కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwhf ఆర్టికల్‌ 9
  • తల్లిదండ్రులు పిల్లలకు నిర్దేశం ఎలా ఇవ్వచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తల్లిదండ్రులు పిల్లలకు నిర్దేశం ఎలా ఇవ్వచ్చు?
  • కుటుంబం కోసం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరేం తెలుసుకోవాలి?
  • మీరేం చేయవచ్చు?
  • పెద్దవాళ్ల నిర్దేశం, సలహాలకున్న విలువ
    తేజరిల్లు!—2019
  • తల్లిదండ్రులారా మీ పిల్లలకు మంచి మాదిరిగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • తల్లిదండ్రులారా, యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • పసితనంనుండే మీ పిల్లవానికి తర్ఫీదునివ్వండి
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
మరిన్ని
కుటుంబం కోసం
ijwhf ఆర్టికల్‌ 9
తన పిల్లవాడితో మాట్లాడుతున్న తండ్రి

కుటుంబం కోసం | పిల్లల్ని పెంచడం

తల్లిదండ్రులు పిల్లలకు నిర్దేశం ఎలా ఇవ్వచ్చు?

  • మీరేం తెలుసుకోవాలి?

  • మీరేం చేయవచ్చు?

  • తల్లిదండ్రులు ఏమంటున్నారు?

మీరేం తెలుసుకోవాలి?

నేడు కొన్ని సంస్కృతుల్లో పిల్లలు తమ తల్లిదండ్రులతో మంచి సంబంధం కలిగివున్నారు, దానివల్ల వాళ్లు సలహాల కోసం తల్లిదండ్రుల్ని అడుగుతారు. మరోవైపు వేరే సంస్కృతుల్లో పిల్లలు ఎక్కువగా తమ వయసువాళ్లను సలహాలు అడుగుతుంటారు.

అలా తమ వయసువాళ్లను సలహాలు అడగడం వల్ల, పిల్లలకు తమ తల్లిదండ్రుల సలహాల మీద గౌరవం తగ్గిపోతుంది. నిజానికి అలాంటి పిల్లలు టీనేజీకి వచ్చేసరికి, తమ చేయిదాటిపోయారని తల్లిదండ్రులకు అనిపిస్తుంది. దాంట్లో ఆశ్చర్యం లేదు! ఎందుకంటే, పిల్లలు తోటివాళ్లతో ఎక్కువ సమయం గడిపినప్పుడు, వాళ్లు తల్లిదండ్రుల పెంపకంలో కాదుగానీ తోటి పిల్లల పెంపకంలో ఉన్నట్లు ఉంటుంది.

పిల్లలు, తల్లిదండ్రుల కన్నా తమ వయసువాళ్లకు ఎందుకు అంత సులభంగా దగ్గరౌతారు? ఈ విషయాల్ని పరిశీలించండి:

  • స్కూలు. పిల్లలు తోటి పిల్లలతో ఎక్కువ సమయం గడిపినప్పుడు, వాళ్లకు బాగా దగ్గరౌతారు. దానివల్ల తమ గురించి, తల్లిదండ్రులు ఏం అనుకుంటున్నారనే దానికన్నా, తమ వయసువాళ్లు ఏం అనుకుంటున్నారనే దానికే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం మొదలుపెడతారు. పిల్లలు టీనేజీకి చేరుకునే సరికి అలాంటి ఆలోచన ఇంకా ఎక్కువౌతుంది.

    తన స్కూల్‌ ఫ్రెండ్స్‌కి బాయ్‌ చెప్తున్న ఒక పిల్లవాడు

    పిల్లలు, తమ వయసువాళ్లు ఏమనుకుంటారనే దానిగురించి ఆలోచించే బదులు, తమ తల్లిదండ్రులు ఏమనుకుంటారు అనే దానిగురించే ఎక్కువ ఆలోచించాలి

  • కలిసి తక్కువ సమయం గడపడం. చాలా కుటుంబాల్లో, పిల్లలు స్కూల్‌ నుండి ఇంటికొచ్చే సమయానికి ఇంట్లో ఎవ్వరూ ఉండరు, బహుశా వాళ్ల తల్లిగానీ, తండ్రిగానీ లేదా ఇద్దరూ ఉద్యోగానికి వెళ్లి ఉంటారు.

  • టీనేజ్‌ లైఫ్‌స్టైల్‌. టీనేజ్‌కి వచ్చేసరికి యౌవనుల మనసంతా తమ వయసువాళ్లు వేసుకునే బట్టలు, మాట్లాడే తీరు, ప్రవర్తించే విధానం చుట్టు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల అభిప్రాయాలకన్నా, తమ వయసువాళ్ల అభిప్రాయాలకే వాళ్లు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు.

  • వ్యాపారం. వ్యాపారస్థులు ఎక్కువశాతం వస్తువుల్ని, వినోదాన్ని పెద్దవాళ్ల కోసం కాకుండా కేవలం యౌవనుల కోసమే తయారు చేస్తున్నారు. దానివల్ల తల్లిదండ్రులు, టీనేజర్లు ఒకరినొకరు అర్థంచేసుకోవడం ఇంకా కష్టమౌతోంది. డాక్టర్‌ రాబర్ట్‌ ఎప్‌స్టీన్‌ ఇలా రాస్తున్నాడు, “ఒకవేళ టీనేజర్ల లైఫ్‌స్టైలే కనుమరుగైపోతే, పెద్దపెద్ద వ్యాపార సంస్థలు వెంటనే కుప్పకూలిపోతాయి.”a

మీరేం చేయవచ్చు?

  • మీ పిల్లలతో ఉన్న సంబంధాన్ని బలంగా ఉంచుకోండి.

    బైబిలు ఇలా చెప్తుంది: ‘నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నువ్వు వాటిని నీ కుమారుల హృదయాల్లో నాటాలి; నువ్వు నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు వాటి గురించి మాట్లాడాలి.’—ద్వితీయోపదేశకాండము 6:6, 7, NW.

    తమ వయసువాళ్లు పిల్లలకు స్నేహితులుగా ఉండవచ్చేమో గానీ, ఆ స్నేహితులు తల్లిదండ్రులుగా మీకున్న స్థానాన్ని ఎప్పటికీ తీసుకోకూడదు. ఒక మంచి వార్త ఏంటంటే: చాలామంది పిల్లలకు అలాగే టీనేజర్లకు తమ తల్లిదండ్రుల మీద గౌరవం ఉందని, వాళ్లు తమ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలని కోరుకుంటారని నిపుణులు చెప్తున్నారు. మీరు మీ పిల్లలతో దగ్గరి సంబంధాన్ని కలిగివుంటే, వాళ్లమీద తమ వయసువాళ్ల ప్రభావం కన్నా మీ ప్రభావమే ఎక్కువ ఉంటుంది.

    తండ్రి తన పిల్లవాడితో కలిసి సమయం గడుపుతూ పార్క్‌లో నడుస్తున్నాడు, కంప్యూటర్‌లో పనిచేస్తున్నాడు, కారు బాగుచేస్తున్నాడు

    “ప్రతీరోజూ మీరు పిల్లలతో సమయం గడపాలి. వాళ్లతో కలిసి వంట చేయడం, క్లీనింగ్‌ చేయడం, ఆఖరికి హోమ్‌వర్క్‌ లాంటివి కూడా చేయండి. సరదా కోసం చేసేవి అంటే ఆటలు ఆడడం, సినిమాలు లేదా టీవీ చూడడం లాంటివి కూడా కలిసి చేయండి. అప్పుడప్పుడు కొన్ని గంటలు చక్కగా గడిపితే సరిపోతుందని అనుకోకండి. మీరు పిల్లలతో కలిసి ఎక్కువ సమయం గడపాలి అప్పుడే మీ మధ్య దగ్గరి సంబంధం ఏర్పడుతుంది.”—లారేన్‌.

  • మీ పిల్లలు కేవలం తమ వయసువాళ్లతోనే కాకుండా వేరేవాళ్లతో కూడా స్నేహం చేసేలా చూసుకోండి.

    బైబిలు ఇలా చెప్తుంది: ‘పిల్లవాడి హృదయంలో సహజంగానే మూర్ఖత్వం ఉంటుంది.’—సామెతలు 22:15, NW.

    కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎక్కువమంది స్నేహితులు ఉండడం చూసి సంతోషపడతారు. ఒక పిల్లవాడు తోటి స్నేహితులతో సహవసించడం వల్ల అందరితో కలిసిమెలిసి ఎలా ఉండాలో నేర్చుకోవచ్చేమో గానీ, మంచిచెడులు తెలుసుకునేంత పరిణతి సాధించాలంటే వేర్వేరు వయసువాళ్లతో అతను స్నేహం చేయాలి. పిల్లలకు కావాల్సిన నిర్దేశాన్ని ప్రేమగల తల్లిదండ్రులు ఇచ్చినట్టు తమ వయసువాళ్లు ఇవ్వలేరు.

    “యౌవనులకు కొన్ని విషయాలు తెలిసివుండవచ్చు, కానీ జీవితంలో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనేంత సామర్థ్యం వాళ్లకు ఉండదు. మంచి నిర్ణయాలు తీసుకునేలా తోటి యౌవనులకు సహాయం చేసేంత తెలివి, అనుభవం కూడా వాళ్లకు ఉండవు. అయితే యౌవనులు తమ తల్లిదండ్రుల సలహాల్ని పాటించినప్పుడు, తమ వయసుకు తగ్గ పరిణతి సాధిస్తారు.”—నాడ్య.

  • తెలివైన సలహాలు ఇవ్వండి.

    బైబిలు ఇలా చెప్తుంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును.”—సామెతలు 13:20.

    మీ పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నప్పుడు కూడా, మీతో సమయం గడపడం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు. కాబట్టి వాళ్లకు మంచి ఆదర్శం ఉంచండి.

    “తల్లిదండ్రులే పిల్లలకు మంచి ఆదర్శం. తల్లిదండ్రులను విలువైనవాళ్లుగా చూడడం, గౌరవించడం పిల్లలు నేర్చుకున్నప్పుడు, వాళ్లు కూడా పెద్దయ్యాక తమ తల్లిదండ్రుల్లాగే ఉండాలని కోరుకుంటారు.”—క్యాథరిన్‌.

తల్లిదండ్రులు ఏమంటున్నారు?

భార్యాభర్తలైన వెన్‌డెల్‌, సూజన్‌

“యౌవనులు ఎక్కువగా తమకున్న కొద్దిపాటి అనుభవంతో నిర్ణయాలు తీసుకుంటుంటారు. అది చెడు పర్యవసానాలకు దారితీయవచ్చు. కానీ పిల్లలు తల్లిదండ్రుల అనుభవం నుండి నేర్చుకున్నప్పుడు, విషయాలను ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు, దానివల్ల మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.”—భార్యాభర్తలైన వెన్‌డెల్‌, సూజన్‌.

భార్యాభర్తలైన కోట్నీ, ఎరిక్‌

“మీ పిల్లలు ఇష్టపడే పనులు చేయండి, బహుశా అవి మీకు చేయాలని అనిపించకపోయినా చేయండి. వాళ్లతో కలిసి గడిపే సమయాన్ని ఆనందించండి. నమ్మదగిన వాళ్లుగా ఉండండి, పిల్లలు ఎలాంటి దాపరికం లేకుండా మీతో మాట్లాడేలా ఉండండి, అలాగే వాళ్లకు మంచి ఆదర్శం ఉంచండి. మీ పిల్లలు సంతోషంగా జీవించాలనేదే మీ కోరికని వాళ్లు అర్థంచేసుకోవాలి.”—భార్యాభర్తలైన కోట్నీ, ఎరిక్‌.

ఒకసారి ఆలోచించండి: మీ పిల్లలకు కావాల్సిన నిర్దేశాన్ని మీరెలా ఇవ్వాలి?

  • మీ పిల్లలతో ఉన్న సంబంధాన్ని బలంగా ఉంచుకోండి. తమ వయసువాళ్లు పిల్లలకు స్నేహితులుగా ఉండవచ్చేమో గానీ, తల్లిదండ్రులుగా మీకున్న స్థానాన్ని వాళ్లు ఎప్పటికీ తీసుకోకూడదు.

  • మీ పిల్లలు కేవలం తమ వయసువాళ్లతోనే కాకుండా వేరేవాళ్లతో కూడా స్నేహం చేసేలా చూసుకోండి. ఒక పిల్లవాడు తోటి స్నేహితులతో సహవసించడం వల్ల అందరితో కలిసిమెలిసి ఎలా ఉండాలో నేర్చుకోవచ్చేమో గానీ, మంచిచెడులు తెలుసుకునేంత పరిణతి సాధించాలంటే వేర్వేరు వయసువాళ్లతో అతను స్నేహం చేయాలి. పిల్లలకు కావాల్సిన నిర్దేశాన్ని తల్లిదండ్రులు ఇచ్చినట్టు తమ వయసువాళ్లు ఇవ్వలేరు.

  • తెలివైన సలహాలు ఇవ్వండి. మీ పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నప్పుడు కూడా, మీతో సమయం గడపడం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు.

a టీన్‌ 2.0—సేవింగ్‌ అవర్‌ చిల్డ్రన్‌ అండ్‌ ఫ్యామిలీస్‌ ఫ్రమ్‌ థ టోర్మెంట్‌ ఆఫ్‌ అడోలసెన్స్‌ పుస్తకం నుండి తీసుకున్నది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి