కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbv ఆర్టికల్‌ 26
  • కీర్తన 46:10—“ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కీర్తన 46:10—“ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి”
  • బైబిలు వచనాల వివరణ
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కీర్తన 46:10 అర్థమేంటి?
  • కీర్తన 46:10 సందర్భం
  • కీర్తన 37:4—‘యెహోవాను బట్టి సంతోషించు’
    బైబిలు వచనాల వివరణ
  • కీర్తనల తృతీయ, చతుర్థ స్కంధములలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • కీర్తన 23:4—“గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను”
    బైబిలు వచనాల వివరణ
  • మెస్సీయ గురించిన వివరాలు ప్రవచనాల్లో ఉన్నాయి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మరిన్ని
బైబిలు వచనాల వివరణ
ijwbv ఆర్టికల్‌ 26

బైబిలు వచనాల వివరణ

కీర్తన 46:10—“ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి”

“లొంగిపోండి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి. నేను దేశాల మధ్య హెచ్చించబడతాను; నేను భూమ్మీద హెచ్చించబడతాను.”—కీర్తన 46:10, కొత్త లోక అనువాదం.

“ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును భూమిమీద నేను మహోన్నతుడనగుదును.”—కీర్తన 46:10, పరిశుద్ధ గ్రంథము.

కీర్తన 46:10 అర్థమేంటి?

ప్రతీఒక్కరు తనను ఆరాధించాలి, భూమిని పరిపాలించడానికి తనకున్న హక్కును గుర్తించాలి అన్నదే దేవుని కోరిక. ఆయన శక్తినీ అధికారాన్నీ ఎవరూ కాదనలేరు, శాశ్వత జీవితం పొందాలనుకునే ప్రతి ఒక్కరూ ఆ వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే.—ప్రకటన 4:11.

“లొంగిపోండి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి.” కొన్ని బైబిలు అనువాదాల్లో ఈ వాక్యంలోని మొదటి భాగం “ఊరకుండుడి” అని ఉంటుంది. దానివల్ల, ఈ వచనాన్ని చర్చిలో భయభక్తులు చూపిస్తూ, నిశ్శబ్దంగా ఉండాలని తెలిపే ఆజ్ఞగా అపార్థం చేసుకున్నారు. అయితే, “లొంగిపోండి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి” అని అనువదించిన హీబ్రూ పదబంధం, స్వయంగా యెహోవాa దేవుడే అన్ని దేశాల ప్రజలను చర్య తీసుకోమని ప్రోత్సహిస్తున్నాడని చూపిస్తుంది. అంటే, తనను వ్యతిరేకించడం ఆపి, తాను మాత్రమే ఆరాధనకు అర్హుడని అందరూ గుర్తించాలన్నదే దేవుని ఆలోచన.

ఆ ప్రోత్సాహం 2వ కీర్తనలో కూడా కనిపిస్తుంది. అక్కడ, దేవుడు తనను వ్యతిరేకించే వాళ్లపై చర్య తీసుకుంటానని మాటిస్తున్నాడు. మరోవైపున, దేవుని అధికారాన్ని గుర్తించేవాళ్లు నిర్దేశం, బలం, తెలివి కోసం ఆయన మీద ఆధారపడతారు. ఈ కష్టకాలాల్లో కూడా అలా “ఆయన్ని ఆశ్రయించే వాళ్లందరూ” సంతోషంగా, సురక్షితంగా ఉంటారు.—కీర్తన 2:9-12.

“నేను దేశాల మధ్య హెచ్చించబడతాను; నేను భూమ్మీద హెచ్చించబడతాను.” గతంలో కూడా యెహోవా దేవుడు తన ప్రజలను కాపాడడానికి తన గొప్ప శక్తిని ఉపయోగించినప్పుడు హెచ్చించబడ్డాడు. (నిర్గమకాండం 15:1-3) భవిష్యత్తులో, భూమ్మీదున్న ప్రతి ఒక్కరూ ఆయన అధికారానికి లోబడి, ఆయనను ఆరాధించినప్పుడు ఆయన మరెంతో గొప్పగా హెచ్చించబడతాడు.—కీర్తన 86:9, 10; యెషయా 2:11.

కీర్తన 46:10 సందర్భం

ఓ రెఫరెన్సులో 46వ కీర్తన గురించి ఇలా ఉంది: ‘ఇది తన ప్రజల్ని కాపాడే బలవంతుడైన దేవుని శక్తిని కీర్తిస్తూ చేసే భజన.’ యెహోవా తమకు సహాయం చేసి కాపాడగలడనే నమ్మకాన్ని చూపిస్తూ దేవుని ప్రజలు 46వ కీర్తన పాడేవాళ్లు. (కీర్తన 46:1, 2) యెహోవా ఎప్పుడూ తమతోనే ఉన్నాడని ఆ మాటలు వాళ్లకు గుర్తుచేసేవి.—కీర్తన 46:7, 11.

యెహోవా చేసిన శక్తివంతమైన పనుల గురించి ఆలోచిస్తూ తమను కాపాడే శక్తి ఆయనకుందనే నమ్మకాన్ని పెంచుకోమని ఈ కీర్తన ప్రోత్సహించింది. (కీర్తన 46:8) ముఖ్యంగా, యుద్ధాల్ని ఆపే విషయంలో ఆయనకున్న సామర్థ్యం గురించి ఈ కీర్తన చెప్తుంది. (కీర్తన 46:9) నిజానికి పాతకాలంలో, శత్రు దేశాల నుండి తన ప్రజల్ని కాపాడి యెహోవా యుద్ధాల్ని ఆపాడు. కానీ, దేవుడు త్వరలోనే ఇంకా పెద్ద స్థాయిలో, అంటే భూవ్యాప్తంగా యుద్ధాలనేవే లేకుండా చేస్తాడని బైబిలు మాటిస్తుంది.—యెషయా 2:4.

యెహోవా ఇప్పుడు కూడా తన ఆరాధకులకు సహాయం చేస్తాడా? అవును, చేస్తాడు. అందుకే, దేవుని సహాయం తీసుకోమని పౌలు క్రైస్తవుల్ని మరీమరీ ప్రోత్సహించాడు. (హెబ్రీయులు 13:6) 46వ కీర్తనలోని మాటలు దేవుని రక్షణ శక్తి మీద మన నమ్మకాన్ని బలపరుస్తాయి. ఆ కీర్తన చదివితే, “మన ఆశ్రయం, మన బలం” ఆయనే అన్న నమ్మకం మనకు కుదురుతుంది.—కీర్తన 46:1.

కీర్తన 46 చదవండి. చదువుతున్నప్పుడు అధస్సూచీల్లో ఉన్న వివరణల్ని, క్రాస్‌ రెఫరెన్సులను కూడా చూడండి.

కీర్తనల పుస్తకం గురించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.

a యెహోవా అనేది దేవుడే ఎంచుకున్న పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” ఆర్టికల్‌ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి