ భద్రతా సంతృప్తీ ప్రమాదంలో ఉన్నాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 5/8 పేజీలు 28-29

ఇరవయవ శతాబ్దపు ఫాక్స్‌

న్యూయార్క్‌నుండి టొరంటోకు ఒక్కనిమిషంలోపలే చేరవచ్చు. అదే ఫాక్స్‌ యొక్క వేగం. ఏమిటది? సాధారణ వివరణ ప్రకారం అది సుదూర ఫోటో కాపి చేయుట—అనగా ఒక్క మాటకూడ మాట్లాడకుండ పరస్పర సమాచార మిచ్చుట. అమెరికాలోనే ప్రతినెల లక్షలకు పైగా ఫాసిమైల్‌ మిషన్లు కొంటున్నారు.

డాక్టర్లు వైద్య నివేదిక పంపిస్తారు, న్యాయవాదులు న్యాయపరమైన నకలు కాపీలను మార్చుతారు, కిరాణకొట్టు వారు ఆహారపదార్థములకు అర్డర్లిస్తారు, రేడియో స్టేషన్‌లు శ్రోతలనుండి పాటలను గూర్చిన విజ్ఞాపనలను స్వీకరిస్తాయి—ఇవన్నీ ఫాక్స్‌ ద్వారానే. కాలిఫోర్నియాలో ఓ తల్లి తనకు శిశువు పుట్టిన ఒక గంటలోనే ఫాక్స్‌ద్వారా శిశువు అరికాళ్ల గుర్తులను తీసి మరో రాష్ట్రములో వున్న అవ్వ తాతలకు పంపింది.

అదెలా పనిచేస్తుంది?

అది చాలా సులభం. నీకు కావలసినదంతా ఒక టెలిఫోను, ఒక గోడప్లగ్‌ మరియు ఒక ఫాక్స్‌ యంత్రం. వివరణ పత్రాన్ని యంత్రంలోనికి ఎక్కిస్తారు, అక్కడ పేజిమీదనున్న నల్లని ఆకారంలో వున్న వాటినన్నింటిని ఒక నియంత్రిత కిరణ యంత్రభాగం చదువుతుంది, వాటిని అనువదించి విద్యుత్‌ తరంగ ప్రచోదనములుగా మార్చుతుంది, మరియు టెలిఫోన్‌లైన్‌ ద్వారా వాటిని ప్రసరింప జేస్తుంది. సమాచారమును అందుకునే ఫాక్స్‌యంత్రం ఈ ప్రచోదనములను మరల నల్లని ఆకారములుగా మార్చి అచ్చు దానిమాదిరే కాపీని ముద్రిస్తుంది.

ఈ సాంకేతిక జ్ఞానము ఎక్కడ ఆరంభమైంది?

వెనుకటి 1843 సంవత్సరములో స్కాట్‌లాండ్‌ దేశపు ఒక గడియారములను కనిపెట్టి తయారు చేసే వ్యక్తి, అలెగ్జాండర్‌ బెయిన్‌ అనే ఆయన మొట్టమొదట ఈ ఫాక్స్‌ను కనిపెట్టి విక్రయహక్కు పొందాడు. ఈనాటి నాణ్యతకు పోల్చితే ఆనాడు అది మొరటు రకానికి చెందిన నియంత్రిత కిరణ యంత్రం. విద్యుత్‌ తీగతో వున్న ఛాయాయంత్ర భాగమునొకదానిని ఊగే లోలకము కొనభాగమున అతికించబడి, అది లోహముతో తయారయిన దిమ్మె మీద వెనక్కి ముందుకు ఆడుతూ, టెలిగ్రాఫ్‌తీగెల మీదుగా విద్యుత్‌ ప్రవాహ కాంతిధ్వని స్పందనను పంపించింది. మరో తీగతోచుట్టివున్న లోలకము ప్రతి కాంతిధ్వని స్పందనను ఎలక్ట్రోసెన్సిటివ్‌ పేపరు మీద తర్జుమా చేసింది.

తిరిగేడ్రమ్‌ మరియు దానిచుట్టు చుట్టబడిన పేపరు ముక్కతో సహా మామూలు అచ్చున్న దాన్ని చదువగలిగే ఫోటో ఎలిక్ట్రికల్‌ సెల్‌ను వుపయోగించే ఫాక్స్‌ యంత్రాలు 1907 నాటికి వచ్చినవి. అయిననూ రేడియో సంకేతనములద్వారా సమాచారమందించే పద్ధతి ఆలస్యమౌతూ తరచూ మధ్యలో ఆటంకానికి గురయ్యేది.

సన్ననార దృష్టికోణములను (ఫైబర్‌ ఆప్టిక్స్‌), సంఖ్యా ప్రసరణము, మరియు సంకేతన సంపీడనముల నుపయోగించుచు 1980 దశాబ్దంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానము వలన ప్రత్యేక పరిస్థితులలోనైతే ఒక పేజిని మూడు సెకండ్లలలోచదివి, ప్రసరింపచేయుటకు ఫాక్స్‌ యంత్రాలకు వీలుకల్గింది. ప్రస్తుతం, అత్యంత అధికముగా వుపయోగించబడే యంత్రాలకు ఒక పేజిని 45 సెకండ్లవేగంతో ప్రసరింప చేయగల శక్తి వున్నది.

ఫాక్స్‌ ఎలా ఉపయోగించబడుతుంది?

సాధారణంగా ఒకే రోజులో కొరియర్‌ లేదా పోస్టల్‌ ద్వారా అందించబడే అత్యవసర సమాచార మిప్పుడు కొన్ని నిమిషాల్లో అందించవచ్చును. ప్రాముఖ్యమైన పత్రాలను అవతలి వ్యక్తి చేతుల్లోకి, ఒక కవరుమీద అడ్రసు వ్రాసి, స్టాంపు అతికించి పోస్టు చేసేంత సమయములో, ఫాక్స్‌ ద్వారా అందించవచ్చును.

కెనడా దేశంలో ఇటీవల ఒక బిడ్డకు తీవ్రమైన, ప్రాణాంతకమైన రక్తముతో వైద్య చికిత్స చేయవలసినంత వైద్యరీత్య చిక్కు సమస్య వచ్చిపడింది. తల్లిదండ్రులు యెహోవాసాక్షులైనందువల్ల, ఎట్టిపరిస్థితులలోనూ రక్తం వుపయోగించకూడదనే మతపరమైన దృఢవిశ్వాసముతో వుండిరి. వైద్యపరిశోధకులను సంప్రదించినమీదట రక్తంలేని సాంకేతిక పద్ధతులద్వారా చికిత్స చేసే విషయంలో వైద్యబృందానికి సహాయపడునట్లు అక్కడున్న ఇన్‌చార్జి డాక్టరు ఫాక్స్‌ ద్వారా క్షణాల్లో వ్యాసాలను పంపించారు. తలిదండ్రుల ఇష్టాలను గౌరవించారు, బిడ్డకు విజయవంతంగా చికిత్స చేశారు. హాస్పిటల్‌ వైద్య బృందాలు ఇప్పుడు వైద్యపరమైన ఒప్పంద పత్రాలను ఇచ్చిపుచ్చుకొనుటలో ఫాక్స్‌ నొక సాధనంగా వాడుకొంటున్నందుకు ఆ కుటుంబం ఆనందించింది.

వార్తా పత్రికలు కూడా ఫాక్స్‌ను సద్వినియోగం చేస్తున్నవి. 1989 సంవత్సరములో చైనా సైన్యం బీజింగ్‌లోని టీయానాన్‌మెన్‌ స్క్వేర్‌లో విద్యార్థల తిరుగుబాటును అణచివేసినపుడు ప్రభుత్వం దూరదర్శిని, రేడియో మరియు వార్తలపై ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ వ్యాపారాన్ని నడుపుకొనుటకు టెలిఫోన్‌లైన్లను స్వేచ్ఛగా వదిలి పెట్టారు గనుక విలేఖరులు చైనాలోను మిగతా ప్రపంచమంతటనున్న ప్రజలకు వార్తలను, ఫోటోలను ఫాక్స్‌ ద్వారా అందించారు.

ప్రచార పరిశ్రమ కూడా ఈ సాంకేతిక జ్ఞానము వల్ల లాభముపొందింది. ఒక మార్కెటింగ్‌ మేనేజరు తెల్పినదేమనగా ఫాక్స్‌ ద్వారా ప్రకటనలుపంపితే “ఆ సందేశములు, తక్షణచర్యతీసుకొనే అత్యవసర భావాన్ని కల్గివున్నవి. వెంటనే వాటిని చదువుతారు.” అయితే ఫాక్స్‌ యంత్రాల యజమానుల విషయంకొస్తే ఈ అనవసరమైన ఫాక్స్‌ వారి పనిని కట్టివేసి, వారి వ్యాపారమునకు సంబంధించి వచ్చే ప్రాముఖ్యమైన సమాచారానికి అటంకం కల్గుతుందని తలంచుచున్నారు.

పైన తెలిపిన రీతిగా, ఫాక్స్‌ వినియోగం చాలావరకు నీ ఊహను బట్టి మాత్రమే పరిమితమై వుంటుంది. అయిననూ, క్రొత్త సాంకేతిక జ్ఞానమును దుర్వినియోగ పరచినట్లే దీన్ని పాడు చేసేవాడెవడో ఒకడుంటాడు.

ఫాక్స్‌ యొక్క భవిష్యత్తేమిటి?

ఒక కంప్యూటర్‌ ఇంజనీర్‌ ఫాక్స్‌ యంత్రాలు ఇంకా వేగంగాను, గణనీయంగాను వుపయోగపడతాయని నిరీక్షిస్తున్నాడు. వ్యాపారంలో డెస్క్‌మీద వుండే యంత్రాలు సర్వసాధారణ వాడుకలోనికి వస్తే ఇక అంతర్భాగ ఉత్తరాల బట్వాడాకు బదులు అంతర్భాగ ఫాక్స్‌ ప్రసారంవస్తుంది. పూర్తి రంగులతో కూడిన ఫాసిమైల్స్‌, మోసికొనిపోగల (పోర్టబుల్‌) చిన్న ఫాక్స్‌ యంత్రాలు తయారులో వున్నవి. ఒక పర్సనల్‌ కంప్యూటర్‌ ద్వారా నడిపించబడే, కాపీచేసేది/అచ్చువేసేది/ఫాక్స్‌ మూడు కలిసిన, ఒక యంత్రం భవిష్యత్తులో తయారయ్యే అవకాశమున్నది. ఒక పెద్ద ఉత్పత్తిదారుడు భవిష్యత్తులో ఒక అరచెయ్యంత సైజున్న స్వంత ఫాక్స్‌ యంత్రం 100 డాలర్ల ఖరీదుకు లభ్యమౌతుందని జోస్యం చెబుతున్నాడు.

టెలిఫోను ఇప్పటికీ తక్షణమే సంభాషించుటకు వీలు కల్గిస్తున్ననూ అట్టి సమాచారములు కొన్ని సార్లు తప్పుగా అందించడం లేదా తప్పుగా అర్థంచేసుకోవడం జరుగుతుంది. ఫాక్స్‌ అసలైన సమాచారమును అచ్చు ద్వారా—శీఘ్రముగా అందిస్తుంది. మన జీవితాలలో అది ఇప్పుడు సమాచారాన్ని అందించే ప్రాముఖ్యమైన ఉపకరణమైయున్నది. ఫాక్స్‌ ఓస్థాయికి ఎదిగింది మరి అది నిలుస్తుంది. (g91 1/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి